కిక్: వద్దు బాబోయ్!

5/24/2009 - రాసింది karthik at Sunday, May 24, 2009
పొయిన వారం ఇంటికి పొయినప్పుడు మా కజిన్స్ తో కలిసి కిక్ అనే సినిమా చూశాను. మామూలుగా ఏ సినిమాకు పోవాలి అనేది మా అక్కనే డిసైడ్ చేస్తుంది. కానీ ఈ సారి తనకు ఆ చాన్స్ ఇవ్వకుండా నేనే కిక్ సినిమాకు వేళదాము అని చెప్పి తీసుకుపోయాను. లేటుగా పోతే టికెట్లు దొరకవని 15 నిమిషాలు తొందరగానే వెళ్ళాము.("అరుంధతి" కి లేటుగా వెళ్ళి "నచ్చావులే" చూశాము. ఆ దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదు) సినిమా మొదలవుతూనే ఇలియాన చిన్న చిన్న బట్టలు వేసుకుని భారతదేశం లోని బీదరికాన్నంతా చూపించింది. నాకు తెలియక అడుగుతాను యోగా చెయ్యాలి అంటే చిన్న చిన్న బట్టలు వేసుకోవాడం అవసరమా? (బాబా రాందేవ్ కూడా చిన్న చిన్న బట్టలు వేసుకుంటాడు అంటే నేను సమధానం చెప్పలేను) ఇంక కథ కొద్దిగా మొదలవుతూనే మనకు అర్థం అయిపోతుంది, ఇది రవితేజ మార్కు ఒవెర్ యాక్షన్ కథ అని. "విక్రమార్కుడు" లో అత్తిలిసత్తి క్యారెక్టర్ హిట్ అయ్యాక అన్ని సినిమాలు అలానే ఉంటున్నాయి కాబట్టి కథ గురించి పెద్దగా అలోచించకుండా దర్శకుడు ఒక 3-4 కామెడీ క్యారెక్టర్లు పెట్టి బండి లాగించాడు. ఎందుకంటే వాళ్ళూ లేక పోతే మొదలైన 15నిమషాలకే ఇంటర్వెల్ ఇవ్వాల్సి వచ్చేది. ఇక్కడి దాకా సినిమా చూశాక నాకు ఒక డౌట్ వచ్చింది : ఆంధ్రదేశం లో అమ్మాయిలు అంత సులభంగా అన్ని బూతులు మాట్లాడుతున్నారా? (నేను ఆంధ్ర వదిలి నాలగేళ్ళైంది కాబట్టి అడుగుతున్నాను.దేవుడి పాలనలో ఇట్ల కూడా డెవలప్ అయ్యామా????) ఎందుకంటే, ఇలియానా ప్రతి సీన్ లో హీరో వంశవృక్షాన్ని పెళ్ళగిస్తూనే ఉంది మరి!

ఇంకొక ముఖ్య విషయం ఈ సినిమాలోని పోలిస్-దొంగ చేజింగులు,ఫైట్లు. ఏమాత్రం మోహమాటం లేకుండా అవన్నీ ధూం-2 నుంచీ, ఇంకా కొన్ని ఇంగ్లీష్ సినిమాల నుంచీ కాపీ కొట్టాడు, సారీ స్పూర్తి పొందాడు. ఇంక సెకండ్ పార్ట్ లో ఒక చెత్త ఫ్లాష్ బ్యాక్ దానిలో ఒక సెంటిమెంట్ టచ్. ప్రేక్షకుల గుండెలు పిండాను అని దర్శకుడు అనుకుంటాడు, కానీ అలాంటివి గుమ్మడి కాలం నుంచీ చూస్తున్నారు కాబట్టి జనాల గుండెలు కరగలేదు. అందరూ శుభ్రంగా ఇంటర్వల్ లో కొనుకున్న కూల్ డ్రింకులు, స్నాక్స్ ముగించారు.

కానీ ఈ సినిమాలో ఏదైనా మచి విషయం ఉంది అంటే, అది ఆ కొత్త యాక్టర్ "శ్యాం". అతను పోలీస్ ఆఫీసర్ లాగా మంచి యాక్షన్ చేశాడు.రవితేజ రక్త కన్నీరు చూపించాడు, ఇంక ఇలియాన గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇంక విలన్ల గ్యాంగ్ అంతా మనకు తెలిసిన వాళ్ళే. వాళ్ళు అంత కంటే వేరే రోల్స్ చెయ్యలేరు. నాకు బాధేసిన విషయం ఏమిటంటే, ఆలీ, బ్రహ్మి లాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్స్ ని ఎందుకు అలా వేస్ట్ చెస్తున్నారో అర్థం కావడంలేదు. వాళ్ళిద్దరి చేతా చాలా చెత్త చేయించాడు. ఆ దర్శకుడు పూర్వాశ్రమంలో ఖచ్చితంగా ఏదో సీరియల్ కు పని చేసి ఉంటాడు.

మొత్తానికి కిక్=విక్రమార్కుడు+కృష్ణ+కొన్ని ఇంగ్లీష్ సినిమాలు. అదీ స్టొరీ!

కొసమెరుపు: మొన్న ఈ సినిమా నిర్మాత ఇది ఒక సందేశాత్మక చిత్రమని స్టేట్ మెంట్ ఇచ్చాడు. నాకైతే ఇందులో ఎలాంటి సందేశము కనిపించలేదు. తెలుగు సినిమా ఎంత దిగజారింది అనే దానికి ఇంతకంటే మంచి ఉదాహరణ అవసరం లేదనుకుంటా!!

నా బ్లాగు కూడలి లొ కనిపించడంలేదు!!

5/07/2009 - రాసింది karthik at Thursday, May 07, 2009
కారణం నాకు తెలియదు కాని నా బ్లాగు రాసిన తరువాత, కూడలి బ్లాగ్ రోల్ లో నా బ్లాగు రావటం లేదు. ఈ మధ్య కూడలి వారు ఏమైనా షరతులు విధించారా?? లేక నేను అంత చెత్త కంటెంట్ రాస్తున్నానా? లేక నా రాతలు ఏదైనా వర్గం వారి మ్నొభావాలను దెబ్బతీశయా ? (పొయిన వారం రాజకీయ నాయకుల మీదా, అంతకు ముందు ఆడవాళ్ళ మీదా సెటైర్లు వేశాను, ఆ సెటైర్లకు నన్ను రిటైర్ చెయ్యటం ఏమి బాగాలేదు :) )
కనుక, అయ్యా కూడలి వారూ..దయ చేసి నా బ్లాగు ను కూడలికి జత చెయ్యండి. నేను రెండు రొజులు క్రితమే తమకు పర్సనల్ గా మెయిల్ కూడా పంపాను. గమనించగలరు.

ప్రజలకు మనవి: ఒక వేళ ఈ టపా కూడలి లో కనపడితే శ్రమ అనుకోకుండా ఆ పైన ఉన్న పోల్ లో తెలుపగలరు.

-కార్తీక్

బ్లాగు వీటి దొంగ

5/03/2009 - రాసింది karthik at Sunday, May 03, 2009
బ్లాగింగే ఒక అట.. సుత్తి కొట్టడమే పూ బాట.. ||2||
నాకే బ్లాగు ఉన్ననాళ్ళూ ఉండవు మీకు కామెంట్లూ..
బ్లాగర్ ఐనా, వర్డ్ ప్రెస్ ఐనా, అంతా నా వాళ్ళూ..
వైరస్ నాకు లేదు..నా బ్లాగే ఆపలేరు..
వైరస్ నాకు లేదు..నా బ్లాగే ఆపలేరు..

బ్లాగింగే ఒక అట.. సుత్తి కొట్టడమే పూ బాట.. ||2||
అనాథ బ్లాగుల.. ఉగాది కోసం...
అనాథ బ్లాగుల ఉగాది కోసం లేఖినిలా నే దిగివస్తా..
బ్లాగు బ్లాగును కొత్తగ మలిచి బ్లాగరిలా నే దిగివస్తా..
అనాథ బ్లాగుల ఉగాది కోసం లేఖినిలా నే దిగివస్తా..

బ్లాగు బ్లాగును కొత్తగ మలిచి బ్లాగరిలా నే దిగివస్తా..


అనామకులకూ.. అజ్ఞాతలకూ..

అనామకులకు అజ్ఞాతలకు బూజు దులపక తప్పదురా

తప్పదురా..తప్పదురా.. తప్పదురా..

బ్లాగింగే
ఒక అట.. సుత్తి కొట్టడమే పూ బాట.. ||2||

బ్లాగు దేవతకూ..వెబ్ సైట్ తెరిచే..
బ్లాగు దేవతకు వెబ్ సైట్ తెరిచె సైటుదేవతను నేనేరా..

చిన్న బ్లాగుల పోస్టుల మంటకు వర్డు ప్రెస్సునై వస్తా రా..

బ్లాగు దేవతకు వెబ్ సైట్ తెరిచె సైటుదేవతను నేనేరా..

చిన్న బ్లాగుల పోస్టుల మంటకు వర్డు ప్రెస్సునై వస్తా రా..

గూగుల్ రాజ్యం.. యాహు ప్రభుత్వం..

గూగుల్ రాజ్యం యాహు ప్రభుత్వం నేల
కూల్చక తప్పదురా..
తప్పదురా..తప్పదురా.. తప్పదురా..

బ్లాగింగే
ఒక అట.. సుత్తి కొట్టడమే పూ బాట.. ||2||


నేను రాసిన ఆఖరి రెండు టపాలకు ఎవరూ కామెంట లేదు అంతే కాక హిట్స్ చాలా తక్కువ వచ్చాయి.. అందుకని ఇలా రాశాను :)

కొండ వీటి దొంగ సినిమాలో పాట ఇది.


-కార్తిక్