సరిగ్గా 26 ఏళ్ళ క్రితం నేను ఈ రోజునే పుట్టాను. అంటే మే 23,1984.
ఇక మే 23 2010 అనేది నాకొక అద్భుతం.. మాటల్లో చెప్పలేని ఆనందం.. పదాలాలో పట్టలేని సంతోషం.. దానికి చాలా కారణాలే ఉన్నాయి.. ఇవన్నీ బ్లాగులో ఎందుకు రాస్తున్నానంటే తర్వాత ఎప్పుడైనా మూడ్ బాలేనప్పుడు చదువుకోవడానికి పనికివస్తుందని.
ఈ రోజు ఎందుకు ఒక అద్భుతం అనేది తెలియాలంటే కింద చదవండి మరి.
నిన్న రాత్రి 12గం: కేక్ కట్ చేశాను..అందులో వింతేముంది అనుకుంటున్నారా?? మరే మామూలు కేక్ ఐతే వింత లేదు.. కానీ ఆ కేక్ మా అమ్మ అదే పని గా బజార్ కు పొయి తెచ్చింది.. తనకు ఈ ఊర్లో మా ఇంటి పక్కన ఉండే కూరగాయల షాప్ తప్పించి ఇంకేమీ తెలీదు.. అలాంటిది బేకరీ ఎక్కడుందో కనుక్కొని మరీ తీసుకొచ్చింది.. తర్వాత అమెరికా నుంచీ రవి ఫోన్ చేశాడు..
ఇవాళ ఉదయం 8గం: మా అమ్మ కు,అమ్మమ్మకు, అక్కా బావలకు పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నాను. పుట్టిన రోజుకు మా అమ్మటో ఉండి అక్షరాలా ఆరు సంవత్సరాలు అయ్యింది..
ఉదయం పదిన్నర: నా మేనల్లుడి అన్నప్రాసన ఫంక్షన్ జరిగింది.. అక్కడ కూడా అన్ని నేనే చూసుకున్నాను.. నిజం మరి, చూస్తూనే ఉన్నాను చెయ్యలేదు :)
సాయంత్రం 5గం: ఆశ్రమం లో సత్సంగ్ కి వెళ్ళను.. చాలా బాగా జరిగింది.. మరియూ పన్నా అనే మామిడికాయ రసం తాగాను.. సూపర్ గా ఉంది.. తర్వాత 6:30 నుంచీ 7:30 వరకూ ఒక గొప్ప చర్చ లో పాల్గొన్నాను.. నా మిత్రులతో, మరియూ అనుభవజ్ఞులతో కలిసి నా పురోగతి అడ్డు పడుత్తున్న కొన్ని ప్రతిబంధకాలను ఎలా దాటలో తెలుసుకున్నాను.. దీని కంటే అద్భుతం ఏమిటంటే సత్సంగ్ తర్వాత గురూజి నుంచీ ఒక బహుమతి నాకొచ్చింది.. అసలు నమ్మలేని విధంగా జరిగింది ఇది.. మామూలుగా పుట్టినరోజు వాళ్ళకి, పెళ్ళిరోజు వాళ్ళకి సత్సంగ్ లో వాళ్ళ చుట్టూ ఉన్నవారు శుభాకాంక్షలు చెబుతారు.. కానీ ఈ రోజు గురూజీ తరఫున కొన్ని బహుమతులు పంచారు.. గత 10 నెలల కాలంలో అలా జరగడం ఇదే తొలిసారి..
సాయంత్రం 7:30గం: మా సుష్మక్కను కలిశాను.. తను ఈ రోజు ఆర్ట్ ఆఫ్ లివింగ్ టిచర్ ట్రైనింగ్ పూర్తిచేసింది.. మా సుష్మక్క గురించి చెప్పలేదు కదూ.. తను పూర్వజన్మలో నాకు అమ్మ.. దేవుడు మళ్ళీ ఈ జన్మలో కూడా కలిపాడు.. నాకొక రోజు కార్ లో లిఫ్ట్ ఇచ్చింది.. తర్వాత నేను వాళ్ళింట్లో ఫెవికాల్ వేసుకుని స్థిరపడి పోయాను..
వీటి తో పాటు ఇంకా సంతోషం ఏమిటంటే ఈ రోజు నా పాతమిత్రులు చాలామంది ఫోన్ చేసి మాట్లాడారు.. మా ప్రపీసస అధ్యక్షులు కూడా మా సంఘం తరఫున ఒక మంచి కార్డ్ పంపించారు.. ఇవాళ ఫోన్ కూడా చేశారు. ఇవేకాక నా ఇంజినీరింగ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇప్పుడు కడుపుతో ఉండి మాట్లాడను కూడా ఓపిక లేదు.. కాని నా పుట్టిన రోజు గుర్తుపెట్టుకుని మెయిల్ చేసింది..
I repeatedly say that I'm blessed to lead the life I have.. well, can anyone challenge my claim???
-కార్తీక్