బండి దేవత

7/23/2009 - రాసింది karthik at Thursday, July 23, 2009
నేను హోండా షైన్ అనే బండి ఓనర్ని. అది కొని వచ్చే వారానికి ఒక సంవత్సరం. నా బండంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే అది కొనడానికి వాడిన ప్రతి పైసా నేను నా చెమటను ఎక్ష్సెల్ షీట్ లలోకి నా క్రియేటివిటీ ని SAS కోడ్ లోకి మార్చి సంపాదించింది.( నేను మార్గ దర్సి లో చేరకుండానే కొన్నాను మరి :) )
ఈ రోజు నా బండి సర్విసింగుకు ఇచ్చాను. ఫ్రంట్ వీల్ లో గాలి లేదు, నా బుర్రలో గుజ్జు లేదు అని చెప్పి ఆ మెకానిక్ మాములుగా కంటే రెండింతలు ఎక్కువే గుంజాడు. కానీ ఎం చేస్తాం!! ప్రకృతి అందమైనది, విధి బలియమైనది. అందుకని వాడికి ఆ డబ్బులు ఇచ్చి బండి తెచ్చుకున్నాను. ఇలాంటి సీసనల్ క్షవరం కాక నాకు ఇంకొక గుండు కొట్టించుకొనే ప్లాన్ కూడా ఉంది. దాని పేరు "రెస్క్యు ఫర్స్ట్". నేను బండి కొన్నప్పుడు అందరూ చాలా భయపెట్టి దీనిలో నన్ను చేర్పించారు. ఇప్పటివరకూ ఒకే ఒకసారి వాడుకున్నాను. టయర్ పంచర్ ఐతే పిలిచాను.. వాడూ మా దగ్గర ఉన్న టైరు వాడితే రిపెయిర్ చేస్తాం లేదంటే లేదు అని వార్నింగ్ ఇచ్చాడు. తప్పుతుందా?? ఎంతైనా నా బుజ్జి బండి కదా మరి :) బండి మీద నాకున్న మోజు చూసి, నా యాక్సిడెంట్ దెబ్బలు తగ్గిన శుభ సందర్భం లో మా అన్నయ్య కొన్ని ఫోటోలు కూడా తీశాడు. మచ్చుకి ఒకటి నా ఇంగ్లీష్ బ్లాగులో పెట్టాను. ( ఆ ఫోటో చూసి ప్రజలు జడుసుకుంటే నాది భాధ్యత కాదు. ఇప్పుడే చెబుతున్నా ) ఈ రోజు ఏదో ఆలోచిస్తుంటే గుర్తుకు వచ్చింది, సంవత్సరం అవుతుంది కదా! దానికి ఎమిషన్ టెస్ట్ కూడా చేయించాలి. ఇంత చేసినా కూడా నా బండి నాకు చాలా ముద్దు. అందుకే ఒక చిన్న పాట. ఇది పూర్తిగా నా బండికే అంకితం.

దారి చూపిన స్కూటరూ, బ్యాకు టయరూ పంచరూ..
దారి చూపిన స్కూటరూ, బ్యాకు టయరూ పంచరూ..
రోడ్డు రోడ్డులో తోడుగా, నా దారిలో నువ్ గెంతగా..
దారి చూపిన స్కూటరూ, బ్యాకు టయరూ పంచరూ..

కారు లేని మనిషి నేను నిన్ను నడిపిన వారిలో..
లైసెన్సున్న మనిషినైతీ చల్లనీ నీ సీటులో..
ట్యాంకు నిండిన వేళలో నీకేమి సేవలు చేతును..
దారి చూపిన స్కూటరూ, బ్యాకు టయరూ పంచరూ..

తుడిచి పోదూ మాసి పోదు కింద పడ్డ గాయమూ..
కలను కూడా మరువలేను డాక్టరిచ్చిన బిల్లును..
బండి నేర్పిన మిత్రుడా.. ఆ బండి నిన్నూ కాపాడదా..

దారి చూపిన స్కూటరూ, బ్యాకు టయరూ పంచరూ..
రోడ్డు రోడ్డులో తోడుగా, నా దారిలో నువ్ గెంతగా..
దారి చూపిన స్కూటరూ, బ్యాకు టయరూ పంచరూ..

ఈ పాట ఒరిజినల్ ఇక్కడ చూడగలరు.

-కార్తీక్