గణేష్: కేవలం గణేష్..

9/29/2009 - రాసింది karthik at Tuesday, September 29, 2009
మొన్న పండగకి ఇంటికి పొయినప్పుడు ఈ సినిమా చూశాను. "బాణం" "శంఖం" వగైరా వగైరా ఉన్నా ఈ సినిమానే ఎందుకు చూశానంటే, ముందు రోజు ఈనాడు పేపర్లో ఈ సినిమా నిర్మాత, దర్శకుడు " మా హీరో పేరుకు ముందు ఇంటి పేరు వెనుక కులం పేరు చెప్పుకోని కుర్రోడు" అని స్తేట్మెంట్ ఇచ్చారు. ఇదేదో అర్థం కాకున్నా వినడానికి ఇంటరెస్టింగా వుందే అని వెళ్ళాము.
ఫస్ట్,ఫస్ట్ లోనే సూపర్ సీన్ అని అనుకుంటున్నారా? కానే కాదు. ఫస్ట్ పేర్లు పడతాయి ఆ తరువాత సినిమా మొదలు. హీరోని ఎస్టాబ్లిష్ చేసేందుకు తగ్గ పిచ్ తయారు చేయలికద, అందుకని ఒకావిడ ఆమె చంకలో బిడ్డని ఆటోలో కూర్చోబెడుతుంది. ఆమె కూరగాయలు బేరమాడుతుంటే ఇంకొక వైపు ఆటో వెళ్ళిపోయింది. అప్పుడు హీరో ఆ ఆటో వెంట పరిగెత్తి ఆ బిడ్డని రక్షిస్తాడు. ఏంటీ? ఆటో వెనకాల పరుగెత్తడం కంటే ఇంకో ఆటోలో వెళ్ళడం మేలు కద అనుకుంటున్నారా? అలా ఆలోచిస్తే తెలుగు సినిమా దర్శకులుగా మీరు డిస్క్వాలిఫై అవుతారు. తర్వాత నా మీదికి మాట రాకూడదు కాబట్టి చెబుతున్నా.
తరువాత సీన్లో హీరోని అందరూ వీడు ఏమనుకుంటే అది చేస్తాడు, పర్యవసానాలు ఆలోచించడు అని అంటుంటారూ. అప్పుడు హీరో మొబైల్ కు కాల్ వస్తుంది. ఈ సినిమాకు రెమునరేషన్ ఇవ్వనని నిర్మాత చెప్పాడేమో, హీరో సీరియస్ గా మొహం పెడతాడు. కట్ చేస్తే ఒక ఇంట్లో బెడ్ మీద ఒక అమ్మాయి ఏడుపు మొహం పెట్టుకుని వుంతుంది. ఆ బెడ్ పక్కనే సన (ఆమేనండీ పూర్వాశ్రమంలో దూరదర్శన్ కేంద్రం హై. సీరియల్స్ లో ఉండేది.) వుంటుంది. కెమెరా హీరో మొహం మీద, సన మొహం మీద, ఒక ప్లేట్లో ఉండే ఒక ముద్ద అన్నం మీదా ఫోకస్ అవుతుంది. అన్నం సరిపోలేదని కొట్టుకుంటున్నారేమో అనుకున్నాను. కానీ విషయం చాలా సీరియస్. విషయం ఏమిటంటే, ఆ అమ్మాయి ఒకడిని ప్రేమించింది. ఆ వేస్టు గాడికి ఒక మేనత్త కూతురు ఉంటుంది అలవాటుగా ఇంట్లో వాళ్ళు వీళ్ళీద్దరి పెళ్ళి చిన్నప్పుడే కుదిర్చి ఆ తర్వాత పోట్లాడుకుని విడిపోతారు.

అప్పుడు హీరో చాలా షార్ప్ గా ఆలోచించి ఆ మేనత్త కూతురిని నేను ప్రేమలో పడేస్తాను అంటాడు. నాకొక విషయం చెప్పండి, అమ్మాయిలను ప్రేమలో అయినా/బురదలో అయినా పడెయడం అంత వీజీనా? 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే నేనేమీ చెప్పలేను.

"బాబూ నీ డౌట్లకు ఇంకొక పోస్టు రాసుకో ముందు సినిమా గురించి రాయి"

వస్తున్నా, వస్తున్నా.. ఇంక హీరొయిన్ తన అపార్ట్మెంట్ లో ఉండే రౌడీ పిల్లలకు ట్యుషన్ చెపుతు ఉంటుంది. అర్థిక మాంద్యం తెలుగు హీరోయిన్ లకు కూడా తాకింది ఉద్యోగాలు లేక ఇలా ట్యుషన్లు చెప్పుకుంటున్నారు. హీరో ఆ రౌడీ పిల్లలతో కలిసి హీరొయిన్ ని పడెస్తాడు. అనాథ అయిన హీరోకి అంత రిచ్ అపార్ట్మెంట్ కు రెంట్ ఎలా కట్ట గలడు అని మీకు డౌట్ రాకుడదు. వచ్చిందంటే మరోసారి ఫెయిలైపోతారు. సెకండ్ హాఫ్ అంతా మాములే ముడు అపర్థాలూ ఆరు క్షమాపణలటో కథ నడుస్తుంది, సారీ కథ కాదు, సమయం గడుస్తుంది ఇందులో కథ అనేది లేదు కదా మరి.

హోలు మొత్తంగా ఆలోచిస్తే, దర్శకుడు ఏమి చెప్పదలచుకున్నాడో నాకు అర్థం కాలేదు. కథ అనే ప్రాణి బుతద్దం వేసి వెతికినా కనిపించదు. ఇంక నటన పరంగా చూస్తే, హీరోయిన్ ఫస్ట్ హాఫ్ బాగానే చేసింది అంటే పళ్ళికిలించడం తప్ప వేరే ఏమీ లేవు. ఇక సెకండ్ హాఫ్ లో ఆ సెంటిమెంటల్ సీన్స్ ఇద్దరు ముందు నుయ్యి, వెనక గొయ్యి టైపులో చేశారు.
the hero is pathetic. In many scenes he seems to have been making a spoof of Pawan Kalyan. It will be too much if he expects to be a big star with this kind of copied acting. Particularly in sentimental scenes you will recall Pawan Kalyan time and again.

"బాబూ ఇది తెలుగు బ్లాగు. ఇంగ్లీషులో రాయాలంటే ఇంకొక బ్లాగు ఉంది కదా, అందులో రాసుకో"
సరే సరే, హీరోయిన్ ఫస్ట్ హాఫ్ లోనూ, పాటలప్పుడూ బాగుంది. సెకండ్ హాఫ్ లో రక్త కన్నీరే. ఇంక పాటల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 2,3 పాటలు ఏ భాషవో కూడా అర్థం కాదు.
ఇక ఈ సినిమాలో ఏదైనా చూడ తగ్గ విషయం అంటే, అవి ఆ పిల్లల అల్లరి మరియు బ్రహ్మి కామెడీ. బ్రహ్మి చాలా ఈజీగా ఒక మంచి రోల్ చేశాడు. ఆ పిల్లలు వచ్చి రానీ మాటలతో ముద్దుగా వున్నారు.

ఇంతకూ ఆ దర్శక నిర్మాతలు పేపర్లో ఎందుకు అలా వేయించారో నాకు అసలు అర్థం కాలేదు. ప్రజలకు ఎవరికైన అర్థం ఐతె తెలుపగలవారు.

-కార్తీక్