పండంటి ప్రేమకు పది బహుమతులు

7/06/2009 - రాసింది karthik at Monday, July 06, 2009
'ఓయ్' అనే సినిమా చూశాక నాకు కుడా కొత్త కొత్త గిఫ్టులను కనిపెట్టాలనే ఆలోచన వచ్చింది. ఒకటి రెండు ఆలోచించాక చూస్తే మేధ గారు అగర్బత్తిలకు ఆర్థిక మాంద్యానికి లంకె పెట్టనే పెట్టారు. ఇక అసలు టపాలోకి పొయ్యేముందు ఒక చిన్న మనవి. ఈ టపా లేడీస్ స్పెషల్. ఎందుకంటే, ఏజ్ బార్ అయిన సిద్ధార్థ్ గాడికే అంత క్రియేటివిటి ఉంటే, "యంగిస్తాన్" అయిన అబ్బాయిలకు ఎంత ఉండాలి?? అమ్మాయిలంటే అంత ఆలోచించే తీరికా, ఓపిక వాళ్ళకు ఎలాగూ ఉండవు :) :), కనుక ఏదో వాళ్ళకు సహాయం చేద్దామని రాస్తున్నాను. అమ్మాయిలు, పెన్ను, పేపర్ తీసుకుని రెడిగా పెట్టుకొండి. ( ఫెమినిస్టులెవరైనా ఉంటే మొహమాటం లేకుండా నన్ను తిట్టుకోవచ్చు. చాన్సిస్తే కామెంట్లు కూడా పెడతారని నాకు తెలుసు. ఆశ, దోశ, అప్పడం!! అందుకనే మీకు ఆ చాన్స్ ఇవ్వకుండా కామెంట్ మాడరేషన్ పెట్టాను. :) :) )

1. సిగరెట్ లైటర్:
నరలోకానికి నరకలోకానికి అనుసంధానమైనది సిగరెట్. లైటర్ ఎలాగైతే సిగరెట్ ను మండిస్తుందో అలాగే ఆడది కూడా మగాడి జీవితాన్ని మండిస్తుంది. కాబట్టి జరగబోయేదానికి సింబాలిక్ గా చెప్పినట్టు ఉంటుంది.

2. కత్తెర:
వాడిగా ఉన్న రెండు కత్తులు కలిసి ఎలా గుడ్డను చించుతాయో, అలాగే ఒక మగవాడు ఒక ఆడది కలిస్తే జీవితం అనే గుడ్డ కూడా చినిగిపోతుంది. ( ఎవరి జీవితం అనేది అప్రస్తుతం). వాహ్! ఎంత మంచి అనాలజీ కదా?? నాకు తెలుసు నా క్రియేటివిటి ముందు సినిమా వాళ్ళు బలాదూర్ అని.

3.షూ లేసులు:
కాలు అనేది కుటుంబ పెద్ద అయితే, బూట్లు, సాక్సులు, పిల్లలాంటివి. వీళ్ళందరిని బలంగా పట్టి ఉంచే లేసులు భార్య లాంటివి. ( ఫెమినిష్టులు-ఇప్పుడు మీరు హ్యాప్పీనా కదా ;) ;))

4. కంప్యుటర్ మౌస్:
మౌస్ ఎలాగైతే బయటి నుంచి స్క్రీన్ లోపల ఉన్న కర్సర్ ను కంట్రోల్ చేస్తుందో, అలాగే ఆడది కూడా ఇంట్లో ఉండి బయట ఉన్న మగడ్ని కంట్రోల్ చేస్తుంది. ( ఈ రోజు నా అనాలజీలకు తిరుగులేదు!!).

5. తాళం చెవి:
సన్నగా ఉన్న తాళం చెవి లావుగా ఉన్న తాళం కప్పను ఎలాగైతే కంట్రోల్ చేస్తుందో, అలాగే ఎంత బలవంతుడైన మోగుడ్ని కూడా ఆడది కంట్రొల్ చెయ్యగలుగుతుంది. (ఫెమినిస్టులకు పండగ తిట్టడానికి పొద్దూనే ఎన్ని పాయింట్లో!!)

6,7,8,9,10: ముందు పైన చెప్పినవి ఇవ్వండి. ఆ మొగ పీనుగ ఇంకా బతికి బట్టకడితే అప్పుడు మిగతా వాటి గురించి చెప్తాను.

అబ్బాయిలకు ఒక మాట:
అమ్మాయిలేదో గిఫ్ట్ ఇచ్చారని మీరు మిమ్మల్ని గిఫ్ట్ గా ప్రెసెంట్ చేసుకోకండి. వాళ్ళు కత్తికో కండగా నరికి కేజిల లెక్కన అమ్ముకున్నా ఏమీ చెయ్యలేరు :) :) ఇంకాస్త ముందుకెళ్ళి కిడ్నీలు లివరూ అమ్మేస్తే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి నే చెప్పేదేమిటంటే, కళ్ళు మూసుకుని కత్తి ఫైటు చేస్తూ హీరోయిన్ ను చంపేసిన ఒకానొక తెలుగు సినిమా హీరో లాగా కాకండి. ఆ హీరో ఎవరో తెలియలేదా?? అయితే ఒక చిన్న క్లూ:
అతను తొడ కొడితే సమరసింహం
కత్తి పడితే నరసింహం
నోరు తెరిస్తే గ్రామ సింహం.
ఇంకా తెలియకపోతే.. మీ మానసిక పరిస్థితి గురించి నిపుణులను సంప్రదించండి.

-కార్తీక్.