పెన్ టెర్రరిజం-1

7/04/2010 - రాసింది karthik at Sunday, July 04, 2010
సాధారణంగా ఇలాంటి టపాలు రాయటం నాకంత ఇష్టం ఉండదు. కానీ రోజు రోజుకూ సమాజం లో ఈ పీడ ఎక్కువైపోతోంది అందుకే రాయాల్సివస్తోంది. మూడు సంఘటనలను చూద్దాం:

ఆర్ట్ ఆఫ్ లివింగ్ భూమి గురించి గొడవ:
రెండు రోజుల క్రితం ఎన్.డి.టి.వి. లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారు ఒక ఎన్.ఆర్.ఐ. భూమి కబ్జా చేశారని ఒక వార్త ప్రసారం చేశారు. దాని గురించి ఒక రెండు రోజుల పాటు వాళ్ళ సైట్ లో ఒక చిన్న సెక్షన్ కూడా పెట్టారు. ఆ లంకెను ఇక్కడ నొక్క గలరు.
దాని సారాంశం ఇది:
ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ బెదిరింపులు వస్తున్నాయని కేసు పెట్టిన తరువాత పాల్ అనే ఒక ప్రవాస భారతీయుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ తన భూమిని కబ్జా చేసిందని ఆరోపించాడు. మోహన్ అనే రైతు నుంచీ సదరు పాల్ భూమి ని కొన్నారు. కాని లీగల్ ఫార్మాలిటీస్(తెలుగు పదం??) పూర్తి చేసే లోపు మోహన్ చనిపోయారు. దాని గురించి కోర్టులో కేస్ నడుస్తోంది. ఇంతలో ఆ రైతు కొడుకు ఆ భూమిని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు ఇచ్చాడు. శ్రీశ్రీ రవిశంకర్ ఈ వ్యవహారం సెటిల్ చేద్దామని రెండేళ్ళ క్రితం చెప్పారు కాని ఇప్పుడు ఆ భూమిని మర్చిపొమ్మంటున్నారు అని ఆ ప్రవాస భారతీయుని ఆరోపణ. ఇప్పుడు ఈ విషయంగా ఆ భూమి గురించిన వ్యవహారం సెటిల్ చెయ్యమని ఈ ప్రవాస భారతీయుడు అగ్ని శ్రీధర్ అనే జర్నలిస్ట్ గా మారిన రౌడీ ని అడిగాడట. (మక్కీ కి మక్కీ అనువదించటానికి ప్రయత్నిస్తున్నాను అర్థం అయ్యింది కదా!).. ఇదే వ్యక్తి బెదిరింపులకు దిగుతున్నాడని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ కేసు పెట్టింది.

ఇప్పుడు కొన్ని విషయాలు ఆలోచిద్దాం:
1. భూ కబ్జా అంటే భూమి కొనుక్కోవడమా?? ఆ రైతు కొడుకు ఆ భూమిని అమ్మేస్తే దానికి కబ్జా అనడం ఎంత వరకూ సబబు??
2. 12 సంవత్సరాల క్రితం కొన్న భూమిని 2007 లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు ఇచ్చారు. ఈ మధ్య కాలంలో సదరు ప్రవాస భారతీయుడు సెటిల్చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించలేదు??
3. అసలు కబ్జా అన్న పదం ఈ విషయం లో ఎంతవరకూ కరెక్ట్??
ఇవన్నీ పక్కన పెడితే అసలు సెటిల్ చెయ్యమని జర్నలిస్టును అడగటం ఏమిటి? ఆ జర్నలిస్టేమన్నా ఒక పెద్దమనిషా?? ఇప్పటి వరకూ రౌడిలు ముదిరి రాజకీయ నాయకులు అవుతారు అనుకున్నాను.. కానీ ఇకనుంచీ గూండాలు ముదిరి జర్నలిస్టులు అవుతారని అనుకోవాలేమో..

26/11, రతన్ టాటా సహాయం:
26/11 గురించీ మళ్ళీ సెపరేటుగా చెప్పకర్లేదు. అది జరిగిన తరువాత రతన్ టాటా తన సంస్థ ఉద్యోగులను, ఆ చుట్టు ప్రక్కల ప్రజల్ను ఎలా ఆదుకున్నాడో ఎవరికైనా తెలుసా?? ఆ వివరాల మెయిల్ నాకు ఫార్వర్డ్ గా వచ్చింది. అది మొత్తం అలాగే పెడితే ఈ టపా చాలా పెద్దదైపోతుందని నా ఇంగ్లీష్ బ్లాగ్ లో పెట్టాను.. దాని కోసం ఇక్కడ చూడండి.
ఇంత చేసిన రతన్ టాటా గురించి మన మీడియాలో ఒక్క వార్త కూడా రాలేదు.. యస్పీ గారి కుక్క తప్పి పోయింది, మినిష్టర్ గారి పిల్లి చచ్చిపోయింది లాంటి వార్తల కంటే ఇది తీసిపోయిందా?? ( నేను స్వతహాగా టాటాల అభిమానిని నాదృష్టిలో జాతిపితగా గాంధీ కంటే జమ్షడ్జీ టాటా ను పెట్టాల్సింది అని నా అభిప్రాయం. ప్రస్తుతం ఆ చర్చ ఇక్కడ వద్దు.)

యెం.యెఫ్.హుసేన్ జలుబు - ది హిందు పత్రిక తుమ్ములు:
యెం యెఫ్ హుసేన్ కతార్ పోతానంటే ది హిందు పత్రిక యాజమాన్యం చొంగ కార్చుడు చేష్టలు చూశి ఒళ్ళు మండి వాళ్ళకు ఒక మెయిల్ చేశాను. అది కనీసం వాళ్ళ రీడర్స్ ఒపీనియన్ లో వెయ్యను కూడా లేదు. ముందు నా మెయిల్ చూడండి :
Dear Sir,

This is in response to the article by Mr. N. Ram about M.F. Husain. I request you to publish this in the reader's response section.

I fail to understand how Husain's episode is a sorriest chapter in independent secular India. In a country like India where religion is a sensitive issue he should not have gone to hurt others' sentiments. The claim that he loves his country of birth never looked convincing. If he is so keen to be in India then he should learn to respect his fellow Indian's sentiments.

"He breathes the spirit of modernity, progress and tolerance": Does modernity mean offending others?? Does progress mean spoiling harmony by paintings?? And any high school going child can say tolerance never mean "Attacking others". I wonder why The Hindu is so keen in making a issue out of this trivial happening.

Overall the article stands as a new low touched by The Hindu

My Address:

Karthikeya Indrakanti

ఇక్కడ నేను చెప్పేది వాళ్ళు నా మెయిల్ వెయ్యలేదని కాదు. అసలు ఆ ముసలి నక్కను విమర్సిస్తూ ఒక్క అభిప్రాయం కూడా ప్రచురించలేదు. ఇది దిగజారుడు జర్నలిజం. ప్రజల నాడిని అలాగే చూపించడం పత్రికల ధర్మం (పిల్లల గురించి, దేశ రహస్యాలను గురించి కొన్ని మినహాయింపులు ఉన్నాయి). మరీ దేశం మొత్తం ఆ నక్కను గురించి బాధపడుతున్నారని చూపించడం పైత్యం కాక మరేమిటి??
if The Hindu mgt declares itself as a money making organization what they did is fine. but doing these kind of things they dont deserve to talk about things like "Freedom of speech, liberty etc etc"


ఇప్పుడు మరొక సంఘటన చెబుతాను:
2006లో నేను కులదీప్ నయ్యర్ గారిని మా కేంపస్ లో కలిశాను. అపుడు నేను రెండు ప్రశ్నలు అడిగాను:
1. న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం కలిగించడం ఎలా?
2. పత్రికలలో వచ్చేది నిజమని ఎలా నమ్మడం?
ఆయన సమాధానం: " నాకూ తెలీదు, నా మితృలలో కొందరు ప్రెస్ మీట్ కు హాజరయ్యి సరిగ్గా నోట్స్ కూడా రాసుకోరు. ఆ కాఫీ, బిస్కేట్లు ముగించి వాళ్ళకు బుద్ది పుట్టింది ఏదో ఒకటి రాస్తుంటారు" (ఆయన చెప్పిన భావం ఇదే, అనువదింపు దోషాలు గట్రా ఉండొచ్చు)

కొసమెరుపు: మా బంధువులలో ఒక వ్యక్తి మునుపు కేబుల్ టీవీ వ్యాపారం చేసేవాడు ఇప్పుడు జర్నలిస్టుగా మారి మునుపటికంటే ఎక్కువే సంపాదిస్తున్నాడు. ఖర్చులు చాలా తగ్గాయి.. పేపర్లో రాస్తానని బెదిరించి చౌక డిపోల నుంచీ ఇంటికి కావాల్సినవన్నీ తెచ్చుకుంటే ఖర్చులు తగ్గవా చెప్పండి??

ఇది నేటి జర్నలిజం!
అసలు ఈ విషయం గురించి ఒక టపా తో సరిపుచ్చుదామనుకున్నాను కానీ ఇప్పుడే ఒక మితృనితో మాట్లాడాక ఒక సీరీస్ గా 2-3 రాస్తే బాగుంటుందనిపిస్తోంది. మరికొంత పెన్ టెర్రరిజం గురించి మరొక టపాలో..

-కార్తీక్