ఇప్పుడే పడుకునేముందు ఒకసారి వార్తలు చూద్దామని ఐ.బీ.యెన్. ఒపన్ చేశాను. దానిలో రేండు వార్తలు ఒకటి 26మంది రిజర్వ్ పోలీసులను అన్నలు చంపేశారట అసలు ఈ అన్నలగా పిలబడేవాళ్ళు ఎప్పుడైనా మనుషులా ప్రవర్తించారా? నాకు తెలిసి ఎప్పుడు చూసినా వాళ్ళు అక్కడ పట్టాలు కోసేశారు, ఇక్కడ బస్సులు కాల్చేశారు అని తప్ప ఎక్కడైనా ఒక బడి గానీ, అనాధ శరణాలయం గానీ మొదలుపెట్టినట్టు చరిత్రలో ఉందా? నేను సెటైర్ వేయటం లేదండీ బాబూ (ఎంటో ఈ రోజుల్లో ప్రనా అన్నా మంచి పదమైపోతోంది :( ) నిజంగానే అడుగుతున్నాను.. ఎవరికైనా తెలిస్తే చెప్పండి లేదా లింకులివ్వండి.. ఏ చెహోవ్ రచనలు చదవమని, కలరులీడరమ్మ రచనలు చదివి అర్థం చేసుకోమని ఐదు పైసల సలహాలు నాకొద్దు బాబూ, ఆయనే ఉంటే బోడిగుండెందుకని అవి అర్థం అయ్యే ఓపికే ఉంటే బ్లాగులెందుకు .. కామెంట్లు డిసేబుల్ చేసి నేనే ఎంచక్కా నాలగైదు కౌముది లాంటి వెబ్ మ్యాగజైన్లు మొదలుపెట్టేవాడిని.
అన్నల దృష్టిలో మనుషులంటే ఎవరు? పోలీసులతో వాళ్ళకు ఉండేది వర్గ వైరమా లేక అదే వాళ్ళ అస్తిత్వమా? వీళ్ళకంత జనాదరణే ఉంటే అడువుల్లో ఎందుకు ఉంటారు? ఎన్నికలను ఎందుకు బహిష్కరిస్తారు? ఒక ఎన్నికలంటే ఏమో అనుకోవచ్చు.. ప్రతీ ఎన్నికలూ అలవాటుగా బహిష్కరిస్తారు.. అసలు మనదేశం లో ఉన్నంత బలమైనా ప్రజాస్వామ్యం ఎన్ని దేశాలలో ఉంది? (మనమే అత్యుత్తమం అని నేను చెప్పటం లేదు, గమనించగలరు) ఇక్కడ ఇంకా కామెడీ ఏమిటంటే ఈ అన్నలు పనిచేసే సంస్థల్లోనే ప్రజాస్వామ్యానికి దిక్కు లేదు, ఇక వీళ్ళా ప్రజల గురించి మాట్లాడేది? హవ్వ!
అన్నల కథ సరే ఈ కమ్యూనిజం పరిస్థితి ఏమిటి? ఇంత వరకూ ఈ దేశం లో వారు చారిత్రక తప్పిదాలు కాక ఇంకేమైనా చేశారా?? అసలు రజాకార్ ఉద్యమం కాక కమ్యూనిస్టులు చేసిన ప్రొడక్టివ్ ఉద్యమం అంటూ ఏమైనా ఉందా??( ఇక్కడ ప్రొడక్టివ్ అనేది కరెక్ట్ పదం కాదేమో కానీ నాకు అంతకంటే మంచి పదం గుర్తు రావట్లేదు).. వీళ్ళ ప్రభుత్వాలు ఎక్కడ కాలుమోపుతారో అక్కడ అరాచకాలు, ఆందోళనలు బందులు మట్టీ మశానం.. ఏదో ఆ టూరిజం బాగుంది కాబట్టి సరిపోయింది లేకుంటే కేరళ కూడా బెంగాల్ లా ఎప్పుడో మునిగిపోయేది.. ఈ విషయం చెప్పటానికి నేనేమీ స్టాటిస్టిక్స్ వగైరా చదవక్కరలేదు.. ఒక్కసారి కలకత్తా ఎయిర్ పోర్టుకు వెళ్ళండి చాలు మీకు తెలుస్తుంది ఆ ఊరు మిగతా దేశం కంటే ఎంత వెనుకబడి ఉందో, మనదేశం గురించి వదిలేద్దాం అసలు ప్రపంచం లో కమ్యూనిజం వల్ల బాగుపడ్డ దేశాలేవైనా ఉన్నాయా?? నేను అర్థం చేసుకున్నంతలో కమ్యూనిజం వల్ల వ్యక్తులు బాగు పడ్డారు తప్ప సమాజాలు కాదు. ఈ రకంగా చూస్టే కమ్యూనిజం కూ క్యాపిటలిజం కూ ఆట్టే తేడా లేదు. అక్కడ యజమానులు దోచుకుంటారు ఇక్కడ సదరు నాయకులు దోచుకుంటారు.. దీనికి లెనిన్ కూడా మినహాయింపు కాదు.. ఇలిచ్ వ్యావ్నోవ్ (లెనిన్ అసలు పేరు) అనే పేరుతో ఒక స్విస్ బ్యాంక్ అకౌంట్ ఉండేదని ఒకసారి ఈనాడు బుక్ లో చదివాను.. ఇక స్టాలిన్ లాంటి నిరంకుశ, నరరూప రాక్షసుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఒక స్టాలిన్ ఒక పోల్ పాట్ (ఈ జీవి గురించి ఇక్కడ చదవండి) వగైరా చాలా సులభంగా దొరుకుతారు.. ఇలాంటి వారి మధ్య గంజాయి వనంలో తులసిమొక్కలా ఉండేది ఒక ఫిడేల్ క్యాస్ట్రో మాత్రమే..
ఇక కమ్యూనిజం వల్ల బాగుపడ్డ దేశాలకోశం వెతికితే ఒక్క దేశం కూడా కనపడదు.. చైనా అని చెప్ప్కండి చైనా చెప్పేదొకటి చేసేదొకటి, వాళ్ళు కమ్యూనిజం వదిలేసి చాలా రోజులయింది. రష్యాలో మట్టికొట్టుకుని పోయారు, చైనా కమ్యూ"నిష్ఠ" ను వదిలేశారు, ఇక వీళ్ళు ఉండేది ఎక్కడ?
ఇక నేను చూసిన రెండవ వార్త, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ పోలీసులకు చివాట్లు పెట్టిందట ఆ ఎంకౌంటర్లలో చనిపొయిన వారికి మర్యాదలు జరగటం లేదని.. ఇంకా నయం వాళ్ళకు ప్రభుత్వ సొమ్ముతో సంవత్సరీకాలు, తద్దినాలు పెట్టమని డిమాండ్ చేయలేదు.. అసలు అన్నల చేతిలో చనిపోయే పోలీసులు మనుషులు కారా?? వాళ్ళకు హక్కులుండవా? ఈపౌర సంఘాలు పోలీసుల మరణాలను కనీశం ఖండించను కూడా ఖండించవు.. మరి అన్నల ముఖాల మీద మాస్కులు వీళ్ళే కదా , ఖండిస్తే పార్టీ నుంచీ పీకేస్తారని భయం కాబోలు..

NHRC: Notorious Heinous Rogues committee