గ్యాంగ్ లీడర్!!!

8/24/2007 - రాసింది karthik at Friday, August 24, 2007
మరొ సారి నా స్కూలు రోజులకు వెళ్ళక తప్పదు !!!
అవును మరి మేగా స్టార్ చిరు, విజయశాంతి కాంబినేషన్ లో "గ్యాంగ్ లీడర్" రిలీజ్ అయ్యింది అప్పుడె.
నేను స్కూల్లొ అలవాటు గా నా క్లాస్ లొ జరుగుతున్న హింది కాకుండా పక్క క్లాస్ లొ తెలుగు సర్ చెపుతున్న కథ వింటున్నాను.
ఒక్క సారిగా టీచర్ "కార్తికేయ" అని పిలిస్తె కథ లొ నుంచి మళ్ళీ ఈ క్లాస్ అనే లొకం లొకి వచ్చా.
విషయం ఏమనగా నాకోసం ఇంటి దగ్గర నుంచి ఏవరో వచ్చారు. వెళ్ళీ చూడగా ఆ వచ్చింది మా సొదర రత్నం. నాతొ ఏమి చెప్పకుండా "మీ మేడం తో మట్లాడు అని అన్నాడు. నాకు చాలా భయమేసింది. మరొసారి వేప మండల కార్యక్రమం తప్పదు అని డిసైడ్ అయ్యను. అంతలొ మా మేడం "మీరు తీసుకుని వెళ్ళండి" అని చెప్పారు. నాకు అంతా గందరగోళంగా, ఆది వారం డిడి-1 లొ "బధిరులకు వార్తలు" చూస్తున్న ఫీలింగ్ కలిగింది. మా అన్న విషయం చెప్పకుండా "ఇంటికి పద" అన్నాడు.
ఇంటికి వెళ్ళగానే తెలిసింది ఏమనగా మనం సినిమా వెళ్ళుటక్కు స్కూల్లొ ఊరికి వెల్తున్నామని చెప్పి పర్మిషన్ తీసుకున్నారు. నేను చాలా హ్యాపి గా ఫీల్ అయ్యాను. ఎందుకంటె ఎప్పుడో కాని అమ్మ స్ఖుల్ కి ఎగరకొత్తడనికి పర్మిషన్ ఇవ్వదు. అందరం వెంటనె థియేటర్ కు వెళ్ళాము. ఎలగో టికెట్స్ తీసుకుని సీట్స్ లొ కూర్చున్నాం. ఫస్ట్ పాట వరకు బాగనె సాగింది. మా అన్న నా చెవిలో "మేడం" అన్నడు, కాని చిరు డాన్స్ ముందు మనకు ఏమీ కనిపించలేదు. కాని మా అన్న నన్ను ఎత్తుకుని వెరే సీట్ లో కూర్చో పెట్టాడు. అప్పుడు చూసాను నేను మా మేడం ని. ఒక్క నిమిషం లో ఏడుపు వచ్చింది. కాని మా అన్న నన్ను ఆమె చూడకుండా కవర్ చేసాడు. అప్పుడు కొంత ధైర్యం వచ్చింది. కాని మా అక్క వాళ్ళు మీ మేడం కు చెప్తాం అని బెదిరించటం మొదలుపెట్టారు. :(
ఈ విధంగా సినిమా చూసి మా మేడం చూడకుండా బయట పడ్డాను.



*తన బ్లాగ్ తో నాకు స్పూర్తిగా నిలిచిన త్రివిక్రం గారు మరో వారం లొ ఒక ఇంటి వారౌతున్నారు. ఈ సందర్భంగా త్రివిక్రం గారికి నా హార్ధిక శుభాకాంక్షలు.

ఒక దోశ కథ

8/08/2007 - రాసింది karthik at Wednesday, August 08, 2007
ఇది మాములు దోశ కాదు
కాదు, కారాదు, కాబోదు
ఎందుకంటె ఇది నేను చేసిన తొలి వంట కనుక
ఎందుకంటె దీని వల్ల నాకు దోశ మీద విరక్తి పుట్టింది కనుక
......!!!!
అవి నేను స్కూలుకి వెళ్ళె రోజులు
జీవితం భారంగా సాగుతున్న రోజులు
స్కూలుకి నామం పెట్టడమె జీవిత లక్ష్యంగా భావించే రోజులు
సరిగ్గా అటువంటి రొజులలొ ఒక పరీక్ష వున్న రోజు
అనగా స్కూలు ఎగరకొట్టలేని రోజు
పైగా అమ్మ ఇంట్లొ లేని రోజు
అనగా అక్కయ్యలతో కొట్లాడకుడని రోజు
అమ్మ అలవాటుగా దోశ పిండి కలిపి పెట్టిన రోజు
అలవాటుగా చిన్నక్కయ్య ఏడు గంటలకు పరీక్ష కు వెళ్ళిన రోజు
అందు వల్ల ఇక ఇంట్లొ మిగిలింది ఇద్దరు ప్రాణులు : నేను, పెద్దక్కయ్య.
అక్కయ్య పరీక్ష ఎనిమిదికె కనుక తను నా కంటె ముందుగా టిఫిన్ తింది
నేను టిఫిన్ తినను చుడగా ఒకే ఒక దోశ మిగిలింది !!!
అది ఒక్కటి ఎలాగు మనకు సరిపోదు :(
అందువల్ల తక్షణ సమస్యకు తక్షణ పరిష్కారం?- "స్వయంపాకం"
అందువల్ల నేను వెంటనే వంటకు ఉపక్రమించాను. కానీ...
మనం తినడం తప్ప చేసిన పాపాన ఎప్పుడూ పోలేదే!!!
ఐన గుండె రాయి లాంటిది చేసుకుని మొదలు పెట్టాను
కొంత దోశ పిండి పెనం మీద పోయగానె ఒక విషయం అర్థం అయ్యింది. అది ఏమనగా పిండి అయ్యిపోయింది. :(
అప్పుడు మన తక్షణ కర్తవ్యం ఆలొచించంగా, చించగా..కొంత చినిగాక ఒక అద్భుతమైన ఆలోచన తళ్ళుక్కుమంది. అది ఏమనగా పిండి లొ నీళ్ళు పొయ్యట్టాం!!!
అలొచన వచ్చిందె తడవుగ నీళ్ళు పోశాను. అప్పుడు అది చాల బక్క పలచగా, తెలుగు సినిమా లొ హీరోయిన్ లా అయ్యింది. అప్పుడు మనకు ఒక గొప్ప విషయం అర్థం అయ్యింది. అది ఏమనగా దోశ పిండి తొ చెయ్యాలి నీళ్ళ తొ కాదు అని. అప్పుడు పిండి కోసం వెతకగా ఒకానొక పిండి కనిపించదం దాన్ని మిగిలిన పిండి లొ కలపటం వెనువెంటనే జరిగాయి.
తర్వాత మామూలు దోశ కాకుండ మసాల దోశ తినాలని అనిపించింది. వెంటనే పప్పుల పొడి కొసం అన్వేషించాను. ఫలితంగ మనకు కొంత పొడి దొరికినది. వెంటనే పచ్చడి తొ కలిపి మసాల దోశ పొయ్యటం తటస్థించింది.
ఈ విధంగా పోసిన దోశ తినగా మనకు రెండు విషయాలు అర్థం అయ్యయి:
1. మనం వాడిన పిండి దోశ పిండి కాదని.
2. మనం వేసిన పొడి కజ్జికాయలు చేసే తియ్యని పొడి అని.

రెండు రకాల పిండ్లు కలిపి ఎర్రగడ్డ పచ్చడి లొ తియ్య పప్పుల పొడి వేసి చేసిన దోశ ఎల వుంటుందొ ఊహించుకొండి!!!