ఒక దోశ కథ

8/08/2007 - రాసింది karthik at Wednesday, August 08, 2007
ఇది మాములు దోశ కాదు
కాదు, కారాదు, కాబోదు
ఎందుకంటె ఇది నేను చేసిన తొలి వంట కనుక
ఎందుకంటె దీని వల్ల నాకు దోశ మీద విరక్తి పుట్టింది కనుక
......!!!!
అవి నేను స్కూలుకి వెళ్ళె రోజులు
జీవితం భారంగా సాగుతున్న రోజులు
స్కూలుకి నామం పెట్టడమె జీవిత లక్ష్యంగా భావించే రోజులు
సరిగ్గా అటువంటి రొజులలొ ఒక పరీక్ష వున్న రోజు
అనగా స్కూలు ఎగరకొట్టలేని రోజు
పైగా అమ్మ ఇంట్లొ లేని రోజు
అనగా అక్కయ్యలతో కొట్లాడకుడని రోజు
అమ్మ అలవాటుగా దోశ పిండి కలిపి పెట్టిన రోజు
అలవాటుగా చిన్నక్కయ్య ఏడు గంటలకు పరీక్ష కు వెళ్ళిన రోజు
అందు వల్ల ఇక ఇంట్లొ మిగిలింది ఇద్దరు ప్రాణులు : నేను, పెద్దక్కయ్య.
అక్కయ్య పరీక్ష ఎనిమిదికె కనుక తను నా కంటె ముందుగా టిఫిన్ తింది
నేను టిఫిన్ తినను చుడగా ఒకే ఒక దోశ మిగిలింది !!!
అది ఒక్కటి ఎలాగు మనకు సరిపోదు :(
అందువల్ల తక్షణ సమస్యకు తక్షణ పరిష్కారం?- "స్వయంపాకం"
అందువల్ల నేను వెంటనే వంటకు ఉపక్రమించాను. కానీ...
మనం తినడం తప్ప చేసిన పాపాన ఎప్పుడూ పోలేదే!!!
ఐన గుండె రాయి లాంటిది చేసుకుని మొదలు పెట్టాను
కొంత దోశ పిండి పెనం మీద పోయగానె ఒక విషయం అర్థం అయ్యింది. అది ఏమనగా పిండి అయ్యిపోయింది. :(
అప్పుడు మన తక్షణ కర్తవ్యం ఆలొచించంగా, చించగా..కొంత చినిగాక ఒక అద్భుతమైన ఆలోచన తళ్ళుక్కుమంది. అది ఏమనగా పిండి లొ నీళ్ళు పొయ్యట్టాం!!!
అలొచన వచ్చిందె తడవుగ నీళ్ళు పోశాను. అప్పుడు అది చాల బక్క పలచగా, తెలుగు సినిమా లొ హీరోయిన్ లా అయ్యింది. అప్పుడు మనకు ఒక గొప్ప విషయం అర్థం అయ్యింది. అది ఏమనగా దోశ పిండి తొ చెయ్యాలి నీళ్ళ తొ కాదు అని. అప్పుడు పిండి కోసం వెతకగా ఒకానొక పిండి కనిపించదం దాన్ని మిగిలిన పిండి లొ కలపటం వెనువెంటనే జరిగాయి.
తర్వాత మామూలు దోశ కాకుండ మసాల దోశ తినాలని అనిపించింది. వెంటనే పప్పుల పొడి కొసం అన్వేషించాను. ఫలితంగ మనకు కొంత పొడి దొరికినది. వెంటనే పచ్చడి తొ కలిపి మసాల దోశ పొయ్యటం తటస్థించింది.
ఈ విధంగా పోసిన దోశ తినగా మనకు రెండు విషయాలు అర్థం అయ్యయి:
1. మనం వాడిన పిండి దోశ పిండి కాదని.
2. మనం వేసిన పొడి కజ్జికాయలు చేసే తియ్యని పొడి అని.

రెండు రకాల పిండ్లు కలిపి ఎర్రగడ్డ పచ్చడి లొ తియ్య పప్పుల పొడి వేసి చేసిన దోశ ఎల వుంటుందొ ఊహించుకొండి!!!