తెలంగాణ: నా అనుకోలు!

12/10/2009 - రాసింది karthik at Thursday, December 10, 2009
నా తెలుగు బ్లాగులో సీరియస్ టపాలు రాయకూడదు అని నేను ఫిక్స్ అయ్యి చాలా కాలమయ్యింది.. కాని ఇప్పుడు రాయాల్సి వస్తోంది..కారణం "తెలంగాణ" ఈ టపాలో నేను తెలంగాణా చరిత్ర,మొదటి రాష్ట్రాల పునర్విభజన కమీషన్, నెహ్రూ ఇలాంటి విషయాల జోలికి పోదలుచుకోలేదు.. ఈ అంశం గురించీ నా ఆలోచనలను బ్లాగీకరించే ప్రయత్నమే ఈ టపా.

రాష్ట్రం విడిపోతే తెలంగాణా బాగుపడుతుంది అనేది తెలంగాణా వాదుల మౌలికమైన ఉద్దేశ్యం (basic idea), దానికి వారు హిమాచల్ వగైరా రాష్ట్రాలని ఉదాహరణాలుగా చూపిస్తారు. బాగుపడే అవకాశం ఎంతుందో మరొక దోపిడీ మొదలయ్యే అవకాశం కూడా అంతే ఉంది. చిన్న రాష్ట్రమైన హిమాచల్ బాగుపడితే బీహార్ నుంచీ విడిపొయిన జార్ఖండ్ పాతాళానికి పరుగులు పెడుతూ ఉంది. రేపు తెలంగాణా నేతలు మరొక మధు ఖోడాలుగా తయారు కారని నమ్మకం ఏమిటి?? కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే అభివృద్ది అనేది నేతల మీద ఆధారపడి ఉంది తప్ప రాష్ట్రం యొక్క పరిణామం మీద కాదు.
ఇక ఇప్పటివరకూ ఏ తెలంగాణా వాది నుంచీ విడిపోవడానికి convincing reason వినలేదు. ఇక్కడ అత్యంత దురదృష్టకర పరిణామం ఏమిటంటే తెలంగాణా పేరు మీదా ఆంధ్రా వాళ్ళ మీద విషం కక్కడం. మేము తిట్టేది కేవలం రియల్ ఎస్టేట్లలో సంపాదించిన వాళ్ళను మాత్రమే అంటారు మరి ఆంధ్రా బ్యాంకు పేరు మార్చడం, ఆంధ్రా మీల్స్ అన్న బోర్డ్ కొట్టేయడం ఇవి దేన్ని సూచిస్తున్నాయి. మేము తిట్టేది బడా బాబులనే అని నాయకులు చెప్పొచ్చు కాని కాలిన కడుపులతో ఉన్న వారికి అంత విచక్షణ ఉంటుందా??? వాడికి ఆంధ్రా అన్న పదమే ఒక బూతైపోయింది. శరత్ గారు అన్నట్టు తెలబాన్లు అనే పదమే కరెక్టేనేమో!
ఇక హైదరాబాదు అనేది అత్యంత పెద్ద పీటముడి. అప్పుడింకెంత గొడవలు జరుగుతాయో! ఏమో? హైదరాబాదులో వీధి పోరాటాలు జరిగినా నేను ఆశ్చర్యపోను. దీన్ని ఎలా పరిష్కరిస్తారు??
రాష్ట్ర విభజన అనేది ఒక administrative process జరగాల్సింది ఒక sentimental injury అయ్యింది. అన్నిటికంటే పెద్ద సమస్య అది. ఇప్పుడు ఈ విషం కక్కే చేష్టల వల్ల ఇండియా-పాకిస్తాన్ వాతావరణం ఏర్పడుతుందేమోనని భయంగా ఉంది. ఎందుకంటే తెలంగాణా ఏర్పడ్డా లేకపొయినా నాకొచ్చే జీతం లో తేడా ఏమీరాదు. కానీ మనసులో ఎందుకో తెలియని బాధగా ఉంది.
నా పాయింట్ ఒక్కటె దేశన్ని ప్రాంతలకు అతీతంగ, పార్టీలకు అతీతంగ అందరూ దొచుకున్నారు. వాళ్ళకి తెలంగాణా ఐన, రాయలసీమ ఐన పెద్ద తేడా లేదు. సొ కనీసం మన తరమైనా అభివృద్ధి గురించి ఆలోచించాలి. ఒకరిని ఒకరు తిట్టుకుంటే ప్రయోజనం శూన్యం

చైనా వాడు మన దేశాన్ని 32 భాగాలుగా చేస్తే తన మార్కేట్కు పోటీగా రాకుండా ఉంటామని ప్లాన్ చేశాడట. (4 ఏళ్ళ క్రితం ఏదో పుస్తకం లో చదివాను). ఇక పాకిస్తాన్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. తాలిబన్లు మన మీద షరియా విధించటానికి యాక్షన్ ప్లాన్ తయారు చేసి పెట్టారు. ఇంత మంది ఇన్ని రకాలుగా మనమీద కత్తిగట్టి ఉంటే మన్మేమో కొత్త రాష్ట్రాలు తొక్క తోలు అని కొట్టుకుంటున్నాం!!
ఈ తప్పుకు చరిత్ర మనల్ని క్షమిస్తుందా??? i have no answer..


ఏది ఏమైనా తెలంగాణా రావటం ఫిక్స్ అయ్యింది కనుక ఆ ప్రాంత ప్రజలకు నా హార్దిక శుభాకాంక్షలు. ఇప్పటి వరకూ జరిగిన విష ప్రచారం ఇకనైనా ఆపాలని మనవి.

చివరగా:
మాతెలుగుతల్లికి క్షమాపణల దండ

మా కన్నతల్లికి పాదాభివందనములు

కడుపులో కత్తెర్లు
కనుపాపలో నెత్తుర్లు
చీదరింపుల చీకట్లు
ప్రసరించెను మాతల్లి

గణగణ తెలంగాణ కదలిపోతుంటేను
బిరబిర హైదరాబాద్ వీడిపోతుంటేను

కంగారు క్షణాలే దొర్లుతాయి
ముత్యాలమురిపాలు మోడులాయే

క్షమించు తెలుగు తల్లీ !

క్షమించు తెలుగు తల్లీ!

పాటకు కాపీరైట్ హక్కుదారు: ప్ర.పీ.స.స.

ఆశ్రునయనాలతో
-కార్తీక్


గమనిక:
కామెంట్లు రాసే ప్రజలు విషం కక్కే మాటలు రాస్తే నేను ఆమోదించను, నా బ్లాగుకి నేనే మోనార్కుని!