చివరకు కేంద్రం తెలంగాణ
ప్రకటించింది. ఇప్పటిదాకా తిట్టుకున్న తిట్లన్నీ మర్చిపొయి ఇప్పుడు అందరం
సోదరభావంతో ఉందామని ప్రముఖులంతా ప్రకటనిస్తున్నారు.. సరే, సంతోషం! నేను ఆ
విషయం గురించి ఏమీ చెప్పదలుచుకోలేదు. విభజన కరెక్టా, కాదా అనే చర్చ కూడా
ఇప్పుడు అప్రస్తుతం. ఎందుకంటే ప్రజలలో మానసికంగా విభజన జరిగి ఒక ఐదారేళ్ళకు
పైగానే అయింది. ఒకరు విగ్రహాలు పగులగొట్టినప్పుడు, కవిత్వం పేరుతో బూతు
పురాణాలు ప్రచురించినప్పుడు, మరొకరు ఆత్మాహుతి దళం గా మారుతాం అన్నప్పుడే
మానసిక విభజన్ ఏ స్థాయిలోఓ ఉందో చూశాం..
ఒక సమైక్యవాదిగా సారీ ఇప్పుడు ఈమాటకు విలువ లేదు కదా, సరే ఒక సీమబిడ్డగా ఈ నిర్ణయం వల్ల మా నాకు కనిపిస్తున్న నష్టాలు:
1.
హైదరాబాదు నుంచీ సీమాంధ్ర ప్రాంతాలకు బస్సు చార్జీలు పెరగడం. ఎందుకంటే
అంతరాష్ట్రాల మధ్య ఉండే టాక్స్ అదనంగా కట్టాలి. ఇది సీమాంధ్రులకు మాత్రమే
నష్టం కాదు. అంతకంటే ఘనుడు ఆచంట మల్లన్న అని ఇరు ప్రాంతాల వారూ మొహమాటం
లేకుండా ఈ టాక్స్ వేసుకుంటారు.
2. కరెంట్ కష్టాలు అధికమవడం. సీమాంధ్రులకు సింగరేణి బొగ్గు, సాగర్ నుంచీ కరెంట్ రెండు కష్టమే.. ఎందుకంటే తెలంగాణ ప్రాంతానికే ఇవి సరిపోవడం కష్టం. కాబట్టి ఇక సీమాంధ్రులు ఎంచక్కా కరెంట్ తీగలపై బట్టలారేసుకోవచ్చు.
3. రాయలసీమలో, యస్ నా సీమలో తాగడానికి కూడా నీళ్ళు దొరకవు. కరువుసీమలో పుట్టిన పాపానికి సాగు నీళ్ళ గురించి ఆలోచించడం అత్యాసే కానీ ఇప్పుడు తాగు నీరు కూడా కష్టమే. కడప, అనంతపురం జిల్లాలో అతి త్వరలో ఎడారులుగా మారే అవకాశాలు పుష్కలం.
4. ఉద్యోగాలలో ఇబ్బందులు వస్తాయి అని ఒక వాదన. కానీ ఈరోజులలో ప్రభుత్వ ఉద్యోగాలు ఉండేదే చాలా తక్కువ పోను పోను ఇంకా తగ్గిపోతాయి. కాబట్టి ఇది పరిగణలోకి తీసుకోలేము.
ఈ సమస్యలు పక్కన పెడితే ఈ తెలంగాణ ఏర్పాటు వల్ల కనీసం ఈ క్రింద చెప్పిన సమస్యలు తీరినా నేను సంతోషిస్తాను:
1. ఫ్లోరైడ్ సమస్య: మన ప్రభుత్వాల చేతగానితనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న ఈ సమస్య తీరితే అంతే చాలు.
2. ఐ.ఐ.టి. హైదరాబాద్ అంతర్జాతీయ సాంకేతిక కళశాలగా రూపుదిద్దుకోవాలి.
3. హైదరాబాదులో ఉన్న చిన్న చిన్న పరిశ్రమలకు నిరంతరంగా కరెంట్ ఇచ్చి అవి వేరే రాష్ట్రాలకు పోకుండా చూడాలి.

తెలంగాణ ఏర్పాటు వల్ల ఈ మాత్రం మేలు జరిగినా ఉద్యమానికి సార్థకత చేకూరినట్లే..
సర్వేజనా సుఖినోభవంతు
-కార్తీక్
సర్వేజనా సుఖినోభవంతు
-కార్తీక్