పెన్ టెర్రరిజం-1

7/04/2010 - రాసింది karthik at Sunday, July 04, 2010
సాధారణంగా ఇలాంటి టపాలు రాయటం నాకంత ఇష్టం ఉండదు. కానీ రోజు రోజుకూ సమాజం లో ఈ పీడ ఎక్కువైపోతోంది అందుకే రాయాల్సివస్తోంది. మూడు సంఘటనలను చూద్దాం:

ఆర్ట్ ఆఫ్ లివింగ్ భూమి గురించి గొడవ:
రెండు రోజుల క్రితం ఎన్.డి.టి.వి. లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారు ఒక ఎన్.ఆర్.ఐ. భూమి కబ్జా చేశారని ఒక వార్త ప్రసారం చేశారు. దాని గురించి ఒక రెండు రోజుల పాటు వాళ్ళ సైట్ లో ఒక చిన్న సెక్షన్ కూడా పెట్టారు. ఆ లంకెను ఇక్కడ నొక్క గలరు.
దాని సారాంశం ఇది:
ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ బెదిరింపులు వస్తున్నాయని కేసు పెట్టిన తరువాత పాల్ అనే ఒక ప్రవాస భారతీయుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ తన భూమిని కబ్జా చేసిందని ఆరోపించాడు. మోహన్ అనే రైతు నుంచీ సదరు పాల్ భూమి ని కొన్నారు. కాని లీగల్ ఫార్మాలిటీస్(తెలుగు పదం??) పూర్తి చేసే లోపు మోహన్ చనిపోయారు. దాని గురించి కోర్టులో కేస్ నడుస్తోంది. ఇంతలో ఆ రైతు కొడుకు ఆ భూమిని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు ఇచ్చాడు. శ్రీశ్రీ రవిశంకర్ ఈ వ్యవహారం సెటిల్ చేద్దామని రెండేళ్ళ క్రితం చెప్పారు కాని ఇప్పుడు ఆ భూమిని మర్చిపొమ్మంటున్నారు అని ఆ ప్రవాస భారతీయుని ఆరోపణ. ఇప్పుడు ఈ విషయంగా ఆ భూమి గురించిన వ్యవహారం సెటిల్ చెయ్యమని ఈ ప్రవాస భారతీయుడు అగ్ని శ్రీధర్ అనే జర్నలిస్ట్ గా మారిన రౌడీ ని అడిగాడట. (మక్కీ కి మక్కీ అనువదించటానికి ప్రయత్నిస్తున్నాను అర్థం అయ్యింది కదా!).. ఇదే వ్యక్తి బెదిరింపులకు దిగుతున్నాడని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ కేసు పెట్టింది.

ఇప్పుడు కొన్ని విషయాలు ఆలోచిద్దాం:
1. భూ కబ్జా అంటే భూమి కొనుక్కోవడమా?? ఆ రైతు కొడుకు ఆ భూమిని అమ్మేస్తే దానికి కబ్జా అనడం ఎంత వరకూ సబబు??
2. 12 సంవత్సరాల క్రితం కొన్న భూమిని 2007 లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు ఇచ్చారు. ఈ మధ్య కాలంలో సదరు ప్రవాస భారతీయుడు సెటిల్చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించలేదు??
3. అసలు కబ్జా అన్న పదం ఈ విషయం లో ఎంతవరకూ కరెక్ట్??
ఇవన్నీ పక్కన పెడితే అసలు సెటిల్ చెయ్యమని జర్నలిస్టును అడగటం ఏమిటి? ఆ జర్నలిస్టేమన్నా ఒక పెద్దమనిషా?? ఇప్పటి వరకూ రౌడిలు ముదిరి రాజకీయ నాయకులు అవుతారు అనుకున్నాను.. కానీ ఇకనుంచీ గూండాలు ముదిరి జర్నలిస్టులు అవుతారని అనుకోవాలేమో..

26/11, రతన్ టాటా సహాయం:
26/11 గురించీ మళ్ళీ సెపరేటుగా చెప్పకర్లేదు. అది జరిగిన తరువాత రతన్ టాటా తన సంస్థ ఉద్యోగులను, ఆ చుట్టు ప్రక్కల ప్రజల్ను ఎలా ఆదుకున్నాడో ఎవరికైనా తెలుసా?? ఆ వివరాల మెయిల్ నాకు ఫార్వర్డ్ గా వచ్చింది. అది మొత్తం అలాగే పెడితే ఈ టపా చాలా పెద్దదైపోతుందని నా ఇంగ్లీష్ బ్లాగ్ లో పెట్టాను.. దాని కోసం ఇక్కడ చూడండి.
ఇంత చేసిన రతన్ టాటా గురించి మన మీడియాలో ఒక్క వార్త కూడా రాలేదు.. యస్పీ గారి కుక్క తప్పి పోయింది, మినిష్టర్ గారి పిల్లి చచ్చిపోయింది లాంటి వార్తల కంటే ఇది తీసిపోయిందా?? ( నేను స్వతహాగా టాటాల అభిమానిని నాదృష్టిలో జాతిపితగా గాంధీ కంటే జమ్షడ్జీ టాటా ను పెట్టాల్సింది అని నా అభిప్రాయం. ప్రస్తుతం ఆ చర్చ ఇక్కడ వద్దు.)

యెం.యెఫ్.హుసేన్ జలుబు - ది హిందు పత్రిక తుమ్ములు:
యెం యెఫ్ హుసేన్ కతార్ పోతానంటే ది హిందు పత్రిక యాజమాన్యం చొంగ కార్చుడు చేష్టలు చూశి ఒళ్ళు మండి వాళ్ళకు ఒక మెయిల్ చేశాను. అది కనీసం వాళ్ళ రీడర్స్ ఒపీనియన్ లో వెయ్యను కూడా లేదు. ముందు నా మెయిల్ చూడండి :
Dear Sir,

This is in response to the article by Mr. N. Ram about M.F. Husain. I request you to publish this in the reader's response section.

I fail to understand how Husain's episode is a sorriest chapter in independent secular India. In a country like India where religion is a sensitive issue he should not have gone to hurt others' sentiments. The claim that he loves his country of birth never looked convincing. If he is so keen to be in India then he should learn to respect his fellow Indian's sentiments.

"He breathes the spirit of modernity, progress and tolerance": Does modernity mean offending others?? Does progress mean spoiling harmony by paintings?? And any high school going child can say tolerance never mean "Attacking others". I wonder why The Hindu is so keen in making a issue out of this trivial happening.

Overall the article stands as a new low touched by The Hindu

My Address:

Karthikeya Indrakanti

ఇక్కడ నేను చెప్పేది వాళ్ళు నా మెయిల్ వెయ్యలేదని కాదు. అసలు ఆ ముసలి నక్కను విమర్సిస్తూ ఒక్క అభిప్రాయం కూడా ప్రచురించలేదు. ఇది దిగజారుడు జర్నలిజం. ప్రజల నాడిని అలాగే చూపించడం పత్రికల ధర్మం (పిల్లల గురించి, దేశ రహస్యాలను గురించి కొన్ని మినహాయింపులు ఉన్నాయి). మరీ దేశం మొత్తం ఆ నక్కను గురించి బాధపడుతున్నారని చూపించడం పైత్యం కాక మరేమిటి??
if The Hindu mgt declares itself as a money making organization what they did is fine. but doing these kind of things they dont deserve to talk about things like "Freedom of speech, liberty etc etc"


ఇప్పుడు మరొక సంఘటన చెబుతాను:
2006లో నేను కులదీప్ నయ్యర్ గారిని మా కేంపస్ లో కలిశాను. అపుడు నేను రెండు ప్రశ్నలు అడిగాను:
1. న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం కలిగించడం ఎలా?
2. పత్రికలలో వచ్చేది నిజమని ఎలా నమ్మడం?
ఆయన సమాధానం: " నాకూ తెలీదు, నా మితృలలో కొందరు ప్రెస్ మీట్ కు హాజరయ్యి సరిగ్గా నోట్స్ కూడా రాసుకోరు. ఆ కాఫీ, బిస్కేట్లు ముగించి వాళ్ళకు బుద్ది పుట్టింది ఏదో ఒకటి రాస్తుంటారు" (ఆయన చెప్పిన భావం ఇదే, అనువదింపు దోషాలు గట్రా ఉండొచ్చు)

కొసమెరుపు: మా బంధువులలో ఒక వ్యక్తి మునుపు కేబుల్ టీవీ వ్యాపారం చేసేవాడు ఇప్పుడు జర్నలిస్టుగా మారి మునుపటికంటే ఎక్కువే సంపాదిస్తున్నాడు. ఖర్చులు చాలా తగ్గాయి.. పేపర్లో రాస్తానని బెదిరించి చౌక డిపోల నుంచీ ఇంటికి కావాల్సినవన్నీ తెచ్చుకుంటే ఖర్చులు తగ్గవా చెప్పండి??

ఇది నేటి జర్నలిజం!
అసలు ఈ విషయం గురించి ఒక టపా తో సరిపుచ్చుదామనుకున్నాను కానీ ఇప్పుడే ఒక మితృనితో మాట్లాడాక ఒక సీరీస్ గా 2-3 రాస్తే బాగుంటుందనిపిస్తోంది. మరికొంత పెన్ టెర్రరిజం గురించి మరొక టపాలో..

-కార్తీక్

మరొక దాడి

6/30/2010 - రాసింది karthik at Wednesday, June 30, 2010
ఇప్పుడే పడుకునేముందు ఒకసారి వార్తలు చూద్దామని ఐ.బీ.యెన్. ఒపన్ చేశాను. దానిలో రేండు వార్తలు ఒకటి 26మంది రిజర్వ్ పోలీసులను అన్నలు చంపేశారట  అసలు ఈ అన్నలగా పిలబడేవాళ్ళు ఎప్పుడైనా మనుషులా ప్రవర్తించారా?  నాకు తెలిసి ఎప్పుడు చూసినా వాళ్ళు అక్కడ పట్టాలు కోసేశారు, ఇక్కడ బస్సులు కాల్చేశారు అని తప్ప ఎక్కడైనా ఒక బడి గానీ, అనాధ శరణాలయం గానీ మొదలుపెట్టినట్టు చరిత్రలో ఉందా? నేను సెటైర్ వేయటం లేదండీ బాబూ (ఎంటో ఈ రోజుల్లో ప్రనా అన్నా మంచి పదమైపోతోంది :( )   నిజంగానే అడుగుతున్నాను.. ఎవరికైనా తెలిస్తే చెప్పండి లేదా లింకులివ్వండి.. ఏ చెహోవ్ రచనలు చదవమని, కలరులీడరమ్మ రచనలు చదివి అర్థం చేసుకోమని ఐదు పైసల సలహాలు నాకొద్దు బాబూ, ఆయనే ఉంటే బోడిగుండెందుకని అవి అర్థం అయ్యే ఓపికే ఉంటే బ్లాగులెందుకు .. కామెంట్లు డిసేబుల్ చేసి నేనే ఎంచక్కా నాలగైదు కౌముది లాంటి వెబ్ మ్యాగజైన్లు మొదలుపెట్టేవాడిని.   
అన్నల దృష్టిలో మనుషులంటే ఎవరు? పోలీసులతో వాళ్ళకు ఉండేది వర్గ వైరమా లేక అదే వాళ్ళ అస్తిత్వమా? వీళ్ళకంత జనాదరణే ఉంటే అడువుల్లో ఎందుకు ఉంటారు? ఎన్నికలను ఎందుకు బహిష్కరిస్తారు?  ఒక ఎన్నికలంటే ఏమో అనుకోవచ్చు.. ప్రతీ ఎన్నికలూ అలవాటుగా బహిష్కరిస్తారు.. అసలు మనదేశం లో ఉన్నంత బలమైనా ప్రజాస్వామ్యం ఎన్ని దేశాలలో ఉంది? (మనమే అత్యుత్తమం అని నేను చెప్పటం లేదు, గమనించగలరు)   ఇక్కడ ఇంకా కామెడీ ఏమిటంటే ఈ అన్నలు పనిచేసే సంస్థల్లోనే ప్రజాస్వామ్యానికి దిక్కు లేదు, ఇక వీళ్ళా ప్రజల గురించి మాట్లాడేది? హవ్వ!
అన్నల కథ సరే ఈ కమ్యూనిజం పరిస్థితి ఏమిటి?  ఇంత వరకూ ఈ దేశం లో వారు చారిత్రక తప్పిదాలు కాక ఇంకేమైనా చేశారా?? అసలు రజాకార్ ఉద్యమం కాక కమ్యూనిస్టులు చేసిన  ప్రొడక్టివ్ ఉద్యమం అంటూ ఏమైనా ఉందా??( ఇక్కడ ప్రొడక్టివ్ అనేది కరెక్ట్ పదం కాదేమో కానీ నాకు అంతకంటే మంచి పదం గుర్తు రావట్లేదు)..   వీళ్ళ ప్రభుత్వాలు ఎక్కడ కాలుమోపుతారో అక్కడ అరాచకాలు, ఆందోళనలు బందులు మట్టీ మశానం..  ఏదో ఆ టూరిజం బాగుంది కాబట్టి సరిపోయింది లేకుంటే కేరళ కూడా బెంగాల్ లా ఎప్పుడో మునిగిపోయేది.. ఈ విషయం చెప్పటానికి నేనేమీ స్టాటిస్టిక్స్ వగైరా చదవక్కరలేదు.. ఒక్కసారి కలకత్తా  ఎయిర్ పోర్టుకు వెళ్ళండి చాలు మీకు తెలుస్తుంది ఆ ఊరు మిగతా దేశం కంటే ఎంత వెనుకబడి ఉందో,     మనదేశం గురించి వదిలేద్దాం అసలు ప్రపంచం లో కమ్యూనిజం వల్ల బాగుపడ్డ దేశాలేవైనా ఉన్నాయా?? నేను అర్థం చేసుకున్నంతలో కమ్యూనిజం వల్ల వ్యక్తులు బాగు పడ్డారు తప్ప సమాజాలు కాదు. ఈ రకంగా చూస్టే కమ్యూనిజం కూ క్యాపిటలిజం కూ ఆట్టే తేడా లేదు.  అక్కడ యజమానులు దోచుకుంటారు ఇక్కడ సదరు నాయకులు దోచుకుంటారు..  దీనికి లెనిన్ కూడా మినహాయింపు కాదు.. ఇలిచ్ వ్యావ్నోవ్ (లెనిన్ అసలు పేరు) అనే పేరుతో ఒక స్విస్ బ్యాంక్ అకౌంట్ ఉండేదని ఒకసారి ఈనాడు బుక్ లో చదివాను..  ఇక స్టాలిన్ లాంటి నిరంకుశ, నరరూప రాక్షసుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఒక స్టాలిన్ ఒక పోల్ పాట్ (ఈ జీవి గురించి ఇక్కడ చదవండి) వగైరా చాలా సులభంగా దొరుకుతారు.. ఇలాంటి వారి మధ్య గంజాయి వనంలో తులసిమొక్కలా ఉండేది ఒక ఫిడేల్ క్యాస్ట్రో మాత్రమే..   
ఇక కమ్యూనిజం వల్ల బాగుపడ్డ దేశాలకోశం వెతికితే ఒక్క దేశం కూడా కనపడదు.. చైనా అని చెప్ప్కండి చైనా చెప్పేదొకటి చేసేదొకటి, వాళ్ళు కమ్యూనిజం వదిలేసి చాలా రోజులయింది.  రష్యాలో మట్టికొట్టుకుని పోయారు, చైనా కమ్యూ"నిష్ఠ" ను వదిలేశారు, ఇక వీళ్ళు ఉండేది ఎక్కడ?    
ఇక నేను చూసిన రెండవ వార్త, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ పోలీసులకు చివాట్లు పెట్టిందట ఆ ఎంకౌంటర్లలో చనిపొయిన వారికి మర్యాదలు జరగటం లేదని.. ఇంకా నయం వాళ్ళకు ప్రభుత్వ సొమ్ముతో సంవత్సరీకాలు, తద్దినాలు పెట్టమని డిమాండ్ చేయలేదు.. అసలు అన్నల చేతిలో చనిపోయే పోలీసులు మనుషులు కారా??  వాళ్ళకు హక్కులుండవా?  ఈపౌర సంఘాలు పోలీసుల మరణాలను కనీశం ఖండించను కూడా ఖండించవు.. మరి అన్నల ముఖాల మీద మాస్కులు వీళ్ళే కదా , ఖండిస్తే పార్టీ నుంచీ పీకేస్తారని భయం కాబోలు.. 
NHRC: Notorious Heinous Rogues committee



నాకు భయమేస్తోంది..

5/30/2010 - రాసింది karthik at Sunday, May 30, 2010
అవును నిజం నాకు భయమేస్తోంది.. కర్ణుడి చావుకి చాలా కారణాలు అలాగే నాకు భయమేయడానికి కూడా చాలానే కారణాలు.. వాటిల్లో కొన్ని ఇవి:

రాకెట్ ఎక్కాలంటే భయం.
ఇప్పుడు రాకెట్ ఎందుకు ఎక్కాలంటారా?? పచారి కొట్టులో ధరలను అందుకోవాలంటే రాకెట్లు, చంద్రయాన్ తప్పేలా లేవు..

రైలు ఎక్కాలంటే భయం.
ఏ అన్నకో కోపం వచ్చి కొన్ని పట్టాలను కోసుకొని పాత సామాన్లకు వేసుంటాడని భయం.

విమానం ఎక్కాలంటే భయం.
టెక్నాలజీ సౌజన్యంతో ఏ లోయలోకో తీసుకెళ్ళి బ్రతికుండగానే తగలబెడతారని భయం.

బస్సు ఎక్కాలన్నా భయం.
ఏ సందు మలుపులోనో పొంచి ఉన్న కరెంటు తీగ సున్నితంగా ముద్దాడి మక్కువ తీర్చుకుంటుందేమోనని భయం.

సాయంత్రం సరదాగా మాల్ కు పోవాలన్నా భయం.
ఏ జిహదీనో పైలెట్ ప్రాజెక్ట్ కింద ఆ మాల్ లో ఒక అరడజను బాంబులు పెట్టుంటాడని భయం.

భక్తి తో గుడికి వెళ్ళాలన్నా భయం.
ఏ గోపురాన్నో కూల్చి ఒకేసారి ముక్తిని ప్రసాదిస్తారని భయం.

ఇల్లు కొనాలంటే భయం.
రేప్పొదున ఏ రాజకీయ రావణుడొ వచ్చి కబ్జా చేస్తాడని భయం.

పత్రికలు చదవాలంటే భయం.
చావులు,రేపులు కాక ఇంకేమీ ఉండవని భయం.

 
ఇంట భయం బయట భయం
ముందు భయం వెనుక భయం
బ్రతుకంతా భయం భయం
ఇంత భయంగా మాట్లాడుతున్న నా పేరు చెప్పలేదు కదూ.. ఇదుగోండి:

మధ్య తరగతి మానవులం!
నిస్సహాయకులం నిష్ప్రయోజనులం!
దరిద్రులం దామోదరులం!
మా చిరునామా స్వార్థం, మా బ్రతుకు వ్యర్థం!
మా నేస్తం స్వప్రయోజనం, మా మరో పేరు మూర్ఖత్వం!
నిర్లక్ష్యం మా చుట్టం, నైరాశ్యం మా నైజం !
శనిదేవుడి సేవకులం, లక్ష్మీ ప్రసన్నత మాకు శూన్యం!
కర్మ భూమిన కుక్కలం, లేదు మాకు ఆత్మ బలం!

-కార్తీక్

ఈ రోజు..

5/24/2010 - రాసింది karthik at Monday, May 24, 2010
సరిగ్గా 26 ఏళ్ళ క్రితం నేను ఈ రోజునే పుట్టాను. అంటే మే 23,1984.

ఇక మే 23 2010 అనేది నాకొక అద్భుతం.. మాటల్లో చెప్పలేని ఆనందం.. పదాలాలో పట్టలేని సంతోషం.. దానికి చాలా కారణాలే ఉన్నాయి.. ఇవన్నీ బ్లాగులో ఎందుకు రాస్తున్నానంటే తర్వాత ఎప్పుడైనా మూడ్ బాలేనప్పుడు చదువుకోవడానికి పనికివస్తుందని.
ఈ రోజు ఎందుకు ఒక అద్భుతం అనేది తెలియాలంటే కింద చదవండి మరి.

నిన్న రాత్రి 12గం: కేక్ కట్ చేశాను..అందులో వింతేముంది అనుకుంటున్నారా?? మరే మామూలు కేక్ ఐతే వింత లేదు.. కానీ ఆ కేక్ మా అమ్మ అదే పని గా బజార్ కు పొయి తెచ్చింది.. తనకు ఈ ఊర్లో మా ఇంటి పక్కన ఉండే కూరగాయల షాప్ తప్పించి ఇంకేమీ తెలీదు.. అలాంటిది బేకరీ ఎక్కడుందో కనుక్కొని మరీ తీసుకొచ్చింది.. తర్వాత అమెరికా నుంచీ రవి ఫోన్ చేశాడు..

ఇవాళ ఉదయం 8గం: మా అమ్మ కు,అమ్మమ్మకు, అక్కా బావలకు పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నాను. పుట్టిన రోజుకు మా అమ్మటో ఉండి అక్షరాలా ఆరు సంవత్సరాలు అయ్యింది..

ఉదయం పదిన్నర: నా మేనల్లుడి అన్నప్రాసన ఫంక్షన్ జరిగింది.. అక్కడ కూడా అన్ని నేనే చూసుకున్నాను.. నిజం మరి, చూస్తూనే ఉన్నాను చెయ్యలేదు :)

సాయంత్రం 5గం: ఆశ్రమం లో సత్సంగ్ కి వెళ్ళను.. చాలా బాగా జరిగింది.. మరియూ పన్నా అనే మామిడికాయ రసం తాగాను.. సూపర్ గా ఉంది.. తర్వాత 6:30 నుంచీ 7:30 వరకూ ఒక గొప్ప చర్చ లో పాల్గొన్నాను.. నా మిత్రులతో, మరియూ అనుభవజ్ఞులతో కలిసి నా పురోగతి అడ్డు పడుత్తున్న కొన్ని ప్రతిబంధకాలను ఎలా దాటలో తెలుసుకున్నాను.. దీని కంటే అద్భుతం ఏమిటంటే సత్సంగ్ తర్వాత గురూజి నుంచీ ఒక బహుమతి నాకొచ్చింది.. అసలు నమ్మలేని విధంగా జరిగింది ఇది.. మామూలుగా పుట్టినరోజు వాళ్ళకి, పెళ్ళిరోజు వాళ్ళకి సత్సంగ్ లో వాళ్ళ చుట్టూ ఉన్నవారు శుభాకాంక్షలు చెబుతారు.. కానీ ఈ రోజు గురూజీ తరఫున కొన్ని బహుమతులు పంచారు.. గత 10 నెలల కాలంలో అలా జరగడం ఇదే తొలిసారి..

సాయంత్రం 7:30గం: మా సుష్మక్కను కలిశాను.. తను ఈ రోజు  ఆర్ట్ ఆఫ్ లివింగ్ టిచర్ ట్రైనింగ్ పూర్తిచేసింది.. మా సుష్మక్క గురించి చెప్పలేదు కదూ.. తను పూర్వజన్మలో నాకు అమ్మ.. దేవుడు మళ్ళీ ఈ జన్మలో కూడా కలిపాడు.. నాకొక రోజు కార్ లో లిఫ్ట్ ఇచ్చింది.. తర్వాత నేను వాళ్ళింట్లో ఫెవికాల్ వేసుకుని స్థిరపడి పోయాను..

వీటి తో పాటు ఇంకా సంతోషం ఏమిటంటే ఈ రోజు నా పాతమిత్రులు చాలామంది ఫోన్ చేసి మాట్లాడారు.. మా ప్రపీసస అధ్యక్షులు కూడా మా సంఘం తరఫున ఒక మంచి కార్డ్ పంపించారు.. ఇవాళ ఫోన్ కూడా చేశారు. ఇవేకాక నా ఇంజినీరింగ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇప్పుడు కడుపుతో ఉండి మాట్లాడను కూడా ఓపిక లేదు.. కాని నా పుట్టిన రోజు గుర్తుపెట్టుకుని మెయిల్ చేసింది..
I repeatedly say that I'm blessed to lead the life I have.. well, can anyone challenge my claim???

-కార్తీక్

"ఘర్షణ" పరిష్కారమా???

5/12/2010 - రాసింది karthik at Wednesday, May 12, 2010
ఈ మధ్య బ్లాగుల్లో జరిగిన కొన్ని చర్చలలో అసమానతలను రూపుమాపడానికి ఘర్షణ తప్పదనే ఒక భావన వ్యక్తమైంది. ఇది నాకు కొంత ఆశ్చర్యం మరికొంత అసహనం కలిగించింది.  ఇది నేను స్త్రీవాదానికో లేక దళితవాదానికో మాత్రమే పరిమితం చేసి ఈ టపా రాయటం లేదు.. కేవలం రెండు  వర్గాల గురించి మాత్రమే చెప్పదల్చుకున్నాను..  ఆ వర్గాలు ఎవరైనా కావచ్చు.. స్వతహాగా నేను ఏ వాదినీ కాదు.. నాకు తెలిసి ఏ అమ్మా అబ్బకు కూడు పెట్టే వాదాలు నాకింతవరకూ కనిపించ లేదు. అది సామ్యవాదమైనా కావచ్చు లేదా స్త్రీవాదమైనా కావచ్చు.
ఇక విషయానికి వస్తే "ఘర్షణ" తో కలిగిన ఏ మార్పూ శాశ్వతంగా నిలబడుతుందని నాకనిపించటం లేదు. ఎందుకంటే ఈ ఘర్షణ వల్ల మరొక వర్గం లో "ఓటమి" అనే బాధ ప్రతీకారాన్ని నూరిపోస్తుంది తప్ప వాళ్ళకు సమానత్వం యొక్క అవసరాన్ని తెలియచెప్పదు. ప్రస్తుతం సమాజానికి కావాల్సింది సహజీవనానికి ఆయువు పట్టు లాంటి ఓర్పు, సహనం. "ఘర్షణ" అనేది ఒకసారి మొదలంటూ అయితే ఇక దానికి అంతం అంటూ ఉంటుందా అనేది నాకు అర్థం కాని విషయం.  ఎందుకంటే దాన్ని ప్రతీ వర్గం వారూ ఒక ఆధిపత్య పోరులా భావిస్తారే తప్ప  సమానత్వానికి దారిలా అంగీకరించరు. సమాజం లో ప్రతీ వ్యక్తీ/వర్గానికీ ఒక ప్రత్యేక స్థానం అంటూ ఉంది.. ఈ "ఘర్షణ" అనే భావజాలం దాన్ని గుర్తించక సదరు వ్యతిరేక వర్గాన్ని కించపరుస్తూ తమ గొప్పతనాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తాయి.. దీనికి ఏ వర్గమూ అతీతం కాదు.. ఇప్పుడు పీడిత వర్గం గా ఉన్నవారు భవిష్యత్తులో పీడించేవారిగా మారరు అని చెప్పలేము.. ఎందుకంటే మన కళ్ళ ముందే ఎన్నో ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం..రేపు ఈ పీడిత వర్గాలకు ఏ హిట్లరో దొరికాడంటే మిగతా వారి పని గోవిందే.. జర్మనీలో యూదుల ఆధిపత్యానికి గండి కొట్టాలనే హిట్లర్  తలంపు దేనికి దారితీసిందో మనకందరికీ తెలుసు. ఆ రోజులలో జర్మన్ సమాజం లోని ఉన్నతమైన పదవులను యూదులు ఆక్రమించారని వారికి వ్యతిరేకంగా హిట్లర్ చేసిన పనులు ఏ సమానత్వాన్ని సాధించాయో ప్రపంచం చూస్తూనే ఉంది..
ఇలాంటిదే మరొక సంఘటన నేను కళ్ళారా చూశాను.. నాకు తెలిసిన మిత్రుడొకరు విడాకులు తీసుకోవాలనుకుంటే అతని భార్య గృహ హింస కింద కేసు పెట్టింది. ఇక్కడ విషయమేమిటంటే ఆ జీవి అప్పుడు అమెరికాలో ఉన్నాడు, వాళ్ళ అమ్మా నాన్నలు బ్రతికిలేరు.. కానీ ఇండియాకు వచ్చిన వెంటనే జెయిలుకైతే వెళ్ళల్సి వచ్చింది.. అంతే కాక అతని మీద ఏడు కేసులు పెట్టిందట కనీసం తన కొడుకును కూడా నాలుగేళ్ళపాటూ చూడనివ్వలేదు :( ఇలాంటిదే ఇంకొక సంఘటన కూడా చూశాను కానీ దాని గురించి బ్లాగులో రాయడం సభ్యత కాదు కాబట్టి రాయడం లేదు.. ఆర్కుట్లో ఉన్న 498ఏ సమూహం లో చూస్తే ఇలాంటివే మరిన్ని తగుల్తాయి..
మరో పక్క మా బంధువుల అమ్మాయిని అత్తగారి వాళ్ళు కిరోసిన్ పోసి చంపేశారు.. బాగా బలిసిన పార్టీ కనుక అది బయటికి రాకుండా మూసేశారు.. ఆ అమ్మాయి తండ్రి మొన్నటి వరకూ కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు..
ఆఖరుగా నేను చెప్పేదేమిటంటే ఇప్పుడు పీడితులుగా ఉన్నవారు అవకాశం అంటూ వస్తే ఇతరులను పీడిచే అవకాశం ఎంతైనా ఉంది..   కనుక ఈ ఘర్షణలు మరొక ఘర్షణకు మార్గం తప్ప మరేమీ కాదు.. మొదటి ప్రపంచ యుద్దం తరువాత జరిగిన వర్సెయిల్స్ ఒప్పదమే రెండవ ప్రపంచ యుద్దానికి నాందిగా నిలిచింది.  
ఇక ఈ ఫలానావాదుల గురించి నేను ఎంత తక్కువ చెబితే అంత మంచిది.. ఉదా:స్త్రీవాదులు. నా జీవితం లో ఇప్పటి వరకూ ఒక్క నిజమైన స్త్రీవాదిని చూడలేదు. అందరూ స్త్రీవాదమనే ముసుగును అవసరానికి వాడుకునే వారే.. కాబట్టి ఎవరైనా స్త్రీవాదులం అని చెప్పుకుంటే నేను నమ్మడానికి కొంచెం సందేహిస్తాను.. 
The need of the hour is enrollment of people into our cause not enforcement.
నేను enrollment(తెలుగుపదం??) అని ఎందుకు చెబుతున్నానంటే అది పని చెయ్యడం ఒక కుటుంబ స్థాయిలో చూశాను కాబట్టి.. వ్యక్తి స్థాయిలో ఫలవంతమైనది సమూహం స్థాయిలో కూడా పనికిరావచ్చు అనేది నా భావన.. దీనికి నా దగ్గర ఆధారాలు, నిరూపిత సాక్ష్యాలు లేవు.  ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఖైదీల కోసం ఒక  కార్యక్రమం నిర్వహిస్తారు. దానిలో వారిని హింసారహిత జీవితం లోకి enroll చేస్తారు తప్ప బలవంత పెట్టరు.. నేను చెప్పేది అలాంటి పరివర్తన. ఆ పరివర్తనకు మూలం enrollment మాత్రమే!!

-కార్తీక్
గమనిక: నేను రేపు పొద్దునే ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళుతున్నాను. కనుక మీ వ్యాఖ్యలకు జవాబివ్వటం కొంత ఆలస్యం కావచ్చు. గమనించగలరు.