నా తెలుగు బ్లాగు పయనం -2009

12/31/2009 - రాసింది karthik at Thursday, December 31, 2009
నేను నా తెలుగు బ్లాగు మొదలుపెట్టి రెండేళ్ళకు పైగా అయ్యింది. కానీ క్రియాశీలకంగా రాస్తున్నది మాత్రం ఈ సంవత్శరం ఫిబ్రవరి నుంచే.. అప్పటి వరకు నాకు తెలుగు బ్లాగులంటే తోటరాముడు, కూడలి, విహారి లాంటి ఒకటి రెండు బ్లాగులే.. ఏదో టపా శిర్షిక ఆకర్షణీయంగా అనిపిస్తే అవి మాత్రం చూసే వాడిని.. ఈ సంవత్శరం ఇంత సీరియస్ గా తెలుగు బ్లాగు రాయడానికి చాలా పెద్ద కథే ఉంది, అదంతా చెప్పి పాఠకులకు బోర్ కొట్టించడం నాకిష్టం లేదు..
ఇక బ్లాగులు చదువుతున్న కొద్ది, ఫాలో అవుతున్న కొద్దీ చాలా మంది ఆలోచనలు తెలుసుకునే అవకాశం కలిగింది. కొంతమంది రాసినవి చాలా బాగా నచ్చితే కొందరు రాసినవి పరమ చెత్తగా అనిపించాయి.. నాకు గుర్తున్నంతలో నేనెవరి గురించీ చెత్త కామెంట్లు పెట్టలేదు.. ఇక ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే చాలా మందితో నేను కొన్ని విషయాలలో పూర్తిగా ఏకీభవించేవాడిని ఇంకొన్ని విషయాలలో పూర్తిగా విబేదించే వాడిని.. ఇక్కడ నేనర్థం చేసుకున్న జీవిత సత్యం ఏమిటంటే ఈ ప్రపంచంలో ఎవరూ అన్ని విషయాలలో మనతో ఏకీభవించరు, అన్ని విషయాలలో విబేధించరు.. so treat anyone's ideas as just another opinion and accept it.
ఇక ఈ సంవత్శరం కొందరి బ్లాగులు, వాళ్ళ ఆలోచనలు నన్ను చాలా ప్రభావితుణ్ణి చేశాయి.. అలాంటివాళ్ళలో మొదటి వ్యక్తి మన సాహిత్య అభిమాని బ్లాగు రాసే శివరాం ప్రసాద్ గారు. ఆయన రచనలు చూసినప్పుడల్లా, మా నాన్నకు ఒక బ్లాగు ఒపన్ చేసిచ్చి రాయమంటే ఇలానే రాస్తారేమో అనిపిస్తుంది. చందమామ గురించి కానీయండి లేదా ఆయనిచ్చే సలహాలు కానీయండి అన్నీ అలానే అనిపిస్తాయి may be that generation is like that. అందుకే ఆయన రచనల్లన్నీ 2-3 సార్లు చదువుతాను.. అసలు ఆయన రాసిన about me చదివే ఆయన ఫ్యాన్ అయిపోయాను.. " I am 51 year young..." that alone shows his enthusiasm.. I salute you sir!

తర్వాత చెప్పవలసింది తాడేపల్లి గారి గురించి, కత్తి మహేష్ గారి గురించి.. వీరిద్దరితో నేను చాలా విషయాలలో ఏకీభవిస్తాను, చాలా విషయాలలో విబేదిస్తాను.. కానీ ఒక అభిప్రాయం ఏర్పరచుకునే ముందు వాళ్ళు చేసినంత బ్రెయిన్ స్టార్మింగ్(తెలుగు పదం??) నాకు తెలిసి ఎవరూ చెయ్యరు..వాళ్ళు రాసిన చాలా టపాలలో విషయాలు నాకు ఒక కొత్త దృక్కోణాన్ని చూపాయి.. అంతే కాక వారి మధ్య జరిగే చర్చలు కూడా నాకు బాగా నచ్చేవి ఎక్కడా చెత్త మాటలు చెత్త సంగతులు లేకుండా సాగుతాయి.. కొన్ని సార్లు నేనెవర్ని సమర్ధిస్తున్నానో నాకే అర్థం అయ్యేది కాదు :) :) ఒక కామెంట్ చదివితే ఈయన కరెక్ట్ అనిపిస్తాడు ఇంకోటి చదివితే ఆయన కరెక్ట్ అనిపిస్తాడు.. మధ్యలో నలిగిపోయేవాడిని.. ఆలాంటప్పుడు నేనెందుకు కామెంటలేదు అని ప్రజలడగచ్చు.. ఎందుకంటే "నేను చాలా బిజీ" ఇదే మాటను తెలుగులో ఒళ్ళు బరువు అంటారు.. I carry huge respect to the dedication that you show towards your principles!

ఇక మారుపేర్లతో రాసేవారిలో నాకు బాగా ముఖ్యులు మన చదువరిగారు,అబ్రకదబ్ర గారు.. వాళ్ళిద్దరూ చేసే విశ్లేషణలు కూడా నాకు చాలా బాగా నచ్చుతాయ్.. ఇక కొత్తపాళి గారు రాసే కబుర్లలో నాకు కొంత చలసాని ప్రసాదరావు గారి శైలి కనిపిస్తుంది.. ఈనాడులో ప్రతీ బుధవారం వచ్చే కబుర్లు నేనెప్పుడు మిస్ కాలేదు..
మహిళా బ్లాగర్లలో కవితలు రాసేవాళ్ళందరి బ్లాగులు తప్పకుండా చదువుతాను. ఎందుకంటే నేను కవితలు రాయలేను అందుకని వారు రాసినవన్నా చదివి గుర్తుపెట్టుకుంటే ఎక్కడైనా ఒపయోగపడతాయని ఒక ఆశ :) :) అవే కాక మేధగారి బ్లాగు, లక్ష్మిగారి బ్లాగు తప్పకుండా చదువుతాను.. నేను గుర్తుకు తెచ్చుకుని మరీ నవ్వుకునే తిట్లు కొన్ని ఉన్నాయ్.. వాటిలో లక్ష్మి గారు రాసిన "పాతబస్తీలో పసుపుకుంకుమలు అమ్ముకునే వెధవ" తప్పకుండా ఉంది..

ఇవన్నీ ఒక ఎత్తైతే మార్తాండ ఒక్కడూ ఒక ఎత్తు..మొదట్లో నేను మనోడిని సపోర్ట్ చేసే వాడిని. ఆ జీవి లాజిక్కులు తిక్క తిక్కగానే ఉన్నా ఏదో తను నమ్మినవి చెబుతున్నాడులే అనుకునే వాడిని.. ఎప్పుడైతే మన వాడు సాటి బ్లాగర్ల మీద వ్యక్తిగత దాడి మొదలుపెట్టాడో అప్పుడే గౌరవం కోల్పోయాడు.. ఆ తర్వాత నేను మనోడి కామెంట్లు అవి ఫాలో అయ్యి మనోడిలో ఎంతమంది అపరిచితులు ఉన్నారు అనేది తెలుసుకోగలిగాను.. కానీ జూన్ 26న మనోడు చెప్పిన కామెంట్ చదివాక మనోడి మీద కోపం స్థానం లో జాలి కలిగింది.. ఆ రోజు మనోడు చేసిన కామెంట్ ఏమిటి అనేది నా బ్లాగులో రాయడం నాకిష్టం లేదు.. ఇక మార్తాండతో పాటు మంచి కామెడీ ఇచ్చిన మరో బ్లాగు నా ప్రపంచం బ్లాగు.. ఇన్నయ్య అనే జీవి మీద, జన విజ్ఞాన వేదిక మీద ముందు నాకు అంతో ఇంతో మంచి అభిప్రాయం ఉండేది.. ఆ బ్లాగులు ఆయన రాసిన చౌకబారు కూతలతో ఆ మర్యాద కాస్తా పొయింది.. ఇప్పుడు నాకు ఇన్నయ్యంటే "మార్తాండకు ఎక్కువ మొమైత్ ఖాన్ కు తక్కువ" అంతే! వీళ్ళిద్దరి పైత్యం వల్ల నేను ప్ర.పీ.స.స. సభ్యుణ్ణయ్యాను.. నాకు బ్లాగుల ద్వారా ఏర్పడ్డ మొట్ట మొదటి మిత్రులు ప్ర.పీ.స.స. సభ్యులు.. జో,బంతి,సౌమ్య,నాగ,కల్యాణి, JD,malak,...you guys rock!! మనలందరినీ కలిపిన మొహన్ గారికి ప్రత్యేక నెనర్లు..

బ్లాగుల్లొ అందరూ తమ తృప్తి కోసం రాసుకుంటారు కానీ జీవని గారు మాత్రం తన బ్లాగు ద్వారా మనకు కొంతమందికి సహాయపడే అవకాశం కల్పించారు.. 2009 నాకు ఎక్కువ తృప్తి కలిగించిన విషయం మాత్రం నేను జీవని ద్వారా చేసిన రక్త దానమే!!

ఇక వచ్చే సంవత్శరం నా బ్లాగు లక్ష్యాలు:
1.ప్ర.పీ.స.స. కు ఒక రోజులో 500 కామెంట్లు రావాలి,, 24 గంటలూ ఎవరో ఒకరూ రాస్తూనే ఉండాలి..
2. నేను నవతరంగం, పుస్తకం లలో సమీక్షలు రాయాలి..

నాకు తెలుగు బ్లాగును పరిచయం చేసిన త్రివిక్రం గారికి నెనర్లు చెప్పకుండా ఈ టపా ముగియకూడదు.. thanx a million Trivikram!!

అందరికీ హార్దిక నూతన సంవత్శర శుభాకాంక్షలు

-కార్తీక్