నా దిష్టి వాటికి తగిలిందా???

1/12/2009 - రాసింది karthik at Monday, January 12, 2009
నేను బెంగళూరు చేరుకొని ఒకటిన్నర సంవత్సరాలు అయ్యింది. ఈ సమయంలో నేను చాల వీధులు తిరిగాను. కాని నాకు బాగా నచ్చిన వీధులు మాత్రం మూడే!! అందులో ఒకటి అగర బస్ స్టాప్ నుండీ సర్జాపూర్ సిగ్నల్ వరకు ఉన్న రింగ్ రోడ్. నేను ప్రతి రోజూ ఆఫిస్ కి అదే రోడ్డు లో వెళతాను. ప్రతి రోజూ ఆ చెట్ల మధ్యలో బండి నడిపేటప్పుడు నాకు తెలియని ఆనందం నన్ను ఆవరించుకొని ఉంటుంది. ఏపుగా పెరిగిన ఆ చెట్లు ఎండ అనేది రోడ్డు మీద పడకుండా అడ్డు పడతాయి. చూసేందుకు ఎంతో ముచ్చటగా ఉంటుంది. ట్రాఫిక్ జాం అయినా ఆ చెట్ల వల్ల బోర్ అనిపించదు(కనీసం నాకైతే అనిపించదు). కాని ఈ రోజు పొద్దున చూస్తే ఆ చెట్లు కొట్టెయ్యడం మొదలు పెట్టారు. ఎందుకో నాకు తెలియదు, కానీ చాల బాధేసింది. ఆఫీస్ లో ప్రజలను అడిగితే అండర్ పాస్ కని ఒకరు, మెట్రో రైలుకని ఇంకొకరు చెప్పారు. అవి ఎంతవరకూ నిజమో నాకు తెలియదు, మేము ఈ రింగ్ రోడ్ ఆఫీస్ కి మారక ముందు ఒక రోజు మా మేనేజర్ పది సంవత్సరాల ముందు రింగ్ రోడ్ చాలా పచ్చగా చెట్లతో కళళలాఊతూ ఉండెది అని చెప్పాడు. అది విని నేను చాలా సంతోషించా, అప్పుదంత పచ్చగా కాక పొయిన బాగానే ఉంటుంది అని. కానీ, నేను ఎక్కువగా అలొచించానని తర్వాత తెలిసింది. ఈ పది సంవత్సరాల సమయంలో బెంగళూరు చాలా డెవలప్ అయ్యింది అని ప్రజలు చెప్పుకుంటారు. కాని బెంగళూరు జరిగిన నష్టం ఎమిటి???
రింగ్ రోడ్లో అండర్ పాస్, మేట్రో వస్తే ఎలావుంటుందో నాకు తెలియదు. కానీ ఆ చెట్లు లెకుంటె నాకు చాల బాధగా వుంటుంది. వాటికి నా దిష్టి తగిలిందేమో !!!