వైద్యో నారయణో హరి...

3/29/2015 - రాసింది karthik at Sunday, March 29, 2015
వైద్యో నారయణో హరి- అంటే వైద్యుని దగ్గరకు వెళితే నారాయణా కోచింగ్ సెంటర్ లాగా శాంతం నాకేసి ఫైనల్ గా హరి పాదాలకు చేర్చుతారని ఒక పెద్దమనిషి ఉవాచ. ఆ పెద్దమనిషి ఎవరా అని పెద్దగా ఆలోచించకండి.. అది నేనే! :)

ఈరోజు ఏదో వీడియోలు చూస్తుంటే ఈ మహత్తరమైన వీడియో దొరికింది. ఆంధ్రుల (దుర)అభిమాన చానల్ టీవీ9లో మంతెన సత్యనారాయణరాజు గారి ప్రకృతి వైద్యం మీద చర్చా కార్యక్రమం మహా పసందుగా జరిగింది. ప్యానల్ లో ఉన్న ముగ్గురు డాక్టర్లూ మంతెన గారిని నానా రకాలుగా విమర్శిస్తూ రక్తి కట్టించారు. ఏ విషయానికైనా రెండో వర్షన్ ఉంటుందని టీవీ9 వాళ్ళకు తెలియదు కాబోలు మంతెన గారి వర్షన్ చెప్పడానికి ఎవరినీ పిలవలేదు. ఈ టపా ఉద్దేశ్యం మంతెన గారిని సమర్థించడమో లేక టివీ9 వాళ్ళను విమర్శించడమో కాదు. ఆ రెండు పనులు చెయ్యడానికి అటు హేటువాదులు ఇటు టీ.ఆర్.యస్ పార్టీ వాళ్ళూ ఎలాగూ ఉన్నారు. అసలు మౌలికంగా ఈ Alternative Medicine ఇంత పాపులర్ ఎలా అయ్యింది అనే కోణంలో ఆలోచించి ఈ టపా రాస్తున్నాను.

ముందుగా కొంత చరిత్ర:
ఏల్చురి గారి ఆయుర్వేదం, మంతెన గారి ప్రకృతి వైద్యం లాంటివి ప్రస్తుతం చాలా కొత్తగా అనిపిస్తున్నాయి కానీ మునుపు ఇవి మనవాళ్ళకు సుపరిచితమైనవే. 1950ల దాకా బెజవాడ గుంటూర్ ప్రాంతాలలో 30కి పైగా ఆయుర్వేద వైద్యశాలలు ఉండేవి.  ఆ తర్వాత కాలంలో వివిధ కారణాల వల్ల అవి మూతపడ్డాయి. అలాగే వేరే రంగాల్లో రాణించిన వారికి కూడా ఆయుర్వేదంలో ప్రవేశం ఉండటం అక్కడక్కడా మనకు కనిపిస్తుంది. కానీ ఇది చాలావరకూ అనువంశీకమే తప్ప ఒక సబ్జెక్ట్ లాగా కాలేజీలలో నేర్పించింది లేదు. బ్రిటీష్ వాళ్ళకు ఇవన్నీ ఎందుకు పడతాయి? (On another note, Ayurvedic medicine is still prohibited in UK & Europe. What a loss to their societies!!)

ఒక 4-5 దశాబ్దాలపాటూ మరుగున పడ్డ ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం లాంటివి ఏ ప్రభుత్వ సహాయం లేకుండా కేవలం 15-20ఏళ్ళల్లో ఎందుకింత పాపులర్ అయ్యాయి??

1. ఫ్యామిలీ డాక్టర్ పద్దతి ఉన్నన్ని రోజులు పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఒక పర్సనల్ రిలేషన్ ఉండేది, డాక్టర్లు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఆ పద్దతి కనుమరుగు అయ్యిందో అప్పటి నుంచీ డాక్టర్-పేషెంట్ రిలేషన్ కాస్తా వెండార్-కస్టమర్ రిలేషన్ అయ్యింది. అలోపతి అయినా ఆయుర్వేదమైనా డాక్తర్ మీద పేషెంటుకు నమ్మకం ముఖ్యం. ఎప్పుడైతే ఫ్యామిలీ డాక్టర్ పద్దతి పోయిందో డాక్టర్లను నమ్మడం కష్టమైపోతోంది. 

2. డాక్టర్లు పేషెంట్లను cash cow గా చూస్తున్నారు తప్ప మనుషులుగా చూడటం లేదు అనే ఒక వాదన ప్రజలలోకి బలంగా వెళ్ళడం. ఇందులో మీడియా పాత్ర చాలా ఉంది. ఈ విషయంలో గవర్నమెంట్ డాక్టర్లూ ప్రైవేట్ డాక్టర్లూ అన్న తేడాలు లేవు. ఠాగూర్ సినిమాలో చూపించిన డాక్టర్ ఎపిసోడ్ నిజంగా జరగడం మన దౌర్భాగ్యం. గ్రామాలలోకి వెళ్ళి పని చెయ్యడానికి అటు సీనియర్ వైద్యులు ఇటు జుడాలు ఇద్దరూ మొండికేయడం నడుస్తున్న చరిత్ర.

3. Alternative Medicine ఫాలో అయ్యే వాళ్ళలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్ళూ ఎక్కువ. దీనికి కారణం మన డాక్టర్ల యాటిట్యుడ్. డాక్టర్ కన్సల్టేషన్ టైం 10నిమిషాలైతే హాస్పిటల్లో వెయిటింగ్ టైం కనీసం ఒకగంట సేపు ఉంటుంది. ఇది కూడా ముందు అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత. ఇక సర్కారీ దవాఖానాల సంగతి సరేసరి!

4. అలోపతి మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండటం. 

5. మంతెన, ఏల్చూరి, బాబా రాందేవ్.. ఇలా పాపులర్ అయిన వాళ్ళంతా టీవీలలో డైరెక్ట్ గా రాలేదు. ముందు word of mouth ద్వారా పాపులర్ అయ్యి తర్వాత టీవీలో రావడం మొదలు పెట్టారు. కాలేజీలలో చేరడం దగ్గరనుంచీ పెళ్ళి సంబంధాల వరకూ మన సమాజంలో word of mouth చాలా పవర్ఫుల్ అడ్వర్టైజింగ్ టెక్నిక్.కాబట్టి అక్కడికి వెళ్ళేవాళ్ళల్లో  తమకు నయం అవుతుంది అన్న నమ్మకం మీద వెళ్ళేవాళ్ళే ఎక్కువ. సైకలాజికల్ గా ఇది చాలా పెద్ద బోనస్. బాబా రాందేవ్ ఏకంగా ఐ.యం.ఏ. ని చాలెంజ్ చేశాడంటే ఆలోచించండి. 

పైన చెప్పినవన్నీ వ్యవస్థాగత సమస్యలైతే దీనికంటే దారుణం ఏమంటే మన డాక్టర్లు తాము పట్టిన కుందేలుకు రెండున్నర కాళ్ళేనని వాదించడం. ఇప్పటికి కూడా Alternative Medicine ని గుడ్డిగా విమర్శించడం సైంటిఫిక్ ప్రూఫ్ లేదు అని అరిగిపొయిన రికార్డ్ వెయ్యడం తప్ప ఈ ని సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యడం లేదు. ఎంతసేపూ బాబా రాందేవ్ కు ఎవరో ఒక ద్వీపం మొత్తం ఇచ్చారు అని, మంతెన గారు కోటీశ్వరుడు అవుతున్నారని అదే పనిగా మాట్లాడటం వల్ల ప్రజల దృష్టిలో కుళ్ళుబోతులుగా మిగిలిపోతున్నారు. మనిషి ఆరోగ్యం అనేది అలోపతి-ఆయుర్వేదం-హోమియోపతి-వగైర మధ్య టగ్ ఆఫ్ వార్ లో చిక్కుకోకూడదు.


సర్వేజనా సుఖినోభవంతు,
-కార్తీక్

దొంగ రచయితలున్నారు జాగ్రత్త!!

2/09/2015 - రాసింది karthik at Monday, February 09, 2015
ప్రతీ మనిషికి కొన్ని ఇష్టాఇష్టాలు ఉంటాయి.. వాటికి కారణాలు ఉండాలని రూల్ లేదు, కొన్ని సార్లు కారణాలు ఉంటాయి కొన్ని సార్లు ఉండవు. ఈ సోదంతా ఎందుకు చెబుతున్నానంటే కొందరు పైత్యపుగాళ్ళు తమను తాము రచయితలని చెప్పుకుంటూ తాము రాసిందే సాహిత్యమని తమ ఆలోచన ధోరణీతో విబేధించేవాళ్ళను నానా తిట్లు తిట్టి తమను తాము మేధావులమని చెప్పుకుని కుతి తీర్చుకుంటూ ఉంటారు. వీళ్ళను ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే వ్యక్తిగత దాడి, సంస్కారహీనమైన పనులు అంటూ మాటలు చెబుతారు, వీళ్ళు మాత్రం ఎవరి గురించైనా ఎంత నీచంగా మాట్లాడినా అదంతా ఫ్రీడం ఆఫ్ స్పీచ్, స్వేచ్చ ప్రపంచంలో మనిషికి ఉండే హక్కు. అన్నట్టు మనుషులంటే ఒకానొక విదేశీ భావజాలన్ని నమ్మేవాళ్ళు మాత్రమే, మిగిలిన వాళ్ళంతా రాతియుగం నాటి జంతువులు.

కోతికి కొబ్బరికాయ దొరికినట్టు సదరు పైత్యపుగాళ్ళకు పబ్లిషర్లు దొరికారు, అంతే! ఇంక చెప్పేదేముంది?? ఇషాంత్ శర్మను చూసిన ఆస్ట్రేలియా బాట్స్ మెన్ లాగా రెచ్చిపోతుంటారు.. పైత్యం ఒకపాలు, ఉన్మాదం మూడు పాళ్ళు ఉన్న వీళ్ళ రచనల దెబ్బకు తెలుగు దేశంలో పుస్తకాలు చదివే వాళ్ళే కరువయ్యారు. ఎవరైనా కొంచెం వెరైటీగా రాస్తే వాళ్ళకు క్షుద్ర రచయితలని బిరుదులు ప్రదానం చేస్తుంటారు. ఇంకొందరు ఇంకొంచెం ముందుకు వెళ్ళి "తెలుగు సాహిత్య పతనం యండమూరితో మొదలైంది" అని స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు.  ఈ చినవాల్తేరు శాల్తీలందరికి నవల/కథ అంటే ఈ క్రింది లక్షణాలు ఉండాలి:

1. హీరో పేదవాడు అయ్యుండాలి.. అంతే కాక ఆడవాళ్ళ సమస్యల గురించి ప్రతీ అరడజను పేజీలకు ఒక పేజీ స్పీచ్ ఇస్తుండాలి..
2. విలన్ ఖచ్చితంగా బాగా డబ్బున్న వాడు అయ్యుండాలి. నిజజీవితంలో ఎవరూ పెట్టుకోని సర్పభూషణ రావు  లాంటి తింగరి పేర్లు ఉండాలి. అతగాడు హీరోయిన్ తండ్రి అయ్యి హీరో కుటుంబానికి ఏదో తీరని అన్యాయం చేసుండాలి.. ఆ జరిగిన అన్యాయాన్ని రెక్టిఫై చేసేదానికి హీరోయిన్ హీరోని ప్రేమించి తన సమసమాజపు భావజాలాన్ని చాటి చెబుతుంది.
3. డబ్బున్న వాళ్ళందరూ నీతి నిజాయితీ లేకుండా ఉండాలి. వాళ్ళంతా రోజూ బ్రాందీలు విస్కీలు తాగుతూ ఉండాలి. కాగడా వేసి వెతికినా వాళ్ళల్లో ఏ మంచి లక్షణాలు ఉండకూడదు.

ఈ రూల్స్ కు వ్యతిరేకంగా ఎవరైనా రాస్తే అది చెత్త సాహిత్యం, మనిషికి సహజంగా ఉండే బలహీనతలతో ఆడుకోవడం. వీళ్ళు మాత్రం పేర్లు మార్చి, ఊర్లు మార్చి రాసిందే రాస్తూ ప్రజల మీద ఘోరమైన మానసిక దాడులు చేస్తుంటారు. పెషావర్లో తాలిబలు పిల్లల మీద ఒకసారే దాడి చేశారు, ఈ దొంగ రచయితలు మాత్రం ప్రజల మీద కొన్ని దశాబ్దాలుగా దాడులు చేస్తూనే ఉన్నారు. వీటికి తోడు ఎవరైనా వీళ్ళతో కలిసి పని చేయకూడదని అనుకుంటే వాళ్ళ మీద సెటైర్లు అదనం.

ఇప్పటిదాక వీళ్ళు రాసిన చెత్తను ఒకసారి చూసి వీళ్ళు భవిష్యత్తులో ఏం రాస్తారో అని ఒక ఊహించి ఒక లిస్ట్ రాశా, దాన్ని క్రింద చూడండి:

1. తెందుల్కర విషబ్యాటు:
సచిన్ తెందుల్కర్ మహిళా క్రికెట్లో ఆడకుండా పురుషుల క్రికెట్లో మాత్రమే ఆడి స్త్రీ జాతిని ఎలా అవమానించాడు అనేది ఈ నవల కాన్సెప్ట్.

2. ఆగడు సినిమాపై మార్కిస్టు విశ్లేషణ: ఒక పరిశోధనాత్మక వ్యాసం
దీని గురించి వేరే ఏం చెప్పాలి.. పేరు చూస్తేనే భయం వెయ్యడం లేదు.. అనుభవించండి.

3. ఇదండీ లార్డ్ ఆఫ్ ద రింగ్స్:
లార్డ్ ఆఫ్ ద రింగ్స్ సినిమాలో హాబిట్ గా మగవాడిని పెట్టడం ఎంత ఘోరం ఎంత నేరం. స్త్రీజాతికి ఇంతకంటే పెద్ద అవమానం మరొకటి లేదు. ఈ విషయంలో టొల్కిన్ ఎంత నీచంగా ఆలోచించాడు అనే విషయం మీద ఈ నవల.




బాపూ గారి గురించి వేణువు బ్లాగులో టపాకు నా సమాధానం

9/09/2014 - రాసింది karthik at Tuesday, September 09, 2014
ఈ టపా రంగనాయకమ్మ భజన బృందాలకు నచ్చే అవకాశం లేదు. కావున మీరు ఆ జాబితాలో ప్రజలైతే ఈ టపా చదవకపోవడం ఉత్తమం. అలా చేయడం వల్ల మీ సమయాన్ని ఆదా చేసుకున్నవాళ్ళౌతారు. 

ఈ టపాకు మూలమైన వేణువు బ్లాగులోని టపా ఇక్కడ చదవగలరు.

అందులో ప్రధాన ఆంశం ఏమంటే బాపూ గారు విషవృక్షం పుస్తకానికి ముఖచిత్రం వేయడానికి నిరాకరించడం తప్పు. అంతే కాక ఆ ముఖ చిత్రం కోసం పంపిన డ్రాఫ్ట్ వెనకాల రామ రామ అని వ్యంగ్యంగా రాయడం ఇంకా తప్పు.. 

అసలు దీనికంటే ముందు విషవృషం పుస్తకం గురించి కొన్ని విషయాలు:

ఆకలి అనేది నాలగు రకాలు అని రమణ ఉవాచ; బ్లాగర్ రమణ కాదు ముళ్ళపూడి వెంకటరమణ.. అవి కడుపాకలి, డబ్బాకలి, కామాకలి, పేరాకలి.. ఇందులో మొదటిది కాసింత తిండి పడేస్తే సర్దుకుంటుంది కానీ మిగిలినవి తీర్చేకొద్దీ పెరిగేవే తప్ప తగ్గేవి కాదు.. (ఇది కూడా ఆయన చెప్పిందే) అలా పేరాకలి ఎక్కువైన ఒకానొక మహిళా రచయిత్రి ఒకానొక విదేశీ భావాజాలానికి గులాం గిరి చేస్తూ రచనలు చేశారు.. వాటిలో చాలామటుకు ఆడవాళ్ళను విక్టిమైజ్ చేస్తూ కావాల్సినంత పాపులారిటీ సంపాదించుకున్నారు. అదే మూసలో రామాయణ విషవృక్షం అనే పుస్తకం రాసి దానిలో రామాయణంలోని అన్ని పాత్రలనూ చెడామడా తిట్టేశారు.. పనిలోపనిగా వాల్మికి గారిని కూడా వదలకుండా ఆయన కోటా ఆయనకిచ్చారు. అసలు ఆ పుస్తకం మొదలవడమే, "నీగురించి తెలుసుకో, నీ వర్గమేదో తెలుసుకో" లాంటి విదేశీభావజాల దాస్యంతో మొదలౌతుంది. ఆ తర్వాత ముసలి వాళ్ళను ముగ్గుబుట్ట తల అనటము, వంశ పారంపర్య రాజ్యంలో ప్రజాస్వామ్యం లేదని వాపోవడం లాంటి తింగరి లాజిక్కులతో మొత్తం పుస్తకాన్నీ రక్తి కట్టించారు.. ఇందులో ఫలాన విషయం రామాయణంలోని ఫలానా పద్యం నుంచీ తీసుకున్నానని ఎక్కడ కూడా లేదు. కనీసం నేను చదివిన పుస్తకంలో అయితే నాకు కనిపించడం లేదు.. కానీ వేణువు బ్లాగర్ వేణు గారు ఆ పుస్తకంలో ఫుట్ నోట్స్ ఉన్నాయి అని చెబుతున్నారు.. నాకైతే కనిపించలేదు.

ఇంతా చేస్తే "ఎందుకు తల్లీ రాముడంటే అంత ద్వేషం. అంతగా అయితే రామయణాన్ని మించిన పుస్తకం నువ్వే ఒకటి రాయి" అని కవి సామ్రాట్ విశ్వనాథ వారు ఒక చిన్న ప్రశ్నవేశారు. నాలగు దశాబ్దాలు దాటిన సదరు రచయిత్రి గారు వాళ్ళనూ వీళ్ళనూ తిట్టిన రచనలే తప్ప ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పిన దాఖలాలు లేవు.. ఈ విషయం చదివాక మీకు "మై స్ప్రైట్ పీతా హూన్ ఔర్ జ్ఞాన్ దేతా హూన్" అన్న పాత స్ప్రైట్ ప్రకటన గుర్తొస్తే నా బాధ్యత కాదు.  

ఇక ప్రస్తుత విషయానికి వస్తే బాపూ గారు చేసింది ఎందుకు తప్పు?? ఆయనకు నచ్చిన పని చేసే హక్కు ఆయనకు లేదా?? కళాకారుడైనంత మాత్రన ఎవరొచ్చి ఏం చెప్పినా చెయ్యాలని రూలేమన్నా ఉందా? వీళ్ళ లాజిక్ ప్రకారం ఒక తాళాలు తయారు చేసేవాడికి ఎవరైనా ఒక డ్రాఫ్ట్ ఇచ్చి ఫలానా ఇంటి తాళం ఈ సమయంలో తియ్యాలి అని చెబితే ఆ పని అతను ఒప్పుకోవాల్సిందే అంటారేమో..  

ఇక దీని కంటే అద్భుతం, ఆ డ్రాఫ్ట్ వెనకాల రామ రామ అని రాశాడని జనాలు ఆక్షేపించడం.. 
 ఆర్టిస్టుకి ఇష్టమైతే బొమ్మ వేసి ఇవ్వాలి. ఇష్టం లేకపోతే చెక్కుని మర్యాదగా వెనక్కి పంపించెయ్యాలి. దానిమీద ‘రామ రామ’ అని గానీ, ‘కృష్ణ కృష్ణ’ అని గానీ , ఏదో ఒకటి రాయడానికి ఆయనకి హక్కు ఎలా వచ్చింది?’ 

విషవృక్షం అనే పేరు పెట్టి కొన్ని కోట్లమందికి ఆదరణీయమైన పుస్తకాన్ని నానా టిట్లు తిట్టారు, ఇప్పుడు కేవలం "రామ" అని ఒకేఒక పదం రాస్తే భరించలేకున్నారు.. మీ ఆదర్శాలకు, సహనశీలతకు ఒక పెద్ద పంగనామం. ఇదేమాట ఆ రచయిత్రి విషయంలో ఎందుకు వర్తించదు.. ఇష్టముంటే రామాయణం చదవాలి లేదా మానుకోవాలి అంతే కానీ ఇలా చవకబారు విమర్శలు చేసే అధికారం ఆమెకెవరిచ్చారు?

మితృడు రాజ్ కుమార్ మాటల్లో చెప్పాలంటే ఇదేలా ఉందంటే "కొరివి దయ్యం వర్షంలో వేదాలు చదువుతూ యాగం చేసినట్లుంది".  

సర్వేజనా సుఖినోభవంతు
-కార్తీక్



కొత్త రాజధాని.. నా ఆలోచనలు!!

8/17/2014 - రాసింది karthik at Sunday, August 17, 2014
1. హైదరాబాద్ సిండ్రోం
కొత్త రాజధాని అనే మాట వింటూనే వచ్చే మొట్టమొదటి ఆలోచన "హైదరబాద్ కంటే బాగుండాలి", "హైదరాబాదు ఉన్నట్టుండాలి", "హైదరాబాదు లాగా కంపెనీలు ఉండాలి".. ఈ ఆలోచనలన్నీ అర్థం చేసుకోదగ్గవే ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి హైదరాబాదుతో ఏదో రకమైన అనుబంధం ఉంది. ఈ రోజు అక్కడి ముక్కుదొర ప్రభుత్వం ఆంధ్రా విద్యార్థులని, ఉద్యోగులని తరిమేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా, ఈ ఎమోషనల్ అటాచ్మెంట్ ఇంకో తరం మారే దాకా ఇలానే ఉంటుంది. టాంక్ బండ్ పై విగ్రహాలు చూస్తూ గర్వించని ఆంధ్రుడెవడు?
కానీ ప్రస్తుతం ఈ హైదరాబాద్ సెంట్రిక్ ఆలోచనలు మనకు ఏ మాత్రం పనికి రావు.. మన రాజధాని మన బలాబలాలకు, మన అవసరాలకు తగినట్టుగా ఉండాలి తప్ప హైదరాబాదునే వేరు పేరుతో నిర్మించాలనుకోవడం మంచిది కాదు. కానీ హైదరాబాదు విషయంలో జరిగిన తప్పుల నుంచీ పాఠాలు నేర్చుకోవాలి.. మంచి నీటి కొరత, విద్యుత్, ట్రాఫిక్ సమస్యలు హైదరాబాదును ఇంకా కొన్నేళ్ళ దాకా వదిలే సూచనలు లేవు.. కొత్త రాజధాని విషయంలో ఇలాంటి వాటిపై శ్రధ్ధ పెట్టాలి.

2. సాఫ్ట్వేరు - బోడి గుండు
తొంభైవ దశకం లో సాంకేతిక విప్లవాన్ని అందిపుచ్చుకోవడం వల్ల హైదరాబాదులో జరిగిన అభివృధ్ధి ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయ్యే పరిస్ఠితి లేదు.. అప్పట్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పెరగడానికి చాలా అవకాశాలు ఉండేవి... ఇప్పుడు ఇండస్ట్రీ బాగా మెచ్యూర్ అయ్యింది. 2008 రిసెషన్ తర్వాత కంపెనీలు చాలా కన్సెర్వేటివ్ గా ఉన్నాయి. ముఖ్యంగా ఆఫర్ లెట్టర్ ఇచ్చి దాన్ని నిలబెట్టుకోలేని ఇబ్బందికి దూరంగా ఉండాలని అనుకుంటున్నాయి.. కాబట్టి అప్పటిలాగా వేలకు వేలు ఉద్యోగాలు పుట్టడం కుదరని పని. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మొత్తం హైదరాబాదు నుంచీ రావాలనుకోవడం మూర్ఖత్వం.. ముక్కుదొర ప్రభుత్వం మరీ తాలిబన్ల తమ్ముడిలా వేధిస్తే చెప్పలేం కానీ మామూలు పరిస్థితుల్లో అయితే అది జరగని పని.

3. కోస్తా వర్సెస్ సీమ
అన్నిటికంటే ఇది ప్రధాన సమస్య.. రాజధాని కోస్తాలో ఉంటే సీమకు అన్యాయం జరుగుతుందని, సీమలో ఉంటే కోస్తాకు అన్యాయం జరుగుతుందని రెండు వైపులా అభ్యంతరాలున్నాయి.. ఈ భయాలకు కూడా హైదరాబాద్ సిండ్రోమే ప్రధాన కారణం. రాజధాని అంటే హైదరాబాదులా అన్నీ ఒకే చోట ఉంటే మిగిలిన ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందని భయం. కాబట్టి ఇరుప్రాంతాలను సంతృప్తి పరిచే విధంగా సాధ్యమైనంత వికేంద్రీకరణ జరగాలి.. ప్రతీ జిల్లా ఏదో ఒక రంగానికి కేంద్రీకృతం కావాలి. ప్రతీ జిల్లాపై మిగిలిన పన్నెండు జిల్లాలు ఆధారపడేలా ఉండాలి. సెక్రెటేరియట్, హై కోర్ట్ ఒకేచోట ఉండకూడదు. అసంబ్లీ సమావేశాలు ఇరు ప్రాంతాలలో జరిగేలా చూడాలి.

4. మన సముద్రం మన బలం:

శాతవాహనుల కాలంలోనే సముద్ర వ్యాపారం చేసిన జాతి మనది. యజ్ఞశ్రీ శాతకర్ణి ముద్రించిన నాణేలపై నౌక ముద్ర ఉండటం మన పూర్వీకులకు నౌకాయానం పై గల పట్టుని చూపుతోంది. మన మోటుపల్లి కాలగర్భంలో కలిసిపొయి ఉండచ్చు కానీ ప్రకృతి ప్రసాదించిన సముద్రం మాత్రం ఇంకా మనకు అపారమైన అవకాశలను కల్పిస్తోంది. దాన్ని వాడుకుని అంతర్జాతీయ నౌకాశ్రయాలు నిర్మించుకోవాలి.. రాజధాని కంటే అధిక ప్రాధాన్యత దీనికే ఇవ్వాలి. బకింగ్ హాం కాలువ మొదలుకొని అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలి. రోడ్లపైన సరకు రవాణా భారం తగ్గించాలి.

Facebook నుంచీ కాపీ చేసిన టపా!!!

8/06/2014 - రాసింది karthik at Wednesday, August 06, 2014
Copied from FB



నోరు విప్పితే ఆంధ్రా వాళ్లపై దాడి. దగా- మోసం- కుట్ర…. ఈ మూడు పదాలు నిత్యం రామ నామ జపంలా జపించి తెలంగాణ ప్రజల్ని నమ్మించి నట్టేట ముంచాడు కేసీఆర్. విభజనకు ముందు నిపుణులు, ఏపీ ముఖ్యమంత్రి గొంతి చించుకుని చెప్పారు తెలంగాణ ఆంధ్రమీద, ఆంధ్ర తెలంగాణ మీద ఆధారపడి ఉంది. ఈ రాష్ట్ర విభజన ఇరు రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంది అని నెత్తీనోరు మొత్తుకున్నారు. అయినా వినలేదు. మభ్యపెట్టి… ఏదో ఒకలా ఇచ్చేయండని అన్నారు. ఈరోజు తెలంగాణ పొలాలు ఎండిపోయాయి. ఉత్తర తెలంగాణకు రైస్ బౌల్ అని పేరున్న మెదక్ జిల్లా పొలాలు గొంతెండి చూస్తున్నాయి. అవన్నీ బోరు బావుల పంటలు. కరెంటు ఉంటేనే పంటకు నీరు. దీనికి తోడు వర్షాభావం. దీంతో మెట్టరైతులు పంట వేయలేక అన్యాయం అయిపోతే బోరు బావుల కింద రైతులు పంటలు వేసి కరెంటు కోసం చూసి చూసి అది రాక అన్యాయం అయిపోయారు. హైదరాబాదు నగరానికి రోజుకు ఐదు గంటలు కోతలు పెట్టినా, అన్ని జలాశయాలు నిండుకుండలా మారినా తెలంగాణకు అవసరమైన విద్యుత్తు అందడం లేదు. ఎందుకంటే… ఈ పొలాలన్నీ ఇంతకాలం ఆంధ్రా నుంచి వచ్చే విద్యుత్తుతో పండేవి. ఇపుడు అది వేరే రాష్ట్రం, ఇది వేరే రాష్ట్రం. ఆ రాష్ట్రం తన అవసరాలు చూసుకోవడంతో తెలంగాణ రైతులు అన్యాయం అయిపోయారు.
దీనికి ఎవరు కారణం?

కచ్చితంగా తొలి దోషి టీఆర్ఎస్. ఎన్నికల ముందు అంత ఆఘమేఘాల మీద విభజన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. ఈరోజు రెండు రాష్ట్రాల ప్రజలను నడిరోడ్డున నిలబెట్టాల్సిన పరిస్థితి. తెలంగాణకు కరెంటు ప్రాణం, ఆంధ్రకు రాజధాని ప్రాణం. ఆంధ్రకు రాజధాని పోయి వారు తీవ్రంగా ఆదాయాన్ని కోల్పోయి నష్టపోతే… తెలంగాణలో ఉన్న వ్యవసాయం, పరిశ్రమలు నడపటానికి కీలకమైన కరెంటును నష్టపోయి ఇక్కడి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఇంత ఘోరమైన విభజన చేయకపోతే విభజన కు పార్లమెంటు సాక్షిగా డెడ్ లైన్ పెట్టి మూడేళ్లలో ఇటు కరెంటు ఉత్పత్తిని పెంచి, అటు రాజధానిని నిర్మించి రాష్ట్రాన్ని విడదీసి ఉంటే ఇరు ప్రాంతాల ప్రజలు భరోసాతో జీవించేవారు. రెండు రాష్ట్రాలు క్షేమంగా ఉండేవి. కానీ కాంగ్రెస్, టీఆర్ఎస్ అధికార దాహం ఇరు ప్రాంతాల ప్రజల పాలిట శాపమైంది. హైదరాబాదులో వేలసంఖ్యలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడే ప్రమాదం పొంచిఉంది. అక్టోబరు నుంచి నిరంతర కరెంటు సరఫరా ఉండే ఆంధ్రకు ఈ చిన్న పరిశ్రమలు తరలిపోయినా పెద్ద ఆశ్చర్యమే లేదు. ఎందుకంటే వాటిని తరలించడం చాలా సులభం. పైగా వాటికి విద్యుత్తు అత్యంత అవసరం. ఈ నేపథ్యంలో వారికి ఆంధ్ర మెరుగైన ఆప్షన్ అవుతుంది.

ఏ మొహం పెట్టుకుని ఆంధ్రాను అడుగుతారు ?

నిస్సిగ్గుగా, నిర్మొహమాటంగా తన తప్పులను పక్కన పెట్టి ఎదుటి వారిని వేలెత్తిచూపడంలో నోబెల్ అవార్డు అంటూ ఉంటే అది కేసీఆర్ నే వరిస్తుంది. అధికారం కోసం అత్యాస పడిన కేసీఆర్ ఇపుడు కరెంటు ఇవ్వడం చేతకాక చంద్రబాబు తాజాగా ఆగ్రహం వ్యక్తంచేశారు.
వీటీపీఎస్ నుంచి 500 ముద్దనూరు నుంచి 210 మెగావాట్లు విద్యుత్తు రావాల్సి ఉన్నా ఆంధ్రా సీఎం అడ్డుకుంటున్నారని రైతులకు ఆయన చంద్రబాబును చూపిస్తున్నారు. మరి ఇదే బుద్ధి ఫీజు రీఎంబర్స్ మెంటు విషయంలో ఏమైంది. మా పిల్లలకే ఫీజులు ఇస్తాం, మీకేం నొప్పి అని బడాయి చెప్పిన ఆయన అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం ఆ ప్రజలకు తన సొంత విద్యుత్తు ఇవ్వడంలో తప్పేముంది. తెలంగాణలో దశాబ్దాలుగా స్థిరపడి ఇక్కడే పుట్టి పెరిగిన వారినే పట్టించుకోనపుడు ఆ రాష్ట్రం తెలంగాణ గురించి ఎందుకు పట్టించుకుంటుంది? ఎందుకు పట్టించుకోవాలి.
విభజన చట్టం ఉల్లంఘించి ఉన్నత విద్యా మండలి పెట్టినపుడు గుర్తురాలేదా అదే చట్టం ఉల్లంఘించి వారు విద్యుత్తు ఆపేయవచ్చని?. ఉమ్మడి రాష్ట్ర జీవోను ఉల్లంఘించి ఆంధ్ర వాహనాలపై పన్ను వేసినపుడు గుర్తురాలేదా… అదే ఉల్లంఘన వారు కూడా చేయగలరని? మా రాష్ట్రం, మా విద్యావిధానం మా ఇష్టం అన్నపుడు గుర్తురాలేదా … వారు కూడా మా రాష్ట్రం మా విద్యుత్తు మా ఇష్టం అంటారని? మాకు కర్ణాటక ఎంతో ఆంధ్రా అంతే అన్నపుడు గుర్తురాలేదా… ఆంధ్రప్రదేశ్ కూడా మాకు కర్ణాటక ఎంతో, తెలంగాణ అంతే అని అనగలదని.
ఇతర రాష్ట్రాల సీఎంలు మాత్రం తమ ప్రజల ప్రయోజనాలు త్యాగం చేసి తెలంగాణకు విద్యుత్తు ఇవ్వాలా? ఎవడు నేర్పిన న్యాయం ఇది! నీ ప్రయోజనాలకు సంబంధించి చట్టం ప్రకారం జరగాలి. ఇతరుల ప్రయోజనాలకు సంబంధించిన విషయాలు అయితే కేసీఆర్ ఇష్టం ప్రకారం జరగాలా? విభజనకు ముందు ఆంధ్రోళ్లను కడుపులో పెట్టుకుని చూసుకుంటాం అన్న మాటలు మరిచిపోయి ఆంధ్రోడు అన్న మూలం ఎక్కడున్నా వేటాడుతున్న కేసీఆర్ కు ఆ ఆంధ్రోడు ఎందుకు విద్యుత్తు ఇవ్వాలి?

(నోట్ : లాఠీ ఛార్జి జరిగితే తెలంగాణ బిడ్డలను రాక్షసంగా అణచివేస్తారా అన్న కేసీఆర్ ఈరోజు కరెంటు అడిగిన పాపానికి మెదక్ జిల్లాలో రైతులపై లాఠీ ఛార్జి చేయించాడు. పదిమంది రైతులకు ఈ సందర్భంగా తీవ్ర గాయాలయ్యాయి. అధికారులు, పోలీసుల తీరుపై రైతులు తిరగబడటంతో రాత్రి పొద్దుపోయాక కేసీఆర్ … దీనికంతటికీ బాబే కారణం అంటూ ఆంధ్ర వైపు వేలెత్తి చూపాడు. ఈ కథనం నేపథ్యం ఇది.)

సమస్యలు: అటూ, ఇటూ ..

7/31/2013 - రాసింది karthik at Wednesday, July 31, 2013
చివరకు కేంద్రం తెలంగాణ ప్రకటించింది. ఇప్పటిదాకా తిట్టుకున్న తిట్లన్నీ మర్చిపొయి ఇప్పుడు అందరం సోదరభావంతో ఉందామని ప్రముఖులంతా ప్రకటనిస్తున్నారు.. సరే, సంతోషం!  నేను ఆ విషయం గురించి ఏమీ చెప్పదలుచుకోలేదు. విభజన కరెక్టా, కాదా అనే చర్చ కూడా ఇప్పుడు అప్రస్తుతం. ఎందుకంటే ప్రజలలో మానసికంగా విభజన జరిగి ఒక ఐదారేళ్ళకు పైగానే అయింది. ఒకరు విగ్రహాలు పగులగొట్టినప్పుడు, కవిత్వం పేరుతో బూతు పురాణాలు ప్రచురించినప్పుడు, మరొకరు ఆత్మాహుతి దళం గా మారుతాం అన్నప్పుడే మానసిక విభజన్ ఏ స్థాయిలోఓ ఉందో చూశాం.. 

ఒక సమైక్యవాదిగా సారీ ఇప్పుడు ఈమాటకు విలువ లేదు కదా, సరే ఒక సీమబిడ్డగా ఈ నిర్ణయం వల్ల మా నాకు కనిపిస్తున్న నష్టాలు:

1. హైదరాబాదు నుంచీ సీమాంధ్ర ప్రాంతాలకు బస్సు చార్జీలు పెరగడం. ఎందుకంటే అంతరాష్ట్రాల మధ్య ఉండే టాక్స్ అదనంగా కట్టాలి. ఇది సీమాంధ్రులకు మాత్రమే నష్టం కాదు. అంతకంటే ఘనుడు ఆచంట మల్లన్న అని ఇరు ప్రాంతాల వారూ మొహమాటం లేకుండా ఈ టాక్స్ వేసుకుంటారు.

2. కరెంట్ కష్టాలు అధికమవడం. సీమాంధ్రులకు సింగరేణి బొగ్గు, సాగర్ నుంచీ కరెంట్ రెండు కష్టమే.. ఎందుకంటే తెలంగాణ ప్రాంతానికే ఇవి సరిపోవడం కష్టం. కాబట్టి ఇక సీమాంధ్రులు ఎంచక్కా కరెంట్ తీగలపై బట్టలారేసుకోవచ్చు.

3. రాయలసీమలో, యస్ నా సీమలో తాగడానికి కూడా నీళ్ళు దొరకవు. కరువుసీమలో పుట్టిన పాపానికి సాగు నీళ్ళ గురించి ఆలోచించడం అత్యాసే కానీ ఇప్పుడు తాగు నీరు కూడా కష్టమే. కడప, అనంతపురం జిల్లాలో అతి త్వరలో ఎడారులుగా మారే అవకాశాలు పుష్కలం.

4. ఉద్యోగాలలో ఇబ్బందులు వస్తాయి అని ఒక వాదన. కానీ ఈరోజులలో ప్రభుత్వ ఉద్యోగాలు ఉండేదే చాలా తక్కువ పోను పోను ఇంకా తగ్గిపోతాయి. కాబట్టి ఇది పరిగణలోకి తీసుకోలేము.

ఈ సమస్యలు పక్కన పెడితే ఈ తెలంగాణ ఏర్పాటు వల్ల కనీసం ఈ క్రింద చెప్పిన సమస్యలు తీరినా నేను సంతోషిస్తాను:

1. ఫ్లోరైడ్ సమస్య: మన ప్రభుత్వాల చేతగానితనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న ఈ సమస్య తీరితే అంతే చాలు.
2. ఐ.ఐ.టి. హైదరాబాద్ అంతర్జాతీయ సాంకేతిక కళశాలగా రూపుదిద్దుకోవాలి.
3. హైదరాబాదులో ఉన్న చిన్న చిన్న పరిశ్రమలకు నిరంతరంగా కరెంట్ ఇచ్చి అవి వేరే రాష్ట్రాలకు పోకుండా చూడాలి.
 
తెలంగాణ ఏర్పాటు వల్ల ఈ మాత్రం మేలు జరిగినా ఉద్యమానికి సార్థకత చేకూరినట్లే..


సర్వేజనా సుఖినోభవంతు
-కార్తీక్


దూసుకొచ్చిన కారు; తల్లీ పిల్లలు దుర్మరణం!

రాసింది karthik at Wednesday, July 31, 2013
న్యూఢిల్లీ, జూలై 30: ఈ రోజు సాయంత్రం ఏడుగంటల ప్రాంతం లో రాజధాని ఢిల్లీ నగరంలో JANPATH10 నంబర్ కల గులాబీ రంగు కారు ఫుట్ పాత్ పైకి దూసుకోపోవడం తో తల్లి, ఆమె పిల్లలు అక్కడిక్కడే అకాల మరణం పొందారు. ఈ దుర్ఘటన పొరపాటున జరిగింది కాదని, యస్.గాంధీ అనే విదేశీ వనిత తన కుమారుడైన రాహువును అందలమెక్కించడానికి చేస్తున్న అనేక ప్రయత్నాలలో ఒకటని అభిజ్ఞ వర్గాల భోగట్టా. ఇంతకు మునుపు ఇదే రాహువు కోసం యస్.గాంధీ బీహారీ చాత్ పూజలు చెయ్యడం, లక్నో కబాబులు తినడం లాంటి ప్రయత్నాలు కూడా చేసింది. అవి రెండూ బెడిసికొట్టడం తో నిస్సహాయురాలైన ఈ మృతురాలిని లక్ష్యం గా చేసుకుని ఈ ఘోరకలికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో ఎలాంటి పొరపాట్లు కాకుండా పిగ్విజయ్ సింగ్, గులాం ఆజాద్నహీ అనే డ్రైవర్ల దగ్గర నుంచీ సలహాలు తీస్కున్నట్టు తెలిసింది. 
మృతురాలి స్వస్థలం గోదావరీ, కృష్ణ పరివాహక ప్రాంతమని తన వాళ్ళందరూ అనాథగా వదిలివేయడంతో ఢిల్లీ రోడ్ల మీద బ్రతుకుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. మరణించిన వారి వివరాలు:

పేరు: తెలుగు తల్లి
పిల్లలు: శాంతి, తేజ

మరణించిన వారి ఆత్మలకు పుణ్యలోకాలు కలగాలని కోరుకుందాం!

మరణించిన వారిపై రాసిన పాటను క్రింది వీడియో చూడగలరు:





ఈ విషయం ఈరోజు హిందూ పేపర్లో వచ్చిన ఈ లేఖను ఒకసారి చూద్దాం. 


It looks like political expediency, not development, is behind the formation of a separate Telangana. The Congress is aware that Chief Minister Kiran Kumar Reddy is from Rayalaseema and has never openly backed the demand for Telangana. It is evident that his views were not taken seriously by the party high command which appears to have made up its mind after the BJP’s strident support for the cause.
The Congress will gain nothing from its latest move. It has lost its identity in all three regions of Andhra Pradesh. The party leaders from Telangana cannot hope to perform a magic in the region as the TRS, which has been pursuing the demand since 2001, will gain an upper hand. It may well turn out to be a straight contest between the TRS and the TDP. One thing is certain. Andhra Pradesh is heading for a long phase of uncertainty and violence.
V. Sriharsha,
New Delhi
నిన్ను రక్షించుకోలేకపోయిన దౌర్భాగ్యపు జాతి మాది. క్షమించు తెలుగు తల్లీ, క్షమించు!  

ఆశ్రునయనాలతో
-కార్తీక్

బ్రహ్మశ్రీ చాగంటి వారి వివాదం: నా అనుకోలు

7/21/2013 - రాసింది karthik at Sunday, July 21, 2013

గుర్తుకొస్తున్నాయి : రాజంపేట

5/07/2013 - రాసింది karthik at Tuesday, May 07, 2013

పొయిన నెలలో మా పెదనాన్న గారి సంవత్సరీకం జరిగితే రాజంపేటకు వెళ్ళాను.. మా పెదనాన్న గారి పార్థివ శరీరం చూసే అవకాశం నాకు రాసిపెట్టలేదు అందువల్ల ఇప్పుడు మిస్ అవకుండా అటెండ్ అయ్యాను.. రాజంపేట అంటే అన్నమయ్య జన్మించిన తాళ్ళపాకకు దగ్గర్లో ఉన్న చిన్న టౌను. అది మా అమ్మమ్మ గారి ఊరు కావడం వల్ల చిన్నప్పటి నుండీ సెలవలకు అక్కడికి వెళ్ళేవాడిని.. మా చుట్టాలు అక్కడ చాలామందే ఉన్నారు కానీ చిన్నతనంలో నా సమయమంతా మా అమ్మమ్మా వాళ్ళ గడ్డివామిలో ఆడుకునేందుకే సరిపోయేది.. ఆ గడ్డివామి దగ్గర నిలబడితే రాజంపేట రైల్వే స్టేషన్ కనిపించేది.. ఇప్పుడు ఆ గడ్డివామి లేదు, ఇళ్ళు కట్టడం వల్ల రైల్వే స్టేషన్ కూడా కనిపించదు. దాదాపు పది సంవత్సరాల తర్వాత ఆ ఊరికి వెళ్ళాను, ఊరు చాలా మారిపోయింది.. పాత బస్ స్టాండ్ నుంచీ స్టేషన్ దగ్గర మా అమ్మమ్మా వాళ్ళ ఇంటి వరకూ బైక్ లో వెళుతూ ఉంటే ప్రతీ వీధి, ప్రతీ షాపూ నా జ్ఞాపకాల నుంచీ బయటకు వచ్చాయి.. అలా ఆలోచిస్తూ ఉండగానే బి.యస్. థియేటర్ ఉన్న సందు కనిపించింది.. ఇప్పుడు ఆ థియేటర్ ఉందో లేదో తెలీదు.. కానీ నేను ఆ థియేటర్లో ఎన్ని సినిమాలు చూశానో లెక్కేలేదు. ఆ థియేటర్ స్పేషాలిటీ ఏమంటే అక్కడ కేవలం పాత సినిమాలు మాత్రమే వచ్చేవి.. మా మామ వాళ్ళతో ఆ సినిమాలకు మ్యాట్నీకి వెళ్ళేవాడిని, మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు నాకు ఎప్పుడూ లేదు మరి.. అలనాటి ఆణిముత్యాలు బాలనాగమ్మ, బందిపోటు, ఇల్లరికం, ఇంకా విజయా వాళ్ళ సినిమాలు ఆ హాల్లోనే చూశాను. ఆ సినిమాలకు వెళ్ళాలంటే కూడా చాలా షరతులు పెట్టేవాడిని, "రేలంగి ఉన్నాడా?", "రమణా రెడ్డి  ఉన్నాడా?", "రాజబాబు ఉన్నాడా?" లాంటి ప్రశ్నలకు సరైన సమాధానం దొరికితేనే వేళ్ళేవాడిని.. వాళ్ళు ముగ్గురూ లేని పాత సినిమాలు చూడటం దండగ అని నా నమ్మకం; అప్పుడే కాదు ఇప్పుడు కూడా!

ఇంకాస్త దూరం వెళితే సంగీత బుక్ లింక్స్ షాప్ ఉన్న స్థలం కనిపించింది. సంగీతా బుక్ లింక్స్ లో నేను షాడో, బుల్లెట్ నవలలు అద్దెకు తెచ్చుకుని చదివేవాడిని.. పుస్తకం మరుసటి రోజుకు ఇచ్చేయాలి కాబట్టి గబ గబా చదివేవాడిని.. కొన్ని సార్లు డబ్బులు తక్కువ పడేవి అప్పుడు మా మామ దగ్గరో, మా ప్రసన్నక్క దగ్గరో గాంధీ ఖాతా మీద డబ్బు తీసుకునేవాడిని.. :)   సంగీతా బుక్ లింక్స్ గురించి మా తమ్ముడిని అడిగితే ఆ షాప్ ఇప్పుడు మరో చోటకు మార్చారని, ఇప్పుడు ఎక్కువ కంపిటీటివ్ పరీక్షల పుస్తకాలు మాత్రమే అమ్ముతున్నారని చెప్పాడు.. ఇప్పుడు డిమాండ్ ఉన్నది వాటికేగా మరి.. ఇప్పుడు పుస్తకాలు అద్దెకు ఇచ్చే షాపులూ లేవు, తీసుకుని చదివే ప్రజలూ పెద్దగా కనిపించరు.. బహుశా పుస్తకాలు అద్దెకు తెచ్చుకున్న వారిలో నా తరం ఆఖరు అనుకుంటా..   పుస్తకాలు పక్కన పెడితే ఆ షాపు దగ్గర ఎప్పుడూ ఎవరో ఒకరు నిలబడి దేశ కాల వైపరిత్యాల గురించి చర్చిస్తుండేవారు.. అలాంటి వాళ్ళతో చర్చించేంత వయసు, సబ్జెక్ట్ నాకు లేకపోవడం వల్ల కేవలం వాళ్ళ చర్చ విని ఇంటికి వచ్చేవాడిని.. అదొక శునకానందం! 

ఇంకొంచెం ముందుకు వెళితే అక్కడ సమద్ థియేటర్ కనిపించింది. ఈ థియేటర్లో సహజంగా కొత్త సినిమాలు వచ్చేవి.. అవి కూడా డైరెక్ట్ రిలీజ్ కాదు కడపలో రిలీజైన వారం పది రోజులకు వచ్చేవి.. కానీ నా జీవితంలో మరచిపోలేని థియేటర్లలో అదీ ఒకటి. సినిమా ఏదో గుర్తులేదు కానీ ఒకసారి ఫస్ట్ షో  మధ్యలో కరెంట్ పోతే కరెంట్ వచ్చాక మళ్ళీ రమ్మని జనాలను ఇంటికి పంపించారు.. మేము ఇంటికి వచ్చి అన్నం తిని కరెంట్ వచ్చాక మళ్ళీ సినిమాకు వెళ్ళాం.. ఇలాంటి అనుభవాలు ఇప్పుడు ఎక్కడున్నాయి చెప్పండి??  ఇప్పుడు ఈ సమద్ థియేటర్ దగ్గర నుండీ మొదలయ్యే ఒక పెద్ద ఫ్లై ఓవర్ కట్టారు, దాని వల్ల రైల్వే ట్రాక్ దగ్గర ట్రాఫిక్ ఆగిపోయే సమస్య తప్పింది.. ఈ ఫ్లై ఓవర్ కట్టాలని బ్రిటీష్ కాలం నుంచీ ప్రతిపాదన ఉంటే రెండు మూడేళ్ళ క్రితం కట్టించారు.. స్వతంత్ర భారత దేశమా జోహార్!

ఇవన్నీ కాక రాజంపేటకు వెళితే తప్పకుండా చేసేపని బోనగిరి గుట్టకు వెళ్ళడం. ఈ గుట్ట మీద లక్ష్మీ నరసింహ స్వామి గుడి ఉంది.. అప్పట్లో ఆ గుడి శనివారాలు మరియూ ఇతర పర్వదినాలలో మాత్రమే తెరిచేవారు.. మేము అక్కడికి నడిచివెళ్ళేవాళ్ళం. దూరమెంతో గుర్తులేదు కానీ మాకు ఎప్పుడూ బడలిక అనిపించేది కాదు.. ఎందుకంటే మధ్య దారిలో పూర్తిగా మామిడి తోటలు. అక్కడక్కడా ఆగుతూ కాసేపు పెరిగెత్తుకుంటూ కొంచెం సేపు ఒకరితో ఒకరు పందేలు కాస్కుంటూ వెళ్ళేవాళ్ళం.. దారి మధ్యలో తినడానికి మిక్చర్ కలిపిన బొరుగులు..అదొక తీపి జ్ఞాపకం! ఇప్పుడు ఆ గుడిని మాజీ ఎం.ఎల్.ఏ. పసుపులేటి బ్రహ్మయ్య గారు బాగా అభివృధ్ధి చేయించారని తెలిసింది. ఇప్పుడు ప్రతీ రోజు ఆ గుడిని తెరుస్తారట పైగా కొండమీద మోటర్ వాహనాలు వెళ్ళే వెసులుబాటు కూడా ఉందట.. మేము వెళ్ళే కాలంలో ఇలాంటి సదుపాయం లేదు.. బహుశా అందువల్లే మేము ఎక్కువగా ఎంజాయ్ చేయగలిగామేమో!

భారత క్రికెట్ టీముకు సర్ రవీంద్ర జడేజా ఎలానో రాజంపేట ఊరికి పనీర్ సోడా అలాంటిది.. :)) ఈ కూల్ డ్రింక్ మరెక్కడా తయారు చేసినట్టు నేను చూడలేదు; వినను కూడా వినలేదు .. ఎలా చేస్తారో నాకు తెలీదు కానీ తింగర తింగరగా భలే ఉండేది. నా పదవ తరగతి సెలవల్లో ప్రతీ రోజూ రైల్వే స్టేషన్ నుండీ కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉన్న లైబ్రరీకి నడుచుకుంటూ వెళ్ళి ఈనాడు పేపర్ చదివేవాడిని. అలాంటి రోజులలో కొన్ని సార్లు పనీర్ సోడా తాగేవాడిని.. ఇప్పుడు అది ఎవరూ తయారు చేయడం లేదట.. ఎంత ఘోరం?? అలాంటిదే పెద్ద గ్రౌండులో జరిగే క్రికెట్ పోటీలు.. ప్రతీ వేసవిలో తప్పకుండా జరిగేవి.. ఒకటి రెండు సార్లు మా అన్న కూడా ఈ పోటీల్లో పాల్గొన్న టీములో ఉన్నాడు.. కానీ వాళ్ళ టీము ఆడిన మొదటి మ్యాచులోనే ఇంటికి వచ్చేసి ఆటగాడిగా మా అన్నకు, ప్రేక్షకుడిగా నాకూ శ్రమ తప్పించింది.. ఇప్పుడు కూడా ఇలాంటి పోటీలైతే జరుగుతున్నాయంట కానీ ముందంత జోరు లేదని టాక్.

అలానే రాజంపేటలో నాకు బాగా నచ్చే మరొక స్థలం అక్కడి స్కూలు, కాలేజి దాని పక్కనుండే పేఏఏద్ద గ్రౌండు..ఆ గ్రౌండులో ఉన్న పెద్ద పెద్ద చెట్లు.. రావి, మఱ్ఱి, జివ్వి లాంటి చెట్లు అక్కడ చాలా ఉండేవి. వాటి క్రింద ఆడుకునేందుకు మాకు కావాల్సినంత నీడ ఉండేది.  ఈ కాలంలో అంత గ్రౌండున్న స్కూల్ దొరకాలంటే చాలా కష్టం.. మా అమ్మా వాళ్ళ కుటుంబంలో అందరూ అక్కడ చదివిన వాళ్ళే; మా తాతగారు అక్కడ లెక్చరర్ గా పని చేశారు. నాకిప్పటికీ బాగా గుర్తు, మా అమ్మ ఒకసారి తను పరీక్షలు రాసిన క్లాస్ మాకు చూపించింది..  ఇలాంటి జ్ఞాపకాలు ఆ ఊరితో మరెన్నో ఉన్నాయి, దాదాపు పదేళ్ళ తర్వాత వెళ్ళాను కనుక ఇప్పుడు ఎక్కువగా టచ్ చేస్తున్నాయి..

-కార్తీక్ 

జీవనికి వెళ్ళామోచ్!!

4/02/2013 - రాసింది karthik at Tuesday, April 02, 2013

దాదాపు 7-8 నెలల నుంచీ అనుకున్న జీవని యాత్ర చివరకు నిన్న శని-ఆదివారాలు కుదిరింది. శనివారం పొద్దున మారథహళ్ళి నుంచీ నేనూ, రాజ్, భాస్కర్ అవినేని గారూ బయలుదేరాం.. భాస్కర్ గారి కార్లో వెళదామనుకోవడం వల్ల బస్/రైల్ రిజర్వేషన్ల గొడవ లేకుండా బయలుదేరాం..  భాస్కర్ గారికి లాంగ్ డ్రైవ్స్ అలవాటు ఉండటం వల్ల, అనంతపురం రూట్ తెలిసుండటం వల్ల ఏ ఇబ్బంది లేకుండా అనంతపురం దాకా వెళ్ళిపోయాం.. ముందు రోజు ఫోన్ చేసినప్పుడు ప్రసాద్ గారు చిలక్కు చెప్పినట్టు చెప్పారు "రాప్తాడు దాటిన తర్వాత కుడివైపు టర్నింగ్ తీసుకుంటే టౌన్లోకి వెళ్ళకుండా రోటరీపురం వచ్చేయచ్చు" అని.. కానీ నేను మరోసారి నా అలవాటును కొనసాగించి ఆ టర్నింగ్ గురించి భాస్కర్ గారికి చెప్పలేదు.. ఇప్పటిదాకా జీవనికి వెళ్ళిన ఎప్పుడు కూడా నేను ఆ టర్నింగ్ తీసుకోలేదు.. ఒకసారి ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కు వచ్చాం, నిన్న కూడా మిస్ అయ్యింది.. నేనే అనుకుంటే మన రాజ్ బాబు ఇంకా గొప్పోడు ఒకసారి రాప్తాడులో దిగేశాడు, ఇంకోసారి దిగాల్సిన స్టాప్ దాటి రెండు స్టాపుల తర్వాత దిగాడు.. బ్లాగర్లా మజాకా! 

అనంతపురం ఊర్లోకి వెళ్ళాక ఒక రెండు డజన్లమందిని రూట్ అడిగి (జ్ఞానేశ్వర్ గారు రూట్ చెప్పిన తర్వాత కూడా) తిన్నగా కాకుండా వంకర టింకరగా వెళ్ళి జీవని చేరుకున్నాం.. అక్కడికి హైదరాబాద్ నుంచీ రహ్మాన్, బెంగళూరు నుంచీ శారద గారు, ఆనంద్ గారు మాకంటే ముందే వచ్చేశారు. మేము కారులో వచ్చిన దానికంటే వాళ్ళు బస్సులో ముందు వచ్చారు.. మన బస్సులు ఎంత ఫాస్ట్ పోతాయో దీనిద్వారా ప్రజలు తెలుసుకోవాలి..  శారద గారు రెగులర్గా బ్లాగులు చదువుతుండటం వల్ల మా గురించి ప్రవర చెప్పకుండానే గుర్తు పట్టేశారు.. పిల్లలు ఇంకా స్కూల్ నుంచీ రాలేదు కాబట్టి భోజనాలకు ఇంకా టైం ఉండటం వల్ల  పిల్లల రూములు అవి చూశాం.. పిల్లలంతా బట్టల అల్మారాలు, పుస్తకాల అల్మారాలు చాలా నీటుగా పెట్టుకున్నారు.. నేను ఆ వయసులో ఎప్పుడూ నా పుస్తకాలు అంత నీటుగా పెట్టుకోలేదు.. నర్సరీలో ఉండే పిల్లలకు స్కూల్ లేదు కాబట్టి వాళ్ళతో పరమ పద సోపాన పటం, టిక్ ట్యాక్ టో లాంటి ఆటలు ఆడించాం.. మన రాజ్ బాబు స్మైలీ అనే పాపతో ఆడాడు.. కనీసం మూడుసార్లు పెద్ద పాము నోట్లో పడి క్రిందకు వచ్చాడు.. ఇక స్మైలీకి ఇంకా నంబర్లు కరెక్ట్ గా తెలీదు.. ఎటు సైడు నిచ్చెన కనిపిస్తే ఆ సైడు తన బొమ్మ జరిపేసుకుంది.. ఎలాగైతే ఏం చివరకు రాజ్ బాబే గెలిచాడు.. కాంగ్రాట్స్ రాజ్! 

భోజనాలయ్యాక పిల్లలందరితో కూర్చుని మాట్లాడుతూ వాళ్ళ చేత పాటలు పాడించాం.. దాదాపు పిల్లలంత ఉత్సాహంగా పాటలు పాడారు ఒకరిద్దరు డాన్సులు కూడా చేశారు..జీవనిలో డాన్సులు, పాటలు అంటే శివకుమార్ గురించి చెప్పాలి.. తను ఇప్పుడు 7వ తరగతి చదువుతున్నాడు.. నాలైదు పాటలు కలిపి సొంతంగా తనే డాన్స్ కంపోజ్ చేసుకుంటాడట.. జీవని హాస్టల్ శంకుస్థాపన రోజు మైక్ తీసుకుని పాట, స్పీచ్, మిమిక్రి అన్నీ కలిపి కొట్టాడు. మైక్ వెనక్కు తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడ్డాం.. శివనే కాక దాదాపు పిల్లలందరూ స్టేజ్ ఫియర్  లేకుండా ముందుకు వచ్చి పాటలు పాడారు.   సాయంత్రమయ్యాక పిల్లలందరూ స్నాక్స్ తిని వరుసగా కూర్చుని హోంవర్క్ చేసుకున్నారు.. మేము కాసేపు దాకా నడుచుకుంటూ వెళ్ళి వచ్చాం.. మాతోపాటూ రాజ్ కుమార్ ఉన్నాడు కాబట్టి ప్రతీ నాలగు సెకన్లకు ఒక కుక్క మా వెనుక పడేది. ఎలాగో తప్పించుకుని, కాట్లు లేకుండా మళ్ళీ వెనక్కు వచ్చేశాం.. శునక చరిత్ర తెలుసుకోవాలనుకున్నవాళ్ళు ఈ లంకెను నొక్కండి..

సాయంత్రానికి హైదరాబాదు నుంచీ సురేష్ పెద్దరాజు గారూ, లక్ష్మి నరేష్, చిత్తూరు నుంచీ బంతి వచ్చేశారు..  రాత్రి భోజనాలయ్యాక కొంతసేపు సాహిత్య చర్చ జరిపి కొన్ని ఆడియోలు విని వీడియోలు చూసాం..  పడుకోవాలని డాబా మీదికెళ్ళి అక్కడ కూర్చుని బాలయ్య విగ్ కలెక్షన్ దగ్గర నుంచీ 2014 ఎన్నికల దాకా చాలా విషయాలు మాట్లాడుకున్నాం.. Everything and anything under the sun is discussed. భాస్కర్ గారు తప్ప మిగిలిన వాళ్ళమంతా ఈ సుదీర్ఘ చర్చల్లో పాల్గొని తమ తమ విజ్ఞానానికి పదును పెట్టుకున్నారు..  భాస్కర్ గారు త్వరగా నిద్రపోయారు కాబట్టి (అ)జ్ఞాన యజ్ఞంలో పాల్గొనలేకపోయారు.. 

ఆదివారం పొద్దున నిద్ర లేచి డాబా పై నుంచీ ప్రకృతి రమణీయతను ఆస్వాదించాం.. అప్పటికే పిల్లలందరూ లేచి పుస్తకాలు తెరిచి హోం వర్క్ అవి చేసుకుంటున్నారు.. కొంత సేపయ్యాక పిల్లలకు శారద/ఆనంద్ గార్లు  తెచ్చిన  రంగులు ఇచ్చి హోలీ ఆడించాం.. పిల్లలు ముందు కొంచెం భయపడ్డారు కానీ తర్వాత రంగుల అయిపోయాక కూడా మామూలు నీళ్ళు కూడా ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఆడుకున్నారు. అప్పటిదాకా బుద్దిగా హోం వర్క్ చేసుకున్న పిల్లలు ఒక్కసారిగా తమ అసలైన బాల్యాన్ని ఆవిష్కరించారు..  మాటలతో చెప్పడం కాదు కానీ వాళ్ళ కేరింతలు నిజంగా చూడాల్సిందే..కలర్స్ తేవాలనే చక్కని ఐడియాతో వచ్చిన ఆనంద్/శారద గార్లకు అభినందనలు.. 

హోలీ అయ్యాక పిల్లలందరితో క్రికెట్ ఆడాం.. మన లక్ష్మి నరేష్ తన సీనియారిటీ అంతా ప్రదర్శించి పిల్లలందరికి సూచనలిస్తూ దుమ్ము లేపాడు.. సురేష్ గారు ధోనీ అసూయ పడేలా రెండు సిక్సర్లు పీకి తన బ్యాటింగ్ ప్రావిణ్యాన్ని ప్రదర్శించారు.. భాస్కర్ గారు అంపైరింగ్ చేసారు.. కానీ మ్యాచులో హైలెట్ మాత్రం రాజ్ కుమారే.. బ్యాటింగులో ముందుకు జరిగి, వికెట్ల వెనక్కు జరిగి, భరత నాట్యం, కథకళి ఫ్యూజన్ చేసి క్రీజ్ మీద అరాచకం చేశాడు.. పైగా హ్యాట్రిక్ ఫోర్లు కూడా కొట్టాడు.. ఆ జుగల్ బందీ కార్యక్రమం వాళ్ళ ఒంకార్ అన్నయ్య చూసుంటే ఆట-36 కి రాజ్ కుమార్నే జడ్జ్ గా పెట్టుకునేవాడు.  

క్రికెట్ తర్వాత టిఫిన్లు చేసి చలో తాడిపత్రి అన్నాం.. పిల్లలకు మెడికల్ చెకప్ ఉండటం వల్ల దొరికిన తీరికను ఇలా వాడుకున్నాం.. ముందుగా చెప్పుంటే విజయమోహన్ గారే అనంతపురం వచ్చేవారు కానీ నేను ఆయనకు ఫోన్ చెయ్యడం మర్చిపోయాను.. అనంతపురం నుంచీ ఫోన్ చేస్తే విజయమోహన్ గారు ఇంటికి రమ్మని పిలిచారు.. నాకేమో కుదరదనిపించింది కానీ సురేష్ గారూ, లక్ష్మి నరేష్ తాడిపత్రి గుడి చూద్దాం అని సజెస్ట్ చెయ్యడంతో విజయమోహన్ గారికి ఫోన్ చేసి వస్తున్నామని చెప్పాను.. ఆయన దగ్గరుండి రెండు గుళ్ళు చూపించారు.. ఆ గుళ్ళ గురించి రాయాలంటే ఈ టప సరిపోదు కాబట్టి రాయడం లేదు. తర్వాత వాళ్ళింటికి వెళ్ళాం, వాళ్ళింట్లో ప్రతీ ఒక్క వస్తువూ ఒక మాస్టర్ పీసే.. మేము విజయమోహన్ గారితో మాట్లాడటం కంటే వాళ్ళింట్లో ఆర్ట్ వర్క్స్ ఫోటోలు తీసుకోవడానికే ఎక్కువ సమయం కేటాయించాం.. టౌన్లో పుట్టి సిటీలో బ్రతుకుతున్న నాలాంటి వారికి విరగకాసిన మామిడి చెట్టును చూసి చేతులు ముడుచుకుని కూర్చోవడం చాలా కష్టమైంది. వాళ్ళింట్లో మొత్తం మూడు మామిడి చెట్లు, రెండు శ్రీగంథం చేట్లు (తిరుమల నుంచీ తెచ్చి వేశారట), ఒక జామ చెట్టు, ఒక దేవ గన్నేరు, ఇంకా ఒక వెరైటీ క్రోటన్ మొక్క ఉన్నాయి.. నేను ముందు అనుకున్నట్లు తాడిపత్రి వెళ్ళకుండా ఉంటే చాలా మిస్ అయ్యేవాడిని.. విజయమోహన్ గారిలా కళాహృదయం, ప్రకృతిని ప్రేమించే గుణం ఈ కాలంలో బహు అరుదు.. వారికి అన్నివిధాలా తోడ్పాటును అందించిన వారి కుటుంబ సభ్యులు ఇంకా అరుదు.

తాడిపత్రి నుంచీ వచ్చాక భోజనాలు చేసి మేము అందరికీ వీడ్కోలు చెప్పి బయలుదేరాం.. రెండు రోజులు ఎలా గడిచిపోయాయో ఇప్పటిదాకా అర్థం కావడం లేదు.. కానీ ఒక్కటి మాత్రం నిజం ఈ మధ్య కాలంలో ఇంత మంచి ట్రిప్ నేను అసలు వెయ్యలేదు.. నేను వెళడం అనగానే ముందుకువచ్చిన రాజ్, శ్రమ అనుకోకుండా కార్ డ్రైవ్ చేసిన భాస్కర్ గారికి ధన్యవాదాలు.. అలాగే హైదరాబాద్ నుంచీ వచ్చిన బంతి, నాగార్జున, రహ్మాన్, సురేష్ పెద్దరాజు, లక్ష్మి నరేష్ గార్లకు కూడా నెనర్లు..

మేము వెళ్ళడం అనేది పక్కన పెడితే, రోటరీపురంలో కాపురం ఉంటున్న ప్రసాద్ గారి కుటుంబం సదా అభినందనీయులు.. ఏ చిన్న అవసరం వచ్చిన ఆఖరకు ఉప్పూ, చింతపండూ కావలసి వచ్చినా అనంతపురం (12కి.మి) వెళ్ళాలి.. మరి ప్రసాద్ గారి కుటుంబం ఎలా మేనేజ్ చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. జీవని హోం శంకుస్థాపన అప్పుడు శీనన్న ఒక మాట అన్నాడు "జీవనిలో ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు కానీ ఇక పైన జరిగే ప్రయాణం నూనే పూసిన స్థంభాన్ని ఎక్కడం లాంటిది" అని. రోటరీపురంలో ప్రసాద్ గారి కూటుంబం ఉండటం ఖచ్చితంగా అలాంటిదే..

పప్పుసార్,
ఈ టూర్ విషయంలో మిమ్మల్ని ఎలా మిస్ అయ్యానో ఇప్పటిదాకా అర్థం కావడాం లేదు.. ఇందుకుగానూ మీకు బ్లాగు ముఖంగా క్షమాపణలు తెలుపుకుంటున్నాను.. మరోసారి ఇలాంటి ట్రిప్(అన్నీ కుదిరితే డిశంబర్లో) వేస్తే మీరు మిస్ అవ్వకుండా చూసుకుంటాను.. ఈసారికి మమ్మల్ని క్షమించేసేయండి.. ;-)

సర్వేజనా సుఖినోభవంతు,
-కార్తీక్

సినిమా ఆట!!

2/18/2013 - రాసింది karthik at Monday, February 18, 2013

చిన్నప్పుడు చాలా ఆటలు ఆడుకుంటాం కానీ కొన్ని ఆటలు మర్చిపోలేని గుర్తుగా మిగిలిపోతాయి. 
ఏంటి, బొంగులో బ్లాగుకు ఇంత బిల్డప్ అవసరమా అనుకుంటున్నారా?? కికికి.. ఈరోజు భావావేశం పడిశం పట్టినట్టు పట్టింది.. అందులో నుంచీ వచ్చిందే ఇది.. 

సరే విషయానికి వస్తే చిన్నప్పుడు మేము సినిమా ఆట అనే ఒక చిత్రాతి చిత్రమైన ఆట ఒకటి ఆడుకునేవాళ్ళం.. ఇందులో రూల్ ఏమంటే కొత్తగా వచ్చిన ఏదైనా సినిమాని రీమేక్ చెయ్యాలి. అంటే కాపీ రైట్లు, మ్యూజిక్ రైట్లు కొనడం కాదు ఆ సినిమాలో జరిగినట్లు డైలాగులు, పాటలు, ఫైట్లు చెయ్యాలి.. మా కాంపౌండులో జనాలు చాలామందే ఉండేవారు..  కానీ మా కాంపౌండులో సినిమా ఆట అంటే జనాలు పక్క కాంపౌండ్ నుంచీ కూడా వచ్చేవాళ్ళు.. మా గ్యాంగులో  మా అక్కలు ఇద్దరు, మా పక్కింట్లో ఉండే ఒక అక్క ఒక బాబు, మా ముందింట్లో ఉండే ఒక అక్క.. పక్క కాంపౌండునుంచీ సరోజ అనే ఒక పాప. ఈ సినిమా ఆటగా ఆడటానికి నాకు ఎక్కువగా నచ్చే సినిమా మరణ మృదంగం.. ఎందుకంటే ఆ సినిమాలో డైలాగులు పాటలు ఏమీ ఉండేవి కాదు.. జట్టుకు ఇద్దరు చొప్పున జట్లుగా విడిపోయి, మెట్ల కిందా, బావి పక్కన దాక్కుని "ఢన్ ఢన్ ఢన్ ఢన్" అని అరుస్తూ ఉంటే కాసేపటికి బోరుకొట్టిన జట్టు చెప్పా పెట్టాకుండా ఇంటికి వెళ్ళిపోతుంది సినిమా ఆటోమేటిగ్గా అయిపోతుంది..  

మన సమాజంలో ఉన్న వివక్ష గురించి నాకు తెలిసింది ఈ సినిమా ఆటలోనే, ఎందుకంటే సినిమా ఏదైనా సరే విలన్ మాత్రం నేనే, ఎందుకంటే నేను వయసు ఆధారిత మైనార్టీని కాబట్టి.. అప్పటికి మా కాంపౌండ్లో ఐదుకంటే తక్కువ వయసున్న వాడిని నేను మాత్రమే.. అందుకని మరో ఆలోచన లేకుండా నన్నే విలన్ పాత్రకు ఫిక్స్ అయ్యేవాళ్ళు.. 
ఆటలో నాకు మాబాగా గుర్తున్న సినిమా "శివ".. నాగార్జున అనే హీరో ఒకడున్నాడని మా పక్కింటి సరోజ లాంటి చిన్నపిల్లలకు చాటిచెప్పిన సినిమా "శివ".. నాకు నాగార్జున ముందే తెలుసు, మా అమ్మ నన్ను విక్కిదాదా సినిమాకు రాయల్ హాల్ లో మాట్నీకి తీసుకెళ్ళింది.. ఐ యాం ఇంటెలిజెంట్ యు నో!! 

ఆ "శివ" ప్రభంజంలో అలవాటుగా మా కాంపౌండ్లో సినిమా ఆట మొదలుపెట్టారు, నన్ను మామూలుగానే విలన్ చేశారు అంటే "భవానీ" అన్న మాట..   ఆ భవాని మాటిమాటికీ ఒక చిన్న సీసా తీసి ఏదో తాగుతాడు.. నాకు ఏం తాగాడో తెలీదు కానీ నేను కూడా ఏదో ఒకటి తాగాలి అందులో బాటిల్ లాంటి దానిలో తాగాలి, అలాంటి సమయంలో నాకు రస్నా ఆడ్ గుర్తుకు వచ్చింది.. వెంటనే నా తెలివిని పూర్తిగా ఉపయోగించా! మా వంటింట్లో ఉండే మరచెంబు నిండా రస్నా పోసి తెచ్చుకున్నా..  ఇంక చూసుకో నా సామీ రంగా నా డైలాగ్ వచ్చినప్పుడల్లా గటగటా తాగి డైలాగులు చెప్పేవాడిని.. అప్పట్లో రియాల్టీ షోలూ టాలెంట్ షోలు లేవు కానీ లేకపోతే నాది కమలహాసన్ లెవెల్ యాక్టింగ్..  
అలానే మరొక సినిమా ఆఖరిపోరాటం.. అందులో నేను ఎక్కువగా బూటులో కత్తి పెట్టుకునే రౌడీ పాత్ర వేసేవాడిని.. మా అక్కలిద్దరిలో ఎవరికి నన్ను కొట్టాలనిపిస్తే వాళ్ళు హీరో పాత్ర వేసేవాళ్ళు.. నాగార్జున పేరు చెప్పుకుని నన్ను ఫుట్ బాల్ ఆడేసుకునేవాళ్ళు.. 

ఇవన్నీ కాదు గానీ సినిమా ఆటలో నాకు బాగా గుర్తున్న విషయం మాత్రం నేను మెట్ల మీద నుంచీ దొర్లుకుంటూ కింద పడ్డం.. ఎవరో కొట్టారో తెలీదు కానీ విలన్ పాత్రను తన్నాలన్న ఉత్సాహం ఎక్కువై కొట్టారు.. నేను మిద్దె మీద నుంచీ దొర్లుకుంటూ కిందికి వచ్చి పడ్డాను.. ఏంతైనా మైనార్టీనీ కదా ఏమైనా చెప్పుకోలేను..

అన్నట్టు చెప్పడం మరిచిపోయా, మా పక్క కాంపౌండ్ జనాలు కూడా మా కాంపౌండ్ కి రావడానికి కారణం మా ఆర్కెస్ట్రా.. మా పెద్దక్క, మా పక్కింటి అక్కా మంచి సింగర్స్.. మా ముందింట్లో ఉండే అక్క పెద్ద సింగర్ అవ్వాలని వాళ్ళింట్లో వాళ్ళు హార్మోనియం కొనిచ్చారు.. ఇంక చెప్పేదేముంది?? అందరు కలిసి ఇరగదీసేవాళ్ళు.. 


-కార్తీక్ 

హవ్వ!! కిడ్నాపులు "తప్పనిసరి" అట, మరి మర్డర్ల మాటేమిటి??

4/28/2012 - రాసింది karthik at Saturday, April 28, 2012
కొద్ది సేపటి క్రితం ఒకానొక కమ్యూనిస్టు మితృడు తన బ్లాగులో వెలిబుచ్చిన అమూల్యమైన అభిప్రాయాలకు మైండ్ బ్లాక్ అయ్యి ఏం చెయ్యాలో అర్థం కాక ఈ టపా రాస్తున్నాను.. ఆ టపా లంకె ఇక్కడ చూడగలరు..

ఒడిషా, ఛత్తిస్ ఘడ్     రాష్ట్రాలలో మావో యిస్టులు చేస్తున్న కిడ్నాపులు "తప్పనిసరి" అట..  వాటి గురించి రాజ్యం అపోహలకు గురి చేస్తోందట.. ఇంకా నయం  వాళ్ళందరూ  వేసవి విహార యాత్రకు వెళ్ళారని చెప్పలేదు..  ఇక కిడ్నాపులు ఆపరేషన్ గ్రీన్ హంట్ ను కొంతవరకూ నియంత్రించేందుకు చేస్తున్నవట..సరే! ఎదురుగా పోరాడలేక ఇలా దొంగ దెబ్బ తీస్తున్నారు. ఇది కమ్యూనిస్టులకు కొత్తా కాదూ, ఇదే చివరా కాబోదు..
ఇక్కడ  మన మితృడు రాసిన మరొక విషయం  " ఏ నేరమూ చేయని ఆదివాసులను మావోయిస్ట్ సానుభూతిపరుల పేరుతో వందలాది మందిని జైళ్ళలో కుక్కుతూ వారికి న్యాయ సహాయం అందకుండా చేస్తున్న రాజ్య వికృత రూపాన్ని బట్ట బయలు చేసేందుకు ఇదో ప్రతిఘటనా రూపంగా విప్లవ పార్టీ ఎంచుకున్న మార్గం."
వారికి న్యాయ సహాయం అందకుండా రాజ్యం చేస్తోంది అనేది వీరి ఆరోపణ.. అసలు  మావోయిస్టులు ఈదేశ న్యాయ వ్యవస్థ మీదనే నమ్మకం లేదని తుపాకి గొట్టాన్ని నమ్ముకున్న గుంపు, మళ్ళీ వీళ్ళు న్యాయ సహాయం అందడం లేదని వాదించడం ఏ లాజిక్ కు అందని ఎర్ర లాజిక్.. మరొక విషయం, న్యాయ సహాయం నిజంగా కావాలంటే  తగినంత రెమునరేషన్ ఇస్తే వీళ్ళ కేస్ తీసుకునే లాయర్లే కరువయ్యారా??  డబ్బులు లేవని కహానీలు చెప్పకండి, తుపాకులకు, క్లైమర్ మైన్లకు వచ్చే డబ్బులు న్యాయ సహాయానికి రావా??
ఇదే వ్యాసం లో ఉన్న మరొక వాక్యం "ఇదే సందర్భంలో అమెరికన్ అపవిత్ర కలయికకు పుట్టిన దేశం ఇజ్రాయిల్ వారి వద్ద నుండి అత్యంతాధునిక ఆయుధాలను కొనుగోలు చేస్తూ మానవ రహిత విమానాల ద్వారా ఆదివాసీ ప్రాంతాలపై నిఘాత పాటు దాడులకు పూనుకుంటున్నది రాజ్యం."
అంటే ఇజ్రాయెల్ నుంచీ కాకుండా చైనా, రష్యాల నుంచీ  ఆయుధాలు దిగుమతి చేసుకుని వాటితో కాలిస్తే మావోయిస్టులకు సమ్మగా స్వర్గం లో తేలుస్తున్నట్టు ఉంటుందా??  ఈ వాక్యం ఇజ్రాయెల్ అంటే కమ్యూనిస్టులకు ఉన్న అపరిమిత ద్వేషాన్ని, ఇంకా చెప్పాలంటే అంతర్లీనంగా ఉండే భయాన్ని తెలియచెబుతుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఈనాడు ప్రపంచాన్ని శాసిస్తున్న దేశం ఇజ్రాయెల్ మాత్రమే.. ఒకానొక చిన్న దేశం  ఐదు దశాబ్దాల కాలం లో ఇంత బలంగా ఎలా అయ్యింది అనేది ఆలోచించి, ఆ స్పూర్తితో  మనం కూడా అభివృధ్ధి వైపు పయనించాలి.. అంతే కానీ, బాగుపడ్డ ప్రతీవాడినీ demonize చేస్తూ బ్రతకడం  అసమర్థతకు నిదర్శనం..   

ఈ వ్యాసం మొత్తం లో అత్యంత ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే "ఇలా రాజ్యం బహుముఖంగా తన దాడిని విస్తరిస్తూ ఉద్యమం మనుగడను ప్రశ్నార్థకంగా మార్చ జూసే క్రమంలో కిడ్నాప్ ఎత్తుగడ మొదలైంది."

Ladies and Gentlemen!
finally a communist confessed that they have become obsolete and they have to do something to stay in the news. అతడు సినిమా లో ఒక డయలాగ్ ఉంది "ఇలానే ఉంటే కొన్ని రోజులకు మీడియా వాళ్ళు ఆ తర్వాత ప్రజలు మనల్ని మర్చిపోతారు" అని, ప్రస్తుతం కమ్యూనిస్టుల పరిస్థితి అలానే ఉంది.  మునుపటిలాగ యువత వీళ్ళను నమ్మడం లేదు.  బ్రాహ్మణ ద్వేషాన్ని/హిందూ ద్వేషాన్ని పైసలుగా  మార్చుకునే రోజులు పోయాయి, యువత తమ సమస్యలకు ఇంకొకరు బాధ్యులు  చేసే ధోరణిని క్రమంగా విడిచి పెడుతున్నారు. ఇది కమ్యూనిస్టుల కు గొడ్డలిపెట్టుగా మారింది.They are just unable to accept this reality and are frustrated. These kidnaps are a clear indication of that frustration.

ఇక వీళ్ళు చెప్పే మరొక పెద్ద జోక్ ఆదీవాసుల హక్కులు, వాళ్ళ జీవనం. ఆదివసులు ఖచ్చితంగా మన సమజాం లో ఒక విశిష్ఠమైన స్థానం కలిగిన వారు, అందులో ఏమాత్రం అనుమానం లేదు. కానీ ఆదివాసుల రక్షణ అంటే తుపాకీ పోరాటం కాదు, ఆదివాసుల రక్షణ అంటే  కమ్యూనిజం కాదు.. ఆదివాసుల రక్షణ అంటే నగరవాసుల చావు అసలే కాదు.

పైన రాసిందంతా నాణేనికి ఒక వైపు మాత్రమే, ఇప్పుడు కిడ్నాపులు తప్పని సరి అయ్యాయి అంటున్నారు  మరి బలిమెల లో నిరాయుధులైన పోలీసులక్ను పాశవికంగా చిత్రహింసలు పెట్టి చంపారు.. మరి అప్పుడు గ్రీన్ హంట్ లేదు కదా కామ్రెడ్స్?? మరి అప్పుడు న్యాయ సహాయం గుర్తు రాలేదా కామ్రెడ్స్?? ఇలాంటి లాజిక్కులు మాట్లాడుతారు కాబట్టే గురివింద గింజ కూడా మిమ్మల్ని చూసి సిగ్గుపడుతుంది.

-కార్తీక్
 





చీకటి రహస్యాలు -3

3/20/2012 - రాసింది karthik at Tuesday, March 20, 2012
నా చీకటి రహస్యాలంటే అందరికీ తెలిసినవి కావు. కానీ నేనే అందరికీ చెప్పేస్తున్నా ఎందుకంటే రేపో మాపో ఏ బ్లాగీ లీక్స్ వాడో బయటపెడితే అవి కరెక్టా కాదా అందరూ నన్నడగడం, నేను మళ్ళీ వాటి గురించి ఒక శ్వేతపత్రం విడుదల చెయ్యడం, ఎందుకీ గోలంతా?? అందుకే చెప్పేస్తున్నా.. నేను ఇంతకుముందు చెప్పిన రహస్యాలు ఇక్కడ లేక ఇక్కడ చదవండి.

నేను సినిమాలు చూడ్డం మొదలుపెట్టిన కొత్తల్లో చిరంజీవి సినిమా ఒకటి వచ్చింది.. అప్పట్లో నేను చిరంజీవిని/బాలకృష్ణ కాకుండా ఇంకెవర్నీ హీరోలుగా ఒప్పూకునేవాడిని కాదు. సినిమా పేరు రుస్తుమో లేక రోషగాడో కరెక్ట్ గా గుర్తులేదు. ఆ సినిమాలో చిరంజీవి పేరు గండ్రగొడ్డలి.  ఒకానొక ఫైటింగ్ సీన్లో చిరంజీవి ఎద్దులబండిలో నుంచీ క్రిందకు దూకి రౌడీలతో ఫైటింగ్ మొదలు పెడతాడు. ఇంతమంచి సీన్ చూసి కూడా కంట్రోల్ చేసుకుని సైలెంట్ గా ఉండటం చాలా కష్టమైన పని. అసలే చీమ దూరే ప్లేస్ లో డైనోసార్లను పంపించడం నా అలవాటు. మరుసటి రోజు మేము రాజం పేట నుంచీ కడపకు వచ్చాం, బస్టాండ్ నుంచీ రిక్షాలో ఇంటికి వస్తున్నాం..ఎర్రముక్కపల్లె సర్కిల్ లో మా రిక్షా చుట్టు రిక్షాలు వచ్చాయి.. ఇంత మంచి అవకాశం వస్తే వదులుతానా?? వెంటనే చిరంజీవిలాగా రిక్షా లో నుంచీ దూకి ఇంటికి వెళ్ళాలని ఫాస్ట్ గా వెళుతున్న రిక్షా లో నుంచీ క్రిందకు దూకాను. అలా దూకిన తర్వాత నాకు రెండు విషయాలు అర్థం అయ్యాయి: 
1. నేను చిరంజీవిని కాను, ఎందుకంటే చిరంజీవి బండిలో నుంచీ దూకి ఫైట్ చేశాడు. నేను మాత్రం రిక్షా లో నుంచీ దూకి నేలకు అతుక్కుపోయాను. మోకాళ్ళు, మోచేతులు పూర్తిగా దోక్కుపోయాయి.. క్రింద పెదవి దగ్గర నుంచీ రక్తం కారుతోంది. రాం చరణ్ కు పోటీకి వస్తానని చిరంజీవే ఏదైనా చేశాడేమో అని నా డౌట్. ;) 
కరెక్ట్ సమయానికి పక్క రిక్షావాళ్ళు బ్రేకులు వేశారు కాబట్టి సరిపోయింది లేకపోతే PH కేటగిరీలో పరీక్షలు రాయాల్సివచ్చేది.
2. మా అమ్మ చాలా మంచిది, ఎందుకంటే నేను కావాలని దూకానని మా అమ్మకు అర్థం కాలేదు. ఏదో రోడ్డు మీద గుంతలకు జారి పడ్డాననుకొంది. అక్కడి నుంచీ డైరెక్ట్ గా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి ఇంజెక్షన్ ఇప్పించింది. మా ఇప్పటికీ ప్రజలకు చెబుతూ ఉంటుంది మా వాడు ఒకసారి రిక్షాలోనుంచీ జారి పడ్డాడు అని.. కికికి

దేవుడు మేలు చేసి అప్పటికి నాకు తలక్రిందులుగా దూకడం రాదు.. వచ్చుంటే బహుశా అది కూడా ట్రై చేసేవాడిని.. అలా చేసుంటే మీకు ఈ సోదంతా చదివే భారం తప్పేది.

మరొక రహస్యం,
నేను 2006లో ఒక రెండు నెలలు మారుతీ ప్లాంట్ లో Summer Internship చేశాను. మే, జూన్ నెలల్ల్ ఢిల్లీ ఎండలకు ఆ మాయదారి ప్లాంట్ లో పని చెయ్యడమంటే సిక్కిం బంపర్ లాటరీ కొట్టడమే. మా సెక్షన్ లో నాతో పాటూ నాలాగే లాటరీ తగిలి పంజాబ్ ఇంజినీరింగ్ కాలేజ్, ఐ.ఐ.టి. ఢిల్లీ వాళ్ళు ఇంకొక 4 ఉండేవాళ్ళు. అందరం కలిసి internship అంటే విహార యాత్ర అనే విధంగా ఎంజాయ్ చేసేవాళ్ళం.. ప్లాంట్ లో ఏ.సీ. ఉండేది కాదు కనుక కూసింత సేద దీరడానికి ఒకానొక మాల్ కి వెళ్ళాం.. మరే!! రిలాక్స్ అవ్వడానికి పూర్తిగా ఆఫీస్ టైమే వాడేవాళ్ళం, ఎక్కడ పోగొట్టుకుంది అక్కడే వెతుక్కోవాలి.. అఫీస్ పని వల్ల అలసిపోతాం కాబట్టి ఆఫీస్ టైం లోనే రిలాక్స్ అయ్యేవాళ్ళం. అలా  వెళ్ళి ఒక 2-3 గంటలు రిలాక్స్ అయ్యాక మా ఫ్రెండ్ ఒకడు బాత్రూం వెళ్ళాల్సి వచ్చింది. అటూ ఇటూ చూశాడు కానీ ఎక్కడా కనిపించలేదు.. అందుకని అక్కడున్న సెక్యూరిటీని బాత్రూం ఎన్నో ఫ్లోర్ లో ఉందని అడిగాడు.. వాడు ఒక దిక్కు చూపిస్తే అక్కడికి వెళ్ళాం, తీరా చూస్తే అది అక్కడ పని వాళ్ళు వాడే బాత్రూం.. తర్వాత ఆలోచిస్తే అర్థం అయిన విషయం ఏమంటే ఆ సెక్యూరిటీ యూనిఫర్మ్ లో ఉన్న మా జిడ్డు మొహాలని చూసి అక్కడ పని చేసేవాళ్ళమనుకున్నాడు.. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని నేను  పట్టించుకోలేదు కానీ మా గ్రూప్లో ఉన్న ఇంకొకడు మాత్రం  బాగా హర్ట్ అయ్యాడు..   ఏం చేస్తాం, ఇటీజ్ కర్మ! దట్సాల్!! 


- కార్తీక్




చిత్రమాలిక లో లారెన్స్ ఆఫ్ అరేబియా (1957)

2/16/2012 - రాసింది karthik at Thursday, February 16, 2012
యుద్ద కథల మీద వచ్చిన ఇంగ్లీష్ సినిమాలకు ఒక ప్రత్యేకమైన వర్గం అభిమానులుగా ఉంటారు. వాళ్ళను ఆకట్టుకోవడానికి వచ్చే ఏ అవకాశాన్నీ దర్శక-నిర్మాతలు వదులుకోరు. ఆ కేటగిరిలో వచ్చిన సినిమానే లారెన్స్ ఆఫ్ అరేబియా. ఈదాదాపు మూడున్నర గంటల నిడివి గల ఈ సినిమా అనే పదానికి ఏమాత్రం తీసిపోదు. ఈ సినిమా గురించిన మొత్తం వ్యాసాన్ని చిత్రమాలికలో ఇక్కడ చదవండి.

ఇలాంటి సినిమాలు చూసినప్పుడు మనసులో ఎక్కడో కొంచెం బాధగా ఉంటుంది. గ్రాఫిక్స్ కు అంత ఖర్చు పెట్టాం, ఆ లొకేషన్లో తీశాం అని చెప్పుకునే మన దర్శకులు కథ గురించి ఎందుకు ఆలోచించరో.. ఒకవైపు హాలీవుడ్ లో ఎన్నెన్నో ఇతి వృత్తాలతో కథలు వస్తుంటే మన సినిమాలు మాత్రం "హీరో" లను ఆకాశానికి ఎత్తేయడం లో బిజీగా ఉన్నాయి. ఫార్ములా పేరు చెప్పుకుని ఇంకా ఎంతకాలం ఈ తొడ కొట్టడాలు, మాఫియా డాన్లను భరించాలో ఏమో :((

బ్లాగరుడ పురాణం -1

1/08/2012 - రాసింది karthik at Sunday, January 08, 2012
కొత్త బ్లాగు లోకం లోకి వచ్చిన వాళ్ళకు ఇక్కడ జరిగే గొడవల గురించి ముఖ్యంగా ఓకానొక విదేశీ భావజాలం గొప్పదని జనాల మీద దాడులు చేసే వాళ్ళ గురించి హెచ్చరించడానికి ఇది "రెకనార్"
ముందుగా డైరెక్టుగా విషయం లోకి పోకుండా ప్రస్తుతం మలక్ మీద జరుగుతున్న దుష్ప్రచారం గురించి కొన్ని విషయాలు చెప్పాలి:
 అక్కడ విశేఖర్ గారు తాను మార్తాండని సమర్థిస్తున్నానని అందుకు కారణం మలక్ మార్తాండ ను నా ప్రపంచం బ్లాగులో "ఒరేయ్" అని అన్నాడని సెలవిచ్చారు..  అది జరిగిన లింక్ అని ఆయన "నా ప్రపంచం" బ్లాగు లింక్ ఇచ్చారు ఆ లింక్ ఇది: (http://naprapamcham.blogspot.com/2009/09/blog-post_26.html)
ఆ టపా రాసింది సెప్టెంబర్ 26, 2009 లో... మరి ఒకసారి ఈ లింక్ చూడండి (http://naprapamcham.blogspot.com/2009/09/blog-post_10.html) అదే బ్లాగులో అంతకంటే పది హేను రోజుల ముందు జరిగింది.. అక్కడ సదరు మార్తాండ మలక్ ని అన్నది ఇది:
" PKMCT said...
    భరద్వాజ మహర్షి గెడ్డం తీసేసి సంసార జీవితంలోకి వచ్చినట్టు ఉన్నాడు. అందుకేనేమో సమాధానం చెప్పడం లేదు."

గడ్డం తీసేసి సంసార జీవితం లోకి వచ్చినట్టున్నాడు అని ఏ హక్కు తో అంటాడు? ఏ సభ్యత తో అంటాడు? (hehe ఆయన పదాలే,  టి.వీ. సిరీయల్ లో డయలాగుల్లా ఉంటే ఎంకరేజ్ చేసినట్టుంటుంది అని వాడుకున్నా :))
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మలక్ కామెంట్ పెట్టింది మంచు గారికి కానీ మార్తాండ గురించి కాదు.. అలాంటప్పుడు ఆయనను కెలకాల్సిన అవసరం మార్తాండకు ఎందుకు??? మార్తాండ విశేఖర్ గారు చెబుతున్నంత అమాయకుడైతే తన భావాలేవో రాసుకుని వెళ్ళచ్చు  కదా.. ప్రక్కవాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి ఎందుకంత జిలానందం??? వల్చర్ థౌజండ్ బఫెలోస్, వన్ సైక్లోన్ స్మాష్ అన్నట్టు, మార్తాండకు మలక్ తగిలాడు.. and the rest, as you see is history :))

actually జూలై 17, 2009 రోజు మలక్ ఈ టపా రాశారు (http://malakpetrowdy.blogspot.com/2009/07/blog-post_17.html) .. మలక్-ఏకలింగం ఒకరే అని మార్తాండ చేసిన ప్రేలాపనకు రుజువు చూపమని చేసిన చాలెంజ్ అది.. దానికి ఇప్పటి దాకా మార్తాండ నుంచీ సమాధానం రాలేదు.. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు.. మలక్-ఏకలింగం ఒకరే అని ప్రూవ్ చేస్తే మలక్ ఆ చాలెంజ్ కి తప్పకుండా కట్టుబడి ఉంటారు..  :P
మధ్యలో మార్తాండ నాదెండ్ల కామెడీ చేశాడు.. ఆ లింక్ ఇక్కడ చూడండి : http://malakpetrowdy.blogspot.com/2009/07/blog-post_6509.html
 
ఇక  విశేఖర్ గారు ప్రవీణ్ పై దాడి మొదలైనప్పుడు అని రాసి మార్తాండకు సింపతీ పెంచాలని చాలానే ప్రయత్నించారు.. కానీ infront crocodile festival..ఒకసారి ఈ క్రింద స్క్రీన్ షాట్లు చూడండి.. ఈ కామెంట్లన్నీ మా శ్రేయోభిలాషి అయిన ఒక మహిళ బ్లాగులో సదరు ప్రవీణ్ అనే శాల్తీ రకరకాల పేర్లతో ఆమెను తిడుతూ రాసినవి... దానికి ఆమె బాధ పడుతూ వేరేటపా కూడా పేట్టారు.. మరి ఇక్కడ దాడి చేసింది ఎవరు??  ఆవిడంతకు ఆవిడ ఏదో కథ గురిచి రాసుకుంటే వ్యక్తిగత దాడులు చెయ్యాల్సిన అవసరం ప్రవీణ్ కు ఎందుకు??  ఆయన చెప్పినట్టు మనసు బాధపడటానికి ఒక్క వ్యాఖ్య చాలదా?? ఈ మాట ప్రవీణ్ కు ఎందుకు చెప్పరో అర్థం ఆయనకే తెలియాలి..


విశేఖర్ గారు చెప్పిన మరొక విషయం  భావజాలానికి ప్రతినిధి.. 
కిం.ప.దొ.న. :))
మార్తాండ ఏ భావజాలానికి ప్రతినిధి?? స్త్రీవాదానికా?? మహిళా బ్లాగర్లలో ఎంతమంది స్త్రీవాదులున్నారో తెలుసా?? మరి వాళ్ళను ఎవరూ ఏమీ అనరు ఎందుకో.. లేక నాస్తిక వాదానికా?? మరి శరత్ గారు కూడా నాస్తికులే, కానీ మా శ్రేయోభిలాషి... ఆయన ఎప్పుడు ఇంకొకరి కుటుంబాలను అన్నట్టు చూడలేదు..

అయితే గీతే, మార్తాండ తప్పకుండా కమ్యునిజానికి ప్రతినిధి అయ్యుంటాడు.. ఎందుకంటే, ఈ కమ్యునిజం సిద్దాంతం ప్రవచించేది అదే..  కార్మిక వర్గం, కర్షక వర్గం అని పడి కట్టు పదాలతో పక్క వాడి ఆస్తిపాస్తులు కాజేయడాన్ని లీగలైజ్ చేసేదే కమ్యూనిజం..   కమ్యూనిజం గురించి నేను ముందు రాసిన టపా ఇక్కడ చూడవచ్చు..

ఇక విశేఖర్ గారి గురించి ఏమని చెప్పాలి?? ఆయన రాసినది చూద్దాం:
పావని లాంటి వారికి గలిగిన గౌరవ భంగం కంటే మానవాళిని కాపాడగలదని నమ్మే నా సిద్ధాంతమే నాకు ముఖ్యం. ఆ విషయాన్ని పావనిలాంటి వారు కూడా అర్ధం చేసుకోగలరని నా నమ్మిక.
పక్క మనిషికి గౌరవ భంగమైనా ఈయనకు ఇబ్బంది లేదట.. ఇదెక్కడి సంస్కారమో నాకైతే తెలియదు.. పక్కనోడి భావలను గౌరవించలేని సిద్దాంతం ఒక సిద్దాంతమేనా?? అలాంటి సిద్దాంతం తో మానవాళికి ఏం విముక్తి కలుగుతుందో ఆ దేవుడికే తెలియాలి..
కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ మార్తాండ, విశెఖర్ లాంటి వాళ్ళు కమ్యూనిజం ఎందుకు ఫెయిల్ అయింది, అవుతోంది అనేదానికి classic cases గా నిలుస్తారు.. వీళ్ళు పక్కనోడిని తిడితే నోరు మూసుకుని ఉండాలి.. కానీ పక్కనోడు రెస్పాండ్ అయితే  భరించలేరు.. అందుకే,   కమ్యూనిష్టు హయాం లో ఒక తియోన్మెన్ స్క్వేర్ జరిగినా,  పోల్ పాట్ లాంటి వాళ్ళు కమ్యూనిష్టు ప్రభుత్వాలలో ఉన్నా అది వింతగా కనిపించదు.. 
p.s.: See the last comment in the screen shot, Martanda himself confessed that he is an "ఎమోషనల్ దెయ్యం " :D

బ్లాగరుడ పురాణం లో మళ్ళీ కలుద్దాం (అవసరమైతే).. అంతవరకూ శలవు!

--కార్తీక్





బ్లాగర్లు!! అందుకోండి నెనర్లు!!

12/07/2011 - రాసింది karthik at Wednesday, December 07, 2011
నవంబర్ 12, 2011

ఉదయం 9:30,
రాజ్ కుమార్ కి ఫోన్ చేశాను.. ఎందుకో మరి ఫోన్ ఎత్తలేదు..  హైదరాబాద్ నుంచీ ఒక బ్యాచ్, బెంగళూరు నుంచీ ఒక బ్యాచ్ వస్తున్నారు.. అందులో చాలామంది సీమ సందుల్లోకి మొదటి సారి వస్తున్నారు..  ఎక్కడున్నారో ఏమో అని టెన్షన్!!  అసలే ఈ సారి అక్టోబర్ లో కూడా ఎండలుగా ఉన్నాయి,  వీళ్ళకు ఎలా ఉందో ఎమో..

హైదరాబాద్ బ్యాచ్ పరిస్థితి ఏంటో కనుక్కుందామని రెహ్మాన్ కు ఫోన్ చేశాను.. రెహ్మాన్ ఏదో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాడు.. ప్రతీ మాటకు పక్కన కౌంటర్ పడుతూ ఉంది.. ఒక నిమిషం తర్వాత నేను మాట్లడలేను బాబూ అని ఫోన్ పెట్టేశాడు.. సో బానే ఎంజాయ్ చేస్తున్నారు, పర్లేదు అనుకున్నాను..

మధ్యాహ్నం 12:40,
మళ్ళీ రాజ్ కే ఫోన్ చేశాను..  ఒక లేడీ వాయిస్ మా సీమ యాసలో జవాబిచ్చింది.. నేను ఆ గొంతు ఎవరిదో కనుక్కున్నాను.. సొ అందరూ కలిశారు ఎంజాయ్ చేస్తున్నారు అని ఊపిరి పీల్చుకున్నాను.. తర్వాత ఒక గంట సేపు ఇంట్లో పనులలో బిజీగా ఉండటం వల్ల ఎవరికీ ఫోన్లు చెయ్యలేదు స్టేటస్ అడగలేదు..

మధ్యాహ్నం 3:15,

ఈసారి మళ్ళీ రహ్మాన్ కు ఫోన్ చేశాను..  టిపికల్ రెహ్మాన్ స్టైల్ లో "బస్సులో కాక బండి తీసుకుని వస్తున్నామండి" అని జవాబిచ్చాడు.. హమ్మయ్య అని కుదుటపడ్డాను.. ఎందుకంటే అనంతపురం నుంచీ పులివెందులకు 3గం. ప్రయాణం అని ఎవరో చెప్పారు.. మూడు గంటలు ఆ డొక్కు బస్సులో జర్నీ చేస్తే వీళ్ళ పరిస్థితి స్త్రీవాద కథ లో హీరోలా తయారౌతుంది..

పులివెందుల పేరు విని వీళ్ళు కూడా "ఓదార్పు యాత్ర" సభ్యులనుకోకండి.. వేదమంత్రాల నడుమ అగ్నిహోత్రుని సాక్షిగా నవంబర్ 13, 2011 నాడు నా పెళ్ళి జరిగింది..  ఆ పెళ్ళికని మన బ్లాగర్లందరూ పులివెందులకు వచ్చారు.. డైరెక్ట్ గా పులివెందులకు ట్రైన్ సదుపాయం లేదు కనుక రెండు బ్యాచులు అనంతపురం లో కలిసి కొంతసేపు జీవని పిల్లలతో ఉండి తర్వాత పులివెందులకు వచ్చారు.. బ్లాగర్లంతా సందడి సందడిగా అల్లరి చేశారు.. నేను పిటల మీద నుండి మధ్య మధ్యలో వీళ్ళని చూస్తున్నాను.. ఎందుకంటే వీళ్ళకు ఆ మొత్తం గుంపులో నేను తప్ప ఇంకెవరూ తెలీదు.. నేనేమో మాట్లాడలేను.. వీళ్ళకు బోర్ కొడుతుందేమో అని కొంచెం ఫీలింగ్.. కానీ బ్లాగర్లా మజాకా.. అందరూ దుమ్ము లేపారు..ఎక్కడ విశాఖపట్నం, ఎక్కడి కడప.. ఎక్కడ నా సోది, ఎక్కడ వాళ్ళ కవితలు, పాటలు.. కొందరు జిల్లాలు దాటి వచ్చారు.. కొందరు రాష్ట్రాలు దాటి వచ్చారు.. అందరికీ పేరు పేరునా కృతజ్ఞతాంజలి..  ఫ్రెండ్షిప్ కు విలువ ఇచ్చి ఇంత దూరం వచ్చారని మా అమ్మా వాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు.. చాలామంది మెయిల్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.. అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.. 

మన వాళ్ళిచ్చిన గ్రీటింగ్ కార్డ్.. ఎంత నచ్చిందో..
పెళ్ళికి వచ్చిన బ్లాగర్లు:
1. భజ్ కుమార్
2. సెగట్రీ
3.  మజ్జిగ చిలికే
4. వెంకట్ గారు
5. తీగ ప్రసాద్
6.  గిన్నెల గరన్
7.  కింకర్. తుస్
8. బంతి గారు ( మా అధ్యక్షులు)
9. అల్లాఉద్దీన్ మిల్క్ షేక్
10. డ్రాగార్జున
11.  జీవని ప్రసాద్ గారూ
12. చిలమకూరు విజయమోహన్ గారు





వస్తామని అనుకుని ఆఖరి నిముషం లో రాలేకపొయిన వాళ్ళు:
1. పప్పు సార్
2. బులుసు గారు
3. కౌటిల్య
4. ఆర్కె
5. ఆండి
6. పవన్ 
7. విజయక్రాంతి (ఈయన ఇప్పుడు నాకు బంధువు అవడం వల్ల వాళ్ళ అమ్మ గారు వచ్చారు)  
8. పెళ్ళికి కొన్ని రోజుల ముందు ఇండియాకు వచ్చిన మంచు గారు ఆ లోపే మళ్ళీ అమెరికా వెళ్ళిపోయారు.  ఆయనకూడా వచ్చుంటే ఇంకెంత సందడిగా ఉండేదో!!! 
9. ఏకలింగం గారు కూడా ఇండిఆ కు వస్తే పెళ్ళి అటెండ్ అవుతానని చెప్పారు.. కానీ ఆయన ప్లాన్ తర్వాత మారింది..

I very much missed all of you.. your presence means a lot to me..

బులుసు గారు వస్తే కనుక ఆయన్ని ఎలాగోలా మేనేజ్ చేసి ఘృతాచి చేత గానా బజానా ఏర్పాటు చేయించాలని మన కుర్రోళ్ళు ప్లాన్ చేశారట.. అది తెలిసే ఆయన రాలేదు అని బయట టాక్..  ఎంత వరకూ నిజమో నాకైతే తెలీదు.. ఆ స్కాం తో నాకేం సంభంధం లేదు..

వీళ్ళే కాక, వై.యస్. వివేకానంద రెడ్డి, ఒంగోల్ శీను, వై.యస్. భాస్కర్ రెడ్డి లాంటి ప్రముఖులు కూడా నా పెళ్ళి వచ్చి నన్ను ఆశీర్వదించారు..  కెబ్లాస నుంచీ ఎవరూ రాలేదు.. మరే! ఒంగోల్ శీను ఇప్పుడు బ్లాగర్ స్థాయి నుంచీ ప్రముఖుడి స్థాయికి చేరుకున్నాడు.. :D

-- కార్తీక్

మహిళా బ్లాగర్లకు బొనాంజా ;)

10/12/2011 - రాసింది karthik at Wednesday, October 12, 2011
ఈ మధ్య నాకు లేటుగా తెలిసినా లేటేస్టు గా తెలిసిన విషయం ఏమిటంటే బ్లాగర్లు నన్ను నా వంటల వల్ల గుర్తుపెట్టుకుంటున్నారట. అందుకని వారి అభిమానాన్ని గుర్తిస్తూ వాళ్ళ కోసం మరో వంటకం అందిస్తున్నాను.
ఈరోజు వంటకం పేరు బెంగళూరు వంకాయ పప్పు.. అసలు బెంగళూరు వంకాయ అంటే చాలామందికి తెలియదు అలాంటి వాళ్ళ సౌకర్యం కోసం కింద క్లోజప్ ఫోటో పెట్టాను అది చూసి మీ జ్ఞాన చక్షువులను తెరిచి ఆ జ్ఞానాన్ని పొందండి.   ఇక అసలు ఈ కూరగాయనే ఎందుకు తీసుకున్నానంటే మా ఇంటి పక్కనున్న షాప్ లో వేరేవి లేవు అందువల్ల..
బెంగళూరు వంకాయ

 పోతే ఈ వంటకానికి కావాల్సిన వస్తువులు: ఒక బెంగళూరు వంకాయ, ఒక కట్ట కరివేపాకు, కొంచెం కొత్తి మీర, 3 చెంచాల నెయ్యి (ఒక చెంచా తిరగవాతలోకి, రెండు చెంచాలు ఆ తర్వాత కలుపుకునేటప్పుడు వేసుకోవడానికి)  మరియూ తిరగవాత సామాన్లు .. వీటన్నిటితో పాటూ కావాల్సింది కొండంత మోటివేషన్..  నా అంత మోటివేషన్ మీకు ఉండకపోవచ్చు ఎందుకంటే ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ; కాబోయే కుటుంబరావుకు కొవ్వెక్కువ సారీ కసి ఎక్కువ. కనుక "డాక్టర్ సినీ యాక్టర్" సినిమాలో కృష్ణ లా మోటివేట్ అయ్యి కసితో వంట మొదలు పెట్టాను.

ఇకపోతే సామాన్ల తో పాటు పెరుగు ప్యాకెట్ కూడా ఉంది.. అది ఎందుకంటే ఒక వేళ ఈ తిండి అటో ఇటో ఐతే అప్పుడు ఎంచక్కా పెరుగన్నం లాగించెయ్యచ్చు.. మరే!  పడవతో పాటూ లైఫ్ బోట్ కంపల్సరీ కదా..  ఇలా అనుకుని ముందు కూరగాయలు తరిగాను.. ఈసారి పుస్తకాలు చదవలేదు కాబట్టి ఎలా తరగాలి అన్న కంఫ్యూజన్ అస్సలు లేదు..  నాకు ఇష్టం వచ్చినట్టుగా నిలువుగా అడ్డంగా, నా సామి రంగా చెడామడా తరిగేశాను..  ముందు ఆ ఫోటోలు పెడదామనుకున్నాను మళ్ళీ ఈ టపా లేడీస్ స్పెషల్ కదా, అంత వయొలెంట్ ఫోటోలు వద్దని పెట్టలేదు.  అలా తరిగాక కుక్కర్లో కొంచెం కందిపప్పు, ఈ వంకాయ ముక్కలు మరియూ నీళ్ళు పోసి స్టౌ మీద పెట్టాను.. మా కుక్కర్ గ్యాస్ కట్ లేచిపొయినట్టుగా ఉంది కనుక అసలు విజిల్స్ రాలేదు..  మా కుక్కర్ కూడా మా మేనేజర్ లాగే అవసరానికి ఎప్పుడూ ఉపయోగపడదు.. కొంచెం సేపటి తర్వాత నేనే ఆఫ్ చేసి కుక్కర్ మూత తీయడానికి ట్రై చేశాను అది నా మీద చాలా కోపంగా ఉంది కాబోలు కస్సు బుస్సు అని సెగలు కక్కింది.. శాంత్ గదా ధారీ భీం శాంత్ అని కొన్ని నీళ్ళు చల్లి కొంచెం సేపు వెయిట్ చేసి కుక్కర్ మూత తెరిచాను.. స్పూన్ తో పప్పుని, కూరగాయలను టచ్ చేసి చూశాను అవి ఉడికిపోయి ఉన్నాయి.. వావ్! సగం వంట అయిపోయింది.. ఇంక మిగిలింది తిరగవాత వెయ్యడం మాత్రమే.. జజ్జినక జజ్జినక!!    
తిరగవాత అనేది ఒక సెపరేట్ అసైన్మెంట్.  వంట అనేది థియరీ పరీక్షల్లాంటిదైతే తిరగవాత ల్యాబ్ exam లాంటిది.. కనుక ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా వైవా చెప్పినంత బాగా నటించాలి..   ముందుగా  కొంచెం నెయ్యి వేడి చేసిన బాణలి లో వెయ్యాలి.. అది కాగిందా లేదా తెలుసుకోను కొన్ని ఆవగింజలు వెయ్యాలి.. అవి బుస్ బుస్ అని సౌండ్ చేశాక అందులో కరివేపాకు, సన్నగా తరిగిన మిరపకాయలు, తిరగవాతలో వేసే బేడలు(పేరు మర్చిపోయాను ఏమనుకోకండి) , ఇంగువ వేయాలి.. ఆ తర్వాత తిరగవాత లో నుంచీ కొంచెం పొగ రావడాం మొదలయ్యాక స్టౌ ఆఫ్ చేయాలి.. అంతే! తిరగవాత రేఢీ.. ఇప్పుడు ఈ తిరగవాతను ఆ పప్పులో వేసి దానికి తగినంత ఉప్పూ, కారం, పసుపు వేసి బాగా కలపాలి..  (ఇంట్లో ఉంటే కొంచెం చింతపండు కూడా వెయ్యచ్చు కానీ నా దగ్గర లేదు కనుక వెయ్యలేదు)
  ఇంకా చెప్పేదేముందీ?? మీ అభిమాన వంటకం బెంగళూరు వంకాయ పప్పు రెఢీ..

మహిళా బ్లాగర్లందరూ ఈ వంటకం యొక్క రెసిపీని విచ్చలవిడిగా వాడుకోవచ్చు.. నేనెలాంటి పేటెంట్ గొడవలు చెయ్యనని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాను..   ఇలా మహిళా ప్రత్యేకమైన టపాలు రాసి స్త్రీజాతిని ఉద్దరిస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను.. నాకు ఈ అవకాశం కల్పించిన బ్లాగర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.. 


-కార్తీక్

అక్కినేని టాప్-10

9/15/2011 - రాసింది karthik at Thursday, September 15, 2011
తెలుగు సినీచరిత్రలో అక్కినేని నాగేశ్వరరావు గారి శకం ఒక సువర్ణాధ్యాయం. ఆయన నటించిన సినిమాలలో టాప్-10 ఏవి అని చర్చకు చిత్రమాలిక శ్రీకారం చుట్టింది. ఈ చర్చ యొక్క ముఖ్య ఉద్దేశ్యం, ప్రేక్షకులు మెచ్చిన ఆ సినిమాల గురించిన ఒక repository తయారు చెయ్యడమే తప్ప మరొకటి కాదు. ఈ పని అనుకున్నంత సులువు కాదని తెలుసు కానీ సినిమాల మీద అభిమానం ఈ కార్యానికి పురికొల్పింది. అందరూ ఈ చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలు తెలపాలని చిత్రమాలిక టీం మనవి చేస్తోంది.

అవినీతి; అన్నా హజారే; నా అభిప్రాయాలు

8/23/2011 - రాసింది karthik at Tuesday, August 23, 2011
ప్రస్తుతం దేశం లో అవినీతి పై ఎంత చర్చ జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం.. ఈ చర్చలో ఏదో నాకు తోచిన నా రెండు పైసలు ఇలా రాస్తున్నాను..
స్థూలంగా ఈ అవినీతి పై చర్చకు రెండు పార్శాలు..
1. ఒకటి అసలు ఇండియాలో అవినీతిని ఎలా అంతమొందించాలి??
2. రెండవది అన్నా హజారే చేస్తున్నది సబబేనా??
మొదటి విషయానికి వస్తే, మన ప్రియతమ ప్రధానమంత్రి గారూ తన దగ్గర మంత్రదండేమేదీ లేదని, పరిష్కారం కుదరదనీ, తానూ నిమిత్త మాత్రుణ్ణనీ, సెలవిచ్చారు.. ఒక పాత కథలో ఎవరో ఒక పండితుడు కాశీకి పొయ్యి పెద్ద చదువులు చదివి తన సొంత బాష మరిచిపోయాడట, (ఆయనకు తిరిగి తన బాషా జ్ఞానం కలిగించడానికి గాడిదతో తన్నించాల్సి వచ్చిందట.. ఆ కథ మనకెందుకులేండి వదిలేయండి.. మళ్ళీ పెటా సభ్యులు గానీ చూస్తే ఇబ్బంది)  అలా ఉంది మన సింగు గారు చెప్పిన విషయం.. ఇక నా విషయానికి వస్తే, నేను ప్రధానమంత్రినీ కానూ , ఆర్థిక శాస్త్రం అసలు చదువుకోలేదు, హార్వార్డ్ డిగ్రీలు అంతకుముందే లేవు.. కనుక ఎంచక్కా నా ఆలోచనలు రాసేస్తున్నాను.. (మరే నా బ్లాగుకు నేనే సుమన్ :)) .. అవినీతి అనే కాక ఏ విషయం అయినా వ్యక్తి స్థాయిలో మార్పు రాకుండా సమాజం మారాలని ఆశించడం అర్థ రహితం.. ఈ వాదన నేను 100% ఒప్పుకుంటా, కానీ వ్యక్తి స్థాయిలో మార్పు రాలేదు కాబట్టి వ్యవస్థ అలానే ఉండాలని అనుకోవడం ఇంకా ఘోరం.. ఇక వ్యక్తి స్థాయిలో మార్పు అంటామా, అది రావడానికి మన సమాజం పరిస్థితులు ఎలా ఉన్నాయి??  మన విద్యా వ్యవస్థ పతనావస్థ లో ఉంది.. మన విద్యా సంస్థల నుంచీ సాఫ్ట్ వేర్ నిపుణులు, రీసెర్చ్ స్కాలర్స్ వస్తున్నారేమో కానీ సమాజిక బాధ్యత తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు??  సామాజిక బాధ్యత వరకూ ఎందుకు మన సొంత మనుషుల పట్ల ఎంతమాత్రం బాధ్యతతో ఉన్నాం?? ప్రతీ వందమందిలో నలభై మంది మహిళలు గృహ హింస బారీన పడుతున్నారు (This number might be over rated but 20-25% looks reasonable to me).. ఆడపిల్ల గడపదాటితే ఎవడు ఆసిడ్ పోస్తాడో అని జనాలు భయపడుతున్నారు.. ఇక తల్లి దండ్రులు గురువుల కు మనం చూపిస్తున్న గౌరవం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.. ఒక తండ్రీ/గురువు కామెడీ క్యారెక్టర్ కానీ సినిమా వచ్చి ఎన్ని రోజులయింది??  ఇన్ని రుగ్మతలతో ఉన్న ఈ తరాన్నుంచీ అవినీతిని కాక ఇంక ఏమాశించగలం??జవాబు కష్టంగా ఉంది కదూ.. శ్రమ ఎందుకు లేండీ, వదిలేయండి!!
ఒక 3-4 సంవత్సరాల క్రింద మాట, ఒక ప్రఖ్యాత సంస్థ నుంచీ విఖ్యాత కోర్స్ చదివి ఫైనల్ సెమిస్టర్ లో ప్లేస్మెంట్ జరగలేదని ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది.. మూడు రోజుల పాటూ శవం సీలింగ్ ఫ్యానుకు వేలాడుతూ ఉంది.. అంటే మూడు రోజులుగా తమ తోటి విద్యార్థిని మెస్ కు రాలేదు, క్లాసులకు రాలేదు అన్న సృహ కూడా ఎవరికీ కలగలేదు.. ఇంతకంటే ఏం చెప్పాలండీ మన సామాజిక బాధ్యత గురించి??  బాధగా ఉంది కదూ, సరే అయితే వదిలేయండి.    
ఒక రెండు నెలల క్రితం మా నాన్న గారూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుంచీ పదవీ విరమణ చేశారు. ఆయన పదవీ విరమణ చేసిన రోజు జరిగిన కార్యక్రమం లో దాదాపు 200 మంది పాల్గొన్నారు.. 1987 లో మా నాన్న తో కలిసి పని చేసిన వాళ్ళు కూడా ఆ రోజు అక్కడికి వచ్చారు.. సో కాల్డ్ MNC ఉద్యోగులూ, ఒక్కసారి ఆలోచించండి మనం పదవీ విరమణ అంటూ చేస్తే (మనకు అంత అదృష్టం కూడానా, పింక్ స్లిప్పులు రాకుంటే అదే చాలు!!) .. ఆ రోజు మనకు Best Wishes అని చెప్పడానికి ఎంతమందికి తీరిక ఉంటుందంటారు?? పోనీ మన పాత టీముల్లో కలిసి పని చేసిన వాళ్ళలో ఎంత మందితో మనం ఫేస్ బుక్ హలో లు కాక మనస్పూర్తిగా బాగున్నావా అని అడిగాము??  మరీ పర్సనల్ గా ఉంది కదూ సరే అయితే ఇది కూడా వదిలేయండి.
ఒక జాతిగా మనం ఎంతగా దిగజారామో మన రాజకీయ నాయకులు కూడా అలానే ఒక్కో మెట్టూ పైకెక్కుతూ మనకు అందని స్టేజికి చేరుకున్నారు. యథప్రజా తథా రాజా.. ప్రజస్వామ్యం కదా అందుకని సామెత కూడా మారింది.  

ఇక ఈ చర్చ లో రెండవ విషయానికి వద్దాం " అన్నా హజారే చేస్తున్నది సబబేనా?? " లోక్ పాల్ తో అద్భుతాలు జరిగిపోవు, ఇప్పుడు ఉద్యమం చేస్తున్న వాళ్ళల్లో ఎంతమంది లంచాలివ్వకుండా పనులు చేసుకుంటున్నారు అనేది ఒక ప్రశ్న.  నిజమే వాళ్ళల్లో చాలామంది లంచాలిచ్చి అవసరానికి తమ పనులు జరిపించుకుంటూ ఉండవచ్చు కానీ అది వాళ్ళు కావాలని చేస్తున్నారా లేక వాళ్ళ నిస్సహయత అలా చేయిస్తోందా అనేది చూడాలి..  ప్రతీ ఒక్కరికీ లంచాలివ్వకుండా తట్టుకుని నిలబడే స్థోమత/పరపతి/ధైర్యం ఉండాలి కదా.. లంచం ఇవ్వకపోతే అంతులేని జాప్యాలు అర్థం లేని తిరస్కరణలు.. బ్రతుకు భారం తో కృశించిపోతున్న సగటు మనిషి మరింత భారం మోసే పరిస్థితుల్లో లేడు కదా.. దాని ఫలితమే ఈ అవినీతి!! ఈ అవినీతిని ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదంటారా?? ఏమో నాకైతే తెలియదు. కానీ నాకు ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా తెలుసు, నీతి నిజాయితీలు కలిగిన వాళ్ళు మన సమాజం లో ఇంకా ఉన్నారు. వాళ్ళను సమర్థించే వాళ్ళూ ఇంకా ఉన్నారు. వాళ్ళ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు ఎందుకంటే వాళ్ళు సినిమా స్టార్లు కాదు, క్రికెటర్లు అసలు కాదు.. మేతావులు అసలే కాదు(అథోగతి రాయ్ గురించి అనుకుంటున్నారా?అయితే మీకు 120 మార్కులు).. వాళ్ళంతా ఊరూ పేరూ లేని Stupid Common Indians.. బాబా రాందేవ్ వెంట అంతమంది నడిచినా, అన్నా హజారే యూత్ ఐకాన్ గా మారినా ఇదంతా వాళ్ళ పుణ్యమే!!


నావరకూ ఫ్రీడం పార్క్ కు వెళ్ళిన రెండు సార్లు చాలా ఆత్మ సంతృప్తి తో ఇంటికి వచ్చాను. ఈ దేశానికి ఇంకా భవిష్యత్తు ఉంది అని నాకు నమ్మకం కలిగించిన ఉద్యమం ఇది.
జై హింద్!!! 


ఈ టపా రాయడానికి ప్రేరణనిచ్చిన టపాలలో కొన్ని:



మెగాస్టార్ కు జన్మదిన శుభాకాంక్షలు!!!

8/22/2011 - రాసింది karthik at Monday, August 22, 2011
మెగాస్టార్ చిరంజీవికి చిత్రమాలిక టీం తరఫున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.. పూర్తి వ్యాసం ఇక్కడ చదవగలరు..