నేను, నా బైక్, ఒక డాక్టర్

10/03/2008 - రాసింది karthik at Friday, October 03, 2008
అది సెప్టెంబర్ 30, మంగళవారం. నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ బైక్ మీద నుంచి కింద పడి ముక్కు, మూతి, మోకాలు, మోచెయ్యి పచ్చడి చెసుకున్న రొజు. 40 కి.మి. వేగంతొ వెళ్తూ కింద పడితే పచ్చడి కాక, సాంబారు రసం అవ్వవు కద!
ఇలాంటి దెబ్బలు నాకు కొత్తా కాదు, వాటికి నేను పాతా కాదు. చిన్నప్పుడు మా ఏరియా లొ " ముళ్ళు కార్తీక్ కు గుచ్చుకోవు, కార్తీక్ ముళ్ళను గుచ్చుకుంటాడు" అని ఒక సామెత వాడుక లో ఉండేది. సో అలవాటుగా దగ్గరలో ఉన్న నర్సింగ్ హోం కి వెళ్ళాను. కాని అక్కడ డాక్టర్ ని కలవలేదు!!! ఆ నర్సింగ్ హో లో ఇద్దరు డాక్టర్ లు ఉన్నారు: ఒకరు గైనాకాలజిస్ట్, ఇంకొకరు లైంగిక వ్యాధుల నిపుణులు. బెంగళూరు స్పీడ్ బ్రేకర్ దెబ్బకు విరిగిన చేతుల జాబితా లొ నా చెయ్యి చేరినా పర్వాలేదు కాని, ఆ డాక్టర్ గడప తొక్కను అని అనుకున్నా. కాంపౌండర్ పిలుస్తున్నా వెనక్కు తిరిగి చూడకుండా పారి పొయి ఇల్లు చేరుకున్నా. ఒకరిద్దరు ముఖ్యులకు మెసేజ్, మెయిల్ పంపించి ఫస్ట్ ఏయిడ్ చేసుకున్నా.అనగా టించర్ తో కడిగి పసుపు పట్టించా దెబ్బకు నొప్పి నషాళానికి ఎక్కింది. అప్పుడు నాకు పరిచయం ఉన్న ఒక డాక్టర్ గుర్తుకు వచ్చాడు. వెంటనే అతని హాస్పిటల్ కు చేరుకున్నా, నేను వస్తున్నా అని తెలుసుకున్నాడొ ఏమో ఆ జీవి ఎక్కడికో ఉడాయించాడు.
అప్పుడు తప్పదు కదా అని మరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ గుర్తుకు వచ్చిన విషయం ఏమిటంటె నా పర్స్ లో డబ్బులు లేవు. జజ్జినక జజ్జినక పండగ చేసుకున్నా! ఆ పక్కనేవున్న ఆక్సిస్ బ్యాంక్ ఏ.టి.ఎం. కి వెళ్ళా, నేను వస్తున్నా అని వీళ్ళకు కూడా తెలిసిపొయిందోచ్! డబ్బులు లేవు అని బోర్డ్ తగిలించారు. ఇంకేప్పుడూ ప్రైవేట్ బ్యాంక్ లను నమ్మకూడదు అని ఒట్టు పెట్టుకుని వెనకాల వీధి లోని ఎస్.బి.ఐ. కి వెళ్ళి డబ్బు తెచ్చు కుని కట్టు కట్టించుకున్నా. అక్కడ కట్టు కట్టే వాడు పసుపుని చూసి అదేదో అంత్రాక్స్ పొడి అన్నట్టు చూసి అది కడిగేసి అదే కలర్ లో వున్న ఒక ఆయింట్మెంట్ పూసి కట్టు కట్టాడు. తర్వాత డాక్టర్ వచ్చి నాలుక తెరువు, చెయ్యి చాపు, రెందు పల్టీలు కొట్టు అని అడిగి, అవన్నీ చేశాక ' ఎవెరిథింగ్ ఇస్ నార్మల్ ' అని చెప్పాడు. ఆ ముక్క నేను ఎం.బి.బి.ఎస్. చదవకుండానె తెలుసుకున్నానురా పాపాత్ముడా అని చెప్పి ఇంటికి వచ్చేశా.