యెస్.బి.ఐ.-2

11/18/2008 - రాసింది karthik at Tuesday, November 18, 2008
ఈ మధ్య కాలం లో ఆఫిస్ కి పోతూనే మొబైల్ నా ర్యాక్ లో పెట్టేసి ఇంటికి వచ్చేటప్పుడు తీసుకుంటున్నా. ఎవరైనా అడిగితే పని ఒత్తిడి వల్ల అని కథలు చెబుతున్నా. కానీ నాకు మాత్రమే తెలిసిన చేదు నిజం ఎమిటంటే, నాకు బెంగళురు ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ వస్తే లిఫ్ట్ చెయ్యలంటే భయంగా వుంది. నాకు ఇంత భయం పెట్టిన ఘనత ఖచ్చితంగా యెస్.బి.ఐ. కి మాత్రమే చెందుతుంది.
పొయిన వారం లో ఒక రోజు.శని,ఆది వారాలు కాకుండా ఆఫీస్ లో పని చేసుకునే రోజు. ఆఫిస్ లో నా అంతకు నేను పాటలు వింటున్న. ఇంతలో నా ల్యాండ్ లైన్ రింగ్ అయ్యింది. ఇక మామూలుగా కథ షురు.
నేను: హలో, కార్తిక్ హియర్!
అవతల: సర్ దిస్ ఇస్ రాధా ఫ్రం యెస్.బి.ఐ. క్యాష్ బ్యాక్. వుయ్ ఆర్ గివింగ్ యు అ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్.
నేను: సారీ ఐ యాం నాట్ విల్లింగ్ ఫర్ థట్.
అవతల: డు యు హవ్ టూ మినిట్స్ ఒఫ్ టైం?
నేను: నో! ఐ యాం బిజి.
అవతల: .......
ఫోన్ కట్ అయ్యింది.
వెంటనే నా పక్కన వుండే మా కొల్లీగ్ ఫోన్ రింగ్ అయ్యింది. అతను సీట్ లో లేకపోవడం వల్ల నేనే లిఫ్ట్ చేసను. మళ్ళీ అదే కథ.
నేను: హలో,
అవతల: సర్ దిస్ ఇస్ రాధా ఫ్రం యెస్.బి.ఐ. క్యాష్ బ్యాక్. వుయ్ ఆర్ గివింగ్ యు అ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్.
నేను: సారీ ఐ యాం నాట్ విల్లింగ్ ఫర్ థట్.
అవతల: డు యు హవ్ టూ మినిట్స్ ఒఫ్ టైం?
నేను: నో! ఐ యాం బిజి.
అవతల: .......
ఫోన్ కట్ అయ్యింది.
కరెక్ట్ గా రెండు నిమిషాల తరువాత మా క్యుబికల్ లో ఇంకొక ఫోన్ రింగ్ అయ్యింది. ఇప్పుడు అది ఎవరో నాకు తెలిసిపొయింది. అంతే కాక నాకు యెస్.బి.ఐ. మీద కొన్ని పాత పగలు వున్నాయి. అందు వల్ల అది కూడా నేనే ఎత్తాను.
ఇప్పుడు ఏమైందంటే:
నేను: ఇస్ ఇట్ రాధా ఫ్రం యెస్.బి.ఐ?
ఫోన్ కట్. ఆ సంతోషంలో హింది తన్నుకు వచ్చింది.
జీత్ హమారీ హైన్! అని గట్టీగా అరిచాను.