బైకు స్వగతం!!

6/29/2009 - రాసింది karthik at Monday, June 29, 2009
పొయిన వారం ఇంటికి పొయినప్పుడు మరోసారి బండిలో నుంచి కింద పడ్డాను. ఈ సారి మా అక్కను కూడా కింద పడేశాను... ఇంత వరకు ఎప్పుడూ కింద పడలేదని గొప్పలు చెప్పుకొనేది.. ఇప్పుడు పాపం ఆ రికార్డ్ బ్రేక్ అయ్యింది.
అన్నీ సవ్యంగా జరిగుంటే ఆ రోజు ఇటలీ లో ఉండవలసిన వాడిని. ఇలా హాస్పిటల్ పాలయ్యాను :) ఆ రోజు హాస్పిటల్ లో ఉన్నప్పుడు అనుకున్నాను. నాకే ఇంత నొప్పిగా ఉంటే బండికి ఎలా ఉంటుంది? పాపం దానికి ఎంత నొప్పిగా ఉంటుంది అని? అప్పుడు వచ్చ్చిన ఐడియానే ఈ "బైకు స్వగతం".
కాస్కోండి మరి:

టం టం ట్టం..
ఢం..ఢం..ఢం..ఢం..ఢం.. (starting music)
పల్సర్ కు ప్యాషన్ కు జరిగిన ఈ సమరంలో...
ట్రాఫిక్ కు బైకింగుకు జరిగిన ఈ సంగ్రామంలో..
కడుపు నొప్పికి తీసిపొనిదీ దెబ్బ..
ఐసు గడ్డకు తగ్గిపొనిదీ దెబ్బ..
ఇది ఆ రోడ్డులో తగిలిన దెబ్బ..
నొప్పా? నొప్పా? నొప్పా? నెవ్వర్!!!
అయాం ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్ ఎనీదింగ్ హ్యాపెన్స్ ఇట్స్ నాట్ మై ఫ్లా

దూరమైనది గమ్యం...
దిక్కులేనిది మార్గం...
బ్రేకులేనిదీ పయనం..
బైకు జన్మకిది ఖర్మం..
రోడ్డు మధ్యలో నేనుప్పుడు రోడ్డు మోత్తము జామైనప్పుడు..నాకు మీరు లేరు..
నేను నేను కాను.. నేను నేను కాను
ఇది ఆ రోడ్డులో తగిలిన దెబ్బ..
నొప్పా? నొప్పా? నో!!

వేగం కోసం డయానా పతీ సుతులనెడబాసినది..
ఫుల్లు ట్యాంకును నేను సర్విసింగుకు పంపించినది..
సిటీ బస్సును కాదని నేను రోడ్ త్యాగం చేసినది..
సొంత బండినే కాదని నేను కన్నీటిని దిగమింగుతున్నది..
ఎందుకొసం?..ఆ..ఎందుకొసం?
మంట పుట్టినా అది మనదే కనుకా..
నోరు ముయ్యాలి తప్పు నాదే కనుకా..
బెణికినా..నే సొట్టపోయినా..
అది ట్రాఫిక్ కనుక..
ఆ ట్రాఫిక్కే నా మార్గం కనుక..

పల్సర్ కు ప్యాషన్ కు జరిగిన ఈ సమరంలో...
ట్రాఫిక్ కు బైకింగుకు జరిగిన ఈ సంగ్రామంలో..
కడుపు నొప్పికి తీసిపొనిదీ దెబ్బ..
ఐసు గడ్డకు తగ్గిపొనిదీ దెబ్బ..
ఇది ఆ రోడ్డులో తగిలిన దెబ్బ..

ఈ పాట మాతృక కోసం ఇక్కడ నొక్కండి.
నాతో పాటు కింద పడి ఒక వారం విశ్రాంతి తీసుకున్న నా సోదరీమణికి క్షమాపణలతో ఈ పాట అంకితం :) :)

Despite accident nothing happened to me. Its true that pain is practical but suffering is optional and I did not chose it.

-కార్తీక్.