బైకు స్వగతం!!

6/29/2009 - రాసింది karthik at Monday, June 29, 2009
పొయిన వారం ఇంటికి పొయినప్పుడు మరోసారి బండిలో నుంచి కింద పడ్డాను. ఈ సారి మా అక్కను కూడా కింద పడేశాను... ఇంత వరకు ఎప్పుడూ కింద పడలేదని గొప్పలు చెప్పుకొనేది.. ఇప్పుడు పాపం ఆ రికార్డ్ బ్రేక్ అయ్యింది.
అన్నీ సవ్యంగా జరిగుంటే ఆ రోజు ఇటలీ లో ఉండవలసిన వాడిని. ఇలా హాస్పిటల్ పాలయ్యాను :) ఆ రోజు హాస్పిటల్ లో ఉన్నప్పుడు అనుకున్నాను. నాకే ఇంత నొప్పిగా ఉంటే బండికి ఎలా ఉంటుంది? పాపం దానికి ఎంత నొప్పిగా ఉంటుంది అని? అప్పుడు వచ్చ్చిన ఐడియానే ఈ "బైకు స్వగతం".
కాస్కోండి మరి:

టం టం ట్టం..
ఢం..ఢం..ఢం..ఢం..ఢం.. (starting music)
పల్సర్ కు ప్యాషన్ కు జరిగిన ఈ సమరంలో...
ట్రాఫిక్ కు బైకింగుకు జరిగిన ఈ సంగ్రామంలో..
కడుపు నొప్పికి తీసిపొనిదీ దెబ్బ..
ఐసు గడ్డకు తగ్గిపొనిదీ దెబ్బ..
ఇది ఆ రోడ్డులో తగిలిన దెబ్బ..
నొప్పా? నొప్పా? నొప్పా? నెవ్వర్!!!
అయాం ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్ ఎనీదింగ్ హ్యాపెన్స్ ఇట్స్ నాట్ మై ఫ్లా

దూరమైనది గమ్యం...
దిక్కులేనిది మార్గం...
బ్రేకులేనిదీ పయనం..
బైకు జన్మకిది ఖర్మం..
రోడ్డు మధ్యలో నేనుప్పుడు రోడ్డు మోత్తము జామైనప్పుడు..నాకు మీరు లేరు..
నేను నేను కాను.. నేను నేను కాను
ఇది ఆ రోడ్డులో తగిలిన దెబ్బ..
నొప్పా? నొప్పా? నో!!

వేగం కోసం డయానా పతీ సుతులనెడబాసినది..
ఫుల్లు ట్యాంకును నేను సర్విసింగుకు పంపించినది..
సిటీ బస్సును కాదని నేను రోడ్ త్యాగం చేసినది..
సొంత బండినే కాదని నేను కన్నీటిని దిగమింగుతున్నది..
ఎందుకొసం?..ఆ..ఎందుకొసం?
మంట పుట్టినా అది మనదే కనుకా..
నోరు ముయ్యాలి తప్పు నాదే కనుకా..
బెణికినా..నే సొట్టపోయినా..
అది ట్రాఫిక్ కనుక..
ఆ ట్రాఫిక్కే నా మార్గం కనుక..

పల్సర్ కు ప్యాషన్ కు జరిగిన ఈ సమరంలో...
ట్రాఫిక్ కు బైకింగుకు జరిగిన ఈ సంగ్రామంలో..
కడుపు నొప్పికి తీసిపొనిదీ దెబ్బ..
ఐసు గడ్డకు తగ్గిపొనిదీ దెబ్బ..
ఇది ఆ రోడ్డులో తగిలిన దెబ్బ..

ఈ పాట మాతృక కోసం ఇక్కడ నొక్కండి.
నాతో పాటు కింద పడి ఒక వారం విశ్రాంతి తీసుకున్న నా సోదరీమణికి క్షమాపణలతో ఈ పాట అంకితం :) :)

Despite accident nothing happened to me. Its true that pain is practical but suffering is optional and I did not chose it.

-కార్తీక్.

ఆకలి కాదు "సాఫ్ట్ వేర్ రాజ్యం"

6/17/2009 - రాసింది karthik at Wednesday, June 17, 2009
మొన్న ఆ సీరియస్ పాట రాసి నేను కూడా కొంచెం చిరాకు పడ్డాను. యూజ్ లెస్ ఫెల్లోస్ ప్రజలను ప్రశంతంగా బ్రతకనీరు. ఈ సారికి ఒక సాఫ్ట్ వేర్ ప్రేమికుడి బాధ ఏమిటో చూద్దాం... ఈ సారి మన ప్రేమికులు ఆఫీస్ కెఫెటేరియాలో పాట పాడుకుంటున్నారు..

ఇంజినీరువని సాఫ్ట్ వేరు అని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి..
చిన్న కోడు రాసి బగ్గులన్ని పట్టి ఎన్నెన్ని రిసల్ట్స్ రప్పించావే పొన్నారి..

లాంగ్వేజి నువ్వైతే....
ప్యాకేజి నేనౌతా...
లాంగ్వేజి నువ్వైతే ప్యాకేజి నేనౌతా

ఇంజినీరువని సాఫ్ట్ వేరు అని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి..
చిన్న కోడు రాసి బగ్గులన్ని పట్టి ఎన్నెన్ని రిసల్ట్స్ రప్పించావే పొన్నారి..


కోడు నీవై.. కోడులో ఎర్రర్ నేనై..
ప్రాజెక్ట్ చెత్తే కాగా..
బగ్గు నేనై..
నాలో ప్రాబ్లం నీవై..
'బ్యుటిఫుల్' తప్పు ఐనది సింటాక్సో లాజికో ఇంపుట్టో..

ఇంజినీరువని సాఫ్ట్ వేరు అని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి..
చిన్న కోడు రాసి బగ్గులన్ని పట్టి ఎన్నెన్ని రిసల్ట్స్ రప్పించావే పొన్నారి..
లాంగ్వేజి నువ్వైతే ప్యాకేజి నేనౌతా..

ఇప్పుడు చూద్దాం

తనన తనన తన్నా..
' హ్మ్మ్' తనన తనన అన్నా..
తాన తన్న తాన్నం తరతతన ...
తాన అన్నా టూలేమో ఒకటే కదా
కోడు రాసి రన్ను చేయలేదా..
కోడే ఫైనల్ కదా..
కోడు తప్పనీ... అన్నా..ఇంతే కాదా..
కోడు తప్పనీ... అన్నా..ఇంతే కాదా..

ఇంజినీరువని సాఫ్ట్ వేరు అని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి..
చిన్న కోడు రాసి బగ్గులన్ని పట్టి ఎన్నెన్ని రిసల్ట్స్ రప్పించావే పొన్నారి..
లాంగ్వేజి నువ్వైతే ప్యాకేజి నేనౌతా..



P.S: ఈ పాటలు విని ప్రజలకు ఎవరికైనా గుండె కళ్ళుక్కుమన్నా.. లేక బుర్ర ఢాం అన్నా. నేను చేయగలిగేది ఏమీ లేదు..

-కార్తీక్

మరొక ప్రేమ పాట

6/13/2009 - రాసింది karthik at Saturday, June 13, 2009
మొదటగా disclaimers:
నేను రాసే పాటలు పాడాలని ప్రయత్నిస్తే ఆ తర్వాతి పరిణామాలకు నేను భాధ్యుణ్ణి కాదు. పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసినా, చుట్టు పక్కల వాళ్ళు మిమ్మల్ని పిచ్చాసుపత్రిలో చేర్చినా నేనూ జవాబుదారి కాదు. :) :)
ఇంతకు ముందు నేను రాసిన టపాలు చూసిన ప్రజలు నాలో ఒక "ఉదయించే కవి" ని చూశాము అని అన్నారు. రూలూ ప్రకారం నేను "నేనా?? కవినా??" అనాలి. ఇంకొ పక్క నుండి ఒకరు "రచయితగారూ " అని అరవాలి కానీ నేను వాడేది సంతూర్ సోప్ కాదు. సినితారలు వాడే లక్స్. అందువల్ల ఏమీ అనడం లేదు. :) :)

ఇక ఈ రోజు విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్ర దేశం లో అమ్మాయిలను వేదించే ట్రెండ్ నడుస్తుంది కద. అందుకని అలాంటి అమ్మాయిల కోసం ఈ పాట రాశాను. ఇది కామెడీగా అనిపిస్తే నేనేమీ చెయ్యలేను. అమ్మాయిలకు సానుభుతి మాత్రం తెలుపుతాను. :( ఈ విషయం మీద చాలా మంది ప్రజలు బల్లలు గుద్ది, కుర్చీలు విరక్కొట్టి ఎన్నో చెప్పారు/చెప్తారు. మా ఇంట్లొ బల్లలు లేవు కనుక నేను ఇది రాస్తున్నాను.

అమ్మాయి:
నన్ను వేధించే శాడిస్టువు నువ్వేనని కళ్ళు పొడిచే ఆ శనిగాడివి నువ్వేనని
నాకు డౌటొచ్చింది, డౌటు క్లియర్ అయ్యింది,
అన్నీ క్లియర్ అయ్యి ఈ ఖర్మ మొదలైంది.
పోశాడండీ ఆసిడే మరి..మండుతూ ఉందిలే ఇది. .
పోశాడండీ ఆసిడే మరి..మండుతూ ఉందిలే ఇది. .

అబ్బాయి:
నిజంగా...నిజంగా ఇలా ఈ రొజే తొలిసారిగా
పోశానండీ ఆసిడే మరి.. సూపరుగా ఉందిలే ఇది.
పోశానండీ ఆసిడే మరి.. సూపరుగా ఉందిలే ఇది.
ఈ కాంత లోన దాగి ఉంది నిర్మలత్వము
తన వైపు నన్ను లాగుతోంది మాయకత్వము..

అమ్మాయి:
నీ చేతిలోన దాగి ఉంది మోండి ఆసిడు..
అది తాకగానే భగ్గుమంది పిచ్చి ముఖము...
అబ్బాయి:
ఇద్దరిదీ ఒకే స్థితి ఏమిటి ఈ పరిస్థితి..
అమ్మాయి:
ఇద్దరిదీ ఒకే స్థితి ఏమిటి ఈ పరిస్థితి..
అబ్బాయి:
బలుపు గుర్రమెక్కి యువత చెయ్యమంది శ్వారీ..
అమ్మాయి:
పోశాడండీ ఆసిడే మరి..మండుతూ ఉందిలే ఇది. .
పోశాడండీ ఆసిడే మరి..మండుతూ ఉందిలే ఇది. .
అబ్బాయి:
నా ఈడు నేడు పాడుతోంది బీరు దండకం..
నా ఒంటి మీద నిండి ఉంది బారు మండలం..
అమ్మాయి:
నా పాత బొబ్బ రేపుతోంది కొత్త నరకం..
నా సత్తువంత పీర్చుకుంది కత్తి గాయం..
కనిపిస్తే ఖర్మే కాలీ.. కాల్చేస్తా ఒకేసారి..
ఆడజన్మ ఎత్తినోళ్ళ ఖర్మ ఈ పరిస్థితి..

it seems gone are those days where girls have rosy dreams about their relationships :(

-కార్తీక్


ప్రేమ "గాయం"

6/09/2009 - రాసింది karthik at Tuesday, June 09, 2009
ఈ మధ్య ఆఫిస్ నుంచి త్వరగా ఇంటికి వస్తున్నా(అంటే 9గం. లకు వస్తున్నా). ఈ రోజు కూడా అలాగే వచ్చి ఏదో ఆలోచిస్తుంటే ఒక అవిడియా వచ్చింది. ఒకవేళ ఎవరైనా అబ్బాయికి బ్లాగుల్లో అమ్మాయి దొరికితే ఆ బ్లాగు ప్రేమను ఎలా చెప్తాడు అని ఒక డౌట్ వచ్చింది. అప్పుడు రాసిందే ఈ ప్రేమ "గాయం" సారీ "గేయం".

నేనొక బ్లాగు పిశాచిని నీవొక కూడలి వాసివి.
నా బ్లాగే నిండనిది నీ సైటే కదలనిది.

నేనొక బ్లాగు పిశాచిని నీవొక కూడలి వాసివి.
నా బ్లాగే నిండనిది నీ సైటే కదలనిది.
నేనొక బ్లాగు పిశాచిని

బ్లాగు మూసిన బ్లాగరింటనే లాగిన్ అయ్యి నిలుచున్నా
క్లిక్కి క్లిక్కి రిప్లై రాక లాగాఫ్ అయ్యి వెళుతున్నా
బ్లాగు మూసిన బ్లాగరింటనే లాగిన్ అయ్యి నిలుచున్నా
క్లిక్కి క్లిక్కి రిప్లై రాక లాగాఫ్ అయ్యి వెళుతున్నా
నా బ్లాగే నిండనిది నీ సైటే కదలనిది.
నేనొక బ్లాగు పిశాచిని

బ్లాగుకు సైటు సైటుకు బ్లాగు పలికే ఆడాన్సూ
ఫ్యుజు కాలిన ల్యాప్టాప్ కు చెబుతున్నా నీ మెయిల్ కు చేరితే చాలు
నీ ఆర్కైవుల ఫోల్డర్ లో నన్నెపుడో చూస్తావు
నా మెయిలు చూశానని చెప్పేలోపు డిలీటై పోతాను.

నేనొక బ్లాగు పిశాచిని నీవొక కూడలి వాసివి.
నా బ్లాగే నిండనిది నీ సైటే కదలనిది.
నేనొక బ్లాగు పిశాచిని

ఆత్రేయగారికి శతకోటి క్షమాపణలతో..
ఆయన అభిమానకోటిలో ఒక సైకతరేణువు...

-కార్తీక్

రైలోపాఖ్యానం

6/06/2009 - రాసింది karthik at Saturday, June 06, 2009
మా అమ్మమ్మా వాళ్ళ ఊరిలో రైల్వే స్టేషన్ మా ఇంటి పక్కనే ఉండేది. అందువల్ల చిన్నప్పుడు కూ చికు చికు అని శబ్దం వినిపించిన వెంటనే అరుగెక్కి స్టేషన్ వైపు చూసేవాడిని. కొన్ని రోజుల తర్వాత మా మామా వాళ్ళు ఏ రైల్ వచ్చినా కార్తీక్! నీ డార్లింగ్ వచ్చింది అని అరిచేవాళ్ళు. అలా అరిచినందుకైనా నన్ను ఎప్పుడు రైల్ దగ్గరికి తీసుకొని పోతారేమో అని అనుకునేవాడిని. కానీ వాళ్ళ డిక్షనరీ లో కనికరం అనే పదమే లేదు. దిష్టి తగులుతుంది అనే కారణం చెప్పి ఎప్పుడూ ఇంట్లోనే ఉంచే వాళ్ళు. ఇంక మా ఊరిలో రైల్వే స్టేషన్ ఉంది అనే విషయం నాకు చాలా రొజుల వరకు తెలీదు. అందువల్ల చాలా కాలం రైలు ఎక్కే చాన్స్ దొరకలేదు. ఇదంతా మా ఇంట్లో వాళ్ళ కుట్ర అని నా బలమైన నమ్మకం. ఎందుకంటే మా నాన్న గత 35 సం.లుగా అర్.టి.సి. లో పని చేస్తున్నారు. కాబట్టి దీని వెనుక ఆయన పాత్ర ఉండొచ్చు.
************************************************
అర్.టి.సి. ప్రస్తావన ఎలాగూ వచ్చింది కాబట్టి ఒక చిన్న జీ.కే. ప్రశ్న (ఐ.ఏ.యస్. ,ఐ.పీ.యస్. రాసే వాళ్ళు తప్పకుండా తెలుసుకోవలసినది):
ప్ర: ఏ.పీ.యస్.ఆర్.టి.సీ. అంటే ఏమిటి?
జ: ఆగితే(A) పోదు(P) సమయానికి(S) రాదు(R) టైముకు(T) చేరదు(C).
************************************************
ఇలాంటి కుట్రలు, కుతంత్రాల నడుమ ఎలాగైతేనేమి 1997 లో మొదటిసారిగా రైలెక్కాను. ఆ తర్వాత అప్పుడప్ప్డూ రైల్ ఎక్కేవాడిని. ఇలా ఉండగా ఇంజినీరింగ్ థర్ద్ యియర్లో ఇండియన్ ఆర్మీ టెక్నికల్ స్ట్రీం ఇంటర్వ్యువ్ అని చెప్పి ఆలహాబాద్ కు వెళ్ళాను. అక్కడ ఆ టెస్ట్ ఎన్ని రొజులు ఉంటుందో కరెక్ట్ గా తెలీదు. కానీ మనం అప్ప్లై చెయ్యటం ఫెయిల్ కావటమా??? చరిత్రలో లేదు అని రిజర్వేషన్ చెయ్యించుకోలేదు. తీరా అక్కడికి వేళ్ళాక మనం మొదటి రౌండ్లోనే వెనక్కి వచ్చేశాం. ఇప్పుడు అలాహాబాద్ నుంచీ వెనక్కు రావడం ఎలా?? మనలాంటి వారూ, మన జాతి వారూ (తెలుగు జాతి) ఇంకొందరు ఉండటం వల్ల అందరం కలిసి వెయిటింగ్ లిస్ట్ టికెట్ మీద పాట్నా నుంచి హైదరాబాద్ వచ్చే రైలెక్కేశాం. ప్రయాణం పేరు మీద మన సర్కారు చేస్తున్న దురాగతాలు అప్పుడు తెలిసొచ్చాయి. నిల్చుకోవడానికి కూడా స్థలం లేదు. ఫుట్ బోర్డ్ మీద కూర్చొని ప్రయాణం చేశాను. ఆ తర్వాత కూడా నాకు రైళ్ళ మీద లవ్వు తగ్గ లేదు. ఆ తర్వాత సంవత్సరం ఇంటర్వ్యువ్ కని కడప నుంచీ బొంబయికి, అక్కడి నుంచీ కాన్ పుర్ కి, అక్కడి నుంచి డిల్లీ కి వెళ్ళాల్సి ఉంది. నాది అసలే బంపర్ జాక్ పాట్ జాతకం కద అందుకని అన్ని వెయిటింగ్ లిస్ట్ టికెట్ మీదనే ప్రయాణం చేశాను. ఇంక చూసుకోండి, ఆహా నా రాజా! కళ్ళు నిజంగానే కాయలు కట్టాయి. ఎంత విసుగొచ్చిందంటే, డిల్లీకి పోకుండానే వెనక్కు వచ్చేశాను. హైదరాబాద్ చేరాక మా అక్కకు చెప్పిన మొదటి విషయం ఏమిటంటే "మనం ఇంటికి బస్సులో పోదాం" అని. ఆ తర్వాత కూడా గౌ. భా.రై. వారు వీలు దొరికినప్పుడల్లా నా జీవితంతో ఆడుకుంటూనే ఉన్నారు. కాన్ పూర్ లొ ఉన్న రెండు సంవత్సరాలు ప్లాన్ చేసుకొని ఇంటికి వచ్చేవాడిని కనుక పెద్ద సమస్య కాలేదు. మధ్యలో ఒక సారి అహమ్మదాబాదుకు వెళ్ళాను. అప్పుడు ఆ రైలు 12 గం. లేట్ వచ్చి నా సెమిస్టర్ రిజిస్ట్రేషన్ ప్రాబ్లం అయ్యింది. ఇలాంటి అనుభవాల నడుమ ఇప్పుడు రైలెక్కాలి అంటే భయం వేస్తోంది. వచ్చే వారం హైదరాబాదుకు వెళ్ళడానికి రైలుకే వేళుతున్నాను. ఎలా వస్తానో ఏమో???
ఇవ్వన్నీ చూశాక ఒక చిన్న పాట రాశాను:

ఇరుకుపెట్టెలో.....
పిచ్చిరషులొ......
.........................................................................

ఇరుకుపెట్టెలో పిచ్చిరషులొ రైలు ప్రయాణం.
స్టేషన్ ఎక్కడో స్టాపు ఎప్పుడో తెలియదు పాపం. తెలియదు పాపం..
ఇరుకుపెట్టెలో పిచ్చిరషులొ రైలు ప్రయాణం.
స్టేషన్ ఎక్కడో స్టాపు ఎప్పుడో తెలియదు పాపం. తెలియదు పాపం
ఒహొ హో ఒహొ హో ఓహొ హొ హో

ఇది భారత రైల్వే అని తెలుసు, అది సింగిల్ లైన్ అని తెలుసు
ఇది భారత రైల్వే అని తెలుసు, అది సింగిల్ లైన్ అని తెలుసు
భారత రైల్వేలో సింగిల్ లైన్లో సాగలేననీ తెలుసు
ఇటు సీట్లు లేవనీ తెలుసు అటు టైం లేదనీ తెలుసు
ఇటు సీట్లు లేవనీ తెలుసు అటు టైం లేదనీ తెలుసు
సీట్లు ఉన్ననూ, టైము ఉన్ననూ ఫైను తప్పదని తెలుసు
ఐనా రైలు ప్రయాణం...
స్టేషన్ ఎక్కడో స్టాపు ఎప్పుడో తెలియదు పాపం. తెలియదు పాపం..
ఒహొ హో ఒహొ హో ఓహొ హొ హో

ఇది టికెటూ డబ్బుల ఆరాటం.. అది సీటు బెర్తుల చెలగాటం
ఇది టికెటూ డబ్బుల ఆరాటం.. అది సీటు బెర్తుల చెలగాటం
టికెటు జారినా బెర్తు పోయినా ఆగదు జీవిత పోరాటం.
ఇది ఇంజిన్ బోగిల పోరాటం. అది డబ్బూ టైమూ చెలగాటం
ఇది ఇంజిన్ బోగిల పోరాటం. అది డబ్బూ టైమూ చెలగాటం
ఇంజిన్ ఫెయిలు అయి..టైము వేస్టు అయి బ్రతుకుతున్నది ఒక శవం.
ఐనా రైలు ప్రయాణం...
స్టేషన్ ఎక్కడో స్టాపు ఎప్పుడో తెలియదు పాపం. తెలియదు పాపం..

ఇరుకుపెట్టెలో పిచ్చిరషులొ రైలు ప్రయాణం.
స్టేషన్ ఎక్కడో స్టాపు ఎప్పుడో తెలియదు పాపం. తెలియదు పాపం..
ఒహొ హో ఒహొ హో ఓహొ హొ హో

-కార్తీక్