ఈ చందమామ!!

8/05/2009 - రాసింది karthik at Wednesday, August 05, 2009
భరత జాతికి దేవుడిచ్చిన వరం ఈ చందమామ!!
భారత దేశ చరిత్రలో నిలిచిపోయింది ఈ చందమామ

ముగ్గురు మాంత్రికులతో చిన్నారులని మంత్రముగ్దులని చేసింది ఈ చందమామ
పెద్దల ఆశీర్వాదంతో రాకాసిలోయ నుంచి క్షేమంగా తిరిగొచ్చింది ఈ చందమామ
తోకచుక్కకు తోడువెళ్ళింది ఈ చందమామ
మకరదేవత కటాక్షాన్ని పొందింది ఈ చందమామ

భరత జాతికి దేవుడిచ్చిన వరం ఈ చందమామ
భారత దేశ చరిత్రలో నిలిచిపోయింది ఈ చందమామ

ఖడ్గ వర్మ కరవాలపు వాడిని వేడి వేడిగా వండి వార్చింది ఈ చందమామ
అరేబియా సిందుబాదును ఆంధ్రాలో నిలబెట్టింది ఈ చందమామ
అవంతీ నగర పింగళుడిని అఖిలాంద్రకోటికి పరిచయం చేసింది ఈ చందమామ
రూపధరుడి యాత్రలను తెలుగు రాష్ట్రానికి పొడిగించింది ఈ చందమామ

భరత జాతికి దేవుడిచ్చిన వరం ఈ చందమామ
భారత దేశ చరిత్రలో నిలిచిపోయింది ఈ చందమామ

పౌరాణికేతిహాసాల నెలవు ఈ చందమామ
చారిత్రకవివరణల నిధి ఈ చందమామ
నీతికథల నిలయం ఈ చందమామ
భేతాళ కథల భాండాగారం ఈ చందమామ

భరత జాతికి దేవుడిచ్చిన వరం ఈ చందమామ
భారత దేశ చరిత్రలో నిలిచిపోయింది ఈ చందమామ

చందమామా! ఓ చందమామా!
సాహితీసాగరంలో ఎన్నో ఆణిముత్యాలనిచ్చిన స్వాతిచినుకు ఓ చందమామ
నీ ప్రభ పొగడ తెలుగు జాతి తరమా?

నేను గత 30 సంవత్సరాల నుంచి వచ్చిన అన్ని చందమామలు చదివాను. ఈ మధ్య బ్లాగాగ్ని, శివ గార్ల వల్ల ఇంకొన్ని పాత కథలు చదివాను. నాకు చందమామ చదవటం అలవాటు చేసిన మా నాన్న గారికి జన్మ జన్మలకు రుణ పడి ఉంటాను.

-కార్తీక్