నా తెలుగు బ్లాగు పయనం -2009

12/31/2009 - రాసింది karthik at Thursday, December 31, 2009
నేను నా తెలుగు బ్లాగు మొదలుపెట్టి రెండేళ్ళకు పైగా అయ్యింది. కానీ క్రియాశీలకంగా రాస్తున్నది మాత్రం ఈ సంవత్శరం ఫిబ్రవరి నుంచే.. అప్పటి వరకు నాకు తెలుగు బ్లాగులంటే తోటరాముడు, కూడలి, విహారి లాంటి ఒకటి రెండు బ్లాగులే.. ఏదో టపా శిర్షిక ఆకర్షణీయంగా అనిపిస్తే అవి మాత్రం చూసే వాడిని.. ఈ సంవత్శరం ఇంత సీరియస్ గా తెలుగు బ్లాగు రాయడానికి చాలా పెద్ద కథే ఉంది, అదంతా చెప్పి పాఠకులకు బోర్ కొట్టించడం నాకిష్టం లేదు..
ఇక బ్లాగులు చదువుతున్న కొద్ది, ఫాలో అవుతున్న కొద్దీ చాలా మంది ఆలోచనలు తెలుసుకునే అవకాశం కలిగింది. కొంతమంది రాసినవి చాలా బాగా నచ్చితే కొందరు రాసినవి పరమ చెత్తగా అనిపించాయి.. నాకు గుర్తున్నంతలో నేనెవరి గురించీ చెత్త కామెంట్లు పెట్టలేదు.. ఇక ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే చాలా మందితో నేను కొన్ని విషయాలలో పూర్తిగా ఏకీభవించేవాడిని ఇంకొన్ని విషయాలలో పూర్తిగా విబేదించే వాడిని.. ఇక్కడ నేనర్థం చేసుకున్న జీవిత సత్యం ఏమిటంటే ఈ ప్రపంచంలో ఎవరూ అన్ని విషయాలలో మనతో ఏకీభవించరు, అన్ని విషయాలలో విబేధించరు.. so treat anyone's ideas as just another opinion and accept it.
ఇక ఈ సంవత్శరం కొందరి బ్లాగులు, వాళ్ళ ఆలోచనలు నన్ను చాలా ప్రభావితుణ్ణి చేశాయి.. అలాంటివాళ్ళలో మొదటి వ్యక్తి మన సాహిత్య అభిమాని బ్లాగు రాసే శివరాం ప్రసాద్ గారు. ఆయన రచనలు చూసినప్పుడల్లా, మా నాన్నకు ఒక బ్లాగు ఒపన్ చేసిచ్చి రాయమంటే ఇలానే రాస్తారేమో అనిపిస్తుంది. చందమామ గురించి కానీయండి లేదా ఆయనిచ్చే సలహాలు కానీయండి అన్నీ అలానే అనిపిస్తాయి may be that generation is like that. అందుకే ఆయన రచనల్లన్నీ 2-3 సార్లు చదువుతాను.. అసలు ఆయన రాసిన about me చదివే ఆయన ఫ్యాన్ అయిపోయాను.. " I am 51 year young..." that alone shows his enthusiasm.. I salute you sir!

తర్వాత చెప్పవలసింది తాడేపల్లి గారి గురించి, కత్తి మహేష్ గారి గురించి.. వీరిద్దరితో నేను చాలా విషయాలలో ఏకీభవిస్తాను, చాలా విషయాలలో విబేదిస్తాను.. కానీ ఒక అభిప్రాయం ఏర్పరచుకునే ముందు వాళ్ళు చేసినంత బ్రెయిన్ స్టార్మింగ్(తెలుగు పదం??) నాకు తెలిసి ఎవరూ చెయ్యరు..వాళ్ళు రాసిన చాలా టపాలలో విషయాలు నాకు ఒక కొత్త దృక్కోణాన్ని చూపాయి.. అంతే కాక వారి మధ్య జరిగే చర్చలు కూడా నాకు బాగా నచ్చేవి ఎక్కడా చెత్త మాటలు చెత్త సంగతులు లేకుండా సాగుతాయి.. కొన్ని సార్లు నేనెవర్ని సమర్ధిస్తున్నానో నాకే అర్థం అయ్యేది కాదు :) :) ఒక కామెంట్ చదివితే ఈయన కరెక్ట్ అనిపిస్తాడు ఇంకోటి చదివితే ఆయన కరెక్ట్ అనిపిస్తాడు.. మధ్యలో నలిగిపోయేవాడిని.. ఆలాంటప్పుడు నేనెందుకు కామెంటలేదు అని ప్రజలడగచ్చు.. ఎందుకంటే "నేను చాలా బిజీ" ఇదే మాటను తెలుగులో ఒళ్ళు బరువు అంటారు.. I carry huge respect to the dedication that you show towards your principles!

ఇక మారుపేర్లతో రాసేవారిలో నాకు బాగా ముఖ్యులు మన చదువరిగారు,అబ్రకదబ్ర గారు.. వాళ్ళిద్దరూ చేసే విశ్లేషణలు కూడా నాకు చాలా బాగా నచ్చుతాయ్.. ఇక కొత్తపాళి గారు రాసే కబుర్లలో నాకు కొంత చలసాని ప్రసాదరావు గారి శైలి కనిపిస్తుంది.. ఈనాడులో ప్రతీ బుధవారం వచ్చే కబుర్లు నేనెప్పుడు మిస్ కాలేదు..
మహిళా బ్లాగర్లలో కవితలు రాసేవాళ్ళందరి బ్లాగులు తప్పకుండా చదువుతాను. ఎందుకంటే నేను కవితలు రాయలేను అందుకని వారు రాసినవన్నా చదివి గుర్తుపెట్టుకుంటే ఎక్కడైనా ఒపయోగపడతాయని ఒక ఆశ :) :) అవే కాక మేధగారి బ్లాగు, లక్ష్మిగారి బ్లాగు తప్పకుండా చదువుతాను.. నేను గుర్తుకు తెచ్చుకుని మరీ నవ్వుకునే తిట్లు కొన్ని ఉన్నాయ్.. వాటిలో లక్ష్మి గారు రాసిన "పాతబస్తీలో పసుపుకుంకుమలు అమ్ముకునే వెధవ" తప్పకుండా ఉంది..

ఇవన్నీ ఒక ఎత్తైతే మార్తాండ ఒక్కడూ ఒక ఎత్తు..మొదట్లో నేను మనోడిని సపోర్ట్ చేసే వాడిని. ఆ జీవి లాజిక్కులు తిక్క తిక్కగానే ఉన్నా ఏదో తను నమ్మినవి చెబుతున్నాడులే అనుకునే వాడిని.. ఎప్పుడైతే మన వాడు సాటి బ్లాగర్ల మీద వ్యక్తిగత దాడి మొదలుపెట్టాడో అప్పుడే గౌరవం కోల్పోయాడు.. ఆ తర్వాత నేను మనోడి కామెంట్లు అవి ఫాలో అయ్యి మనోడిలో ఎంతమంది అపరిచితులు ఉన్నారు అనేది తెలుసుకోగలిగాను.. కానీ జూన్ 26న మనోడు చెప్పిన కామెంట్ చదివాక మనోడి మీద కోపం స్థానం లో జాలి కలిగింది.. ఆ రోజు మనోడు చేసిన కామెంట్ ఏమిటి అనేది నా బ్లాగులో రాయడం నాకిష్టం లేదు.. ఇక మార్తాండతో పాటు మంచి కామెడీ ఇచ్చిన మరో బ్లాగు నా ప్రపంచం బ్లాగు.. ఇన్నయ్య అనే జీవి మీద, జన విజ్ఞాన వేదిక మీద ముందు నాకు అంతో ఇంతో మంచి అభిప్రాయం ఉండేది.. ఆ బ్లాగులు ఆయన రాసిన చౌకబారు కూతలతో ఆ మర్యాద కాస్తా పొయింది.. ఇప్పుడు నాకు ఇన్నయ్యంటే "మార్తాండకు ఎక్కువ మొమైత్ ఖాన్ కు తక్కువ" అంతే! వీళ్ళిద్దరి పైత్యం వల్ల నేను ప్ర.పీ.స.స. సభ్యుణ్ణయ్యాను.. నాకు బ్లాగుల ద్వారా ఏర్పడ్డ మొట్ట మొదటి మిత్రులు ప్ర.పీ.స.స. సభ్యులు.. జో,బంతి,సౌమ్య,నాగ,కల్యాణి, JD,malak,...you guys rock!! మనలందరినీ కలిపిన మొహన్ గారికి ప్రత్యేక నెనర్లు..

బ్లాగుల్లొ అందరూ తమ తృప్తి కోసం రాసుకుంటారు కానీ జీవని గారు మాత్రం తన బ్లాగు ద్వారా మనకు కొంతమందికి సహాయపడే అవకాశం కల్పించారు.. 2009 నాకు ఎక్కువ తృప్తి కలిగించిన విషయం మాత్రం నేను జీవని ద్వారా చేసిన రక్త దానమే!!

ఇక వచ్చే సంవత్శరం నా బ్లాగు లక్ష్యాలు:
1.ప్ర.పీ.స.స. కు ఒక రోజులో 500 కామెంట్లు రావాలి,, 24 గంటలూ ఎవరో ఒకరూ రాస్తూనే ఉండాలి..
2. నేను నవతరంగం, పుస్తకం లలో సమీక్షలు రాయాలి..

నాకు తెలుగు బ్లాగును పరిచయం చేసిన త్రివిక్రం గారికి నెనర్లు చెప్పకుండా ఈ టపా ముగియకూడదు.. thanx a million Trivikram!!

అందరికీ హార్దిక నూతన సంవత్శర శుభాకాంక్షలు

-కార్తీక్


3 ఇడియట్స్!!!

12/26/2009 - రాసింది karthik at Saturday, December 26, 2009
ఈ రోజు మధ్యాహ్నం షోకి ఇనొవేటివ్ మల్టీప్లెక్స్ అనే ఒకానొక చెత్త థియేటర్ లో ఈ సినిమాకు వెళ్ళాను.. ఈ సినిమా చేతన్ భగత్ నవల మీద తీశారు అంటే చూడకూడదనుకున్నాను, ఎందుకంటే అతి చెత్త రచయితలు అనే పోటీ జరిగితే నేను దానికి చేతన్ భగత్ పేరుని నామినేట్ చేస్తా!! ఆ జీవి రాసిన 5 పాయింట్ సంవన్,3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్ చదివాను.. ఆ తరువాత ఇంకెప్పుడు అతని రచనలు చదవకూడదని ఫిక్స్ అయిపోయాను..

రచయిత చెత్త అయినా ఆమిర్ ఖాన్ సినిమా, అందులో మున్నాభాయ్ తీసిన డైరెక్టర్, కాబట్టి పర్లేదులే అని వెళ్ళాను...90% సినిమా మాధవన్ నెరేట్ చేస్తాడు.. మాధవన్, ఆమిర్ ఖాన్ తో పాటు శర్మాన్ జోషి కూడా ఉన్నాడు.. నాకు రంగ్ దే బసంతి తరువాత శర్మాన్ జోషీ బాగా నచ్చాడు.. హీరోయిన్ గా కరీనా కపూర్ ఒక ముఖ్యమైన పాత్రలో బొమన్ ఇరానీ ఉన్నారు.. చేతన్ భగత్ నవల నుంచీ పక్కా దింపుడు కాదు కనుక నవల చదివినా కూడా కొత్తగానే అనిపించింది.. 90% సినిమా ఒక ముగ్గురు స్టూడెంట్ల నాలుగేళ్ళ కాలేజీ జీవితమే.. ఇంకా చెప్పాలంటే హాస్టల్ జీవితం.. నవల లో చేతన్ భగత్ IITల మీద ప్రజలకున్న క్రేజును విమర్శించాడు.. సినిమాలో ఆమిర్ ఖాన్ మన మార్కుల వ్యవస్థను విమర్శించాడు.. దర్షిల్ సఫారీ ఆత్మ హత్య చేసుకున్నప్పుడు జరిగే సంభాషణ నాకు బాగా నచ్చింది. "డాక్టర్లు గొంతు మీద ఒత్తిడి వల్ల చనిపోయాడు అన్నారు, కానీ మెదడు మీద పడ్డ ఒత్తిడి గురించి ఏమీ చెప్పలేదు" అంటాడు...how true!! నా రెండేళ్ళ హాస్టల్ జీవితం లో ప్రతీ 2-3 నెలలకు ఒక ఆత్మహత్య చూశాను..(at one point of time i attended a workshop on "how to prevent suicides and find signs of depression in people around us") కనుక ఆ వాక్యం నా మనసుకు బాగా హత్తుకుంది.. మున్నాభాయ్ తరహాలోనే దీనిలో కూడా కామెడికి సెపరేట్ ట్రాక్ అంటూ ఏమీ లేదు కానీ మంచి పంచ్ డయలాగులు ఇంకొంత సిచ్యుయేషనల్ కామెడీ బాగుంది.. ఇంటర్వెల్ బ్రేక్లో వచ్చే ట్విస్ట్ నవల నుంచీ సినిమాను దూరంగా నిలబెడుతుంది.. ఇక సెకండ్ హాఫ్ లో నవల నుంచీ తీసుకున్న కొన్ని సీన్లు ఉన్నాయి కానీ నవలలో లాగా చెత్త రొమాంటిక్ సన్నివేశాలు లేవు.. ఎవరైనా కరీనా కపూర్ హాట్ హాట్ సీన్ల కోసం సీనిమా చూడలనుకుంటే వారికి తీవ్ర నిరాశ తప్పదు.. క్లైమాక్స్ లో ఒక 15-20 నిమిషాలు నాకు సుత్తి కొట్టింది. క్లైమాక్స్ టెన్షన్ క్రియేట్ చేసేదానికి కథాపరంగా వేరే సన్నివేశం చేసుంటే బాగుండేదేమో!! బిల్డింగ్ నుంచీ దూకడం, కొశన్ పేపర్లు కొట్టేయడం నవల నుంచీ తీసుకున్నారు..

ఇక పాత్రల చిత్రీకరణల విషయానికి వస్తే హీరో పాత్రను ఎలివేట్ చేసిన విధానం బాగుంది. ఎక్కడా ఒవర్ చేస్తున్నారు అని అనిపించలేదు.. నవల లో ఉన్న తమిళియన్ పాత్రను చతుర్ రామలింగం గా బాగా అడ్జస్ట్ చేశారు.. అది కూడా కథలో ఇమిడిపోయింది.. చాంధసవాద ప్రిన్సిపల్ గా బొమన్ ఇరానీ పాత్ర సినిమాకే హైలైట్!! అలాంటి వాళ్ళను నా జీవితం లో కూడా చాలామందినే చూశాను.. (అవన్నీ "నా ఇంజినీరింగ్ రోజులు" సీరీస్ లో త్వరలో రాద్దామనుకుంటున్నాను). ఇక కరీన హీరోయిన్ గా కంటే ఒక సపోర్టింగ్ పాత్ర అంటే బాగుంటుందేమో, కానీ హీరో హీరోయిన్ రిలేషన్ బాగా చూపించాడు.. ముగ్గురు ఇడియట్స్ మధ్య జరిగే కొన్ని సంభాషణలు చాలా నచ్చాయి.. All is well ఫిలాసఫీ నాకు బాగా నచ్చింది(ఎందుకంటే అది నా ఫిలాసఫీకి చాలా దగ్గరగా ఉంటుంది కనుక :)) All is well అంటే కష్టాలు మాత్రం తీరవు కానీ వాటి వల్ల వచ్చే ఒత్తిడి మాత్రం రాదు.. ఆడియో కూడా బానే ఉంది.. 2-3 పాటలు నాకు బాగా నచ్చాయి..

ఇక నటీనటుల నటన పరంగా చూస్తే అందరూ బాగా చేశారు.. నాకు బాగా నచ్చిన నాటుడు మాత్రం బొమన్ ఇరానీయే.. పాత్రలో చక్కగా ఇండిపోయాడు.. ఆదివారం మధ్యాహ్నం నా కొడుకు చనిపోతే సోమవారం పొద్దున నేను కాలేజీకి వచ్చాను అని చెప్పే సీన్లో మాంఛి గర్వం చూపాడు.. సెంటిమెంటల్ సీన్లలో ఇడియట్స్ ముగ్గురు బాగాచేశారు. ఇక్కడ ఆ ముగ్గురి ప్రతిభ గురించీ ఎవరికీ అనుమానాలు లేవు, వాళ్ళు కూడా ఆ స్థాయికి తగ్గట్టుగా చేశారు..

అన్నీ బాగా కుదిరినా సినిమా హిట్ అయ్యేది మాత్రం డయలాగుల వల్లే, అందులో నాకెటువంటి డౌటు లేదు.. కొన్ని అంతర్జాలం లో మెయిళ్ళ నుంచీ తీసుకున్నా చాలా మటుకు కొత్త జోక్సే ఉన్నాయి.. మొత్తానికి ఆమిర్ ఖాతాలో మరో హీట్ అనుకోవచ్చు..

-కార్తీక్

పసందైన రాజకీయం..

12/18/2009 - రాసింది karthik at Friday, December 18, 2009
ఇప్పుడు రాష్ట్ర రాజకీయం మంచి రసకందాయం లో పడింది.. ఒక పక్క కే.సీ.ఆర్. లాంటి జిన్నాలు రాష్ట్రాన్ని విడదీయటానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు మరో పక్క తాంబూలాలిచ్చిన కేంద్రం మీరు తన్నుకు చావండి అంటూ చోద్యం చూస్తోంది. కానీ ఓలుమొత్తంగా చూస్తే ఎక్కువ నష్టం కలిగింది మాత్రం కాంగ్రెస్ పార్టీకే.. ఒక వేళ తెలంగాణ ఏర్పడితే(అశుభం ప్రతిహతమౌగాక) ఆ క్రెడిట్ తె.రా.స. కొట్టేస్తుంది. మరో పక్క మిగిలిన ప్రాంతాల్లో రాష్ట్రాన్ని విడదీశారనే అపప్రధను మూట కట్టుకుని దుకాణం మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది.. ఇప్పుడు రోశయ్య ఎన్ని ఏడ్పులు ఏడ్చినా, మన్మోహన్ సింగ్ ఆవేదన వెళ్ళబుచ్చినా ఉపయోగం లేదు... ప్రజల మధ్య ఏర్పడ్డ మానసిక దూరం తగ్గే సూచనలు ఇప్పుడిప్పుడే కనపడటం లేదు.. ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలు ఏమీ చెయ్యకుండా తాత్సారం చూపిస్తోంది అందుకే!! ఎటువంటి పరిస్థితిలో అయినా తన 'వర్గ బలంతో' చక్రం అడ్డువేయగల వై.యస్. ఇప్పుడు లేడు.. జగన్ వర్గాన్ని వరండా బ్యాచిగా తయారుచేసి ఒక బలమైన వర్గాన్ని అధిష్ఠానం దూరం చేసుకుంది..
మరో పక్క తెలుగుదేశం పరిస్థితి ఇంకా కామెడీగా ఉంది!! ప్రజల ఆగ్రహాలతో మైండ్ బ్లాక్ అయ్యిన బాబు నేడో రేపో "నా అంబారీ ఏనుగుని రిక్షాలో తీసుకురండి నేను డాల్ఫిన్ హోటల్లో కాఫీ తాగి కురుక్షేత్ర యుద్దానికి పోవాలి" అనే స్టేజిలో ఉన్నాడు.. తెలంగాణ మీద ఒక కమిటీని వేసి దానిలో అభిప్రాయ భేదాలు వచ్చి దేవెందర్ గౌడ్ లాంటి నేత పార్టీని వదిలి వెళ్ళిపోయినా కూడా ఆ అంశం లోని సంక్లిష్టతను అర్థం చేసుకోకుండా తన "ఏ ఎండకా గొడుగు" పాలసీ ఫాలో అయ్యి ఇప్పుడు సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు.. బాబు విస్వనీయత అసలే అంతంతమాత్రం..ఈ దెబ్బతో బాబుకు శంకర గిరి మాన్యాలు తప్పదనిపిస్తోంది..
ఇక మిగిలింది చిరంజీవి, తన మెగస్టార్ స్టేటస్ ను పణంగా పెట్టి మరీ రాజకీయాలకు వచ్చిన వ్యక్తి.. ఎలాగోల అధికార పీఠానికి కూతవేటు దూరం లో అయినా ఉండాలని చాలా తాపత్రయం... ఈ కక్కూర్తితోనే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుందామని ప్రయత్నించాడు. అదికాస్తా మీడియాలో "జెండా పీకేద్దాం" అని వచ్చేసరికీ గొంతులో పచ్చి వెలక్కాయ పడటంతో ఏడుస్తూ అదే పత్రికలకు ఎక్కాడు.. సామాజిక తెలంగాణ అని కబుర్లు చెప్పి ఇప్పుడు అకస్మాత్తుగా నిర్ణయాన్ని మార్చుకున్నాడు.. ఇది ఆలోచించాల్సిన విషయం!! నేను దీని గురించి ఆలోచించగా చించగా కొంత చినిగాక బల్బు వెలిగింది. రాష్ట్రం ఈ రోజు కాకపొయినా ఒక 4-5 ఏళ్ళల్లో అయినా విడిపోక తప్పదు.. అప్పుడు కోస్తాలో కాంగ్రెస్ దూకాణం మూసేసే పరిస్థితిలో ఉంటుంది.. పైగా అది తనకు కొద్దో గొప్పో పట్టున్న ప్రాంతం కనుక అందరికంటే ముందుగా సమైఖ్యాంధ్రకు జై అంటే తెలుగుదేశం కు చెక్ పెట్టచ్చు అనేది ఒక లెక్క!!
ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏమిటంటే జగన్ అకస్మాత్తుగా జై సమైఖ్యాంధ్ర అని ఎందుకన్నాడు?? దీన్ని అడ్డం పెట్టుకుని మేడం కు కడప స్టైల్లో రిప్లై ఇస్తున్నాడా?? (మాదీ కడపే, మేము కొట్టడం అంటు జరిగితే ఇక దెబ్బ తిన్న వాడు మళ్ళీ లేయడు.ఎంతైనా ఉడుకు రక్తం కదా :) :) ) ఇప్పుడు కాంగ్రెస్ నుంచీ జగన్,లగడపాటి అధికార కేంద్రాలుగా తాయారౌతే రాజకీయం బాగుంటుంది.. ఎందుకంటే ఇప్పటిదాకా లగడపాటి వై.యస్. వర్గానికి చెందిన వాడు. ఇక నుంచీ కూడా అలానే ఉంటాడా అనేది ఆలోచించాల్సిన విషయం..ఎందుకంటే ఎక్కడైనా బావే కానీ వంగ తోట దగ్గర మాత్రం కాదు..
ఈ మొత్తం గొడవల్ల ఒక విషయం మాత్రం విస్పష్టంగా తెలిసొచ్చింది.. అదే మన దేశం లో ప్రజలకు, రాజకీయ పార్టిలకు ఉన్న దూరం.. ఒక కమిటీ వేసి కూడా బాబు సమైఖ్యాంధ్ర గురించి తెలుసుకోలేక పోయాడంటే అంతకంటే కామెడీ లేనే లేదు.. ప్రస్తుత పరిస్థితిలో చూశ్తే చిరంజీవికి అందరికంటే ఎక్కువ లాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి..

ఎర్ర బస్సు స్వగతం

12/13/2009 - రాసింది karthik at Sunday, December 13, 2009
నా అసలు పేరేమిటొ నేను మరిచిపోయి చాలా కాలమైంది. అందరూ నన్ను, నా జాతి వారినీ ఎర్రబస్సులనే పిలుస్తారు. మొదట మా జాతిలో 27 మంది మాత్రమే ఉండే వాళ్ళు తర్వాత భారత స్వాత్యంత్రం వచ్చాక మాజాతివారు దిన దిన ప్రవర్ధమానంగా పెరిగి ప్రస్తుతం 21 వేలమంది 7 రాష్ట్రాలలో తిరుగుతూ ఉన్నారు.. రోజు దాదాపుగా ఒకటిన్నరకోటిమంది మా జాతివారితో కలిసి తిరుగుతూ ఉంటారు. అందుకేనంట.. గిన్నేసో, గంగాళేసో రికార్డ్ మా పేరు మీదే రాశారంట.. ప్రపంచంలో ఉన్న అన్ని బస్సు జాతులలో మేము తిప్పేంతమందిని ఎవరూ తిప్పరట.. 1990ల వరకూ ఒకవెలుగు వెలిగాము.. ఒకానొక కాలంలో మా సంరక్షకులుగా పని చెయ్యటం అనేది ఒక సామాజిక హోదాలా ఉండేది.. ఆంధ్ర జ్యోతి అనే పుస్తకంలో మా సంరక్షకుల మీద చాలానే చణుకులు పేలేవి.. కానీ అదంతా గతం...
ఆ తర్వాత కొంత మా సంరక్షకుల నిర్లక్ష్యం వల్ల, ఇంకొంత రాజకీయ నాయకుల స్వార్థం వల్ల, మరికొంత సాంకేతిక విప్లవాల వల్లా ప్రస్తుతం మాజాతి అంతరించిపోయే ప్రమాదంలో పడింది. గత దశాబ్దకాలంగా మా సంరక్షకులకు తెలివొచ్చి మమ్మల్ని కాపాడుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.. కానీ కొందరు పాలకులు ప్రపంచ బ్యాంకో లేక విశ్వవ్యాప్త బ్యాంకో ఇచ్చే రుణాల మీద ఆశతో మమ్మల్ని అమ్మేస్తామని మాటిచ్చారాట.. ఇవన్నీ కాక పాలకుల చిన్న చూపు వల్ల సమాజంలో పంచింగ్ బ్యాగ్స్ లాగా తయారయ్యాము. ఎవరికి ఎవరిమీద కోపం వచ్చినా నష్టం మాత్రం మాజాతికే..

ఒక నాయకుడు మరణించినా.. అన్నలకు ఖాకీలమీద కోపం వచ్చినా..స్టుడెంట్లకు క్లాసులు ఎగరగొట్టాలనిపించినా.. ఇలా చెప్పుకుంటుపోతే రాష్ట్రంలో ఎక్కడ చిన్న అలజడి జరిగినా మరణించేది మాత్రం మేమే. పరిస్థితి ఇలానే సాగితే ఐక్య రాజ్య సమితి వాళ్ళు ప్రకటించే "అంతరించిపోయే జాతుల" అనే జాబితాలో మమ్మల్ని కూడా చేర్చాలేమో!! మా తాతలు తండ్రుల కాలంలో ఎంతో హుందాగా గర్వంగా బ్రతికిన మేము ఇప్పుడు రోడ్ల మీద దిక్కులేని చావు చావాల్సి వస్తోంది.. ఇంతా చేస్తే సగటు మనిషికి మా అవసరం చాలా ఎక్కువ. మాకు ప్రత్యామ్నాయం కానీ లేక మరొకటి కానీ కల్పించే పరిస్థితిలో ఇప్పటి ప్రభుత్వాలు లేవు..భారత రైల్వేతో సమానంగా భారం మోయగల సత్తా మాకుంది.. (ఆధారం: వీకీపీడియా) ఇక ఇప్పటికీ చాలా గ్రామాలకు మేము తప్పే వేరే రవాణా సాధనాం లేనే లేదు.. ఐనా ఈ పంచింగ్ బ్యాగ్ సంస్కృతి తెలుగు జాతి నరనరాల్లోకి ఎక్కింది. దానిని నిలువరించడానికి ప్రభుత్వ సాయం చాలా అవసరం కానీ ప్రభుత్వం ఎవరి మీద కేసుపెడితే ఎక్కడ ఓట్లు పోతాయో అని మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు.. మా పరిస్థితిలాగే మా సంరక్షకుల వెతలు కూడా చాలానే పెరిగాయి.. బోనస్సులు తీసుకునే రోజుల నుంచీ ఓవర్ టైములు చేసుకునే స్థితికి వచ్చారు. పెన్షన్లు గట్ర ఎలాగూ ఉండవు కనుక పని చేసే రోజులలోనే నాలగు రాళ్ళు వెనక వేసుకోవాలి అని తాపత్రయపడుతూ రకరకాల స్కీములతో సంపాదన కోసం వెంపర్లాడుతూ ప్రజాసేవ అనేది క్రమంగా గాలికి వదిలేస్తున్నారు..మర్యాద వారోత్సవాలు, అమర్యాద సంవత్సరీకాలు చేసుకుంటున్నారు తప్పించి ప్రజలకు ఎలా దగ్గర కావాలి అనేదాని మీద శ్రద్ధ కనిపించదు. సమ్మెలు చేయటంలో ఉన్న నిజాయితీ ప్రజల మీద అభిమానంగా మార్చితే అదే చరిత్రలో అతి పెద్ద మార్కెటింగ్ స్కీము.. 2001 లో మా వాళ్ళు చేసిన సమ్మె గురించి తప్పకుండ చెప్పుకోవాల్సిందే.. ఎందుకంటే అది కార్మిక చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం.. ఆ సమ్మె 24 రోజులు జరిగింది చాలా మంది కార్మికులకు 325 రూపాయలు నెల జీతంగా వచ్చింది. అయినా అన్నీ ఓర్చుకున్నారు... కడకు విజయం సాధించారు.. ప్రస్తుతం కూడా నష్టాలలో కార్మికులు పస్తులతో మేమూ బ్రతుకుతున్నాం..ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తే మాకు ఈ ఆకలి చావులు తప్పవు కానీ ప్రభుత్వం ఇవ్వదు కదా!!
మరెన్ని రోజులు ఇలా అందరితో మాట్లాడుతూ చలాకీగా తిరుగుతుంటామో తెలీదు..ఒకవేళ మేము అంతరించిపోవటం అంటు జరిగితే మీ పిల్లలకు మా గురించీ కథలుగా చెబుతారు కదూ!!

రైట్ రైట్ !


-కార్తీక్

మా నాన్న గారు గత 35 సంవత్సరములుగా RTCలో పని చేస్తున్నారు..కాబట్టి నాకు సగటు RTC ఉద్యోగి జీవితం ఎలా ఉంటుంది అనేది బాగా తెలుసు..అందుకే నేను మాత్రం ఆంధ్రాలో ఎక్కడికిపోవాలన్నా RTC బస్సులోనే పోతాను..

"THE WHEEL STANDS FOR COMMON ZEAL"

తెలంగాణ: నా అనుకోలు!

12/10/2009 - రాసింది karthik at Thursday, December 10, 2009
నా తెలుగు బ్లాగులో సీరియస్ టపాలు రాయకూడదు అని నేను ఫిక్స్ అయ్యి చాలా కాలమయ్యింది.. కాని ఇప్పుడు రాయాల్సి వస్తోంది..కారణం "తెలంగాణ" ఈ టపాలో నేను తెలంగాణా చరిత్ర,మొదటి రాష్ట్రాల పునర్విభజన కమీషన్, నెహ్రూ ఇలాంటి విషయాల జోలికి పోదలుచుకోలేదు.. ఈ అంశం గురించీ నా ఆలోచనలను బ్లాగీకరించే ప్రయత్నమే ఈ టపా.

రాష్ట్రం విడిపోతే తెలంగాణా బాగుపడుతుంది అనేది తెలంగాణా వాదుల మౌలికమైన ఉద్దేశ్యం (basic idea), దానికి వారు హిమాచల్ వగైరా రాష్ట్రాలని ఉదాహరణాలుగా చూపిస్తారు. బాగుపడే అవకాశం ఎంతుందో మరొక దోపిడీ మొదలయ్యే అవకాశం కూడా అంతే ఉంది. చిన్న రాష్ట్రమైన హిమాచల్ బాగుపడితే బీహార్ నుంచీ విడిపొయిన జార్ఖండ్ పాతాళానికి పరుగులు పెడుతూ ఉంది. రేపు తెలంగాణా నేతలు మరొక మధు ఖోడాలుగా తయారు కారని నమ్మకం ఏమిటి?? కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే అభివృద్ది అనేది నేతల మీద ఆధారపడి ఉంది తప్ప రాష్ట్రం యొక్క పరిణామం మీద కాదు.
ఇక ఇప్పటివరకూ ఏ తెలంగాణా వాది నుంచీ విడిపోవడానికి convincing reason వినలేదు. ఇక్కడ అత్యంత దురదృష్టకర పరిణామం ఏమిటంటే తెలంగాణా పేరు మీదా ఆంధ్రా వాళ్ళ మీద విషం కక్కడం. మేము తిట్టేది కేవలం రియల్ ఎస్టేట్లలో సంపాదించిన వాళ్ళను మాత్రమే అంటారు మరి ఆంధ్రా బ్యాంకు పేరు మార్చడం, ఆంధ్రా మీల్స్ అన్న బోర్డ్ కొట్టేయడం ఇవి దేన్ని సూచిస్తున్నాయి. మేము తిట్టేది బడా బాబులనే అని నాయకులు చెప్పొచ్చు కాని కాలిన కడుపులతో ఉన్న వారికి అంత విచక్షణ ఉంటుందా??? వాడికి ఆంధ్రా అన్న పదమే ఒక బూతైపోయింది. శరత్ గారు అన్నట్టు తెలబాన్లు అనే పదమే కరెక్టేనేమో!
ఇక హైదరాబాదు అనేది అత్యంత పెద్ద పీటముడి. అప్పుడింకెంత గొడవలు జరుగుతాయో! ఏమో? హైదరాబాదులో వీధి పోరాటాలు జరిగినా నేను ఆశ్చర్యపోను. దీన్ని ఎలా పరిష్కరిస్తారు??
రాష్ట్ర విభజన అనేది ఒక administrative process జరగాల్సింది ఒక sentimental injury అయ్యింది. అన్నిటికంటే పెద్ద సమస్య అది. ఇప్పుడు ఈ విషం కక్కే చేష్టల వల్ల ఇండియా-పాకిస్తాన్ వాతావరణం ఏర్పడుతుందేమోనని భయంగా ఉంది. ఎందుకంటే తెలంగాణా ఏర్పడ్డా లేకపొయినా నాకొచ్చే జీతం లో తేడా ఏమీరాదు. కానీ మనసులో ఎందుకో తెలియని బాధగా ఉంది.
నా పాయింట్ ఒక్కటె దేశన్ని ప్రాంతలకు అతీతంగ, పార్టీలకు అతీతంగ అందరూ దొచుకున్నారు. వాళ్ళకి తెలంగాణా ఐన, రాయలసీమ ఐన పెద్ద తేడా లేదు. సొ కనీసం మన తరమైనా అభివృద్ధి గురించి ఆలోచించాలి. ఒకరిని ఒకరు తిట్టుకుంటే ప్రయోజనం శూన్యం

చైనా వాడు మన దేశాన్ని 32 భాగాలుగా చేస్తే తన మార్కేట్కు పోటీగా రాకుండా ఉంటామని ప్లాన్ చేశాడట. (4 ఏళ్ళ క్రితం ఏదో పుస్తకం లో చదివాను). ఇక పాకిస్తాన్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. తాలిబన్లు మన మీద షరియా విధించటానికి యాక్షన్ ప్లాన్ తయారు చేసి పెట్టారు. ఇంత మంది ఇన్ని రకాలుగా మనమీద కత్తిగట్టి ఉంటే మన్మేమో కొత్త రాష్ట్రాలు తొక్క తోలు అని కొట్టుకుంటున్నాం!!
ఈ తప్పుకు చరిత్ర మనల్ని క్షమిస్తుందా??? i have no answer..


ఏది ఏమైనా తెలంగాణా రావటం ఫిక్స్ అయ్యింది కనుక ఆ ప్రాంత ప్రజలకు నా హార్దిక శుభాకాంక్షలు. ఇప్పటి వరకూ జరిగిన విష ప్రచారం ఇకనైనా ఆపాలని మనవి.

చివరగా:
మాతెలుగుతల్లికి క్షమాపణల దండ

మా కన్నతల్లికి పాదాభివందనములు

కడుపులో కత్తెర్లు
కనుపాపలో నెత్తుర్లు
చీదరింపుల చీకట్లు
ప్రసరించెను మాతల్లి

గణగణ తెలంగాణ కదలిపోతుంటేను
బిరబిర హైదరాబాద్ వీడిపోతుంటేను

కంగారు క్షణాలే దొర్లుతాయి
ముత్యాలమురిపాలు మోడులాయే

క్షమించు తెలుగు తల్లీ !

క్షమించు తెలుగు తల్లీ!

పాటకు కాపీరైట్ హక్కుదారు: ప్ర.పీ.స.స.

ఆశ్రునయనాలతో
-కార్తీక్


గమనిక:
కామెంట్లు రాసే ప్రజలు విషం కక్కే మాటలు రాస్తే నేను ఆమోదించను, నా బ్లాగుకి నేనే మోనార్కుని!

నా ఇంజినీరింగ్ రోజులు-5: ర్యాగింగ్ గోల

11/22/2009 - రాసింది karthik at Sunday, November 22, 2009
నేను మా కాలేజీలో మొట్టమొదట అడుగుపెట్టినరోజు నవంబర్ 12,2001. ఆ రోజే కొందరు సీనియర్స్ ఫ్రెషర్స్ డే వరకూ ర్యాగింగ్ ఉంటుంది అని చెప్పారు. కనుక నేను ఆ ఫ్రెషర్స్ డే అనేది ఒక గొప్ప పండుగ లాంటిది ఉంటుంది అని అనుకున్నాను. ఆ తర్వాత ఫ్రెషర్స్ అందరూ చొక్కా జేబులో పెన్నులూ,డబ్బులూ వగైరా పెట్టుకోవచ్చనుకున్నాను. నేను అందరిలా కాలేజీ బస్సులో కాకుండా ఆర్.టి.సి. బస్సులో కాలేజీకి వెళ్ళేవాడిని. అందువల్ల, సీనియర్ల బెడద కొంచెం తక్కువగా ఉండేది. ఎందుకంటే, బస్సులో అందరి ముందు తిక్క వేషాలు వేయించటం అంత వీజీ కాదు కదా.. కాలేజీ మొదలైన రెండవ వారం బస్సులో ఒక సోడా బుడ్డీ సీనియర్ తగిలాడు. ఆ జీవి ముందు కూర్చున్న ఇద్దరు అమ్మాయిల గురించి తెలుసుకోమని నన్ను పంపించాడు. ఆ అమ్మాయిలు వీడి కన్నా టింగరి ప్రజానీకం ఉన్నాట్టున్నారు అందువల్ల ముందు వాడి గురించి కనుక్కుని చెప్పమన్నారు. మధ్యలో నేను తెలుగు సినిమాలో సెకండ్ హీరోయిన్లా అయిపోయాను. ఆఖరుకు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్లీజ్ ప్లీజ్ అని బతిమాలాను. (వసుదేవుడంతటి వాడే ఎవరి కాళ్ళో పట్టుకున్నాడట నేనెంత?? :) :)) అప్పుడు ఆ అమ్మాయి నన్ను రకరకాల ప్రశ్నలు వేసి చాల సేపు అక్కడే నిలబెట్టింది. ఇంతలో బస్ స్టాండ్ రావటం తో నేను ఆ రోజుకు పారిపోయాను.
మరుసటి రోజు కూడా మన వాడు నన్ను అదే అమ్మాయి గురించి కనుక్కుని చెప్పమనటం నేను పొయ్యి ఆ అమ్మాయితో మాట్లాడుతూ టైం గడపటాం. మూడో రోజు మనవాడికి చాలా కోపం వచ్చి వాళ్ళ గ్రూప్ లో ఉన్న ప్రజలందరికీ "వీడు రోజూ ఆ అమ్మాయితో బ్యాటింగ్ పెడతాడు" అని నన్ను పరిచయం చేశాడు. దెబ్బకు ఆ ప్రజలందరూ నన్ను రకరకాలుగా ఆడుకున్నారు.
"ఏరా ఇప్పటినుంచే సీనియర్లు కావాల్సి వచ్చారా?"
"మాతోనే కాంపిటిషనా??"
"ఎక్స్ట్రాలు తగ్గిస్తే మంచిది"
వగైరా, వగైరా..
మరుసటి రోజు ఆ అమ్మయి కాలేజిలో కనిపిస్తే మాట్లాడాను. అప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే ఆ అమ్మాయి కూడా మా బ్రాంచ్ లోనే చదువుతోంది. ఇంక నేను రెచ్చిపోదామనుకున్నాను. ఆ రోజు బస్సులో డైరెక్ట్గా పొయ్యి ఆ అమ్మాయిలు ఉన్న సీట్ దగ్గరే కూర్చున్నాను. కానీ అక్కడ నేను గమనించని విషయం ఏమిటంటే ఆ రోజు ఆ అమ్మాయి ఒక్కటే రాలేదు. ఇంకొక ముగ్గురు అమ్మాయిలు కూడా ఉన్నారు. నన్ను చూస్తునే గుర్తు పట్టారు వెంటనే అంతా కలిసి నన్ను ఫుట్ బాల్ ఆడుకోవడం మొదలు పెట్టారు. కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు అయ్యింది నా పరిస్థితి. నేను ఇంటర్మీడియట్ చదివిన రెండేళ్ళల్లో అమ్మాయిలతో మాట్లాడిన సందర్భాలు రెండు మూడుకు మించి లేవు. ఇప్పుడు ఒక్కసారిగా ఇంతమంది అమ్మాయిలతో మాట్లాడుతుంటే కొంచెం సిగ్గేసింది (అంటే సిగ్గు వాళ్ళతో మాట్లాడినందుకు కాదు, బస్సులో అందరి ముందు పాటలు పాడాల్సి వచ్చి నందుకు) నేనిట్ల శంకరా నాధశరీరాపరా అని పాడటం మొదలు పెడుతూనే మా సోడా బుడ్డీ జీవి కూడా వచ్చెశాడు తన గ్రూప్ తో సహా. ఇక్కడ నాకు తెలియని చీకటి రహస్యం ఏమిటంటే వాళ్ళంతా బాగా తెలిసిన వాళ్ళు , మంచి దోస్తులు. :( :( అప్పటివరకూ ఫుట్బాల్ లా ఉన్న బస్సు అప్పటి నుంచీ cricket మ్యచ్ లా తయారైంది. ప్రతి రోజూ నేను బస్సు ఎక్కడం ఈ ప్రజలు బ్యాటింగుకు దిగి నన్ను ఆడుకోవడం. ఇంతలో ఫ్రెషర్స్ డే జరిగింది అదికూడా ఒక దయనీయగాధ మరో సారి చెబుతాను. ఫ్రెషర్స్ డే తరువాతా నేను వళ్ళను ఆడుకోవడం మొదలు పెట్టాను. పుస్తకాలు, రికార్డులు, తొక్క తోలు మట్టి మశానం అన్నీ తీసుకున్నాను. వాళ్ళు కాలేజి వదిలి వెళ్ళిపోయే ముందు వరకూ కూడా నేను వాళ్ళ దగ్గర ఏదో ఒకటి తీసుకుంటూనే ఉన్నాను.

ఇలాంటిదే మరొకటి కూడా జరిగింది. అది మరోసారి రాస్తాను..

-కార్తీక్

పుస్తక ప్రదర్శన !!!

11/12/2009 - రాసింది karthik at Thursday, November 12, 2009
తెలుగు పుస్తకాలు ఎగ్జిబిషన్ లో ఉన్నాయంటే, వీకెండ్ కల్లా అయిపోతాయేమోనని కక్కూర్తి పడి ఆఫీస్ నుంచీ ముందుగానే పరిగెత్తాను. ఆ ప్యాలెస్ గ్రౌండ్స్ దారి గురించి అందరిని అడుగుతూ అది కనుక్కొని అక్కడికి చేరేసరికి దాదాపుగా గంటన్నర సేపు పట్టింది, బెంగళూరు ట్రాఫిక్కా మజాకా.. ఆ గంటన్నరలో తలప్రాణం తోకకు సారీ, కాళ్ళలోకి వచ్చింది.ఐదు రూపాయలు పార్కింగుకు, ఇరవై రూపాయలు టికెటుకు సమర్పించుకుని వెళ్ళాను. అసలు నేను అక్కడికి వెళ్ళటానికి ఒకే ఒక కారణం ఉంది. ఆ కారణం పేరు "సావిరహే". మల్లాది వెంకట కృష్ణ మూర్తి రాసిన ఒక గొప్ప నవల. దాని గొప్పతనం పూర్తిగా వివరించాలంటే ఇంకొక టపా రాయాలి.

లోపలికి వెళుతూనే కుడి వైపున అట్ట మీద సచిన్ బొమ్మ ఉన్న "వరల్డ్ కప్ 99" అనే పుస్తకం అయస్కాంతం లాగా నన్ను ఆకర్షించింది. ఆ స్టాల్ లోకి పొయి కొన్ని పుస్తకాలు చూశాను. అరవింద్ అడిగా "వైట్ టైగర్", విలియం డ్యార్లింపల్ "ముఘల్" వగైరా, వగైరా పుస్తకాలు కనిపించాయి. ఇంకాస్త ముందుకు వెళితే చాలా కన్నడ స్టాల్స్ కనిపించాయి. ఆ స్టాల్స్ లో ఇంగ్లీష్ లేదా వేరే భాషలకు సంభందించిన పుస్తకాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆ వరుస చివరలొ ఒక తెలుగు స్టాల్ కనిపించింది. లోపలికి వెళ్ళి చూశాను చాలా పుస్తకాలు ఉన్నాయి, యండమూరి "విజయానికి ఐదు మెట్లు" నుంచీ "మరణ మృదంగం" దాకా, యద్దనపూడి "సెక్రెటరీ", రమణ "సాహితీయానం" యర్రం శెట్టి శాయి "హ్యుమరాలజి", చలం రాసిన ఒక పుస్తకం (పేరు గుర్తు లేదు) వగైరా వగైరా ఉన్నాయి. "సావిరహే" గురించి అడిగితే ఆ స్టాల్ అతను ఒక తట్టుకోలేని నిజం ఒకటి చెప్పాడు. ఇప్పుడు మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారు నవలలు రాయకుండా ఆధ్యాత్మిక విషయాల గురించి రాస్తున్నారంటా. అయ్యో!! ఇంకొక రాజ్ కృష్ణని, మరో ఐరావతాన్ని, వేరొక సద్దాం ఆంటీని చూడలేమా అని గుండెలొ ఎక్కడొ కళ్ళక్కు మనింది. కాలం దేన్నైనా మారుస్తుంది అని ఒక సెంటిమెంటల్ డయలాగ్ గుర్తు తెచ్చుకుని ముందుకు సాగిపోయాను. మధ్యలో చిన్న పిల్లల స్టాల్స్, ఆధ్యాత్మిక విషయాలకు సంభందించినవి, మతపరమైన విషయాలకు సంబందించినవి చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇస్లామిక్ ఏడుకేషనల్ సొసైటీ, రామకృష్ణ మఠం వాళ్ళ స్టాల్ వగైరా వగైరా. అవన్నీ క్రాస్ చేసి ముందుకు వెళితే అక్కడ విశాలాంధ్ర స్టాల్ కనిపించింది. హమ్మయ్య అని లోపలికి వెళ్ళాను. ఒక్కసారిగా అన్ని బుక్కులు చూస్తే ఏమి కొనాలో అర్థం కాలేదు. దీర్ఘంగా ఆలోచించి మా నాన్నకు ఫోన్ చేశా.
"నాన్నా, నేను విశాలాంధ్ర బుక్ స్టాల్ లో ఉన్నా ఏదైనా మంచి పుస్తకాల పేర్లు చెపూ"
"ఉన్నట్లుండి పేర్లు చెప్పమంటే ఎలా? మాన్యుమెంటల్ బుక్స్ ఏమన్నా ఉంటే తీసుకో"
"శరత్ సాహిత్యం తీసుకోనా?"
"మన ఇంట్లో 'శ్రీకాంత్ ' ఉన్నాడు. శరత్ అంతకంటే మంచి బుక్కులు ఏవీ రాయలేదు కాబట్టి వద్దులే"
"విశ్వనాథ సత్యనారాయణ బుక్స్ తీసుకునేనా?"
"నీకు అంత తెలుగు అర్థం చేసుకునే సీన్ లేదు. అవి నీకు అలమరలో పెట్టి నాదగ్గర అవి ఉన్నాయని చెప్పుకోను తప్పించి మరి దేనికీ పనికి రావు"
"హతవిధి! మా నాన్నకు నా గురించి ఎంత నమ్మకం"(స్వగతం)
" అక్కడా ఎవరెవరి బుక్స్ ఉన్నాయో చెప్పు"
"భమిడిపాటి కామెశ్వర రావు అంటా"
"భరాగో కథలు తీసుకో"
"సరేలే ఏవో ఒకటి తీసుకుంటాను"
నా సంభాషణ విన్న ఆ షాప్ అతను వెంటనే భరాగో కథలు తెచ్చి ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు భమిడిపాటి కామేశ్వర రావు గారి బుక్కు కూడా ఒకటి తీసుకున్నాను. ఇంతలో యర్రం శెట్టి శాయి గుర్తుకు వచ్చాడు. "హ్యుమరాలజి" జెమినీ టివీలో చూశాము కదా అని ఇంకొక బుక్కు "ప్రేమకు ఫుల్ స్టాప్ లేదా" అనేబుక్కు తీసుకున్నాను. అదే చేత్తో మల్లాది "డబ్బెవరికి చేదు" కూడా కొన్నాను. రెండు నిముషాలలో నాలగు బుక్కులు ఐపోయాయి ఇంక చాలు అని వస్తూ ఉంటే చలం "స్త్రీ" కనిపించింది. అది చదవమని పొద్దునే ఒక ఉద్వేగపూరితమైన సలహా వచ్చింది :) :) కనుక అది కూడా తీసుకున్నాను. పక్కకు తిరిగితే రంగనాయకమ్మ బుక్కులు కనిపించాయి, వాటి సైజ్ చూసే నాకర్థమైపోయింది అవి నా తాలూకు కాదని.
విశాలాంధ్ర నుంచీ బయటకు వచ్చాక ఒక స్టాల్ లో ఏ బుక్కైనా వంద రూపాయలు మాత్రమే అని కనిపించింది. వెంటనే లోపలికి వెళ్ళాను. అక్కడ Don Quixote కనపడ్డాడు. నేను వదల్లేదు. గబుక్కున ఆ బుక్కును కూడా తీసుకున్నాను. అక్కడికి ఈ రోజు కొన్న బుక్కుల సంఖ్య ఆరుకు చేరింది. అన్నిట్లోకి పాపం చలం "స్త్రీ" ఒక్కటే odd book out లాగా కనిపిస్తోంది. మంచి ముహూర్తం చూసి మొదలు పెడతాను. బాగుంటే రివ్యూ రాస్తాను బాలేక పోతే మార్తాండ లాగ కథ రాస్తాను, చలం కు ఒక బరువైన పాత్ర ఇచ్చి :) :)

-కార్తీక్

బ్లాగు బస్సు..బహుబాగు బస్సు ...

11/03/2009 - రాసింది karthik at Tuesday, November 03, 2009
అది ఒక బస్సు.
డొరు తెరిచి డ్రైవర్ ఎక్కాడు.
"హల్లొ, డ్రైవర్ గారూ.. మీ గురించి కొంత చెపుతారా?"
"నా పేరు వీవెన్
నేను లెఖిని,కూడలి సృష్టించెన్
తెలుగు బ్లాగులు ఒక సెన్సేషన్"
అదుర్స్ అదుర్స్
ఇక బస్సులో మిగతా వాళ్ళ గురించి చూద్దాం.
"నమస్తే సర్, ఫస్ట్ సీట్ లో ఉన్నారు. మీ పేరు?"
"నా పేరు చావా కిరణ్. నేను అందరికంటే ముందు బస్సు ఎక్కాను"
"ఒహో అలాగా!! కంగ్రాట్స్ సర్"
రెండవ సీట్ లో ఒకాయన బిజీగా రాస్తున్నాడు.
"సర్, మీరు...??"
" నేను ఒకసారి వాడిన పెన్ను ని రెండవసారి వాడను అందుకే నా పేరు కొత్తపాళి."
ఇంతలో ఒక చిన్న పాపను ఎత్తుకుని ఒక ఆవిడ బస్సు ఎక్కింది.
"మేడం మీరు..."
"నా పేరు లక్ష్మి ఊరు హైదరాబాదు."
"మీ పాప చాల ముద్దుగా ఉంది. పేరేమిటి మేడం?"
"మా పాప పేరుతో నీకేమి పని నాయనా..
పాతబస్తీ లో పసుపు కుంకుమలు అమ్ముకునే మొహమూ నువ్వూను"
ఇంకాస్త ముందుకు వెళితే ఒకాయన ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు.
"సార్"
"సార్ మీ పేరు, తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం కదండి?"
"లలితా బాలసుబ్రహ్మణ్యం అన్నా నేనే"
"మీ గురించి ఏదో చదివాను సార్"
"నా ఆసక్తులు బహుళం. నాకు ఆలోచనలు నిత్యం. నా లక్ష్యాలు వైకల్పికం"
"తెలుగులో మాట్లాడండి సార్"
ఆ పక్కగా కూర్చున్న కండక్టర్ గారు కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తున్నారు.
"కండక్టర్ గారు.. ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు?"
"మాయావతి అందంగా ఉంటుందా లేక విజయకాంత్ అందంగా ఉంటాడా అని అలోచిస్తున్నాను"
"ఆ..."
"అవును దేవుడు నాకు 23 టలెంట్స్ ఇచ్చాడు. ఒకొక్కసారి ఒక్కొటి వాడుతుంటాను"
"కొంపదీసి మీరు..."
"నన్ను అందరూ the nakar అని పిలుస్తారు. కొందరు దినకర్ అని, ప్రసాద్ అని కూడా పిలుస్తారు"
ఇంతలో నన్ను తోసుకుంటు ఎవరో ముందుకు వెళ్ళారు. తిరిగి చూస్తే ఒకాయన గళ్ళ లుంగి, చారల బనీను బుర్ర మీసాలతో కనపడ్డాడు.
"హల్లో గురూ ఏ ఏరియా మనది?"
"మలక్ పేట"
"వెళ్ళి కూర్చోండి"
వెనుక సీట్లు నిండడనికి ఇంకా టైం ఉంది కదా అని లేడీస్ సీత్ల వైపు అడుగు వెనక్కు వేశాను. ఎవరో అమ్మాయి నిలుచుకుని ఉంది.
"ఏంటండీ మీకు సీట్ దొరకలేదా?"
"నా పేరు మహిత, నేను కామెంట్లు రాస్తాను కానీ టపాలు రాయను. అందుకే కూర్చోలేదు"
"ఒహో!!"
ఇంతలో ఆ పక్క సీట్లో ఉన్న కళ్ళజోడు ఆవిడ నన్నే చూస్తున్నట్టు అనిపించింది.
"ఒక్కా, మీరు..."
"నా పేరు జ్యొతి. చాలా విషయాల మీద బ్లాగులో రాస్తుంటాను"
"ఓహో అలాగా! మీ ఓపిక కి నా జోహార్లు"
"మీ పక్కన ఉన్న ఆవిడ ఎవరు జ్యోతక్కా?"
"ఈమె పేరు సౌమ్య. నిస్యాలోచనాపథం గురించి ఆలోచిస్తూ ఉంటుంది"
ఇంకొక అడుగు ముందుకు వేస్తే ఒకమ్మాయి తనలోతనే మాట్లాడుకుంటు కనిపించింది.
"మీరు..."
"నేను నేనే.. నాలో 'నేను' మాట్లాడుకుంటూ ఉంటాను తప్పించి బయటి వాళ్ళతో ఎవరితో మాట్లాడను"
"మీ పేరు మేధ కదూ!!"
వెనకల నుంచి ఎవరో పిలిచినట్టు అనిపిస్తే చూశాను. ఒక పెద్ద వెలుగు కనిపించింది.
"మీరూ.."
"కూడలి జల్లెడా తెలికీ కనిపిచే మూడు సిమ్హాలైతే, ఆ కనిపించే నాలుగో సింహమే ఈ బ్లాగాగ్ని"
"సూపర్ సూపర్"
ఇంతలో ఎవారో వెనుక సీట్లోకి పరిగెత్తూకుంటు వచ్చి కూర్చున్నారు.
అక్కడికి వెళ్ళి చూడగా ఎర్ర ప్యంటూ ఎర్ర షర్ట్ ఎర్ర కళ్ళజోడు తో ఒక వ్యక్తి కూర్చోని ఉన్నాడు.
"మీ పేరు...."
"ఆస్తిక,అగ్రవర్ణ,భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా ఇప్పుడే ఒక కథ రాస్తాను"
"'ఓహో మీరు కథలు రాస్తారా?"
"బైరాగి తెలితేటలు అంటే అవే మరి"
"నేను బైరాగినా?"
"నా పేరు ప్రవీణ్/మార్తాండ/ISP Administrator/నాదెండ్ల/PKMCT"
"చాలు బాబూ చాలు. నీ డ్రస్ చూసినప్పుడే నిన్ను గుర్తుపట్టాల్సింది"
"నా పేరు మార్తాండ
ఇంటి పేరు మూర్ఖాండ
నా తోటి ఉన్నసేన మూలిగేటి ఎర్రసేన"
"అయ్య బాబోయ్..నీ పాటలు ఆపు బాబూ.."
"సరే ఐతే. పాటలు ఆపి కథ రాస్తాను"
"హమ్మయ్య బ్రతికిపోయాను"
వెనకాల ఎవరో కూర్చొని నా వైపు సందేహంగా చూస్తూ ఉన్నాడు.
"ఇంత సందేహంగా చూస్తూ ఉన్నావంటే నువ్వు కచ్చితంగా నాగప్రసాద్ అయ్యుంటావు"
"అవును. ఇంతకూ నీ గురించి చెప్పలేదు"
"నా పేరు కార్తీక్..
నేను పుట్టింది రాయలసీమలో..చదివింది ఉత్తరభారత దేశం లో
ప్రస్తుతం ఉండేది ఉద్యాన నగరిలో
ఎక్కడ ఉన్నా...పదహారణాల తెలుగు బిడ్డని... ఒక భాషాభిమానిని"
-----------------------------------------------------------------------------------------------
సమకాలిన సామాజిక/రాజకీయ అంశాల మీద టపాలు రాసే కత్తి మహెష్ గారిని, చదువరి గారిని బస్సులో ఇమద్చలేకపోయాను.

నేను తెలుగు బ్లాగు రాయటం మొదలు పెట్టి రెండేళ్ళా కొన్ని నెలలు అయ్యింది. ఈ రెండేళ్ళ కాలంలో నేను రెగులర్గా చదివే బ్లాగులతో ఈ టపా రాశాను. ఏదో సరదాకి రాశాను తప్పించి ఎవరిని నొప్పించే ఉద్దేస్యం నాకు లేదు. అందరికంటే చిన్న వాడిని కదా అందుకని క్షమించెయ్యండి. మనసుబాగాలేకపొయినా, లేక నిద్ర రాకపొయినా నేను చేసే మొదటి పని బ్లాగులు చదవటం. నాకు ఎన్నో సార్లు సహాయపడ్డ బ్లాగ్ మిత్రులందరికి బ్లాగుముఖంగా నెనర్లు తెలుపుకుంటున్నాను.

-కార్తీక్


ప్రమాదవనం: హోస్టే ఘోస్టైతే!!!

10/05/2009 - రాసింది karthik at Monday, October 05, 2009
ఈ టపా గురించి పెద్ద ఉపోద్ఘాతాలు అవసరం లేదు. టైటిల్ చూస్తే చాలు!!!
అవును నిజం. ఈ సారి ప్రమాదవనం లో వాళ్ళూ వీళ్ళూ కాకుండా ఏకంగా మన మలక్పేట్ రౌడీ నే ఇంటార్వ్యు సారీ తుంటర్వ్యు చేశాం.

ఈ సారి మన రెగులర్ హోస్ట్ విస్కాన్సిన్ విశాలక్షి గారు నివార్య కారణల వల్ల రాలేక పోయారు దానికి ప్రజలందరూ ఆమెకు ధన్య వాదాలు తెలుపుతున్నారు. ఇక ఆమె స్థానం లో మన స్పెషల్ హోస్ట్ బెంగుళూరూ బనజ గారు వచ్చారు. ఈమె అసలు పేరు వనజ, బెంగాలీలు ఎక్కువగా ఉన్న ఆఫిస్ లో పని చేసి "వ" మర్చిపోయారు.

బనజ గారు మైక్ ముందుకు వచ్చి తన ముక్కు తో నేలను తాకి తనదైన శైలిలో అందరికి నమస్కారం చేశారు. అందరూ ఆమె కింద పడ్డ చిల్లర ఏరుకుంటున్నారని భ్రమ పడ్డారు. అది గమనించి ఆమె జీవితమే ఒక భ్రమ అని ఒక గొప్ప నిజాని చెప్పి ప్రజల కళ్ళు తెరిపించి, కాళ్ళు విరకొట్టి జ్ఞానొదయం చేశారు.
ఇక తుంటర్య్వు షురు...
బె.బ: ఈ రోజు మన కార్యక్రమం లో వచ్చేది ఎవరో మీకు తెలుసా? (బ్యాక్ గ్రౌండ్ లో తెలుసా తెలుసా తెలుసా)
ఎవరైతే ఆంధ్రా లో పుట్టి అమెరికాలో ఉన్నారో,
ఎవరైతే ఒకానొక లండన్ సర్జన్ ఆన్ లైన్ జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారొ...
ప్రజలు: ఇంత ఓవర్ అక్షన్ వద్దు. మలక్పేట్ రౌడీ అని ముందే చెప్పారు.
మ.రౌ: అందరికి కెలికాస్కారం, నా గురించి పెద్దగా చెప్పుకోవల్సిన పని లేదు.
బె.బ: అవును సార్.. మీ గొప్ప మీరు చెప్పుకుంటే బావోదు.
మ.రౌ: మరి ఇక మొదలు పెడదామ?
బె.బ: సార్, మీరు ఇంతమందిని తుంటర్వ్యు చేఆరు కద, మీకు ఎవరైనా తుంటర్య్వు ఇస్తాం అని చెప్పి పారిపోయారా?
మ.రౌ: ఓ, ఎందుకు లేదు. ప్రతీ వారం ఇద్దరు ముగ్గురు పారిపోతుంటారు..
బె.బ: సార్, మీరు చేసిన అన్ని తుంటర్వ్యులలొ అతి గొప్ప తుంటర్వ్యు ఏది?
మ.రౌ: (కొద్దిగా ఎమోషనల్ అయ్యి) ఏదని చెప్పనూ, ఎన్నని చెప్పనూ...
బె.బ: ఒకటి చెప్తే చాలు సాఇ. మిగతావి బ్లాగులో చదువుకుంటాం.
మ.రౌ: అక్కడే మీరు నన్ను మరీ మొహమాట పెడుతున్నారు. నేను కనీసం ఒక పది చెప్పాలని ప్లాన్ చేసాను. ప్చ్..
బె.బ: (స్వగతం లో) ఓరి నాయనో.. చక్కగా వచ్చి చిక్కగా ఉన్న రెల్లు పొదల్లో కాలు పెట్టినట్లు ఉన్నాను.
మ.రౌ: ఐనా మీరు ఒక్కటి అని అంత వీజీగా చెప్తే ఎలా? నెత్తి మీద ఉన్న జుట్టులో ఏది నచ్చిన వెంట్రుక అంటే ఏమని చెప్పను??
బె.బ: (కళ్ళల్లో నీళ్ళతో) సార్, నాకళ్ళు తెరిపించారు సార్, తెరిపించారు....
మ.రౌ: సరే సరే ఇంత చిన్న విషయానికే ఇలా ఐపోతే మీరు ఇక తుంటర్వ్యు ఏం చేస్తారు? ముందు ఒక బ్రేక్ చెప్పండి..
బె.బ: (తెలుగు సినిమాలో సెకండ్ హీరోయిన్లా) బ్రేక్. చూస్తునే ఉండండి నిరంతర వార్తా స్రవంతి, టీ.వీ.0.5
------------------------------------------------------------------------------------------
వాణిజ్య ప్రకటన:
పని మనిషితో సమస్యా??
పాల వాడితో గొడవ???
పేపర్ వాడితో గాభరా??
ఐతే వెంటనే మీరు తుస్ సబ్బుని కొనండీ. లక్కీ డ్రాలో గెలిస్తే ప్రముఖ నటి కొయ్యా కరన్ గారితో మీ ఇంటి పనులన్నీ చేయించుకోండి.
తుస్ సబ్బు..మీ వంటినే కాదు..ఇంటిని కూడా శుభ్ర పరుస్తుంది.
------------------------------------------------------------------------------------------

బె.బ: మొదటి బ్రేక్ తట్టుకున్న ప్రజలకు మరోసారి కెలికాస్కారం..
మ.రౌ: అక్కో జల్దీగా కానీ రాదేం?
బ.బె: వస్తున్నా మలకన్నా, మీ దగ్గరికే వస్తున్నా..

బె.బ: ఇప్పుడు మలక్న్న గారితో మాట్లాడ్డానికి ఒక స్పెషల్ వ్యక్తిని పిలుస్తున్నాను...
మ.రౌ: ???
(బ్యక్ గ్రౌండ్లో ఎవరు? ఎవరు? ఎవరు?)
బె.బ:
ఎవరైతే శ్రీకాకుళం లో పుట్టి యావత్ బ్లాగ్లోక ప్రజలందరి అభిమానం చూరగొన్నారో?
ఎవరైతే బ్లాగ్లోకంలో ఫేక్ ఐ.డి. లను తుడిచిపెట్టాలనే సంకల్పంతో తన పొలాన్ని అమ్మకానికి పెట్టారో
ఎవరైతే ఇస్త్రి వాద కథలను పుంఖానుపుంఖాలుగా రాస్తున్నారో
ప్రజలు: యెహె.. మాయదారి సోది..తొందరగా చెప్పి చావండి
బె.బ: కార్మిక హృదయ నేత, జన విజ్ఞాన ప్రదాత, మలక్పేట్ మెంటల్ మన విశిష్ట అతిధి.
మ.మె: సాధారణంగా నేను ఇలాంటి భూస్వామ్య వర్గాల ప్రోగ్రాంలలో పాల్గొనను. కానీ దీనిలొ పాల్గొంటాను ఎందుకంటే ఈ హోస్టుకు నాకు ఎటువంటి జాతి వైరం లేదు కనుక.
బె.బ: (స్వగతం లో) జాతి వైరమా!!! అది జంతువుల మధ్య కదా ఉండేది
బె.బ: సార్ మీ గురించి కొంత ఇంట్రడక్షన్ ఇస్తారా?
మ.మె: ఎవరనుకున్నావు, నన్నేమనుకున్నావు???
బె.బ: మనిషివైతే కాదని ఇందాకే తేలిపోయింది. ఎవరో చెప్పు
మ.రౌ: మా తుగ్లక్ ఎమోషనల్ ఐతే ఇలానే ఉంటుంది. కోపం వస్తే మిమ్మలని లేడీ విలన్ గా పెట్టి కథ రాసేయగలడు.
బె.బ: వీడి *%$@
మ.మె: ఓయ్ రౌడి, నువ్వు ఏకలింగం ఒకరేనని ఎందుకు ఒప్పుకోవ్??
మ.రౌ: వెరీ సింపుల్. ఒకరే కాదు కాబట్టి.
మ.మె: ఇది నీలాంటి సామ్రాజ్యవాద, భుస్వామ్య, పెట్టుబడిదారి, ఆస్తిక, అగ్రకుల వర్గాలకు అలవాటే..
మ.రౌ: నీ సరసం పాడుగాను..నా ఆర్కుట్ కమ్యునిటీలు కూడా అనీ లేవు కదరా
మ.మె: అసలు ఈ రౌడీ ఒక రౌడీనే కాదు. కేడి కూడా.. లేకపోతే మీ బుర్ర తింటానని ఒపన్ గా బ్లాగులో రాస్తాడా..
మ.రౌ: అబ్బ చా?
మ.మె: అసలు ఈ రౌడి రౌడీ, హైదరాబాదుకు చెందిన వాడు. అసలు హైదరాబాదు ఒక ఊరేనా? ఆ ఊరిలో అందరూ అచ్చా అచ్చా అంటూ కచ్చ కచ్చగా పుచ్చిపొయిన హింది మాట్లాడుతారు.
మ.రౌ: పిచ్చి నా తుగ్లకూ, అక్కడ మాట్లాడేది హిందీ కాదు.. ఉర్దూ.
మ.మె: అసలు ఈసారి నా కథలో హైదరాబాదునే విలన్ గా చేస్తాను.
మ.రౌ: పండగ చేసుకో..
మ.రౌ: ఒక విషయం చెప్పు, దేవుడంటే ఎందుకు నీకంతా కోపం?
మ.మె: ఎందుకంటే.... మాకు ఎవరో ఒకరిని వ్యతిరేకించకపోతే మాకు నిద్ర పట్టదు. దేవుడైతే నోరు లేని వాడు కనుక ఎమన్నా పర్లేదు.
మ.రౌ: అబ్బో చాల గొప్ప లాజిక్. కులగజ్జికి మీరు వ్యతిరేకులు కద మరి నువ్వు "కర్మ" అని ఎందుకు తగిలించుకున్నావ్?
మ.మె: అది నాకు నేనే ఇచ్చుకున్న బిరుదు. నాకు టెక్నాలజీలో తెలియనిది అంటూ ఏమి లేదు అందుకని.
బె.బ: ఇప్పుడు ఒక పెద్ద బ్రేక్. నాకు తల తిరుగుతొంది.
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
గర్ర్ర్ర్ బుర్ర్ర్ర్ర్ తుర్ర్ర్
గర్ర్ర్ర్ బుర్ర్ర్ర్ర్ తుర్ర్ర్
గర్ర్ర్ర్ బుర్ర్ర్ర్ర్ తుర్ర్ర్
అంతే మరి, ప్రకటనలు ఇచ్చే సాహసం ఎవరూ చేయలేదు.
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బె.బ: వామ్మో, అప్పుడే బ్రేక్ ఐపోయిందా? నాకు తల నొప్పి ఇంకా తగ్గలేదు.
మ.మె: మీలాంటి, ఆస్తికులకు ఇలాంటి నొప్పులు వీజీగా వస్తాయి.
మ.రౌ: మీలాంటి నాస్తికులకు రానేరావు. ఎందుకంటే తల అనేది ఉన్నా లోపల ఏమీ ఉండదు కద.
మ.మె: ఓయ్ రౌడీ, నీ తిక్క ఎలాకుదర్చాలో నాకు బాగా తెలుసు. అందుకే ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తిని పిలుస్తున్నాను. సార్ రండి సార్..
ఇంతలో ఒక తారు డబ్బా లాంటి వ్యక్తి ఒకతను వచ్చాడు. అతని పేరు "చికాగో చిన్నయ్య"
బె.బ: నే పోతున్నా, ఇతని జన అజ్ఞాన వేదిక దెబ్బకు ఇప్పటికే మెదడు బ్లాక్ అయ్యింది.
మ.రౌ: ఏంటి చిన్నయ్య గారు ఇలా వచ్చారు.
చి.చి: ఏం లేదు. ఈ మధ్య ప్రజలు మమ్మలని గుర్తు పట్టడం లేదు. అందుకని ఏదో ఒక చోట దూరాను. మా శిష్యుడి ప్రజ్ఞ చూసి సంతోషంతో పొంగిపోతున్నాను.
మ.మె: (కళ్ళ నిండా నీళ్ళతో) అది మీ గొప్పతనం సార్...
మ.రౌ: ప్రజ్ఞా?? దేని గురించి మాట్లాడుతున్నావ్ బాబూ?
చి.చి: అదే మా వాడి కథల గురించి. ఇస్త్రీ వాద కథలు అంత గొప్ప ఎవరు రాశారు?
మ.రౌ: మీ వాడి కథలలో ఏ అమ్మాయికి చదువు ఎందుకు రాదు?
మ.మె: అది ఈ పురుషాధిక్య సమాజంలో ఆడది చేసుకున్న పాపం.
మ.రౌ: ఈ తుగ్లక్ గాడు ఇలాగే బుర్ర తింటూ ఉంటాడు, మీరెళ్ళి పని చూస్కోండి. ఇప్పటి వరకు ఈ ప్రొగ్రాం చూసిన అందరికి వసుదేవుడి పాదాభివందనం.
-కార్తీక్

గణేష్: కేవలం గణేష్..

9/29/2009 - రాసింది karthik at Tuesday, September 29, 2009
మొన్న పండగకి ఇంటికి పొయినప్పుడు ఈ సినిమా చూశాను. "బాణం" "శంఖం" వగైరా వగైరా ఉన్నా ఈ సినిమానే ఎందుకు చూశానంటే, ముందు రోజు ఈనాడు పేపర్లో ఈ సినిమా నిర్మాత, దర్శకుడు " మా హీరో పేరుకు ముందు ఇంటి పేరు వెనుక కులం పేరు చెప్పుకోని కుర్రోడు" అని స్తేట్మెంట్ ఇచ్చారు. ఇదేదో అర్థం కాకున్నా వినడానికి ఇంటరెస్టింగా వుందే అని వెళ్ళాము.
ఫస్ట్,ఫస్ట్ లోనే సూపర్ సీన్ అని అనుకుంటున్నారా? కానే కాదు. ఫస్ట్ పేర్లు పడతాయి ఆ తరువాత సినిమా మొదలు. హీరోని ఎస్టాబ్లిష్ చేసేందుకు తగ్గ పిచ్ తయారు చేయలికద, అందుకని ఒకావిడ ఆమె చంకలో బిడ్డని ఆటోలో కూర్చోబెడుతుంది. ఆమె కూరగాయలు బేరమాడుతుంటే ఇంకొక వైపు ఆటో వెళ్ళిపోయింది. అప్పుడు హీరో ఆ ఆటో వెంట పరిగెత్తి ఆ బిడ్డని రక్షిస్తాడు. ఏంటీ? ఆటో వెనకాల పరుగెత్తడం కంటే ఇంకో ఆటోలో వెళ్ళడం మేలు కద అనుకుంటున్నారా? అలా ఆలోచిస్తే తెలుగు సినిమా దర్శకులుగా మీరు డిస్క్వాలిఫై అవుతారు. తర్వాత నా మీదికి మాట రాకూడదు కాబట్టి చెబుతున్నా.
తరువాత సీన్లో హీరోని అందరూ వీడు ఏమనుకుంటే అది చేస్తాడు, పర్యవసానాలు ఆలోచించడు అని అంటుంటారూ. అప్పుడు హీరో మొబైల్ కు కాల్ వస్తుంది. ఈ సినిమాకు రెమునరేషన్ ఇవ్వనని నిర్మాత చెప్పాడేమో, హీరో సీరియస్ గా మొహం పెడతాడు. కట్ చేస్తే ఒక ఇంట్లో బెడ్ మీద ఒక అమ్మాయి ఏడుపు మొహం పెట్టుకుని వుంతుంది. ఆ బెడ్ పక్కనే సన (ఆమేనండీ పూర్వాశ్రమంలో దూరదర్శన్ కేంద్రం హై. సీరియల్స్ లో ఉండేది.) వుంటుంది. కెమెరా హీరో మొహం మీద, సన మొహం మీద, ఒక ప్లేట్లో ఉండే ఒక ముద్ద అన్నం మీదా ఫోకస్ అవుతుంది. అన్నం సరిపోలేదని కొట్టుకుంటున్నారేమో అనుకున్నాను. కానీ విషయం చాలా సీరియస్. విషయం ఏమిటంటే, ఆ అమ్మాయి ఒకడిని ప్రేమించింది. ఆ వేస్టు గాడికి ఒక మేనత్త కూతురు ఉంటుంది అలవాటుగా ఇంట్లో వాళ్ళు వీళ్ళీద్దరి పెళ్ళి చిన్నప్పుడే కుదిర్చి ఆ తర్వాత పోట్లాడుకుని విడిపోతారు.

అప్పుడు హీరో చాలా షార్ప్ గా ఆలోచించి ఆ మేనత్త కూతురిని నేను ప్రేమలో పడేస్తాను అంటాడు. నాకొక విషయం చెప్పండి, అమ్మాయిలను ప్రేమలో అయినా/బురదలో అయినా పడెయడం అంత వీజీనా? 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే నేనేమీ చెప్పలేను.

"బాబూ నీ డౌట్లకు ఇంకొక పోస్టు రాసుకో ముందు సినిమా గురించి రాయి"

వస్తున్నా, వస్తున్నా.. ఇంక హీరొయిన్ తన అపార్ట్మెంట్ లో ఉండే రౌడీ పిల్లలకు ట్యుషన్ చెపుతు ఉంటుంది. అర్థిక మాంద్యం తెలుగు హీరోయిన్ లకు కూడా తాకింది ఉద్యోగాలు లేక ఇలా ట్యుషన్లు చెప్పుకుంటున్నారు. హీరో ఆ రౌడీ పిల్లలతో కలిసి హీరొయిన్ ని పడెస్తాడు. అనాథ అయిన హీరోకి అంత రిచ్ అపార్ట్మెంట్ కు రెంట్ ఎలా కట్ట గలడు అని మీకు డౌట్ రాకుడదు. వచ్చిందంటే మరోసారి ఫెయిలైపోతారు. సెకండ్ హాఫ్ అంతా మాములే ముడు అపర్థాలూ ఆరు క్షమాపణలటో కథ నడుస్తుంది, సారీ కథ కాదు, సమయం గడుస్తుంది ఇందులో కథ అనేది లేదు కదా మరి.

హోలు మొత్తంగా ఆలోచిస్తే, దర్శకుడు ఏమి చెప్పదలచుకున్నాడో నాకు అర్థం కాలేదు. కథ అనే ప్రాణి బుతద్దం వేసి వెతికినా కనిపించదు. ఇంక నటన పరంగా చూస్తే, హీరోయిన్ ఫస్ట్ హాఫ్ బాగానే చేసింది అంటే పళ్ళికిలించడం తప్ప వేరే ఏమీ లేవు. ఇక సెకండ్ హాఫ్ లో ఆ సెంటిమెంటల్ సీన్స్ ఇద్దరు ముందు నుయ్యి, వెనక గొయ్యి టైపులో చేశారు.
the hero is pathetic. In many scenes he seems to have been making a spoof of Pawan Kalyan. It will be too much if he expects to be a big star with this kind of copied acting. Particularly in sentimental scenes you will recall Pawan Kalyan time and again.

"బాబూ ఇది తెలుగు బ్లాగు. ఇంగ్లీషులో రాయాలంటే ఇంకొక బ్లాగు ఉంది కదా, అందులో రాసుకో"
సరే సరే, హీరోయిన్ ఫస్ట్ హాఫ్ లోనూ, పాటలప్పుడూ బాగుంది. సెకండ్ హాఫ్ లో రక్త కన్నీరే. ఇంక పాటల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 2,3 పాటలు ఏ భాషవో కూడా అర్థం కాదు.
ఇక ఈ సినిమాలో ఏదైనా చూడ తగ్గ విషయం అంటే, అవి ఆ పిల్లల అల్లరి మరియు బ్రహ్మి కామెడీ. బ్రహ్మి చాలా ఈజీగా ఒక మంచి రోల్ చేశాడు. ఆ పిల్లలు వచ్చి రానీ మాటలతో ముద్దుగా వున్నారు.

ఇంతకూ ఆ దర్శక నిర్మాతలు పేపర్లో ఎందుకు అలా వేయించారో నాకు అసలు అర్థం కాలేదు. ప్రజలకు ఎవరికైన అర్థం ఐతె తెలుపగలవారు.

-కార్తీక్

పాహిమాం పాహి

9/25/2009 - రాసింది karthik at Friday, September 25, 2009

మహిషాసురిడిని సమ్హరించిన మైసురు చాముండీ దేవి అందుకొ మా ప్రణామాలు..
బెజవాడలో భక్తుల కొంగుబంగారమైన ఓ దుర్గమ్మా ఇవే మా నమస్సులు
వారణాసిలో వెలసిన ఓ విశాలాక్షీ ఇదుగోనమ్మా మా వందనాలు
కాంచీపురమునకు ఏతెంచిన ఓ కామాక్షీ పాహిమాం పాహి
మీనాక్షిగా మధురైనేలుతున్న ఓ మహశక్తి ప్రణమామ్యహం
గంగమ్మను భువి మీదకు సాగనంపుతూ రుషీకేశమున వెలసిన ఓ చండీదేవి నమోనమ:
భక్తుల మనవిని మన్నించుటకు హరిద్వారమున వెలసిన ఓ మనసా దేవి శరణు శరణు.
మహంకాళిగా ఉజ్జైనీ నగరాన వెలసిన ఓ జగన్మాతా జేజేలు
ముంబై మాహానగరాన వెలసిన ఓ మహాశక్తీ శరణు తల్లీ శరణు..
గంగా సంగమానికి సాక్షీభూతంగా నిలిచిన ఓ కలకత్తా కాళీ వందనం అభివందనం


ఏ ఊరికేగినా ఏ వాడన వెలసినా తల్లీ పరాశక్తీ నువ్వే దిక్కు,
రక్షమాం రక్ష
పాహిమాం పాహి
రేపు దుర్గాష్టమి. ఈ సందర్భంగా సకల ప్రాణి కోటికీ మంచి జరగాలని, ఆ అమ్మ కరుణ అందరి మీద ఉండాలని ప్రార్థిస్తున్నాను.

సర్వేజనా సుఖినోభవంతు
-కార్తీక్

ఈ చందమామ!!

8/05/2009 - రాసింది karthik at Wednesday, August 05, 2009
భరత జాతికి దేవుడిచ్చిన వరం ఈ చందమామ!!
భారత దేశ చరిత్రలో నిలిచిపోయింది ఈ చందమామ

ముగ్గురు మాంత్రికులతో చిన్నారులని మంత్రముగ్దులని చేసింది ఈ చందమామ
పెద్దల ఆశీర్వాదంతో రాకాసిలోయ నుంచి క్షేమంగా తిరిగొచ్చింది ఈ చందమామ
తోకచుక్కకు తోడువెళ్ళింది ఈ చందమామ
మకరదేవత కటాక్షాన్ని పొందింది ఈ చందమామ

భరత జాతికి దేవుడిచ్చిన వరం ఈ చందమామ
భారత దేశ చరిత్రలో నిలిచిపోయింది ఈ చందమామ

ఖడ్గ వర్మ కరవాలపు వాడిని వేడి వేడిగా వండి వార్చింది ఈ చందమామ
అరేబియా సిందుబాదును ఆంధ్రాలో నిలబెట్టింది ఈ చందమామ
అవంతీ నగర పింగళుడిని అఖిలాంద్రకోటికి పరిచయం చేసింది ఈ చందమామ
రూపధరుడి యాత్రలను తెలుగు రాష్ట్రానికి పొడిగించింది ఈ చందమామ

భరత జాతికి దేవుడిచ్చిన వరం ఈ చందమామ
భారత దేశ చరిత్రలో నిలిచిపోయింది ఈ చందమామ

పౌరాణికేతిహాసాల నెలవు ఈ చందమామ
చారిత్రకవివరణల నిధి ఈ చందమామ
నీతికథల నిలయం ఈ చందమామ
భేతాళ కథల భాండాగారం ఈ చందమామ

భరత జాతికి దేవుడిచ్చిన వరం ఈ చందమామ
భారత దేశ చరిత్రలో నిలిచిపోయింది ఈ చందమామ

చందమామా! ఓ చందమామా!
సాహితీసాగరంలో ఎన్నో ఆణిముత్యాలనిచ్చిన స్వాతిచినుకు ఓ చందమామ
నీ ప్రభ పొగడ తెలుగు జాతి తరమా?

నేను గత 30 సంవత్సరాల నుంచి వచ్చిన అన్ని చందమామలు చదివాను. ఈ మధ్య బ్లాగాగ్ని, శివ గార్ల వల్ల ఇంకొన్ని పాత కథలు చదివాను. నాకు చందమామ చదవటం అలవాటు చేసిన మా నాన్న గారికి జన్మ జన్మలకు రుణ పడి ఉంటాను.

-కార్తీక్

బండి దేవత

7/23/2009 - రాసింది karthik at Thursday, July 23, 2009
నేను హోండా షైన్ అనే బండి ఓనర్ని. అది కొని వచ్చే వారానికి ఒక సంవత్సరం. నా బండంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే అది కొనడానికి వాడిన ప్రతి పైసా నేను నా చెమటను ఎక్ష్సెల్ షీట్ లలోకి నా క్రియేటివిటీ ని SAS కోడ్ లోకి మార్చి సంపాదించింది.( నేను మార్గ దర్సి లో చేరకుండానే కొన్నాను మరి :) )
ఈ రోజు నా బండి సర్విసింగుకు ఇచ్చాను. ఫ్రంట్ వీల్ లో గాలి లేదు, నా బుర్రలో గుజ్జు లేదు అని చెప్పి ఆ మెకానిక్ మాములుగా కంటే రెండింతలు ఎక్కువే గుంజాడు. కానీ ఎం చేస్తాం!! ప్రకృతి అందమైనది, విధి బలియమైనది. అందుకని వాడికి ఆ డబ్బులు ఇచ్చి బండి తెచ్చుకున్నాను. ఇలాంటి సీసనల్ క్షవరం కాక నాకు ఇంకొక గుండు కొట్టించుకొనే ప్లాన్ కూడా ఉంది. దాని పేరు "రెస్క్యు ఫర్స్ట్". నేను బండి కొన్నప్పుడు అందరూ చాలా భయపెట్టి దీనిలో నన్ను చేర్పించారు. ఇప్పటివరకూ ఒకే ఒకసారి వాడుకున్నాను. టయర్ పంచర్ ఐతే పిలిచాను.. వాడూ మా దగ్గర ఉన్న టైరు వాడితే రిపెయిర్ చేస్తాం లేదంటే లేదు అని వార్నింగ్ ఇచ్చాడు. తప్పుతుందా?? ఎంతైనా నా బుజ్జి బండి కదా మరి :) బండి మీద నాకున్న మోజు చూసి, నా యాక్సిడెంట్ దెబ్బలు తగ్గిన శుభ సందర్భం లో మా అన్నయ్య కొన్ని ఫోటోలు కూడా తీశాడు. మచ్చుకి ఒకటి నా ఇంగ్లీష్ బ్లాగులో పెట్టాను. ( ఆ ఫోటో చూసి ప్రజలు జడుసుకుంటే నాది భాధ్యత కాదు. ఇప్పుడే చెబుతున్నా ) ఈ రోజు ఏదో ఆలోచిస్తుంటే గుర్తుకు వచ్చింది, సంవత్సరం అవుతుంది కదా! దానికి ఎమిషన్ టెస్ట్ కూడా చేయించాలి. ఇంత చేసినా కూడా నా బండి నాకు చాలా ముద్దు. అందుకే ఒక చిన్న పాట. ఇది పూర్తిగా నా బండికే అంకితం.

దారి చూపిన స్కూటరూ, బ్యాకు టయరూ పంచరూ..
దారి చూపిన స్కూటరూ, బ్యాకు టయరూ పంచరూ..
రోడ్డు రోడ్డులో తోడుగా, నా దారిలో నువ్ గెంతగా..
దారి చూపిన స్కూటరూ, బ్యాకు టయరూ పంచరూ..

కారు లేని మనిషి నేను నిన్ను నడిపిన వారిలో..
లైసెన్సున్న మనిషినైతీ చల్లనీ నీ సీటులో..
ట్యాంకు నిండిన వేళలో నీకేమి సేవలు చేతును..
దారి చూపిన స్కూటరూ, బ్యాకు టయరూ పంచరూ..

తుడిచి పోదూ మాసి పోదు కింద పడ్డ గాయమూ..
కలను కూడా మరువలేను డాక్టరిచ్చిన బిల్లును..
బండి నేర్పిన మిత్రుడా.. ఆ బండి నిన్నూ కాపాడదా..

దారి చూపిన స్కూటరూ, బ్యాకు టయరూ పంచరూ..
రోడ్డు రోడ్డులో తోడుగా, నా దారిలో నువ్ గెంతగా..
దారి చూపిన స్కూటరూ, బ్యాకు టయరూ పంచరూ..

ఈ పాట ఒరిజినల్ ఇక్కడ చూడగలరు.

-కార్తీక్

రిసెషన్ ప్రేమలు!!

7/20/2009 - రాసింది karthik at Monday, July 20, 2009
రిసెషన్ లో ప్రేమ ఏమిటి అనుకుంటున్నారా?? ఈ ప్రపంచమంతా ప్రేమ మయం, ప్రేమ లేని జీవితం వ్యర్థం వగైరా వగైరా ఐదు పైసల సలహాలు నేను చెప్పను. ఎందుకంటే నేను డైరెక్టర్ తేజను కాదు కాబట్టి. "జై" అనే సినిమా తీయలేదు కాబట్టి. మరొక విషయం మీరు ఈ టపా రిసెషన్ ఎందుకు వచ్చింది? ఎప్పుడు ఐపోతుంది? లాంటివి ఉంటాయనుకుంటే మీరు మా వంట వాడు చేసే దాల్ ఫ్రై లొ కాలేసినట్టే!!!

**************************************************************************************
ఎలాగూ మా వంట వాడి ప్రసక్తి వచ్చింది కాబట్టి వాడి గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్.
దాల్ ఫ్రై ఎలా చెయ్యాలి?
చాలా సింపుల్. పెసర పప్పు నీళ్ళు లేకుండా ఫ్రై చేసి కుక్కర్లో వేసి ఉడికించడమే!!
ఈ క్రియేషన్ యొక్క అన్ని హక్కులు బికాష్ దాస్ అను మా ఒరిస్సా వంట వాడికే ఉన్నాయి.
**************************************************************************************
ఇక ప్రస్తుత విషయానికి వస్తే, రిసెషన్ దెబ్బకు ప్రేమ పాటలు ఎలా మారిపోయాయి అనేది ఈ టపా యొక్క థీం!!
here we go:

ఏ కంపెనీ ఐనా ఏమైనా, మనమెవరికి వారై వేరైనా
నీ జీతమే నే కోరుకున్నా, మీ కంపెనీ అందుకే వీడుతున్నా

అనుకున్నామని ఇవ్వరు హైకు, అనుకోలేదని ఆగదు ఫైరు!!
రాసేదంతా కోడు అని, వచ్చిందంతా మనది అని.
అనుకోవడమే సాఫ్ట్ పనీ..
నీ జీతమే నే కోరుకున్నా, మీ కంపెనీ అందుకే వీడుతున్నా

బుల్లి మౌసు వలె వాడుకున్నాను, కీ బొర్డు వలే కాపాడినాను,
గుండెను సీడిగా చేసాను,
గుండెను సీడిగా చేసాను, నువ్వు బగ్గులున్నవని వెళ్ళావు..
నీ జీతమే నే కోరుకున్నా, మీ కంపెనీ అందుకే వీడుతున్నా
నీ జీతమే నే కోరుకున్నా, మీ కంపెనీ అందుకే వీడుతున్నా

కోడింగ్ తెలిసిన నా మనసునకు టెస్టింగ్ మాత్రం తెలియనిదా!!
కోడు రాసినదే నిజమైతే , బగ్గించుటయే రుజువు కదా!!
నీ జీతమే నే కోరుకున్నా, మీ కంపెనీ అందుకే వీడుతున్నా
నీ జీతమే నే కోరుకున్నా,
నీ కోడే కమ్మగ తిరగనీ.. నా మెయిలే నీలో ఆడనీ..
కలకాలం అప్రైసల్ రావాలని, మెయిలిస్తున్నా నా దేవికి.. మెయిలిస్తున్నా నా దేవికి..

ఏ కంపెనీ ఐనా ఏమైనా, మనమెవరికి వారై వేరైనా
నీ జీతమే నే కోరుకున్నా, మీ కంపెనీ అందుకే వీడుతున్నా
నీ జీతమే నే కోరుకున్నా, నీ జీతమే నే కోరుకున్నా,

అయ్య బాబోయ్!! ఈ పాట సీరియస్ గా వింటే మనసులో ఏదొ తెలియని బాధ. నాకు తెలికుండానే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయ్. ఆత్రేయ గారికి, అక్కినేని గారికి వందనం!! పాదాభి వందనం!! మీరు తెలుగు వాళ్ళవ్వడం తెలుగు జాతి చెసుకున్న పుణ్యం.
పాట వీడియో ఇక్కడ చూడగలరు.
గమనిక: నేను మొన్న రాసిన టపా లో ఆడ వాళ్ళ మీద జోకులేశానని చాలా మంది ఫీల్ అయ్యారు. ఇప్పుడు నేను వాళ్ళకు సారీ చెప్పడం లేదు. ఎందుకంటే నా బ్లాగుకు నేనే "సుమన్" "ప్రభాకర్" "యస్.వీ.కృష్ణా రెడ్డి" వగైరా వగైరా. ఐనా భర్త భార్యను కొట్టాడు అంటే అది సెంటిమెంటు, ట్రాజేడి, అదే భార్య చీపురు తిరగేసి మొగుడికి నాలగు తగిలించింది అంటే అది కామెడి.


ఇంకొక గమనిక: మా రూమ్మేటు వాళ్ళ అన్నా వాళ్ళ తో కలిసి ఉండాలని వెళ్ళి పోతున్నాడు, కనుక నాకు కంప్యుటర్ దొరకదు. ఒక 2-3 నెలలు (నేను ఒక డబ్బా కొనే వరకు) ఈ బ్లాగులో కొత్త టపాలు ఉండక పోవచ్చు. ఇప్పటి దాకా నా పాటలూ, కోతలూ భరించిన అందరికి శతకోటి వందనాలు.

-కార్తీక్

పండంటి ప్రేమకు పది బహుమతులు

7/06/2009 - రాసింది karthik at Monday, July 06, 2009
'ఓయ్' అనే సినిమా చూశాక నాకు కుడా కొత్త కొత్త గిఫ్టులను కనిపెట్టాలనే ఆలోచన వచ్చింది. ఒకటి రెండు ఆలోచించాక చూస్తే మేధ గారు అగర్బత్తిలకు ఆర్థిక మాంద్యానికి లంకె పెట్టనే పెట్టారు. ఇక అసలు టపాలోకి పొయ్యేముందు ఒక చిన్న మనవి. ఈ టపా లేడీస్ స్పెషల్. ఎందుకంటే, ఏజ్ బార్ అయిన సిద్ధార్థ్ గాడికే అంత క్రియేటివిటి ఉంటే, "యంగిస్తాన్" అయిన అబ్బాయిలకు ఎంత ఉండాలి?? అమ్మాయిలంటే అంత ఆలోచించే తీరికా, ఓపిక వాళ్ళకు ఎలాగూ ఉండవు :) :), కనుక ఏదో వాళ్ళకు సహాయం చేద్దామని రాస్తున్నాను. అమ్మాయిలు, పెన్ను, పేపర్ తీసుకుని రెడిగా పెట్టుకొండి. ( ఫెమినిస్టులెవరైనా ఉంటే మొహమాటం లేకుండా నన్ను తిట్టుకోవచ్చు. చాన్సిస్తే కామెంట్లు కూడా పెడతారని నాకు తెలుసు. ఆశ, దోశ, అప్పడం!! అందుకనే మీకు ఆ చాన్స్ ఇవ్వకుండా కామెంట్ మాడరేషన్ పెట్టాను. :) :) )

1. సిగరెట్ లైటర్:
నరలోకానికి నరకలోకానికి అనుసంధానమైనది సిగరెట్. లైటర్ ఎలాగైతే సిగరెట్ ను మండిస్తుందో అలాగే ఆడది కూడా మగాడి జీవితాన్ని మండిస్తుంది. కాబట్టి జరగబోయేదానికి సింబాలిక్ గా చెప్పినట్టు ఉంటుంది.

2. కత్తెర:
వాడిగా ఉన్న రెండు కత్తులు కలిసి ఎలా గుడ్డను చించుతాయో, అలాగే ఒక మగవాడు ఒక ఆడది కలిస్తే జీవితం అనే గుడ్డ కూడా చినిగిపోతుంది. ( ఎవరి జీవితం అనేది అప్రస్తుతం). వాహ్! ఎంత మంచి అనాలజీ కదా?? నాకు తెలుసు నా క్రియేటివిటి ముందు సినిమా వాళ్ళు బలాదూర్ అని.

3.షూ లేసులు:
కాలు అనేది కుటుంబ పెద్ద అయితే, బూట్లు, సాక్సులు, పిల్లలాంటివి. వీళ్ళందరిని బలంగా పట్టి ఉంచే లేసులు భార్య లాంటివి. ( ఫెమినిష్టులు-ఇప్పుడు మీరు హ్యాప్పీనా కదా ;) ;))

4. కంప్యుటర్ మౌస్:
మౌస్ ఎలాగైతే బయటి నుంచి స్క్రీన్ లోపల ఉన్న కర్సర్ ను కంట్రోల్ చేస్తుందో, అలాగే ఆడది కూడా ఇంట్లో ఉండి బయట ఉన్న మగడ్ని కంట్రోల్ చేస్తుంది. ( ఈ రోజు నా అనాలజీలకు తిరుగులేదు!!).

5. తాళం చెవి:
సన్నగా ఉన్న తాళం చెవి లావుగా ఉన్న తాళం కప్పను ఎలాగైతే కంట్రోల్ చేస్తుందో, అలాగే ఎంత బలవంతుడైన మోగుడ్ని కూడా ఆడది కంట్రొల్ చెయ్యగలుగుతుంది. (ఫెమినిస్టులకు పండగ తిట్టడానికి పొద్దూనే ఎన్ని పాయింట్లో!!)

6,7,8,9,10: ముందు పైన చెప్పినవి ఇవ్వండి. ఆ మొగ పీనుగ ఇంకా బతికి బట్టకడితే అప్పుడు మిగతా వాటి గురించి చెప్తాను.

అబ్బాయిలకు ఒక మాట:
అమ్మాయిలేదో గిఫ్ట్ ఇచ్చారని మీరు మిమ్మల్ని గిఫ్ట్ గా ప్రెసెంట్ చేసుకోకండి. వాళ్ళు కత్తికో కండగా నరికి కేజిల లెక్కన అమ్ముకున్నా ఏమీ చెయ్యలేరు :) :) ఇంకాస్త ముందుకెళ్ళి కిడ్నీలు లివరూ అమ్మేస్తే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి నే చెప్పేదేమిటంటే, కళ్ళు మూసుకుని కత్తి ఫైటు చేస్తూ హీరోయిన్ ను చంపేసిన ఒకానొక తెలుగు సినిమా హీరో లాగా కాకండి. ఆ హీరో ఎవరో తెలియలేదా?? అయితే ఒక చిన్న క్లూ:
అతను తొడ కొడితే సమరసింహం
కత్తి పడితే నరసింహం
నోరు తెరిస్తే గ్రామ సింహం.
ఇంకా తెలియకపోతే.. మీ మానసిక పరిస్థితి గురించి నిపుణులను సంప్రదించండి.

-కార్తీక్.

బైకు స్వగతం!!

6/29/2009 - రాసింది karthik at Monday, June 29, 2009
పొయిన వారం ఇంటికి పొయినప్పుడు మరోసారి బండిలో నుంచి కింద పడ్డాను. ఈ సారి మా అక్కను కూడా కింద పడేశాను... ఇంత వరకు ఎప్పుడూ కింద పడలేదని గొప్పలు చెప్పుకొనేది.. ఇప్పుడు పాపం ఆ రికార్డ్ బ్రేక్ అయ్యింది.
అన్నీ సవ్యంగా జరిగుంటే ఆ రోజు ఇటలీ లో ఉండవలసిన వాడిని. ఇలా హాస్పిటల్ పాలయ్యాను :) ఆ రోజు హాస్పిటల్ లో ఉన్నప్పుడు అనుకున్నాను. నాకే ఇంత నొప్పిగా ఉంటే బండికి ఎలా ఉంటుంది? పాపం దానికి ఎంత నొప్పిగా ఉంటుంది అని? అప్పుడు వచ్చ్చిన ఐడియానే ఈ "బైకు స్వగతం".
కాస్కోండి మరి:

టం టం ట్టం..
ఢం..ఢం..ఢం..ఢం..ఢం.. (starting music)
పల్సర్ కు ప్యాషన్ కు జరిగిన ఈ సమరంలో...
ట్రాఫిక్ కు బైకింగుకు జరిగిన ఈ సంగ్రామంలో..
కడుపు నొప్పికి తీసిపొనిదీ దెబ్బ..
ఐసు గడ్డకు తగ్గిపొనిదీ దెబ్బ..
ఇది ఆ రోడ్డులో తగిలిన దెబ్బ..
నొప్పా? నొప్పా? నొప్పా? నెవ్వర్!!!
అయాం ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్ ఎనీదింగ్ హ్యాపెన్స్ ఇట్స్ నాట్ మై ఫ్లా

దూరమైనది గమ్యం...
దిక్కులేనిది మార్గం...
బ్రేకులేనిదీ పయనం..
బైకు జన్మకిది ఖర్మం..
రోడ్డు మధ్యలో నేనుప్పుడు రోడ్డు మోత్తము జామైనప్పుడు..నాకు మీరు లేరు..
నేను నేను కాను.. నేను నేను కాను
ఇది ఆ రోడ్డులో తగిలిన దెబ్బ..
నొప్పా? నొప్పా? నో!!

వేగం కోసం డయానా పతీ సుతులనెడబాసినది..
ఫుల్లు ట్యాంకును నేను సర్విసింగుకు పంపించినది..
సిటీ బస్సును కాదని నేను రోడ్ త్యాగం చేసినది..
సొంత బండినే కాదని నేను కన్నీటిని దిగమింగుతున్నది..
ఎందుకొసం?..ఆ..ఎందుకొసం?
మంట పుట్టినా అది మనదే కనుకా..
నోరు ముయ్యాలి తప్పు నాదే కనుకా..
బెణికినా..నే సొట్టపోయినా..
అది ట్రాఫిక్ కనుక..
ఆ ట్రాఫిక్కే నా మార్గం కనుక..

పల్సర్ కు ప్యాషన్ కు జరిగిన ఈ సమరంలో...
ట్రాఫిక్ కు బైకింగుకు జరిగిన ఈ సంగ్రామంలో..
కడుపు నొప్పికి తీసిపొనిదీ దెబ్బ..
ఐసు గడ్డకు తగ్గిపొనిదీ దెబ్బ..
ఇది ఆ రోడ్డులో తగిలిన దెబ్బ..

ఈ పాట మాతృక కోసం ఇక్కడ నొక్కండి.
నాతో పాటు కింద పడి ఒక వారం విశ్రాంతి తీసుకున్న నా సోదరీమణికి క్షమాపణలతో ఈ పాట అంకితం :) :)

Despite accident nothing happened to me. Its true that pain is practical but suffering is optional and I did not chose it.

-కార్తీక్.

ఆకలి కాదు "సాఫ్ట్ వేర్ రాజ్యం"

6/17/2009 - రాసింది karthik at Wednesday, June 17, 2009
మొన్న ఆ సీరియస్ పాట రాసి నేను కూడా కొంచెం చిరాకు పడ్డాను. యూజ్ లెస్ ఫెల్లోస్ ప్రజలను ప్రశంతంగా బ్రతకనీరు. ఈ సారికి ఒక సాఫ్ట్ వేర్ ప్రేమికుడి బాధ ఏమిటో చూద్దాం... ఈ సారి మన ప్రేమికులు ఆఫీస్ కెఫెటేరియాలో పాట పాడుకుంటున్నారు..

ఇంజినీరువని సాఫ్ట్ వేరు అని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి..
చిన్న కోడు రాసి బగ్గులన్ని పట్టి ఎన్నెన్ని రిసల్ట్స్ రప్పించావే పొన్నారి..

లాంగ్వేజి నువ్వైతే....
ప్యాకేజి నేనౌతా...
లాంగ్వేజి నువ్వైతే ప్యాకేజి నేనౌతా

ఇంజినీరువని సాఫ్ట్ వేరు అని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి..
చిన్న కోడు రాసి బగ్గులన్ని పట్టి ఎన్నెన్ని రిసల్ట్స్ రప్పించావే పొన్నారి..


కోడు నీవై.. కోడులో ఎర్రర్ నేనై..
ప్రాజెక్ట్ చెత్తే కాగా..
బగ్గు నేనై..
నాలో ప్రాబ్లం నీవై..
'బ్యుటిఫుల్' తప్పు ఐనది సింటాక్సో లాజికో ఇంపుట్టో..

ఇంజినీరువని సాఫ్ట్ వేరు అని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి..
చిన్న కోడు రాసి బగ్గులన్ని పట్టి ఎన్నెన్ని రిసల్ట్స్ రప్పించావే పొన్నారి..
లాంగ్వేజి నువ్వైతే ప్యాకేజి నేనౌతా..

ఇప్పుడు చూద్దాం

తనన తనన తన్నా..
' హ్మ్మ్' తనన తనన అన్నా..
తాన తన్న తాన్నం తరతతన ...
తాన అన్నా టూలేమో ఒకటే కదా
కోడు రాసి రన్ను చేయలేదా..
కోడే ఫైనల్ కదా..
కోడు తప్పనీ... అన్నా..ఇంతే కాదా..
కోడు తప్పనీ... అన్నా..ఇంతే కాదా..

ఇంజినీరువని సాఫ్ట్ వేరు అని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి..
చిన్న కోడు రాసి బగ్గులన్ని పట్టి ఎన్నెన్ని రిసల్ట్స్ రప్పించావే పొన్నారి..
లాంగ్వేజి నువ్వైతే ప్యాకేజి నేనౌతా..



P.S: ఈ పాటలు విని ప్రజలకు ఎవరికైనా గుండె కళ్ళుక్కుమన్నా.. లేక బుర్ర ఢాం అన్నా. నేను చేయగలిగేది ఏమీ లేదు..

-కార్తీక్

మరొక ప్రేమ పాట

6/13/2009 - రాసింది karthik at Saturday, June 13, 2009
మొదటగా disclaimers:
నేను రాసే పాటలు పాడాలని ప్రయత్నిస్తే ఆ తర్వాతి పరిణామాలకు నేను భాధ్యుణ్ణి కాదు. పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసినా, చుట్టు పక్కల వాళ్ళు మిమ్మల్ని పిచ్చాసుపత్రిలో చేర్చినా నేనూ జవాబుదారి కాదు. :) :)
ఇంతకు ముందు నేను రాసిన టపాలు చూసిన ప్రజలు నాలో ఒక "ఉదయించే కవి" ని చూశాము అని అన్నారు. రూలూ ప్రకారం నేను "నేనా?? కవినా??" అనాలి. ఇంకొ పక్క నుండి ఒకరు "రచయితగారూ " అని అరవాలి కానీ నేను వాడేది సంతూర్ సోప్ కాదు. సినితారలు వాడే లక్స్. అందువల్ల ఏమీ అనడం లేదు. :) :)

ఇక ఈ రోజు విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్ర దేశం లో అమ్మాయిలను వేదించే ట్రెండ్ నడుస్తుంది కద. అందుకని అలాంటి అమ్మాయిల కోసం ఈ పాట రాశాను. ఇది కామెడీగా అనిపిస్తే నేనేమీ చెయ్యలేను. అమ్మాయిలకు సానుభుతి మాత్రం తెలుపుతాను. :( ఈ విషయం మీద చాలా మంది ప్రజలు బల్లలు గుద్ది, కుర్చీలు విరక్కొట్టి ఎన్నో చెప్పారు/చెప్తారు. మా ఇంట్లొ బల్లలు లేవు కనుక నేను ఇది రాస్తున్నాను.

అమ్మాయి:
నన్ను వేధించే శాడిస్టువు నువ్వేనని కళ్ళు పొడిచే ఆ శనిగాడివి నువ్వేనని
నాకు డౌటొచ్చింది, డౌటు క్లియర్ అయ్యింది,
అన్నీ క్లియర్ అయ్యి ఈ ఖర్మ మొదలైంది.
పోశాడండీ ఆసిడే మరి..మండుతూ ఉందిలే ఇది. .
పోశాడండీ ఆసిడే మరి..మండుతూ ఉందిలే ఇది. .

అబ్బాయి:
నిజంగా...నిజంగా ఇలా ఈ రొజే తొలిసారిగా
పోశానండీ ఆసిడే మరి.. సూపరుగా ఉందిలే ఇది.
పోశానండీ ఆసిడే మరి.. సూపరుగా ఉందిలే ఇది.
ఈ కాంత లోన దాగి ఉంది నిర్మలత్వము
తన వైపు నన్ను లాగుతోంది మాయకత్వము..

అమ్మాయి:
నీ చేతిలోన దాగి ఉంది మోండి ఆసిడు..
అది తాకగానే భగ్గుమంది పిచ్చి ముఖము...
అబ్బాయి:
ఇద్దరిదీ ఒకే స్థితి ఏమిటి ఈ పరిస్థితి..
అమ్మాయి:
ఇద్దరిదీ ఒకే స్థితి ఏమిటి ఈ పరిస్థితి..
అబ్బాయి:
బలుపు గుర్రమెక్కి యువత చెయ్యమంది శ్వారీ..
అమ్మాయి:
పోశాడండీ ఆసిడే మరి..మండుతూ ఉందిలే ఇది. .
పోశాడండీ ఆసిడే మరి..మండుతూ ఉందిలే ఇది. .
అబ్బాయి:
నా ఈడు నేడు పాడుతోంది బీరు దండకం..
నా ఒంటి మీద నిండి ఉంది బారు మండలం..
అమ్మాయి:
నా పాత బొబ్బ రేపుతోంది కొత్త నరకం..
నా సత్తువంత పీర్చుకుంది కత్తి గాయం..
కనిపిస్తే ఖర్మే కాలీ.. కాల్చేస్తా ఒకేసారి..
ఆడజన్మ ఎత్తినోళ్ళ ఖర్మ ఈ పరిస్థితి..

it seems gone are those days where girls have rosy dreams about their relationships :(

-కార్తీక్


ప్రేమ "గాయం"

6/09/2009 - రాసింది karthik at Tuesday, June 09, 2009
ఈ మధ్య ఆఫిస్ నుంచి త్వరగా ఇంటికి వస్తున్నా(అంటే 9గం. లకు వస్తున్నా). ఈ రోజు కూడా అలాగే వచ్చి ఏదో ఆలోచిస్తుంటే ఒక అవిడియా వచ్చింది. ఒకవేళ ఎవరైనా అబ్బాయికి బ్లాగుల్లో అమ్మాయి దొరికితే ఆ బ్లాగు ప్రేమను ఎలా చెప్తాడు అని ఒక డౌట్ వచ్చింది. అప్పుడు రాసిందే ఈ ప్రేమ "గాయం" సారీ "గేయం".

నేనొక బ్లాగు పిశాచిని నీవొక కూడలి వాసివి.
నా బ్లాగే నిండనిది నీ సైటే కదలనిది.

నేనొక బ్లాగు పిశాచిని నీవొక కూడలి వాసివి.
నా బ్లాగే నిండనిది నీ సైటే కదలనిది.
నేనొక బ్లాగు పిశాచిని

బ్లాగు మూసిన బ్లాగరింటనే లాగిన్ అయ్యి నిలుచున్నా
క్లిక్కి క్లిక్కి రిప్లై రాక లాగాఫ్ అయ్యి వెళుతున్నా
బ్లాగు మూసిన బ్లాగరింటనే లాగిన్ అయ్యి నిలుచున్నా
క్లిక్కి క్లిక్కి రిప్లై రాక లాగాఫ్ అయ్యి వెళుతున్నా
నా బ్లాగే నిండనిది నీ సైటే కదలనిది.
నేనొక బ్లాగు పిశాచిని

బ్లాగుకు సైటు సైటుకు బ్లాగు పలికే ఆడాన్సూ
ఫ్యుజు కాలిన ల్యాప్టాప్ కు చెబుతున్నా నీ మెయిల్ కు చేరితే చాలు
నీ ఆర్కైవుల ఫోల్డర్ లో నన్నెపుడో చూస్తావు
నా మెయిలు చూశానని చెప్పేలోపు డిలీటై పోతాను.

నేనొక బ్లాగు పిశాచిని నీవొక కూడలి వాసివి.
నా బ్లాగే నిండనిది నీ సైటే కదలనిది.
నేనొక బ్లాగు పిశాచిని

ఆత్రేయగారికి శతకోటి క్షమాపణలతో..
ఆయన అభిమానకోటిలో ఒక సైకతరేణువు...

-కార్తీక్

రైలోపాఖ్యానం

6/06/2009 - రాసింది karthik at Saturday, June 06, 2009
మా అమ్మమ్మా వాళ్ళ ఊరిలో రైల్వే స్టేషన్ మా ఇంటి పక్కనే ఉండేది. అందువల్ల చిన్నప్పుడు కూ చికు చికు అని శబ్దం వినిపించిన వెంటనే అరుగెక్కి స్టేషన్ వైపు చూసేవాడిని. కొన్ని రోజుల తర్వాత మా మామా వాళ్ళు ఏ రైల్ వచ్చినా కార్తీక్! నీ డార్లింగ్ వచ్చింది అని అరిచేవాళ్ళు. అలా అరిచినందుకైనా నన్ను ఎప్పుడు రైల్ దగ్గరికి తీసుకొని పోతారేమో అని అనుకునేవాడిని. కానీ వాళ్ళ డిక్షనరీ లో కనికరం అనే పదమే లేదు. దిష్టి తగులుతుంది అనే కారణం చెప్పి ఎప్పుడూ ఇంట్లోనే ఉంచే వాళ్ళు. ఇంక మా ఊరిలో రైల్వే స్టేషన్ ఉంది అనే విషయం నాకు చాలా రొజుల వరకు తెలీదు. అందువల్ల చాలా కాలం రైలు ఎక్కే చాన్స్ దొరకలేదు. ఇదంతా మా ఇంట్లో వాళ్ళ కుట్ర అని నా బలమైన నమ్మకం. ఎందుకంటే మా నాన్న గత 35 సం.లుగా అర్.టి.సి. లో పని చేస్తున్నారు. కాబట్టి దీని వెనుక ఆయన పాత్ర ఉండొచ్చు.
************************************************
అర్.టి.సి. ప్రస్తావన ఎలాగూ వచ్చింది కాబట్టి ఒక చిన్న జీ.కే. ప్రశ్న (ఐ.ఏ.యస్. ,ఐ.పీ.యస్. రాసే వాళ్ళు తప్పకుండా తెలుసుకోవలసినది):
ప్ర: ఏ.పీ.యస్.ఆర్.టి.సీ. అంటే ఏమిటి?
జ: ఆగితే(A) పోదు(P) సమయానికి(S) రాదు(R) టైముకు(T) చేరదు(C).
************************************************
ఇలాంటి కుట్రలు, కుతంత్రాల నడుమ ఎలాగైతేనేమి 1997 లో మొదటిసారిగా రైలెక్కాను. ఆ తర్వాత అప్పుడప్ప్డూ రైల్ ఎక్కేవాడిని. ఇలా ఉండగా ఇంజినీరింగ్ థర్ద్ యియర్లో ఇండియన్ ఆర్మీ టెక్నికల్ స్ట్రీం ఇంటర్వ్యువ్ అని చెప్పి ఆలహాబాద్ కు వెళ్ళాను. అక్కడ ఆ టెస్ట్ ఎన్ని రొజులు ఉంటుందో కరెక్ట్ గా తెలీదు. కానీ మనం అప్ప్లై చెయ్యటం ఫెయిల్ కావటమా??? చరిత్రలో లేదు అని రిజర్వేషన్ చెయ్యించుకోలేదు. తీరా అక్కడికి వేళ్ళాక మనం మొదటి రౌండ్లోనే వెనక్కి వచ్చేశాం. ఇప్పుడు అలాహాబాద్ నుంచీ వెనక్కు రావడం ఎలా?? మనలాంటి వారూ, మన జాతి వారూ (తెలుగు జాతి) ఇంకొందరు ఉండటం వల్ల అందరం కలిసి వెయిటింగ్ లిస్ట్ టికెట్ మీద పాట్నా నుంచి హైదరాబాద్ వచ్చే రైలెక్కేశాం. ప్రయాణం పేరు మీద మన సర్కారు చేస్తున్న దురాగతాలు అప్పుడు తెలిసొచ్చాయి. నిల్చుకోవడానికి కూడా స్థలం లేదు. ఫుట్ బోర్డ్ మీద కూర్చొని ప్రయాణం చేశాను. ఆ తర్వాత కూడా నాకు రైళ్ళ మీద లవ్వు తగ్గ లేదు. ఆ తర్వాత సంవత్సరం ఇంటర్వ్యువ్ కని కడప నుంచీ బొంబయికి, అక్కడి నుంచీ కాన్ పుర్ కి, అక్కడి నుంచి డిల్లీ కి వెళ్ళాల్సి ఉంది. నాది అసలే బంపర్ జాక్ పాట్ జాతకం కద అందుకని అన్ని వెయిటింగ్ లిస్ట్ టికెట్ మీదనే ప్రయాణం చేశాను. ఇంక చూసుకోండి, ఆహా నా రాజా! కళ్ళు నిజంగానే కాయలు కట్టాయి. ఎంత విసుగొచ్చిందంటే, డిల్లీకి పోకుండానే వెనక్కు వచ్చేశాను. హైదరాబాద్ చేరాక మా అక్కకు చెప్పిన మొదటి విషయం ఏమిటంటే "మనం ఇంటికి బస్సులో పోదాం" అని. ఆ తర్వాత కూడా గౌ. భా.రై. వారు వీలు దొరికినప్పుడల్లా నా జీవితంతో ఆడుకుంటూనే ఉన్నారు. కాన్ పూర్ లొ ఉన్న రెండు సంవత్సరాలు ప్లాన్ చేసుకొని ఇంటికి వచ్చేవాడిని కనుక పెద్ద సమస్య కాలేదు. మధ్యలో ఒక సారి అహమ్మదాబాదుకు వెళ్ళాను. అప్పుడు ఆ రైలు 12 గం. లేట్ వచ్చి నా సెమిస్టర్ రిజిస్ట్రేషన్ ప్రాబ్లం అయ్యింది. ఇలాంటి అనుభవాల నడుమ ఇప్పుడు రైలెక్కాలి అంటే భయం వేస్తోంది. వచ్చే వారం హైదరాబాదుకు వెళ్ళడానికి రైలుకే వేళుతున్నాను. ఎలా వస్తానో ఏమో???
ఇవ్వన్నీ చూశాక ఒక చిన్న పాట రాశాను:

ఇరుకుపెట్టెలో.....
పిచ్చిరషులొ......
.........................................................................

ఇరుకుపెట్టెలో పిచ్చిరషులొ రైలు ప్రయాణం.
స్టేషన్ ఎక్కడో స్టాపు ఎప్పుడో తెలియదు పాపం. తెలియదు పాపం..
ఇరుకుపెట్టెలో పిచ్చిరషులొ రైలు ప్రయాణం.
స్టేషన్ ఎక్కడో స్టాపు ఎప్పుడో తెలియదు పాపం. తెలియదు పాపం
ఒహొ హో ఒహొ హో ఓహొ హొ హో

ఇది భారత రైల్వే అని తెలుసు, అది సింగిల్ లైన్ అని తెలుసు
ఇది భారత రైల్వే అని తెలుసు, అది సింగిల్ లైన్ అని తెలుసు
భారత రైల్వేలో సింగిల్ లైన్లో సాగలేననీ తెలుసు
ఇటు సీట్లు లేవనీ తెలుసు అటు టైం లేదనీ తెలుసు
ఇటు సీట్లు లేవనీ తెలుసు అటు టైం లేదనీ తెలుసు
సీట్లు ఉన్ననూ, టైము ఉన్ననూ ఫైను తప్పదని తెలుసు
ఐనా రైలు ప్రయాణం...
స్టేషన్ ఎక్కడో స్టాపు ఎప్పుడో తెలియదు పాపం. తెలియదు పాపం..
ఒహొ హో ఒహొ హో ఓహొ హొ హో

ఇది టికెటూ డబ్బుల ఆరాటం.. అది సీటు బెర్తుల చెలగాటం
ఇది టికెటూ డబ్బుల ఆరాటం.. అది సీటు బెర్తుల చెలగాటం
టికెటు జారినా బెర్తు పోయినా ఆగదు జీవిత పోరాటం.
ఇది ఇంజిన్ బోగిల పోరాటం. అది డబ్బూ టైమూ చెలగాటం
ఇది ఇంజిన్ బోగిల పోరాటం. అది డబ్బూ టైమూ చెలగాటం
ఇంజిన్ ఫెయిలు అయి..టైము వేస్టు అయి బ్రతుకుతున్నది ఒక శవం.
ఐనా రైలు ప్రయాణం...
స్టేషన్ ఎక్కడో స్టాపు ఎప్పుడో తెలియదు పాపం. తెలియదు పాపం..

ఇరుకుపెట్టెలో పిచ్చిరషులొ రైలు ప్రయాణం.
స్టేషన్ ఎక్కడో స్టాపు ఎప్పుడో తెలియదు పాపం. తెలియదు పాపం..
ఒహొ హో ఒహొ హో ఓహొ హొ హో

-కార్తీక్


కిక్: వద్దు బాబోయ్!

5/24/2009 - రాసింది karthik at Sunday, May 24, 2009
పొయిన వారం ఇంటికి పొయినప్పుడు మా కజిన్స్ తో కలిసి కిక్ అనే సినిమా చూశాను. మామూలుగా ఏ సినిమాకు పోవాలి అనేది మా అక్కనే డిసైడ్ చేస్తుంది. కానీ ఈ సారి తనకు ఆ చాన్స్ ఇవ్వకుండా నేనే కిక్ సినిమాకు వేళదాము అని చెప్పి తీసుకుపోయాను. లేటుగా పోతే టికెట్లు దొరకవని 15 నిమిషాలు తొందరగానే వెళ్ళాము.("అరుంధతి" కి లేటుగా వెళ్ళి "నచ్చావులే" చూశాము. ఆ దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదు) సినిమా మొదలవుతూనే ఇలియాన చిన్న చిన్న బట్టలు వేసుకుని భారతదేశం లోని బీదరికాన్నంతా చూపించింది. నాకు తెలియక అడుగుతాను యోగా చెయ్యాలి అంటే చిన్న చిన్న బట్టలు వేసుకోవాడం అవసరమా? (బాబా రాందేవ్ కూడా చిన్న చిన్న బట్టలు వేసుకుంటాడు అంటే నేను సమధానం చెప్పలేను) ఇంక కథ కొద్దిగా మొదలవుతూనే మనకు అర్థం అయిపోతుంది, ఇది రవితేజ మార్కు ఒవెర్ యాక్షన్ కథ అని. "విక్రమార్కుడు" లో అత్తిలిసత్తి క్యారెక్టర్ హిట్ అయ్యాక అన్ని సినిమాలు అలానే ఉంటున్నాయి కాబట్టి కథ గురించి పెద్దగా అలోచించకుండా దర్శకుడు ఒక 3-4 కామెడీ క్యారెక్టర్లు పెట్టి బండి లాగించాడు. ఎందుకంటే వాళ్ళూ లేక పోతే మొదలైన 15నిమషాలకే ఇంటర్వెల్ ఇవ్వాల్సి వచ్చేది. ఇక్కడి దాకా సినిమా చూశాక నాకు ఒక డౌట్ వచ్చింది : ఆంధ్రదేశం లో అమ్మాయిలు అంత సులభంగా అన్ని బూతులు మాట్లాడుతున్నారా? (నేను ఆంధ్ర వదిలి నాలగేళ్ళైంది కాబట్టి అడుగుతున్నాను.దేవుడి పాలనలో ఇట్ల కూడా డెవలప్ అయ్యామా????) ఎందుకంటే, ఇలియానా ప్రతి సీన్ లో హీరో వంశవృక్షాన్ని పెళ్ళగిస్తూనే ఉంది మరి!

ఇంకొక ముఖ్య విషయం ఈ సినిమాలోని పోలిస్-దొంగ చేజింగులు,ఫైట్లు. ఏమాత్రం మోహమాటం లేకుండా అవన్నీ ధూం-2 నుంచీ, ఇంకా కొన్ని ఇంగ్లీష్ సినిమాల నుంచీ కాపీ కొట్టాడు, సారీ స్పూర్తి పొందాడు. ఇంక సెకండ్ పార్ట్ లో ఒక చెత్త ఫ్లాష్ బ్యాక్ దానిలో ఒక సెంటిమెంట్ టచ్. ప్రేక్షకుల గుండెలు పిండాను అని దర్శకుడు అనుకుంటాడు, కానీ అలాంటివి గుమ్మడి కాలం నుంచీ చూస్తున్నారు కాబట్టి జనాల గుండెలు కరగలేదు. అందరూ శుభ్రంగా ఇంటర్వల్ లో కొనుకున్న కూల్ డ్రింకులు, స్నాక్స్ ముగించారు.

కానీ ఈ సినిమాలో ఏదైనా మచి విషయం ఉంది అంటే, అది ఆ కొత్త యాక్టర్ "శ్యాం". అతను పోలీస్ ఆఫీసర్ లాగా మంచి యాక్షన్ చేశాడు.రవితేజ రక్త కన్నీరు చూపించాడు, ఇంక ఇలియాన గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇంక విలన్ల గ్యాంగ్ అంతా మనకు తెలిసిన వాళ్ళే. వాళ్ళు అంత కంటే వేరే రోల్స్ చెయ్యలేరు. నాకు బాధేసిన విషయం ఏమిటంటే, ఆలీ, బ్రహ్మి లాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్స్ ని ఎందుకు అలా వేస్ట్ చెస్తున్నారో అర్థం కావడంలేదు. వాళ్ళిద్దరి చేతా చాలా చెత్త చేయించాడు. ఆ దర్శకుడు పూర్వాశ్రమంలో ఖచ్చితంగా ఏదో సీరియల్ కు పని చేసి ఉంటాడు.

మొత్తానికి కిక్=విక్రమార్కుడు+కృష్ణ+కొన్ని ఇంగ్లీష్ సినిమాలు. అదీ స్టొరీ!

కొసమెరుపు: మొన్న ఈ సినిమా నిర్మాత ఇది ఒక సందేశాత్మక చిత్రమని స్టేట్ మెంట్ ఇచ్చాడు. నాకైతే ఇందులో ఎలాంటి సందేశము కనిపించలేదు. తెలుగు సినిమా ఎంత దిగజారింది అనే దానికి ఇంతకంటే మంచి ఉదాహరణ అవసరం లేదనుకుంటా!!

నా బ్లాగు కూడలి లొ కనిపించడంలేదు!!

5/07/2009 - రాసింది karthik at Thursday, May 07, 2009
కారణం నాకు తెలియదు కాని నా బ్లాగు రాసిన తరువాత, కూడలి బ్లాగ్ రోల్ లో నా బ్లాగు రావటం లేదు. ఈ మధ్య కూడలి వారు ఏమైనా షరతులు విధించారా?? లేక నేను అంత చెత్త కంటెంట్ రాస్తున్నానా? లేక నా రాతలు ఏదైనా వర్గం వారి మ్నొభావాలను దెబ్బతీశయా ? (పొయిన వారం రాజకీయ నాయకుల మీదా, అంతకు ముందు ఆడవాళ్ళ మీదా సెటైర్లు వేశాను, ఆ సెటైర్లకు నన్ను రిటైర్ చెయ్యటం ఏమి బాగాలేదు :) )
కనుక, అయ్యా కూడలి వారూ..దయ చేసి నా బ్లాగు ను కూడలికి జత చెయ్యండి. నేను రెండు రొజులు క్రితమే తమకు పర్సనల్ గా మెయిల్ కూడా పంపాను. గమనించగలరు.

ప్రజలకు మనవి: ఒక వేళ ఈ టపా కూడలి లో కనపడితే శ్రమ అనుకోకుండా ఆ పైన ఉన్న పోల్ లో తెలుపగలరు.

-కార్తీక్