గత ఏడాది కాలంగా బ్లాగుల్లో బులుసేరియా అనే వ్యాధి బహు వేగంగా వ్యాపిస్తోందని ఇంటెలిజెన్స్ సమాచారం.. ఈ వ్యాధి లక్షణాలు ఏమిటి??వాటిని మొదట్లోనే తుంచేయడం ఎలా?? అసలు ఈ వ్యాధి కి గల కారణాలు ఏమిటి?? అనే విషయాల పై కొంత తిరిగిశోధన(re-search) చేసి ఈ క్రింది లక్షణాలు కలవారు బులుసేరియా వ్యాధిగ్రస్తులని నిర్ణయించడం జరిగింది..
1. ఏ వాస్తు జ్యోతిష్యాల గురించిన ప్రకటన చూసినా ఈ క్రింది వాక్యం గుర్తొచ్చి నవ్వడం..
1. ఏ వాస్తు జ్యోతిష్యాల గురించిన ప్రకటన చూసినా ఈ క్రింది వాక్యం గుర్తొచ్చి నవ్వడం..
>>ఆతర్వాత ఎ.సి తీసికెళ్ళి బాత్ రూములో పెట్ట౦డి. బెడ్ రూము ఒక అడుగు లోతు తవ్వి౦చ౦డి. బెడ్ రూములో మీమ౦చ౦ నాలుగు కోళ్ళలో రె౦డు సగానికి విరగ కొట్టి౦చ౦డి.
2. స్కూలుకుపొయ్యే ఏ చంటి పిల్లోడిని చూసినా ఈ క్రింది విషయం గుర్తొచ్చి ఎక్కడ ఉన్నామో కూడా చూసుకోకుండా పగలబడి నవ్వడం.
2. స్కూలుకుపొయ్యే ఏ చంటి పిల్లోడిని చూసినా ఈ క్రింది విషయం గుర్తొచ్చి ఎక్కడ ఉన్నామో కూడా చూసుకోకుండా పగలబడి నవ్వడం.
>>తోడన్ నే తోడలేక ఛస్తుంటే తోకలాగ తోన్ ఏమిటిరా అని ఏడ్చేవాడు మాబండోడు.
3. కాంఫరెన్స్ రూం లో మీటింగ్ ఉన్నప్పుడు బాసు పక్కనే ఉన్నా కూడా ఈ క్రింది వాక్యం గుర్తొచ్చి పళ్ళికిలించడం..
3. కాంఫరెన్స్ రూం లో మీటింగ్ ఉన్నప్పుడు బాసు పక్కనే ఉన్నా కూడా ఈ క్రింది వాక్యం గుర్తొచ్చి పళ్ళికిలించడం..
>>బాసింపట్టు వేసుకొని రెండు చేతులు వళ్ళో పెట్టుకొని కళ్ళుమూసుకొని ఘృతాచి మీద మనసు లగ్నం చేసి కూర్చుంటాను.
4.ఏ భార్యా భర్తాలు మాట్లాడుకుంటున్నా ఈ క్రింది విషయాలు గుర్తొచ్చి ముసిముసిగా నవ్వడం.. వాళ్ళు సీరియస్ గా చూస్తే ఏం చెప్పాలో అర్థం కాక తింగరి ఫేస్ పెట్టడం :(
4.ఏ భార్యా భర్తాలు మాట్లాడుకుంటున్నా ఈ క్రింది విషయాలు గుర్తొచ్చి ముసిముసిగా నవ్వడం.. వాళ్ళు సీరియస్ గా చూస్తే ఏం చెప్పాలో అర్థం కాక తింగరి ఫేస్ పెట్టడం :(
>>ఉద్యమిస్తే పొయేది ఏమీలేదు భార్య తప్ప పద౦డి ము౦దుకు పద౦డి పద౦డి.
5.పార్కుల్లో, మాల్స్ లో ఒక అమ్మాయి &అబ్బాయి కనిపిస్తే ఈ క్రింది వాక్యాలు గుర్తు రావడం.. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలిసే ఉంటుంది..
5.పార్కుల్లో, మాల్స్ లో ఒక అమ్మాయి &అబ్బాయి కనిపిస్తే ఈ క్రింది వాక్యాలు గుర్తు రావడం.. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలిసే ఉంటుంది..
>>“ఐ యామ్ తెగ లవింగ్ యు డార్జిలింగ్, సిమ్లా, కులుమనాలి”
6. Appraisal Discussionలో క్రింది పద్యం చెప్పుకోవాలనిపించడం.. అంత సీరియస్ టైం లో నవ్వాపుకోలేకపోవడం
6. Appraisal Discussionలో క్రింది పద్యం చెప్పుకోవాలనిపించడం.. అంత సీరియస్ టైం లో నవ్వాపుకోలేకపోవడం
>>లావొక్కింతయు లేదు, ఎవనిచే జనించు, కానరార కైలాస నివాస, అంటూ పద్యాలు, పాటలు పాడుకుంటున్నాను లోలోపల.
7. అమ్మా నాన్నలతో ఎప్పుడు మాట్లాడినా ఈ క్రింది వాక్యం గుర్తుకు వచ్చి "హహహ" అని వికట్టాట్టహాసం చెయ్యడం..
7. అమ్మా నాన్నలతో ఎప్పుడు మాట్లాడినా ఈ క్రింది వాక్యం గుర్తుకు వచ్చి "హహహ" అని వికట్టాట్టహాసం చెయ్యడం..
>>అయినా ఈ తల్లిదండ్రులకు, ఇల్లా పిల్లలని ముఖ్యంగా మగపిల్లలని సంసార కూపంలో పడవేసి వాళ్ళు మునగలేక, తేలలేక ’హే కృష్ణా, ముకుందా, మురారీ’ అని పాడుతుంటే విని ఆనందించాలనే బలీయమైన కోరిక ఎందుకు కలుగుతుందో నాకు అర్ధం కాదు
8. పెళ్ళిల్లలో నగలు దిగేసుకున్న జనాలను చూసి ఈ క్రింది వాక్యం గుర్తుకురావడం.. నవ్వితే ఏదో ఘోరాం చేసినట్టు వాళ్ళు చూడటం
8. పెళ్ళిల్లలో నగలు దిగేసుకున్న జనాలను చూసి ఈ క్రింది వాక్యం గుర్తుకురావడం.. నవ్వితే ఏదో ఘోరాం చేసినట్టు వాళ్ళు చూడటం
>>కదిలే మార్వాడీ కొట్టు లాగ అడుగులో అడుగు వేసుకుంటూ, బంగారం వాసన వేస్తూ తిరిగే మహిళా మణుల మధ్య నించి, నన్ను లాక్కేళ్ళి అబ్బాయి దగ్గర దిగపెట్టేడు.
వీటన్నిటినీ మించి నా ఫేవరేట్ టపా మాత్రం ఇదే "మీ ఆయన మిమ్మలని ఎంతగా ప్రేమిస్తున్నాడు?" ఇప్పటికి కనీసం 30 సార్లు చదివుంటాను.. :D అసలు మనల్ని ఇంతగా వెంటాడిన బులుసుగారిని కిడ్నాప్ చేస్తే ఎలాఉంటుంది అని ఆలోచించా.. ఏలూరులో ఉన్నానని మాష్టారు చెప్పేశారు కనుక ఇక మిగిలింది సూమోలను దించడమే అనుకున్నా.. కానీ ఆ తర్వాత మోకాల్లో బల్బు వెలిగింది.. తీరా అక్కడికెళ్ళాక ఈయన ఇంకెన్ని విషయాలు చెప్పేస్తారో అసలు కిడ్నాప్ చేసేలోపు మనం నవ్వి నవ్వి సృహ తప్పచ్చేమో అని డౌట్ వచ్చింది.. అందుకని భయపడి ఆ ప్రాజెక్ట్ వదిలేశా.. సీమ లో పుట్టినందుకు ఒక్కటైనా ఫ్యాక్షన్ పని చేద్దామనుకున్నా..
చీ! నాకోరిక ఇలా మట్టికొట్టుక్పోయింది :(
కాబట్టి కామ్రెడ్స్ నేను చెప్పేదేమిటంటే బ్లాగుల్లో ప్రస్తుతం ఉన్నవి రెండు వర్గాలు:
1. బులుసేరియా బాధితులు
2. కాదని అబద్దం చెప్పేవాళ్ళు
మీరే వర్గం వారో మీరే తేల్చుకోండి.. నేను మాత్రం మొదటి వర్గం ఒప్పేసుకుంటున్నా!

గమనిక: సెలయేరులా మొదలైన బులుసుగారి నవ్వులప్రవాహం జీవనదిలా మారి మనందరినీ తడిపిముంచెత్తింది.. ఆ హాస్యపు జల్లు మొదలై వచ్చే వారానికి(14 జూన్) ఒక ఏడాది.. ఆ రోజు నాకు పోస్ట్ వెయ్యడం కుదరకపోవచ్చు అందుకని కూసింత ముందుగానే రాస్తున్నా.. హిహిహి!!