బెంగళూరు తెలుగు బ్లాగర్ల సమావేశం..

4/22/2010 - రాసింది karthik at Thursday, April 22, 2010
ప్రజలారా!
ఈ ఆదివారం లాల్ బాగ్ లో నాకు తెలిసిన  కొందరు తెలుగు బ్లాగర్లు సామావేశం అవుతున్నారు.. ఉదయం 11గం లకు సమావేశం మొదలుపెట్టాలని అభిలాష.. కనుక ఎవరైనా పాల్గొనాలని అనుకుంటే నాకు మీ మెయిల్ ఐడీ ఇవ్వగలరు..
ఈ సమావేశానికి అజెండాలు గాడిదగుడ్డులు ఏమీ లేవు.. జస్ట్ సరదాగా కాసేపు మాట్లాడుకుందామని ఒక చిన్న ప్రయత్నం..     మరేమీ ఆలోచించకుండా వచ్చేయండి..  లాస్ట్ టైం మేము కొందరం కలిసినప్పుడు 3గంటలు 3 నిమిషాల్లా గడిచిపోయాయి..  ఒకవేళ మీరున్న ప్రదేశానికి లాల్ బాగ్ చాలా దూరమైతే మీరే ఒక ప్లేస్ చెబితే మేము అక్కడికి రావటానికి ప్రయత్నిస్తాం..  లాల్ బాగ్ అని ఎందుకనుకున్నాం అంటే అక్కడ మనం కూచొని మాట్లాడుకోవడానికి స్థలం అది బాగుంటుంది.. నగరం లోని మిగతా ప్రాంతాల్లాగా రణగొణ ధ్వనులు ఉండవు.. 

నా మెయిల్: karthikeya.iitk@జీమెయిల్.com

-కార్తీక్

నా పేరు- నా కష్టాలు

4/11/2010 - రాసింది karthik at Sunday, April 11, 2010
నా పూర్తి పేరు ఇంద్రకంటి వీరభద్ర కార్తికేయ శర్మ.   వినటానికే తిక్క తిక్కగా ఉందికదా.. అసలు ఇంత పేరు అప్లికేషన్లలో నింపాలంటే మెయిన్ షీటుతోపాటూ రెండు మూడు అడిషనల్ షీట్స్ కావాలి. అందుకనే నేను కూడా చిన్నప్పటి నుంచీ అందరికీ "కార్తికేయ" అని మాత్రమే చెప్పేవాడిని.   మా అక్కలు ఇద్దరి తర్వాత నేను పుట్టాను అంతే కాక మా వంశం లో ఈ తరానికి నేనొక్కడినే అబ్బాయిని.. అందుకని దేవుడి పేరు పెట్టాలని ఫిక్స్ అయిపోయారు.. దానితో నా పేరు స్కిప్పింగ్ రోప్ అంత పొడుగైంది.   స్కూల్ రోజులలో అందరూ "కార్తికేయ" అని పిలిచేవారు.. నాక్కూడా ప్రాణానికి సుఖంగా ఉండేది.. ఇలా రోజులు గడుస్తుండగా  నేను పదవ తరగతిలో చేరాను.  పదవ తరగతి సర్టిఫికేటులో  పేరు రాయించాలి.. నాలోని అభ్యుదయ భావాలు బీ.పీ. పెరిగినట్టు పెరగడం వల్ల ముందు "శర్మ" అనేది పీకేశాను(బీపీలా ఎందుకు పెరిగాయి అనేది మీరు అడగకూడదు.. నేను చెప్పకూడదు). ఆ తర్వాత ఇంకో రకమైన పైత్యం  వల్ల ఇంటిపేరూ వగైరా పీకేసి కేవలం  "కార్తికేయ" అనేది మాత్రమే ఉంచమని చెప్పాను.. కానీ మా సారు మా అమ్మావాళ్ళతో కుమ్మక్కై అవంతా అలానే ఉంచి "ఐ.వి.బి.కార్తికేయ" గా చేశాడు.  ఈ ఘోర నిజం నాకు తెలిసే సరికే పుణ్యకాలం కాస్తా తీరిపొయింది.. ప్రతీకారం తీర్చుకునే లోపల పదవ తరగతి కూడా అయిపోయింది :( అందువల్ల నా అఫిషియల్ పేరు అలా "ఐ.వి.బి. కార్తికేయ" గా మిగిలిపోయింది. 

కథ ఇక్కడితో ఆగిపోతే నేను కార్తీకునూ కాదు ఇది నా బ్లాగూ కాదు..  ఇంటర్మేడియేట్ ఎలాగో బండి లాగించేశాక ఇంజినీరింగులో అసలు కష్టాలు మొదలయ్యాయి..  విషయం ఏమిటంటే తమిళ దేశాం లో ప్రతీ  ఇంట్లో ఇద్దరు "కార్తికేయన్" లు ఉంటారట కంఫ్యూస్ కాకూడదని ఒకరి పేరు "కార్తికేయన్" ఇంకొకరి పేరు "కార్తిగేయన్" అని పెడతారట (బూతులు వెతక్కండి బాబూ.. వాళ్ళు కొన్ని సార్లు క బదులు గ  రాస్తారు.. ఉదా:-కర్పగవల్లి )  . సో మాలెక్చరర్లు అందరూ మొహమాటం లేకుండా "కార్తికేయన్" "కార్తికేయన్" అని పిలిచేవాళ్ళు.. నాకు ఈ అరవ పేరు అస్సలు ఇష్టం ఉండదు.. అసలే నేను పదహారణాల తెలుగు బిడ్డను..  పైగా అభాతెమాసం సభ్యుడిని కూడా... బుర్ర గోక్కోకండి.. అభాతెమాసం అంటే ప్రపీసస సిస్టర్ కమ్యూనిటీ కాదు.. అభాతెమాసం అంటే అఖిల భారత తెలుగు మాట్లాడే వాళ్ళ సంఘం.      ఈ బెంగ తో సగం మార్కులు గట్రా తక్కువ వచ్చేవి.. కొన్ని రోజులు ఇలా సాగాక ఇక తప్పదని మా లెక్చరర్లకు  చెప్పాను సార్ నా పేరు "కార్తికేయ" మీరు వేరే ఏదో అంటున్నారు అని.   అయినా  కూడా ఏమి ఉపయోగం లేదు ఎంతైనా ఇంజినీరింగు కాలేజీ లెక్చరర్లు కదా..  ఫైనల్ ఇయర్ కు వచ్చాక ఇంకో రూట్లో పని కానిచ్చాలని నా పేరును కాస్తా "కార్తీక్" గా కుదించాను.. స్కిప్పింగ్ రోప్ అంత పెద్ద పేరు హెయిర్ బ్యాండ్ అంత చిన్నగా అయిపొయింది :(.. అందుకే నా ఎంటెక్ ఫ్రెండ్స్ అందరూ "కార్తీక్" అనే పిలుస్తారు.. క్యాంపస్ ఇంటర్వ్యూలో కూడా నా పేరు "కార్తీక్" అని మాత్రమే చెప్పాను..
కొసమెరుపు: పాత కంపెనీలో అందరూ కార్తిక్ అనే పిలుస్తారు.. కానీ నిన్న హ్యులెట్ పాకార్డ్ ఇండక్షం ప్రోగ్రాం లో ఆ మానవ వనరుల మేనేజర్(మేనేజర్ తెలుగు పదం??)  నా పేరు చెప్పాల్సిన చోటల్లా నా పేరు "కార్తికేయన్" "కార్తికేయన్" అని పిలిచింది.. రేపటినుంచీ నా కొత్త బాసుతో కలిసి పని చెయ్యాలి అతను ఎలా పిలుస్తాడో చూడాలి.. ఆ అరవ పేరు పిలిస్తే మాత్రం మొదటి రోజే చెప్పేస్తాను.. అలా చెప్పకపోతే శిక్షగా మార్తాండ కథ సంపుటికి ముందుమాట రాస్తాను..

-కార్తీక్

మరు జన్మలో నేను ......

3/29/2010 - రాసింది karthik at Monday, March 29, 2010
కరవు సీమలో తొలకరి అల్లరికి కలిగిన మట్టి వాసననౌతాను! 
అరుణోదయాన జగతిని నిద్రలేపే పక్షుల కిలకిలరావాలలో ఇమిడిపోతాను!
ముగ్గువేస్తున్న పల్లేపడుచు ముంగురులపై స్వేదబిందువునౌతాను!
బిడ్డకోసం తన సుఖం మరిచే అమ్మ హృదయపు ఆర్ర్ధతనౌతాను!
చెలి ఎడబాటు వల్ల కలిగిన విరహంలోని వేడి నిట్టూర్పునౌతాను! 
కల్లోల కాశ్మీరానా కదం తొక్కే వీరసైనికుడి పాదధూళిగా పుడతాను!
కరవుకరాళ నృత్యానికి సాక్షిగా నిలిచిన బక్కరైతు ఆక్రందననౌతాను! 
నిర్లక్ష్య నిదర్శనంగా బోరుబావిలో పడ్డ పాపడి ఏడుపులో ప్రతిధ్వనినౌతాను!
బుడిబుడి నడకల వయసులో బ్యాగు బరువులకు కుదేలౌతున్న బాల్యపు చిహ్నంగా మిగిలిపోతాను!

-కార్తీక్

కొన్ని రోజుల క్రితం నేను రాసుకున్న కవిత ఇది. ఇవాళ పుస్తకాలు సర్దుతుంటే దొరికింది. మరోసారి మిస్ అయ్యేలోపు బ్లాగులో పెట్టడం మేలనిపించి ఇలా పెట్టాను.

బ్లాగుల్లో పేటెంట్లు

2/24/2010 - రాసింది karthik at Wednesday, February 24, 2010
టెంప్లేట్లు కాదు బాబు పేటెంట్లు..  మళ్ళి కన్ ఫ్యూజు కాకూడదని మరోసారి చెబుతున్నా..

నాకు పేటెంట్లు అన్న పదం విన్నప్పుడల్లా, నా థీసిస్ కు మిస్ అయిన పేటెంటే గుర్తుకు వస్తుంది.. సరేలే పేటెంటు రాకపొయినా కనీసం కొంత జ్ఞానం అన్నా వచ్చిందని తృప్తి పడుతుంటాను..

ఇక విషయానికి వస్తే తెలుగు బ్లాగుల్లో ఎవరెవరికి ఏ ఏ విషయాలకు పేటెంట్లు ఇవ్వాలని నేను కొంత ఆలోచించాను.. దాని ఫలితమే ఈ టపా..

కొత్తపాళి గారు: మంగళవారం
అబ్రకదబ్ర గారు: శ్రీ ఏసుదాసు కథ (కెవ్వు స్టోరీ)
తోటరాముడు గారు: దినకర్
విహారి గారు:సిద్ధా బుద్ధా
 తేటగీతి గారు: బట్టతల (ఈయనకు బట్టతల ఉందో లేదో నాకు తెలీదు కానీ నాకు బాగా ఇష్టమైన కథ మాత్రం "బట్టతల వచ్చేసిందే బాల ")
అరిపిరాల సత్యపసాద్ గారు: కాశీ మజిలీ కథలు

ఇక మనవాళ్ళ విషయానికి వద్దాం.

మలక్ పేట్ రౌడీ: LOOOL :)
జీడిపప్పు( ఈయన ఈ మధ్య బ్లాగుల్లో కనిపించటం లేదు): "బ్లాగు లోకపు కే.ఏ.పాల్" అనే వ్యాఖ్య
పాగడా సారీ పావడా సారీ పవన్: వేరే చెప్పాలా   "కాగడా", "ప్రనా" అన్న గొప్ప పదం
శరత్ గేరు సారి గారు: స్పెషల్ గా చెప్పాలా? మీరనుకుంటున్నదే..
వికటకవి శ్రీనివాస్: రాజేష్
సౌమ్య:సెగట్రీ
మంచుపల్లకి:  ఒక మాంచి పల్లకి కొని ఇచ్చేదాం..
నాగప్రసాద్: కెలుకుడు
బంతి,జో: ప్రపీసస పవర్ ఆఫ్ అథారిటి
జాటర్ డమాల్: డాక్టర్ గారు
ఒక చిన్న డౌటు: కలరులీడరమ్మ పేటెంట్ ఎవరి దగ్గర ఉంది? వాళ్ళకి నా పాదాభివందనం..

ఇప్పుడు ఒక వ్యక్తికి ఇవ్వడానికి కొన్ని పేటెంట్లున్నాయి.. వాటిని బ్లాగుల్లో కేవలం ఒకే ఒక్కరు తీసుకోగలరు.. ఆ వ్యక్తి ఎవరో మీరే చెప్పుకోండి

పేటెంట్లు: "ఎమోషనల్ దయ్యం" "గుండు కొట్టించుకుని గాడిద మీద తిరగడం" "మలక్,ఏకలింగం ఒకరే" "వీర నాస్తికత్వం" "వదిన వాదం సారీ స్త్రీవాదం" "బీరువాలో పెట్టి బుక్కులు మర్చిపోవడం"
నా పేరుతో ఏ పేటెంట్లు లేక పొయినా ఇంతమందికి ఇన్ని పేటెంట్లు ఇవ్వాలని చెబుతున్నాను కనుక ప్రజలు నా విశాల హృదయాన్ని గుర్తించాలి :) :)

-కార్తీక్

ఇదేమి అవతారం దేవుడా??

1/20/2010 - రాసింది karthik at Wednesday, January 20, 2010
అవతార్ సినిమా గురించీ అనుకుంటున్నారా? ఐతే మీకు నూటికి నూటా ఇరవై మార్కులు. నేను ఖచ్చితంగా దాని గురించే మాట్లాడుతున్నాను. 2009 లో నేను చాలానే చెత్త సినిమాలు చూశాను.. కానీ 2010 కూడా ఇంత చెత్త సినిమాతో మొదలైనందుకు నేను కడు చింతింత్ హూ!

నేను బేసిగ్గా విలన్ని, నాకు హీరోయిన్లు నచ్చరు..
నేనెప్పుడు థియేటరుకు పొయి సినిమా చూడడానికి అసలు ఇష్టపడను..
పై రెండు వాక్యాల మధ్య సంబంధం వెదుకుతున్నారా?? ప్చ్ ఏమాత్రం సంబంధం లేదు.. పది రోజులు ప్ర.పీ.స.స. కు దూరంగా ఉంటే ఇలాకాక ఎలా ఉంటాను చెప్పండి?

ఇక మన సినిమా విషయానికి వస్తే అందరూ ఆహా, ఓహో.. అంటే కనీసం "పర్లేదు" టైపులో ఉంటుంది అనుకున్నా.. కానీ అట్టర్ హోప్ లెస్!! అసలు ఆ సినిమాకు పోవటానికి పెద్ద ప్రహసనమే నడిచిందిలెండి. మా ఆఫీస్ టీముకు సంబంధించి ఒక కామన్ ఫండ్ ఉంటుంది ఒకానొక కాలంలో అది కంపెనీ భరించేది మాంద్యం దెబ్బకు ప్రస్తుతం టీం మెంబర్లంతా నెలకు వంద రూపాయలు వేసుకుని బండి లాగిస్తున్నాం.. ఆ డబ్బుతో సినిమాకు వెళదాం అని టికెట్ బుక్ చేశాం.. తీర బుక్ చేశాక ఆ ఐడియా ఇచ్చిన అమ్మాయికి ఆక్సిడెంట్ అయ్యి కాలు విరిగింది.. పాపం ఇంకా సెయింట్ జాన్స్ లోనే ఉంది.. నాకైతే టికెట్ కాన్సిల్ చేద్దామనిపించింది కానీ డబ్బులు వేస్ట్ అవుతాయి కదా అని వెళ్ళాము.. ఇలాంటి శషభిషల మధ్య టీం మొత్తం అంటే నా బాసు, బాసుకు బాసు, ఆ బాసుకు బాసు ఇలా బాసులతో కలిసి వెళ్ళాను.. నాకు సినిమా ట్రైలర్ చూసే ఇదేదో తన్నేట్టుగా ఉందే అని డౌట్ వచ్చింది.. సినిమా మొదలౌతూనే అది కాస్తా నిజమని తేలిపొయింది..


ఒక అడవి జాతి ఉంటుంది..వాళ్ళల్లోకి ఒక బయట వ్యక్తి వస్తాడు.. ఆ జీవిని వాళ్ళంతా అభిమానిస్తారు.. కానీ ఆ కొత్త వ్యక్తి వల్లే ఆ జాతికి నష్టం కలిగింది అని వాళ్ళంటా అనుకుంటారు అప్పుడు ఆ కొత్త వ్యక్తి వాళ్ళకు హెల్ప్ చేసి తన నిజాయితీ చాటుకుంటాడు..

ఈ కథ నేను చిన్నప్పుడు చందమామ కథల్లో చదివాను.. కొంచెం పెద్దయ్యాక బుల్లెట్,షాడో నవలల్లో చదివాను... ఇంకా సినిమాల్లో కూడా ఎక్కడొ చూసినటున్నాను.. అందువల్ల నాకు కథా పరంగా చాలా ఆర్డినరీ అనిపించింది.. ఇక ప్రజలెవరైనా "కథ పాతదే ఐనా కథనం కొత్తగా ఉంది" అనే తెలుగు సినిమా డైరెక్టర్ల మాటలు చెబితే నేనస్సలు నమ్మను.. ఏ పక్క నుంచీ చూశినా అంత కొత్త దనం నాకు కనిపించలేదు (నువ్వంత ముదిరిపోయావు అంటే నేనేమి చెయ్యలేను)

ఇలాంటి కథల్లో నాకు బాగా నచ్చిన సినిమా లార్డ్ ఆఫ్ థి రింగ్స్.. ప్రతీ ఫ్రేములో ఎంతో సహజంగా Magnum Opus అనే పదానికి అర్థం చెప్పేలా ఉంటుంది.. నాకు తెలియకుండానే నేను అవతార్ ను ఆ సినిమాతో పోల్చడం వల్ల ఇంకా చెత్తగా అనిపించింది.. ఇవన్నీ చాలవన్నట్టు 3D ఒకటి.. అదోక ఎక్స్ ట్రా క్షవరం.. 150 టికెట్ 300 కు కొన్నాము.. హై. లో ఉండే ఐమాక్స్ లో చూస్తే బాగుంటుంది అని మా ఫ్రెండ్ అన్నాడు..ఎంత మాత్రం నిజమో నాకు తెలీదు.. ఇక్కడైతే(Inox) అంత గొప్ప ఫీల్ రాలేదు..

ఏదో నా అంతకు నేను మా ఇటాలియన్ క్లయింటుతో కష్టాలు పడుతుంటే టిం బిల్డింగ్ అనే పేరుతో ఈ సినిమా చూపించారు 400 డబ్బులు + 3గంటల నా విలువైన సమయం వృధా అయ్యింది.. ఆ మూడు గంటలు ప్ర.పీ.స.స. లో కామెంట్లు రాసింటే కనీసం మా సభ్యులన్నా కొంచెం సంతోషపడేవారు..

కొసమెరుపు: రాం గోపాల్ వర్మ "అవతార్ చూడొద్దు, అనుభవించండి" అంటే అదేదో పొగడ్త అని తిక్క ప్రజలు ఫీల్ అయిపోయారు.. నేను అనుభవించాను మీరు కూడా మీ ఖర్మ అనుభవించండి అని అర్థం... ఎప్పటికి తెలుసుకుంటారో ఏమో??