లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఎలా?

2/20/2009 - రాసింది karthik at Friday, February 20, 2009
మా రూమ్మేటుకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. పెళ్ళి ప్రస్తావనల పేరు మీద జరుగుతున్న అఘాయిత్యాలు* తట్టుకోలేక లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఈ పాట్లు ఉండవని నిట్టూర్చాడు. ( పూర్తిగా హిందీ లో , అతను బీహారీ కదా! ) అప్పుడు నేను తల ఎత్తి ఆకాశం లోకి చూస్తూ దీర్ఘంగా ఆలోచించాను. మునుపటి నా టపా చదివిన అందరికీ తెలుసు నేను అలా ఆలోచిస్తే నాకు ఎలాంటి అవిడియాలు వస్తాయని. కొంత సేపు అలా ఆలోచించాక అంటే పుర్తీగా చించాక నాకొచ్చిన అవిడియాలు తలుచుకుంటే గర్వంతో కూడిన సంతోషం కలిగింది. ఆ అవిడియాలు మాత్రం ఎవ్వరికీ చెప్పకూడదు అని అనుకున్నా. కాని పొద్దున లేచి ఘంటసాల గారి భగవద్గీత వింటే "పుట్టిన వారు మరణించక తప్పదు" అని చెప్పారు. అంత పెద్దాయన చెప్తే నిజమే అయ్యుంటుందని, ఎలాగూ మరణిస్తాం కద, నాలగు కాలాల పాటు నిలిచిపొయ్యె పనులు చెయ్యాలని ఇదొ ఈ టపా రాస్తున్నా. ముందుగా ఈ టపా అందరి గురించి కాదు. కేవలం అబ్బాఇయిలకు మాత్రమే!! ఇంత డైరెక్ట్ గా చెప్తే అమ్మాయిలు బాధపడతారు అందుకని ఇలా చెప్తున్నా: తమ వయసు 5 సంవత్సరాల తక్కువ చెప్పుకునేవారు ఈ టపా చదవకండి. ( ఇంక ఆడ పురుగు కూడా ఈ కింది విషయాలు చదవలేదు :) :) )

మగ పుంగవులారా కాస్కోండి...
మొదటిది: నచ్చిన అమ్మాయికి ప్రపొజ్ చెయ్యడమే!! కానీ ఇక్కడ ఉన్న పెద్ద చిక్కెందంటే మనకు రొజుకు ఇద్దరు ముగ్గురు నచ్చుతుంటారు. ఆ లెక్కన అంత మందికి ప్రపోజ్ చేస్తే పోలీసులు గూండా చట్టం కింద అరెస్ట్ చేస్తారు. కాబట్టి మీకు నచ్చిన వాళ్ళ పేర్లు ఒక కాగితం మీద రాసి ఒక చీమను పట్టుకుని, నా పేరు చెప్పి ఆ కాగితం మీద వదలండి. అది ఏ అమ్మయి దగ్గర అగుతుందొ, ఆ అమ్మాయికి ప్రపొజ్ చెయ్యండి. మీ అదౄష్టం బాగుండి ఏ ఐశ్వర్య రాయొ లెక బిపాశా బాసూనో తగిలితే వెంటనే బొంబాయికి రైల్ ఎక్కేయండి. హ్యాప్పీ జర్నీ అండ్ ఆల్ ద బెస్ట్!!

రెండవది: ఇది చీమలు పట్టలేని వారికి. మరేమీ మొహమాట పడకుండా, ఒక నలుగురైదుగురికి ప్రపొజ్ చెయ్యండి. ఇప్పుడు ఈ నలుగురైదుగురిలో ఎవరో ఒకరు సీరియస్ అయ్యి వాళ్ళ ఇంట్లో చెప్తారు. వెంటనే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి మిమ్మల్ని చితక్కొట్టి పెళ్ళి చేయిస్తారు. చూడండి ఎంత సింపులో!! వెంటనే కానీయ్యండి. ( గమనిక: ఇది బాడీ బిల్డర్లకు మాత్రమే!! )

మూడవది: ఇంట్లో తెలీకుండా, ఏ మ్యారేజ్ బ్యురో వాడి కాళ్ళూ గడ్డాలూ పట్టుకుని పెళ్ళీ చేసుకుని అందరికి లవ్ మ్యారేజ్ అని చెప్పుకోవడం.. అంతే మరి!! చీమలు పట్టనూరాక, బాడీ బిల్డింగూ చెయ్యకపోతే ఏ బ్యురో వాడో దయతలచి మనల్ని ఉద్దరించాలి.

నాలుగవది: అన్నిట్లోకీ ఇదే సింపుల్. పైన చెప్పిన మూడూ పని చెయ్యకపోతే మీరు వెంటనే హిమాలయాలకు పొయ్యి ఏ ఆడ సన్యాసినినో చూసుకొండి.

ఐదవది: ఆడ సన్యాసి కూడా మనకు దొరకలేదా మహాశయా?? ఒక పని చెయ్యండి. వెంటనే ఇంట్లో వాళ్ళను పెళ్ళి సంబంధాలు చూడమనండి.

నాకు తెలుసు ఇన్ని గొప్ప విషయాలు విన్న తరువాత మీకు నా కాళ్ళు పట్టుకుని గురువా! అని అనాలనిపిస్తొందని!! కానీ నేను పొగడ్తలను పెద్దగా ఇష్టపడను. కనుక, ప్రస్తుతానికి వ్యాఖ్యలు రాసి మీ ముచ్చట తీర్చుకోండి.
*అఘాయిత్యాలు=రోజూ అర్ధరాత్రి అంటే 0600 గం. లకు నిద్ర లేస్తావా అని అడగడం, ఎక్సర్సైజు చేస్తావా అని అడగడం లాంటివి.

గమనిక: ఈ రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తే చాలా బోరుగా అనిపించింది. ఏదో ఒకటి రాద్దాం అని ఇది రాశాను. ఎవ్వరిని కించపరిచే ఉద్దేస్యం నాకు లేదు.