కమ్యూనిజం అంటే???

12/01/2010 - రాసింది karthik at Wednesday, December 01, 2010


కమ్యూనిజం గురించి తెలుసుకోవాలంటే...


 మసకబారిన మానవత్వానికి మూగసాక్షిగా నిలిచిన తియోన్మెన్ స్క్వేర్ ను అడుగు..
ఖ్మేర్ రోగం తో కుప్పకూలిన సగటు కంబోడియా పౌరుడినడుగు..
అనువుగాని చోట అధికులమని ఆఫ్ఘన్ లో ఆశపడ్డ రష్యానడుగు..
ఇంకా తెలియలేదా కామ్రేడ్??

టిబెట్ పౌరల మృత్యుహేళి కమ్యూనిజం..
కోరియా విస్పోటనం కమ్యూనిజం..
బీటలు వారిన జర్మన్ గోడ కమ్యూనిజం.. 

ఇక మన బ్లాగు కామ్రేడ్లు చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని చూద్దాం:
కమ్యూనిజం అంటే శాంతి సామరస్యలతో కూడిన సమ సమాజం నిర్మాణం. దాని భావం అదే.

ROFL.. ప్రపంచం లో ఎక్కడైనా కమ్యూనిస్టులు అధికారం లో ఉండి ప్రశాంతంగా ఉన్న రాజ్యాలు ఉన్నాయా?? చైనా నుంచీ అల్బేనియా వరకూ కమ్యూనిజం దెబ్బకు కుదేలవని సమాజం ఎక్కడైనా ఉందా కామ్రెడ్స్??
పాపం, ఆ కంబోడియా అంత చిన్న దేశం లో మూడేళ్ళలో తమరి కామ్రెడ్స్ దాదాపుగా రెండు మిలియన్ల ప్రజలను లేపేశారట (అంటే ఆ దేశ జనాభాలో అక్షరాలా 21% హాం ఫట్!).. ఇక స్టాలిన్ గురించి ఎంత తక్కువ మాట్లడుకుంటే అంతమంచిది.. బ్రాందీ సీసాల మధ్య సోడా బాటిల్లా  ఉన్న క్యూబా మాత్రమే కొంతవరకూ మినహాయింపు..అక్కడ కూడా లోపల ఏం జరుగుతోంది అనే విషయం ఎవరికీ తెలియదు.. కనుక కామెంటు చెయ్యలేం..  క్యాస్ట్రో నాయకత్వ పటిమ వల్ల మనుగడ సాగిస్తున్నారని నా అభిప్రాయం..

NEXT:
ఈ లాభాలు గుట్టల్లా పేరుకుపోయి ఆ శ్రామికుల డబ్బును సొంతం చేసుకుంటాడు. అదే పెట్టుబడి మోసమంటే.
మరి ఆ పెట్టుబడి మోసమైతే రతన్ టాటాను బెంగాల్ లో పెట్టుబడి పెట్టమని బుద్దదేవ్ గారు అంత కిందా మీదా ఎందుకు పడ్డారు?? ఆ మాత్రం కార్ల ఫ్యాక్టరీ బెంగాల్ గవర్నమేంట్ చేత పెట్టించలేకపోయారా??
పెట్టుబడి అంతే కేవలం డబ్బు మాత్రమే కాదు కామ్రెడ్స్.. ఒక వ్యక్తి/బృందం యొక్క ఆలోచనలు/పని తత్వం కూడా.. ఆ ఆలోచనలతో నలుగురికి ఉపాధి కల్పించి వారి కడుపు నింపడం ఏ రకంగానూ తప్పు కాదు.. ఇక వీళ్ళ లాజిక్ ప్రకారం అది కడుపు నింపడం కాదు కడుపు కొట్టడం అంటే అసలు ఆ ఫ్యాక్టరీయే లేకపోతే ఉపాధి ఎక్కడి నుంచీ వస్తుంది?? ఒక విషయం వినండి కామ్రేడ్స్, మీ దృష్టిలో పెట్టుబడిదారులుగా, మీ వర్ణనలలో దోపిడీదారులుగా ఉన్న టాటా కుటుంబం తమ లాభాలలో 2/3 వంతులు సమాజం కోసం ఖర్చుపెడుతుంది..

NEXT..

ఆ తర్వాత కంపెనీ అరాచకాలను అడుగడుగునా ఎదురు నిల్చి ప్రాణాలను తృణప్రాయంగా భావించి ఉరికంభమెక్కిన భగత్‌సింగ్‌ కమ్యూనిస్టుగాక మరెవరు. అంతేనా నైజాం అరాచకాలను..తెలంగాణా దొర వ్యవస్థను..రజాకార్లను తరిమితరిమి నీళ్లుతాగించిన తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటానికి నేతృత్వం వహించింది కూడా కమ్యూనిస్టేలే.
ఈ విషయం లో నేను చాలావరకూ ఏకీభవిస్తాను.. రజాకార్ల ఉద్యమంలో కమ్యూనిష్టుల పాత్ర ఎంతో ఘనమైనది. దానికి ఆ యోధులకు శిరసు వంచి లాల్ సలాం! కానీ ఆ ఉద్యమం కేవలం వారిది మాత్రమే అనడం కరెక్ట్ కాదు.. ఎందుకంటే ఒక వైపు కమ్యూనిష్టులు ఎంతగా పోరాడారో మరో వైపు ఆర్యసమాజ్ కార్యకర్తలు కూడా ఎంతో శ్రమలకోర్చి ప్రజలలో చైతన్యాన్ని తీసుకువచ్చారు.. ఒక రకంగా చెప్పాలంటే రజాకార్ ఉద్యమానికి కమ్యూనిష్టులు, ఆర్యసమాజ్ రెండు కళ్ళ లాంటి వారు.. అందుకు మన తరాలు వాళ్ళకు ఎంతగానో రుణపడి ఉన్నాయి..


ఇక 2జీ కుంభకోణాం గురించి, కమ్యూనిష్టులు మాత్రం నీతి నిజాయితీలు కలిగే ఉంటారన్న గ్యారంటీ ఏమిటి?? దేశాలకు దేశలు దోచుకున్న కమ్యూనిష్టు నేతలు ఉన్నారు.. మనిషిలోని అలివి కానీ స్వార్థానికి కమ్యూనిజమైనా ఏ ఇజమైనా తలవంచాల్సిందే, కనుక అవినీతి రహిత సమాజాన్ని నిర్మించాలంటే మార్పు అనేది వ్యక్తి స్థాయిలో మొదలై సమాజం స్థాయికి చేరాలి, అంతే తప్ప కమ్యూనిష్ట్లుగా మారండి నీతిమంతులు అయిపోండి అనడం మత మార్పిడుల వంటిదే.. అక్కడ దేవుడిని చూపిస్తారు ఇక్కడ ఇజాన్ని చూపిస్తారు అంతే తేడా!!


ఇక అతి కామెడీ విషయం ఒకటుంది.. ఎంత మంది గమనించారో తెలీదు.. కానీ ఈ రెండు వాక్యాలు చూడండి..
ఇది మూడవ లైనులో రాశారు..
మన దేశంలో మావోయిస్టులు పేరిట చలామణి అవుతున్నవారు ఒకరకంగా చెప్పాలంటే ఉగ్రవాదులు. తీవ్రవాదులు. వీరు..కమ్యూనిస్టులు ఒకటి కాదు. వీరికీ..కమ్యూనిస్టులకు అసలు పొంతన లేదు.
 పదమూడవ లైనులో ఇది రాశారు..

  ఇక మన మావోయిస్టుల గురించి చెప్పాలంటే వారు దారితప్పిన కమ్యునిస్టు సోదరులు అని చెప్పవచ్చు.ROFL..

పట్టుమని పది లైన్ల పాటూ ఒకే మాట మీద నిలబడలేని మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోంది కామ్రెడ్స్.. ఇప్పటి వరకూ కమ్యూనిష్టులు ఎందుకు సగటు మనిషికి దూరంగా ఉన్నారో తెలుసుకోవడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ అవసరం లేదేమో!!

-ఇంద్రకంటి కార్తికేయ

Few References for further reading:

http://en.wikipedia.org/wiki/Tiananmen_Square_protests_of_1989

http://en.wikipedia.org/wiki/Khmer_Rouge

http://en.wikipedia.org/wiki/Soviet_war_in_Afghanistan