ప్రేమ "గాయం"

6/09/2009 - రాసింది karthik at Tuesday, June 09, 2009
ఈ మధ్య ఆఫిస్ నుంచి త్వరగా ఇంటికి వస్తున్నా(అంటే 9గం. లకు వస్తున్నా). ఈ రోజు కూడా అలాగే వచ్చి ఏదో ఆలోచిస్తుంటే ఒక అవిడియా వచ్చింది. ఒకవేళ ఎవరైనా అబ్బాయికి బ్లాగుల్లో అమ్మాయి దొరికితే ఆ బ్లాగు ప్రేమను ఎలా చెప్తాడు అని ఒక డౌట్ వచ్చింది. అప్పుడు రాసిందే ఈ ప్రేమ "గాయం" సారీ "గేయం".

నేనొక బ్లాగు పిశాచిని నీవొక కూడలి వాసివి.
నా బ్లాగే నిండనిది నీ సైటే కదలనిది.

నేనొక బ్లాగు పిశాచిని నీవొక కూడలి వాసివి.
నా బ్లాగే నిండనిది నీ సైటే కదలనిది.
నేనొక బ్లాగు పిశాచిని

బ్లాగు మూసిన బ్లాగరింటనే లాగిన్ అయ్యి నిలుచున్నా
క్లిక్కి క్లిక్కి రిప్లై రాక లాగాఫ్ అయ్యి వెళుతున్నా
బ్లాగు మూసిన బ్లాగరింటనే లాగిన్ అయ్యి నిలుచున్నా
క్లిక్కి క్లిక్కి రిప్లై రాక లాగాఫ్ అయ్యి వెళుతున్నా
నా బ్లాగే నిండనిది నీ సైటే కదలనిది.
నేనొక బ్లాగు పిశాచిని

బ్లాగుకు సైటు సైటుకు బ్లాగు పలికే ఆడాన్సూ
ఫ్యుజు కాలిన ల్యాప్టాప్ కు చెబుతున్నా నీ మెయిల్ కు చేరితే చాలు
నీ ఆర్కైవుల ఫోల్డర్ లో నన్నెపుడో చూస్తావు
నా మెయిలు చూశానని చెప్పేలోపు డిలీటై పోతాను.

నేనొక బ్లాగు పిశాచిని నీవొక కూడలి వాసివి.
నా బ్లాగే నిండనిది నీ సైటే కదలనిది.
నేనొక బ్లాగు పిశాచిని

ఆత్రేయగారికి శతకోటి క్షమాపణలతో..
ఆయన అభిమానకోటిలో ఒక సైకతరేణువు...

-కార్తీక్

రైలోపాఖ్యానం

6/06/2009 - రాసింది karthik at Saturday, June 06, 2009
మా అమ్మమ్మా వాళ్ళ ఊరిలో రైల్వే స్టేషన్ మా ఇంటి పక్కనే ఉండేది. అందువల్ల చిన్నప్పుడు కూ చికు చికు అని శబ్దం వినిపించిన వెంటనే అరుగెక్కి స్టేషన్ వైపు చూసేవాడిని. కొన్ని రోజుల తర్వాత మా మామా వాళ్ళు ఏ రైల్ వచ్చినా కార్తీక్! నీ డార్లింగ్ వచ్చింది అని అరిచేవాళ్ళు. అలా అరిచినందుకైనా నన్ను ఎప్పుడు రైల్ దగ్గరికి తీసుకొని పోతారేమో అని అనుకునేవాడిని. కానీ వాళ్ళ డిక్షనరీ లో కనికరం అనే పదమే లేదు. దిష్టి తగులుతుంది అనే కారణం చెప్పి ఎప్పుడూ ఇంట్లోనే ఉంచే వాళ్ళు. ఇంక మా ఊరిలో రైల్వే స్టేషన్ ఉంది అనే విషయం నాకు చాలా రొజుల వరకు తెలీదు. అందువల్ల చాలా కాలం రైలు ఎక్కే చాన్స్ దొరకలేదు. ఇదంతా మా ఇంట్లో వాళ్ళ కుట్ర అని నా బలమైన నమ్మకం. ఎందుకంటే మా నాన్న గత 35 సం.లుగా అర్.టి.సి. లో పని చేస్తున్నారు. కాబట్టి దీని వెనుక ఆయన పాత్ర ఉండొచ్చు.
************************************************
అర్.టి.సి. ప్రస్తావన ఎలాగూ వచ్చింది కాబట్టి ఒక చిన్న జీ.కే. ప్రశ్న (ఐ.ఏ.యస్. ,ఐ.పీ.యస్. రాసే వాళ్ళు తప్పకుండా తెలుసుకోవలసినది):
ప్ర: ఏ.పీ.యస్.ఆర్.టి.సీ. అంటే ఏమిటి?
జ: ఆగితే(A) పోదు(P) సమయానికి(S) రాదు(R) టైముకు(T) చేరదు(C).
************************************************
ఇలాంటి కుట్రలు, కుతంత్రాల నడుమ ఎలాగైతేనేమి 1997 లో మొదటిసారిగా రైలెక్కాను. ఆ తర్వాత అప్పుడప్ప్డూ రైల్ ఎక్కేవాడిని. ఇలా ఉండగా ఇంజినీరింగ్ థర్ద్ యియర్లో ఇండియన్ ఆర్మీ టెక్నికల్ స్ట్రీం ఇంటర్వ్యువ్ అని చెప్పి ఆలహాబాద్ కు వెళ్ళాను. అక్కడ ఆ టెస్ట్ ఎన్ని రొజులు ఉంటుందో కరెక్ట్ గా తెలీదు. కానీ మనం అప్ప్లై చెయ్యటం ఫెయిల్ కావటమా??? చరిత్రలో లేదు అని రిజర్వేషన్ చెయ్యించుకోలేదు. తీరా అక్కడికి వేళ్ళాక మనం మొదటి రౌండ్లోనే వెనక్కి వచ్చేశాం. ఇప్పుడు అలాహాబాద్ నుంచీ వెనక్కు రావడం ఎలా?? మనలాంటి వారూ, మన జాతి వారూ (తెలుగు జాతి) ఇంకొందరు ఉండటం వల్ల అందరం కలిసి వెయిటింగ్ లిస్ట్ టికెట్ మీద పాట్నా నుంచి హైదరాబాద్ వచ్చే రైలెక్కేశాం. ప్రయాణం పేరు మీద మన సర్కారు చేస్తున్న దురాగతాలు అప్పుడు తెలిసొచ్చాయి. నిల్చుకోవడానికి కూడా స్థలం లేదు. ఫుట్ బోర్డ్ మీద కూర్చొని ప్రయాణం చేశాను. ఆ తర్వాత కూడా నాకు రైళ్ళ మీద లవ్వు తగ్గ లేదు. ఆ తర్వాత సంవత్సరం ఇంటర్వ్యువ్ కని కడప నుంచీ బొంబయికి, అక్కడి నుంచీ కాన్ పుర్ కి, అక్కడి నుంచి డిల్లీ కి వెళ్ళాల్సి ఉంది. నాది అసలే బంపర్ జాక్ పాట్ జాతకం కద అందుకని అన్ని వెయిటింగ్ లిస్ట్ టికెట్ మీదనే ప్రయాణం చేశాను. ఇంక చూసుకోండి, ఆహా నా రాజా! కళ్ళు నిజంగానే కాయలు కట్టాయి. ఎంత విసుగొచ్చిందంటే, డిల్లీకి పోకుండానే వెనక్కు వచ్చేశాను. హైదరాబాద్ చేరాక మా అక్కకు చెప్పిన మొదటి విషయం ఏమిటంటే "మనం ఇంటికి బస్సులో పోదాం" అని. ఆ తర్వాత కూడా గౌ. భా.రై. వారు వీలు దొరికినప్పుడల్లా నా జీవితంతో ఆడుకుంటూనే ఉన్నారు. కాన్ పూర్ లొ ఉన్న రెండు సంవత్సరాలు ప్లాన్ చేసుకొని ఇంటికి వచ్చేవాడిని కనుక పెద్ద సమస్య కాలేదు. మధ్యలో ఒక సారి అహమ్మదాబాదుకు వెళ్ళాను. అప్పుడు ఆ రైలు 12 గం. లేట్ వచ్చి నా సెమిస్టర్ రిజిస్ట్రేషన్ ప్రాబ్లం అయ్యింది. ఇలాంటి అనుభవాల నడుమ ఇప్పుడు రైలెక్కాలి అంటే భయం వేస్తోంది. వచ్చే వారం హైదరాబాదుకు వెళ్ళడానికి రైలుకే వేళుతున్నాను. ఎలా వస్తానో ఏమో???
ఇవ్వన్నీ చూశాక ఒక చిన్న పాట రాశాను:

ఇరుకుపెట్టెలో.....
పిచ్చిరషులొ......
.........................................................................

ఇరుకుపెట్టెలో పిచ్చిరషులొ రైలు ప్రయాణం.
స్టేషన్ ఎక్కడో స్టాపు ఎప్పుడో తెలియదు పాపం. తెలియదు పాపం..
ఇరుకుపెట్టెలో పిచ్చిరషులొ రైలు ప్రయాణం.
స్టేషన్ ఎక్కడో స్టాపు ఎప్పుడో తెలియదు పాపం. తెలియదు పాపం
ఒహొ హో ఒహొ హో ఓహొ హొ హో

ఇది భారత రైల్వే అని తెలుసు, అది సింగిల్ లైన్ అని తెలుసు
ఇది భారత రైల్వే అని తెలుసు, అది సింగిల్ లైన్ అని తెలుసు
భారత రైల్వేలో సింగిల్ లైన్లో సాగలేననీ తెలుసు
ఇటు సీట్లు లేవనీ తెలుసు అటు టైం లేదనీ తెలుసు
ఇటు సీట్లు లేవనీ తెలుసు అటు టైం లేదనీ తెలుసు
సీట్లు ఉన్ననూ, టైము ఉన్ననూ ఫైను తప్పదని తెలుసు
ఐనా రైలు ప్రయాణం...
స్టేషన్ ఎక్కడో స్టాపు ఎప్పుడో తెలియదు పాపం. తెలియదు పాపం..
ఒహొ హో ఒహొ హో ఓహొ హొ హో

ఇది టికెటూ డబ్బుల ఆరాటం.. అది సీటు బెర్తుల చెలగాటం
ఇది టికెటూ డబ్బుల ఆరాటం.. అది సీటు బెర్తుల చెలగాటం
టికెటు జారినా బెర్తు పోయినా ఆగదు జీవిత పోరాటం.
ఇది ఇంజిన్ బోగిల పోరాటం. అది డబ్బూ టైమూ చెలగాటం
ఇది ఇంజిన్ బోగిల పోరాటం. అది డబ్బూ టైమూ చెలగాటం
ఇంజిన్ ఫెయిలు అయి..టైము వేస్టు అయి బ్రతుకుతున్నది ఒక శవం.
ఐనా రైలు ప్రయాణం...
స్టేషన్ ఎక్కడో స్టాపు ఎప్పుడో తెలియదు పాపం. తెలియదు పాపం..

ఇరుకుపెట్టెలో పిచ్చిరషులొ రైలు ప్రయాణం.
స్టేషన్ ఎక్కడో స్టాపు ఎప్పుడో తెలియదు పాపం. తెలియదు పాపం..
ఒహొ హో ఒహొ హో ఓహొ హొ హో

-కార్తీక్


కిక్: వద్దు బాబోయ్!

5/24/2009 - రాసింది karthik at Sunday, May 24, 2009
పొయిన వారం ఇంటికి పొయినప్పుడు మా కజిన్స్ తో కలిసి కిక్ అనే సినిమా చూశాను. మామూలుగా ఏ సినిమాకు పోవాలి అనేది మా అక్కనే డిసైడ్ చేస్తుంది. కానీ ఈ సారి తనకు ఆ చాన్స్ ఇవ్వకుండా నేనే కిక్ సినిమాకు వేళదాము అని చెప్పి తీసుకుపోయాను. లేటుగా పోతే టికెట్లు దొరకవని 15 నిమిషాలు తొందరగానే వెళ్ళాము.("అరుంధతి" కి లేటుగా వెళ్ళి "నచ్చావులే" చూశాము. ఆ దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదు) సినిమా మొదలవుతూనే ఇలియాన చిన్న చిన్న బట్టలు వేసుకుని భారతదేశం లోని బీదరికాన్నంతా చూపించింది. నాకు తెలియక అడుగుతాను యోగా చెయ్యాలి అంటే చిన్న చిన్న బట్టలు వేసుకోవాడం అవసరమా? (బాబా రాందేవ్ కూడా చిన్న చిన్న బట్టలు వేసుకుంటాడు అంటే నేను సమధానం చెప్పలేను) ఇంక కథ కొద్దిగా మొదలవుతూనే మనకు అర్థం అయిపోతుంది, ఇది రవితేజ మార్కు ఒవెర్ యాక్షన్ కథ అని. "విక్రమార్కుడు" లో అత్తిలిసత్తి క్యారెక్టర్ హిట్ అయ్యాక అన్ని సినిమాలు అలానే ఉంటున్నాయి కాబట్టి కథ గురించి పెద్దగా అలోచించకుండా దర్శకుడు ఒక 3-4 కామెడీ క్యారెక్టర్లు పెట్టి బండి లాగించాడు. ఎందుకంటే వాళ్ళూ లేక పోతే మొదలైన 15నిమషాలకే ఇంటర్వెల్ ఇవ్వాల్సి వచ్చేది. ఇక్కడి దాకా సినిమా చూశాక నాకు ఒక డౌట్ వచ్చింది : ఆంధ్రదేశం లో అమ్మాయిలు అంత సులభంగా అన్ని బూతులు మాట్లాడుతున్నారా? (నేను ఆంధ్ర వదిలి నాలగేళ్ళైంది కాబట్టి అడుగుతున్నాను.దేవుడి పాలనలో ఇట్ల కూడా డెవలప్ అయ్యామా????) ఎందుకంటే, ఇలియానా ప్రతి సీన్ లో హీరో వంశవృక్షాన్ని పెళ్ళగిస్తూనే ఉంది మరి!

ఇంకొక ముఖ్య విషయం ఈ సినిమాలోని పోలిస్-దొంగ చేజింగులు,ఫైట్లు. ఏమాత్రం మోహమాటం లేకుండా అవన్నీ ధూం-2 నుంచీ, ఇంకా కొన్ని ఇంగ్లీష్ సినిమాల నుంచీ కాపీ కొట్టాడు, సారీ స్పూర్తి పొందాడు. ఇంక సెకండ్ పార్ట్ లో ఒక చెత్త ఫ్లాష్ బ్యాక్ దానిలో ఒక సెంటిమెంట్ టచ్. ప్రేక్షకుల గుండెలు పిండాను అని దర్శకుడు అనుకుంటాడు, కానీ అలాంటివి గుమ్మడి కాలం నుంచీ చూస్తున్నారు కాబట్టి జనాల గుండెలు కరగలేదు. అందరూ శుభ్రంగా ఇంటర్వల్ లో కొనుకున్న కూల్ డ్రింకులు, స్నాక్స్ ముగించారు.

కానీ ఈ సినిమాలో ఏదైనా మచి విషయం ఉంది అంటే, అది ఆ కొత్త యాక్టర్ "శ్యాం". అతను పోలీస్ ఆఫీసర్ లాగా మంచి యాక్షన్ చేశాడు.రవితేజ రక్త కన్నీరు చూపించాడు, ఇంక ఇలియాన గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇంక విలన్ల గ్యాంగ్ అంతా మనకు తెలిసిన వాళ్ళే. వాళ్ళు అంత కంటే వేరే రోల్స్ చెయ్యలేరు. నాకు బాధేసిన విషయం ఏమిటంటే, ఆలీ, బ్రహ్మి లాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్స్ ని ఎందుకు అలా వేస్ట్ చెస్తున్నారో అర్థం కావడంలేదు. వాళ్ళిద్దరి చేతా చాలా చెత్త చేయించాడు. ఆ దర్శకుడు పూర్వాశ్రమంలో ఖచ్చితంగా ఏదో సీరియల్ కు పని చేసి ఉంటాడు.

మొత్తానికి కిక్=విక్రమార్కుడు+కృష్ణ+కొన్ని ఇంగ్లీష్ సినిమాలు. అదీ స్టొరీ!

కొసమెరుపు: మొన్న ఈ సినిమా నిర్మాత ఇది ఒక సందేశాత్మక చిత్రమని స్టేట్ మెంట్ ఇచ్చాడు. నాకైతే ఇందులో ఎలాంటి సందేశము కనిపించలేదు. తెలుగు సినిమా ఎంత దిగజారింది అనే దానికి ఇంతకంటే మంచి ఉదాహరణ అవసరం లేదనుకుంటా!!

నా బ్లాగు కూడలి లొ కనిపించడంలేదు!!

5/07/2009 - రాసింది karthik at Thursday, May 07, 2009
కారణం నాకు తెలియదు కాని నా బ్లాగు రాసిన తరువాత, కూడలి బ్లాగ్ రోల్ లో నా బ్లాగు రావటం లేదు. ఈ మధ్య కూడలి వారు ఏమైనా షరతులు విధించారా?? లేక నేను అంత చెత్త కంటెంట్ రాస్తున్నానా? లేక నా రాతలు ఏదైనా వర్గం వారి మ్నొభావాలను దెబ్బతీశయా ? (పొయిన వారం రాజకీయ నాయకుల మీదా, అంతకు ముందు ఆడవాళ్ళ మీదా సెటైర్లు వేశాను, ఆ సెటైర్లకు నన్ను రిటైర్ చెయ్యటం ఏమి బాగాలేదు :) )
కనుక, అయ్యా కూడలి వారూ..దయ చేసి నా బ్లాగు ను కూడలికి జత చెయ్యండి. నేను రెండు రొజులు క్రితమే తమకు పర్సనల్ గా మెయిల్ కూడా పంపాను. గమనించగలరు.

ప్రజలకు మనవి: ఒక వేళ ఈ టపా కూడలి లో కనపడితే శ్రమ అనుకోకుండా ఆ పైన ఉన్న పోల్ లో తెలుపగలరు.

-కార్తీక్

బ్లాగు వీటి దొంగ

5/03/2009 - రాసింది karthik at Sunday, May 03, 2009
బ్లాగింగే ఒక అట.. సుత్తి కొట్టడమే పూ బాట.. ||2||
నాకే బ్లాగు ఉన్ననాళ్ళూ ఉండవు మీకు కామెంట్లూ..
బ్లాగర్ ఐనా, వర్డ్ ప్రెస్ ఐనా, అంతా నా వాళ్ళూ..
వైరస్ నాకు లేదు..నా బ్లాగే ఆపలేరు..
వైరస్ నాకు లేదు..నా బ్లాగే ఆపలేరు..

బ్లాగింగే ఒక అట.. సుత్తి కొట్టడమే పూ బాట.. ||2||
అనాథ బ్లాగుల.. ఉగాది కోసం...
అనాథ బ్లాగుల ఉగాది కోసం లేఖినిలా నే దిగివస్తా..
బ్లాగు బ్లాగును కొత్తగ మలిచి బ్లాగరిలా నే దిగివస్తా..
అనాథ బ్లాగుల ఉగాది కోసం లేఖినిలా నే దిగివస్తా..

బ్లాగు బ్లాగును కొత్తగ మలిచి బ్లాగరిలా నే దిగివస్తా..


అనామకులకూ.. అజ్ఞాతలకూ..

అనామకులకు అజ్ఞాతలకు బూజు దులపక తప్పదురా

తప్పదురా..తప్పదురా.. తప్పదురా..

బ్లాగింగే
ఒక అట.. సుత్తి కొట్టడమే పూ బాట.. ||2||

బ్లాగు దేవతకూ..వెబ్ సైట్ తెరిచే..
బ్లాగు దేవతకు వెబ్ సైట్ తెరిచె సైటుదేవతను నేనేరా..

చిన్న బ్లాగుల పోస్టుల మంటకు వర్డు ప్రెస్సునై వస్తా రా..

బ్లాగు దేవతకు వెబ్ సైట్ తెరిచె సైటుదేవతను నేనేరా..

చిన్న బ్లాగుల పోస్టుల మంటకు వర్డు ప్రెస్సునై వస్తా రా..

గూగుల్ రాజ్యం.. యాహు ప్రభుత్వం..

గూగుల్ రాజ్యం యాహు ప్రభుత్వం నేల
కూల్చక తప్పదురా..
తప్పదురా..తప్పదురా.. తప్పదురా..

బ్లాగింగే
ఒక అట.. సుత్తి కొట్టడమే పూ బాట.. ||2||


నేను రాసిన ఆఖరి రెండు టపాలకు ఎవరూ కామెంట లేదు అంతే కాక హిట్స్ చాలా తక్కువ వచ్చాయి.. అందుకని ఇలా రాశాను :)

కొండ వీటి దొంగ సినిమాలో పాట ఇది.


-కార్తిక్