మరొక దాడి

6/30/2010 - రాసింది karthik at Wednesday, June 30, 2010
ఇప్పుడే పడుకునేముందు ఒకసారి వార్తలు చూద్దామని ఐ.బీ.యెన్. ఒపన్ చేశాను. దానిలో రేండు వార్తలు ఒకటి 26మంది రిజర్వ్ పోలీసులను అన్నలు చంపేశారట  అసలు ఈ అన్నలగా పిలబడేవాళ్ళు ఎప్పుడైనా మనుషులా ప్రవర్తించారా?  నాకు తెలిసి ఎప్పుడు చూసినా వాళ్ళు అక్కడ పట్టాలు కోసేశారు, ఇక్కడ బస్సులు కాల్చేశారు అని తప్ప ఎక్కడైనా ఒక బడి గానీ, అనాధ శరణాలయం గానీ మొదలుపెట్టినట్టు చరిత్రలో ఉందా? నేను సెటైర్ వేయటం లేదండీ బాబూ (ఎంటో ఈ రోజుల్లో ప్రనా అన్నా మంచి పదమైపోతోంది :( )   నిజంగానే అడుగుతున్నాను.. ఎవరికైనా తెలిస్తే చెప్పండి లేదా లింకులివ్వండి.. ఏ చెహోవ్ రచనలు చదవమని, కలరులీడరమ్మ రచనలు చదివి అర్థం చేసుకోమని ఐదు పైసల సలహాలు నాకొద్దు బాబూ, ఆయనే ఉంటే బోడిగుండెందుకని అవి అర్థం అయ్యే ఓపికే ఉంటే బ్లాగులెందుకు .. కామెంట్లు డిసేబుల్ చేసి నేనే ఎంచక్కా నాలగైదు కౌముది లాంటి వెబ్ మ్యాగజైన్లు మొదలుపెట్టేవాడిని.   
అన్నల దృష్టిలో మనుషులంటే ఎవరు? పోలీసులతో వాళ్ళకు ఉండేది వర్గ వైరమా లేక అదే వాళ్ళ అస్తిత్వమా? వీళ్ళకంత జనాదరణే ఉంటే అడువుల్లో ఎందుకు ఉంటారు? ఎన్నికలను ఎందుకు బహిష్కరిస్తారు?  ఒక ఎన్నికలంటే ఏమో అనుకోవచ్చు.. ప్రతీ ఎన్నికలూ అలవాటుగా బహిష్కరిస్తారు.. అసలు మనదేశం లో ఉన్నంత బలమైనా ప్రజాస్వామ్యం ఎన్ని దేశాలలో ఉంది? (మనమే అత్యుత్తమం అని నేను చెప్పటం లేదు, గమనించగలరు)   ఇక్కడ ఇంకా కామెడీ ఏమిటంటే ఈ అన్నలు పనిచేసే సంస్థల్లోనే ప్రజాస్వామ్యానికి దిక్కు లేదు, ఇక వీళ్ళా ప్రజల గురించి మాట్లాడేది? హవ్వ!
అన్నల కథ సరే ఈ కమ్యూనిజం పరిస్థితి ఏమిటి?  ఇంత వరకూ ఈ దేశం లో వారు చారిత్రక తప్పిదాలు కాక ఇంకేమైనా చేశారా?? అసలు రజాకార్ ఉద్యమం కాక కమ్యూనిస్టులు చేసిన  ప్రొడక్టివ్ ఉద్యమం అంటూ ఏమైనా ఉందా??( ఇక్కడ ప్రొడక్టివ్ అనేది కరెక్ట్ పదం కాదేమో కానీ నాకు అంతకంటే మంచి పదం గుర్తు రావట్లేదు)..   వీళ్ళ ప్రభుత్వాలు ఎక్కడ కాలుమోపుతారో అక్కడ అరాచకాలు, ఆందోళనలు బందులు మట్టీ మశానం..  ఏదో ఆ టూరిజం బాగుంది కాబట్టి సరిపోయింది లేకుంటే కేరళ కూడా బెంగాల్ లా ఎప్పుడో మునిగిపోయేది.. ఈ విషయం చెప్పటానికి నేనేమీ స్టాటిస్టిక్స్ వగైరా చదవక్కరలేదు.. ఒక్కసారి కలకత్తా  ఎయిర్ పోర్టుకు వెళ్ళండి చాలు మీకు తెలుస్తుంది ఆ ఊరు మిగతా దేశం కంటే ఎంత వెనుకబడి ఉందో,     మనదేశం గురించి వదిలేద్దాం అసలు ప్రపంచం లో కమ్యూనిజం వల్ల బాగుపడ్డ దేశాలేవైనా ఉన్నాయా?? నేను అర్థం చేసుకున్నంతలో కమ్యూనిజం వల్ల వ్యక్తులు బాగు పడ్డారు తప్ప సమాజాలు కాదు. ఈ రకంగా చూస్టే కమ్యూనిజం కూ క్యాపిటలిజం కూ ఆట్టే తేడా లేదు.  అక్కడ యజమానులు దోచుకుంటారు ఇక్కడ సదరు నాయకులు దోచుకుంటారు..  దీనికి లెనిన్ కూడా మినహాయింపు కాదు.. ఇలిచ్ వ్యావ్నోవ్ (లెనిన్ అసలు పేరు) అనే పేరుతో ఒక స్విస్ బ్యాంక్ అకౌంట్ ఉండేదని ఒకసారి ఈనాడు బుక్ లో చదివాను..  ఇక స్టాలిన్ లాంటి నిరంకుశ, నరరూప రాక్షసుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఒక స్టాలిన్ ఒక పోల్ పాట్ (ఈ జీవి గురించి ఇక్కడ చదవండి) వగైరా చాలా సులభంగా దొరుకుతారు.. ఇలాంటి వారి మధ్య గంజాయి వనంలో తులసిమొక్కలా ఉండేది ఒక ఫిడేల్ క్యాస్ట్రో మాత్రమే..   
ఇక కమ్యూనిజం వల్ల బాగుపడ్డ దేశాలకోశం వెతికితే ఒక్క దేశం కూడా కనపడదు.. చైనా అని చెప్ప్కండి చైనా చెప్పేదొకటి చేసేదొకటి, వాళ్ళు కమ్యూనిజం వదిలేసి చాలా రోజులయింది.  రష్యాలో మట్టికొట్టుకుని పోయారు, చైనా కమ్యూ"నిష్ఠ" ను వదిలేశారు, ఇక వీళ్ళు ఉండేది ఎక్కడ?    
ఇక నేను చూసిన రెండవ వార్త, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ పోలీసులకు చివాట్లు పెట్టిందట ఆ ఎంకౌంటర్లలో చనిపొయిన వారికి మర్యాదలు జరగటం లేదని.. ఇంకా నయం వాళ్ళకు ప్రభుత్వ సొమ్ముతో సంవత్సరీకాలు, తద్దినాలు పెట్టమని డిమాండ్ చేయలేదు.. అసలు అన్నల చేతిలో చనిపోయే పోలీసులు మనుషులు కారా??  వాళ్ళకు హక్కులుండవా?  ఈపౌర సంఘాలు పోలీసుల మరణాలను కనీశం ఖండించను కూడా ఖండించవు.. మరి అన్నల ముఖాల మీద మాస్కులు వీళ్ళే కదా , ఖండిస్తే పార్టీ నుంచీ పీకేస్తారని భయం కాబోలు.. 
NHRC: Notorious Heinous Rogues committee



నాకు భయమేస్తోంది..

5/30/2010 - రాసింది karthik at Sunday, May 30, 2010
అవును నిజం నాకు భయమేస్తోంది.. కర్ణుడి చావుకి చాలా కారణాలు అలాగే నాకు భయమేయడానికి కూడా చాలానే కారణాలు.. వాటిల్లో కొన్ని ఇవి:

రాకెట్ ఎక్కాలంటే భయం.
ఇప్పుడు రాకెట్ ఎందుకు ఎక్కాలంటారా?? పచారి కొట్టులో ధరలను అందుకోవాలంటే రాకెట్లు, చంద్రయాన్ తప్పేలా లేవు..

రైలు ఎక్కాలంటే భయం.
ఏ అన్నకో కోపం వచ్చి కొన్ని పట్టాలను కోసుకొని పాత సామాన్లకు వేసుంటాడని భయం.

విమానం ఎక్కాలంటే భయం.
టెక్నాలజీ సౌజన్యంతో ఏ లోయలోకో తీసుకెళ్ళి బ్రతికుండగానే తగలబెడతారని భయం.

బస్సు ఎక్కాలన్నా భయం.
ఏ సందు మలుపులోనో పొంచి ఉన్న కరెంటు తీగ సున్నితంగా ముద్దాడి మక్కువ తీర్చుకుంటుందేమోనని భయం.

సాయంత్రం సరదాగా మాల్ కు పోవాలన్నా భయం.
ఏ జిహదీనో పైలెట్ ప్రాజెక్ట్ కింద ఆ మాల్ లో ఒక అరడజను బాంబులు పెట్టుంటాడని భయం.

భక్తి తో గుడికి వెళ్ళాలన్నా భయం.
ఏ గోపురాన్నో కూల్చి ఒకేసారి ముక్తిని ప్రసాదిస్తారని భయం.

ఇల్లు కొనాలంటే భయం.
రేప్పొదున ఏ రాజకీయ రావణుడొ వచ్చి కబ్జా చేస్తాడని భయం.

పత్రికలు చదవాలంటే భయం.
చావులు,రేపులు కాక ఇంకేమీ ఉండవని భయం.

 
ఇంట భయం బయట భయం
ముందు భయం వెనుక భయం
బ్రతుకంతా భయం భయం
ఇంత భయంగా మాట్లాడుతున్న నా పేరు చెప్పలేదు కదూ.. ఇదుగోండి:

మధ్య తరగతి మానవులం!
నిస్సహాయకులం నిష్ప్రయోజనులం!
దరిద్రులం దామోదరులం!
మా చిరునామా స్వార్థం, మా బ్రతుకు వ్యర్థం!
మా నేస్తం స్వప్రయోజనం, మా మరో పేరు మూర్ఖత్వం!
నిర్లక్ష్యం మా చుట్టం, నైరాశ్యం మా నైజం !
శనిదేవుడి సేవకులం, లక్ష్మీ ప్రసన్నత మాకు శూన్యం!
కర్మ భూమిన కుక్కలం, లేదు మాకు ఆత్మ బలం!

-కార్తీక్

ఈ రోజు..

5/24/2010 - రాసింది karthik at Monday, May 24, 2010
సరిగ్గా 26 ఏళ్ళ క్రితం నేను ఈ రోజునే పుట్టాను. అంటే మే 23,1984.

ఇక మే 23 2010 అనేది నాకొక అద్భుతం.. మాటల్లో చెప్పలేని ఆనందం.. పదాలాలో పట్టలేని సంతోషం.. దానికి చాలా కారణాలే ఉన్నాయి.. ఇవన్నీ బ్లాగులో ఎందుకు రాస్తున్నానంటే తర్వాత ఎప్పుడైనా మూడ్ బాలేనప్పుడు చదువుకోవడానికి పనికివస్తుందని.
ఈ రోజు ఎందుకు ఒక అద్భుతం అనేది తెలియాలంటే కింద చదవండి మరి.

నిన్న రాత్రి 12గం: కేక్ కట్ చేశాను..అందులో వింతేముంది అనుకుంటున్నారా?? మరే మామూలు కేక్ ఐతే వింత లేదు.. కానీ ఆ కేక్ మా అమ్మ అదే పని గా బజార్ కు పొయి తెచ్చింది.. తనకు ఈ ఊర్లో మా ఇంటి పక్కన ఉండే కూరగాయల షాప్ తప్పించి ఇంకేమీ తెలీదు.. అలాంటిది బేకరీ ఎక్కడుందో కనుక్కొని మరీ తీసుకొచ్చింది.. తర్వాత అమెరికా నుంచీ రవి ఫోన్ చేశాడు..

ఇవాళ ఉదయం 8గం: మా అమ్మ కు,అమ్మమ్మకు, అక్కా బావలకు పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నాను. పుట్టిన రోజుకు మా అమ్మటో ఉండి అక్షరాలా ఆరు సంవత్సరాలు అయ్యింది..

ఉదయం పదిన్నర: నా మేనల్లుడి అన్నప్రాసన ఫంక్షన్ జరిగింది.. అక్కడ కూడా అన్ని నేనే చూసుకున్నాను.. నిజం మరి, చూస్తూనే ఉన్నాను చెయ్యలేదు :)

సాయంత్రం 5గం: ఆశ్రమం లో సత్సంగ్ కి వెళ్ళను.. చాలా బాగా జరిగింది.. మరియూ పన్నా అనే మామిడికాయ రసం తాగాను.. సూపర్ గా ఉంది.. తర్వాత 6:30 నుంచీ 7:30 వరకూ ఒక గొప్ప చర్చ లో పాల్గొన్నాను.. నా మిత్రులతో, మరియూ అనుభవజ్ఞులతో కలిసి నా పురోగతి అడ్డు పడుత్తున్న కొన్ని ప్రతిబంధకాలను ఎలా దాటలో తెలుసుకున్నాను.. దీని కంటే అద్భుతం ఏమిటంటే సత్సంగ్ తర్వాత గురూజి నుంచీ ఒక బహుమతి నాకొచ్చింది.. అసలు నమ్మలేని విధంగా జరిగింది ఇది.. మామూలుగా పుట్టినరోజు వాళ్ళకి, పెళ్ళిరోజు వాళ్ళకి సత్సంగ్ లో వాళ్ళ చుట్టూ ఉన్నవారు శుభాకాంక్షలు చెబుతారు.. కానీ ఈ రోజు గురూజీ తరఫున కొన్ని బహుమతులు పంచారు.. గత 10 నెలల కాలంలో అలా జరగడం ఇదే తొలిసారి..

సాయంత్రం 7:30గం: మా సుష్మక్కను కలిశాను.. తను ఈ రోజు  ఆర్ట్ ఆఫ్ లివింగ్ టిచర్ ట్రైనింగ్ పూర్తిచేసింది.. మా సుష్మక్క గురించి చెప్పలేదు కదూ.. తను పూర్వజన్మలో నాకు అమ్మ.. దేవుడు మళ్ళీ ఈ జన్మలో కూడా కలిపాడు.. నాకొక రోజు కార్ లో లిఫ్ట్ ఇచ్చింది.. తర్వాత నేను వాళ్ళింట్లో ఫెవికాల్ వేసుకుని స్థిరపడి పోయాను..

వీటి తో పాటు ఇంకా సంతోషం ఏమిటంటే ఈ రోజు నా పాతమిత్రులు చాలామంది ఫోన్ చేసి మాట్లాడారు.. మా ప్రపీసస అధ్యక్షులు కూడా మా సంఘం తరఫున ఒక మంచి కార్డ్ పంపించారు.. ఇవాళ ఫోన్ కూడా చేశారు. ఇవేకాక నా ఇంజినీరింగ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇప్పుడు కడుపుతో ఉండి మాట్లాడను కూడా ఓపిక లేదు.. కాని నా పుట్టిన రోజు గుర్తుపెట్టుకుని మెయిల్ చేసింది..
I repeatedly say that I'm blessed to lead the life I have.. well, can anyone challenge my claim???

-కార్తీక్

"ఘర్షణ" పరిష్కారమా???

5/12/2010 - రాసింది karthik at Wednesday, May 12, 2010
ఈ మధ్య బ్లాగుల్లో జరిగిన కొన్ని చర్చలలో అసమానతలను రూపుమాపడానికి ఘర్షణ తప్పదనే ఒక భావన వ్యక్తమైంది. ఇది నాకు కొంత ఆశ్చర్యం మరికొంత అసహనం కలిగించింది.  ఇది నేను స్త్రీవాదానికో లేక దళితవాదానికో మాత్రమే పరిమితం చేసి ఈ టపా రాయటం లేదు.. కేవలం రెండు  వర్గాల గురించి మాత్రమే చెప్పదల్చుకున్నాను..  ఆ వర్గాలు ఎవరైనా కావచ్చు.. స్వతహాగా నేను ఏ వాదినీ కాదు.. నాకు తెలిసి ఏ అమ్మా అబ్బకు కూడు పెట్టే వాదాలు నాకింతవరకూ కనిపించ లేదు. అది సామ్యవాదమైనా కావచ్చు లేదా స్త్రీవాదమైనా కావచ్చు.
ఇక విషయానికి వస్తే "ఘర్షణ" తో కలిగిన ఏ మార్పూ శాశ్వతంగా నిలబడుతుందని నాకనిపించటం లేదు. ఎందుకంటే ఈ ఘర్షణ వల్ల మరొక వర్గం లో "ఓటమి" అనే బాధ ప్రతీకారాన్ని నూరిపోస్తుంది తప్ప వాళ్ళకు సమానత్వం యొక్క అవసరాన్ని తెలియచెప్పదు. ప్రస్తుతం సమాజానికి కావాల్సింది సహజీవనానికి ఆయువు పట్టు లాంటి ఓర్పు, సహనం. "ఘర్షణ" అనేది ఒకసారి మొదలంటూ అయితే ఇక దానికి అంతం అంటూ ఉంటుందా అనేది నాకు అర్థం కాని విషయం.  ఎందుకంటే దాన్ని ప్రతీ వర్గం వారూ ఒక ఆధిపత్య పోరులా భావిస్తారే తప్ప  సమానత్వానికి దారిలా అంగీకరించరు. సమాజం లో ప్రతీ వ్యక్తీ/వర్గానికీ ఒక ప్రత్యేక స్థానం అంటూ ఉంది.. ఈ "ఘర్షణ" అనే భావజాలం దాన్ని గుర్తించక సదరు వ్యతిరేక వర్గాన్ని కించపరుస్తూ తమ గొప్పతనాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తాయి.. దీనికి ఏ వర్గమూ అతీతం కాదు.. ఇప్పుడు పీడిత వర్గం గా ఉన్నవారు భవిష్యత్తులో పీడించేవారిగా మారరు అని చెప్పలేము.. ఎందుకంటే మన కళ్ళ ముందే ఎన్నో ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం..రేపు ఈ పీడిత వర్గాలకు ఏ హిట్లరో దొరికాడంటే మిగతా వారి పని గోవిందే.. జర్మనీలో యూదుల ఆధిపత్యానికి గండి కొట్టాలనే హిట్లర్  తలంపు దేనికి దారితీసిందో మనకందరికీ తెలుసు. ఆ రోజులలో జర్మన్ సమాజం లోని ఉన్నతమైన పదవులను యూదులు ఆక్రమించారని వారికి వ్యతిరేకంగా హిట్లర్ చేసిన పనులు ఏ సమానత్వాన్ని సాధించాయో ప్రపంచం చూస్తూనే ఉంది..
ఇలాంటిదే మరొక సంఘటన నేను కళ్ళారా చూశాను.. నాకు తెలిసిన మిత్రుడొకరు విడాకులు తీసుకోవాలనుకుంటే అతని భార్య గృహ హింస కింద కేసు పెట్టింది. ఇక్కడ విషయమేమిటంటే ఆ జీవి అప్పుడు అమెరికాలో ఉన్నాడు, వాళ్ళ అమ్మా నాన్నలు బ్రతికిలేరు.. కానీ ఇండియాకు వచ్చిన వెంటనే జెయిలుకైతే వెళ్ళల్సి వచ్చింది.. అంతే కాక అతని మీద ఏడు కేసులు పెట్టిందట కనీసం తన కొడుకును కూడా నాలుగేళ్ళపాటూ చూడనివ్వలేదు :( ఇలాంటిదే ఇంకొక సంఘటన కూడా చూశాను కానీ దాని గురించి బ్లాగులో రాయడం సభ్యత కాదు కాబట్టి రాయడం లేదు.. ఆర్కుట్లో ఉన్న 498ఏ సమూహం లో చూస్తే ఇలాంటివే మరిన్ని తగుల్తాయి..
మరో పక్క మా బంధువుల అమ్మాయిని అత్తగారి వాళ్ళు కిరోసిన్ పోసి చంపేశారు.. బాగా బలిసిన పార్టీ కనుక అది బయటికి రాకుండా మూసేశారు.. ఆ అమ్మాయి తండ్రి మొన్నటి వరకూ కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు..
ఆఖరుగా నేను చెప్పేదేమిటంటే ఇప్పుడు పీడితులుగా ఉన్నవారు అవకాశం అంటూ వస్తే ఇతరులను పీడిచే అవకాశం ఎంతైనా ఉంది..   కనుక ఈ ఘర్షణలు మరొక ఘర్షణకు మార్గం తప్ప మరేమీ కాదు.. మొదటి ప్రపంచ యుద్దం తరువాత జరిగిన వర్సెయిల్స్ ఒప్పదమే రెండవ ప్రపంచ యుద్దానికి నాందిగా నిలిచింది.  
ఇక ఈ ఫలానావాదుల గురించి నేను ఎంత తక్కువ చెబితే అంత మంచిది.. ఉదా:స్త్రీవాదులు. నా జీవితం లో ఇప్పటి వరకూ ఒక్క నిజమైన స్త్రీవాదిని చూడలేదు. అందరూ స్త్రీవాదమనే ముసుగును అవసరానికి వాడుకునే వారే.. కాబట్టి ఎవరైనా స్త్రీవాదులం అని చెప్పుకుంటే నేను నమ్మడానికి కొంచెం సందేహిస్తాను.. 
The need of the hour is enrollment of people into our cause not enforcement.
నేను enrollment(తెలుగుపదం??) అని ఎందుకు చెబుతున్నానంటే అది పని చెయ్యడం ఒక కుటుంబ స్థాయిలో చూశాను కాబట్టి.. వ్యక్తి స్థాయిలో ఫలవంతమైనది సమూహం స్థాయిలో కూడా పనికిరావచ్చు అనేది నా భావన.. దీనికి నా దగ్గర ఆధారాలు, నిరూపిత సాక్ష్యాలు లేవు.  ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఖైదీల కోసం ఒక  కార్యక్రమం నిర్వహిస్తారు. దానిలో వారిని హింసారహిత జీవితం లోకి enroll చేస్తారు తప్ప బలవంత పెట్టరు.. నేను చెప్పేది అలాంటి పరివర్తన. ఆ పరివర్తనకు మూలం enrollment మాత్రమే!!

-కార్తీక్
గమనిక: నేను రేపు పొద్దునే ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళుతున్నాను. కనుక మీ వ్యాఖ్యలకు జవాబివ్వటం కొంత ఆలస్యం కావచ్చు. గమనించగలరు.

నేను రసంబు కాచిన వేళలో..

4/26/2010 - రాసింది karthik at Monday, April 26, 2010
పొయిన నెలలో నేనొక రోజు  రసం తయారు చేశాను.. ఆ రోజున నాకు లభించిన ఆన్ లైన్ ట్రైనింగ్ సంబంధించిన చాట్ ఇది.. 
Title: Idiot's guide for making rasam.

7:41 PM U: o my mad.... kaartik in chat..
7:42 PM is it true... am i dreaming....
    8 minutes
7:50 PM me: nope u r not ;)
7:51 PM U: O...
7:52 PM నిద్రమత్తులో ప్ర.నా లాగా చూసానేమో..
               అనుకున్నా..
               ఏంటి రసం పెడుతున్నారా... అయిపోయిందా...
               మీకు కూడా రేసిపెస్ కావాలా పంపించామంటారా.. ఈజీ రేసిపెస్
7:53 PM me: maa amma ninna cheppinappudu chaala veeji anipinchindi
         U: అయ్యో పాపం.. ఇప్పుడు కష్టంగా ఉందా..
        me: kani ippudemo anta tikka tikka ga prana story laga undi
7:54 PM ;P
         U: రసం పొడి ముందే తయారు చేసుకుని ఉంచుకుంటే ఓ మూడు నెలలు నిలవ ఉంటుంది..
        me: రసం పొడి ఇంటి నుంచీ తెచ్చుకున్నాను..
         U: చాలా వీజీ... నీకు దౌబ్త్స్ వస్తే ఇలా ఆన్లైన్ లో ఉండే మాలాంటి పెద్ద తలకాయ లని అడగచ్చు..
7:55 PM     మరింకే.. ఈజినేగా..
        me: రసం పొడి చేసుకునే సీనే ఉంటే ఇన్ని కష్టాలెందుకు చెప్పండి?
         U: మిక్సీ లేదా...
        me: ledu
7:56 PM  U: ఓ... అయితే ఒకే..
                   ఇంతకీ అయిందా
        me: chudali.. ippude pettanu
         U: అప్పుడే అవదులే..
7:57 PM     సిం లో పెట్టి మరగాబెట్టు బాగుంటుంది... మూత సగం తీసి ఉంచు..
        me: మొదట రసం పొడి,ఉప్పు,చింతపండుకలిపి దానిలొ రెందు గ్లసులు నీళ్ళు పోసి స్టౌ పై పెట్టాను
         U: కరివేపాకు వేసావా...
              టమేటా వేసావా..
7:58 PM me: కరివేపాకు వేస్తాను, కానీ టొమాటోలు లేవు.
  chintapandu is the replacement of tomato isnt it?
         U: ముందు రెండు గ్లాసుల నీళ్ళలో ఉప్పు పసుపు, చింతపండు నీళ్ళు (అంటే గుజ్జు) రెండు           టమోటోలు, రాసంపొడి వేసి మరిగించడమే..
                  కానే కాదు.. టమేటా లేకపోతె పెద్దగా కాదు కదా చిన్నగా కూడా రుచించదు..
7:59 PM    అర్జెంట్ గా బయట ఏదైనా చిన్న కూరల కొట్టు ఉంటే వెళ్లి రెండు టొమోటోలు తెచ్చుకో..
                 కనీసం పక్కింటి పిన్ని గారిని అయినా అడుగు.. చాలా బాగుంటుంది టమేటా వేస్తె..
        me: avuna
            ok ok
            ippude testa
8:00 PM U: తెచ్చుకో లేకపోతె పిస్చాత్తాప పడతావు..
8:01 PM me: కరివేపాకు టొమాటో రెండూ వేసేశాను
8:02 PM U: అప్పుడే తెచ్చేసావా...
                   వెరీ గుడ్..
       me: ఇంతకూ మీరు నేను రాసిన చిత్తూరు నాగయ్య వ్యాసం చదివారా?? నవతరంగం లో నిన్న పబ్లిష్ అయ్యింది..
8:03 PM U: అయ్యో లేదే.. లింక్ ఇచ్చేయండి చదివేస్తా..
       me: http://navatarangam.com/2010/03/nagaiah-2/
8:04 PM U: చూస్తా..
8:06 PM కొత్తిమీర ఉందా...
8:08 PM me: vesesanu kadaa
         U: అప్పుడే వేయకూడదు..
        me: vesi chaala sepainidi
             ha ha ha
         U: మొత్తం అయిపోయాక చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి.. అంతే..
        me: sorry kottimeera ledu
            sorry kerivepaku vesanu
8:09 PM U: ఒకే.. కరివేపాకు ముందే వేయాలి..
                   కొట్టిమీర ఉంటే మాత్రం చివరకు వేయాలి..
                   నీకు తీపి రసం కావాలా పుల్లటి రసం కావాలా..
కొద్దిగా తీపిగా కావాలంటే ఓ చిన్న బెల్లంముక్క / ఓ అరచెంచా పంచదార వేసుకోవాలి..       me: రసం లా ఉండే రసం కావాలి :P
        U: హి హి హి...
       me: bellam panchadaara levu
           nenu coffee lu gatra taganu anduke alaantivi undavu
8:11 PM U: ఓర్నాయనో... ఎలా బాబు ఇలా అయితే..
                  సరే అయితే పుల్లటి రసం..
8:12 PM me: రసమేదో అయినట్టు ఉంది. తినేసి తర్వాత చెబుతా ఎలా ఉండేది..
                 U: అపుడే అవదు తొందర పడకు..
                     టమేటా మగ్గాలి..
8:13 PM me: avuna stove off chesaanu.. manchi vaasana vastunte
            malli on chestanu
            :P
         U: వస్తుంది కానీ సిం లో పెట్టు.. మంట..
              చాలా బాగా తెర్లాలి..
        me: sim lone pettanu
         U: కనీసం ఇరవై అయిదు నిమిషాలు..
             పెట్టి ఎంత సేపయ్యింది తమరు..
8:14 PM me: oka 15-20 mins ayyuntundi
                 U: ఇంకో అయిదు నిమిషాలు ఉంచు.. టమేటా చితికిపోయి మగ్గిపోవాలి.. అప్పుడు ఆఫ్ చేసేసి తినేయచ్చు.  అన్నట్టు మిరియాల పొడి కలిపారా రసం పౌడర్ లో.. లేకపోతె విడిగా వేసుకోవాలి..
8:15 PM me: మీకు నా రసం దెబ్బకు ఆన్లైన్ ట్యుటోరీలexperience ్ లో వచ్చేస్తుంది..
         U: కొద్దిగా అంటే ఓ రెండు మూడు చిటికెలు..
              హహ్హహ్హ... మరే..
        me: అవన్నీ కలిపే మా అమ్మ తయారు చేసుంటుంది.. నా గురించి బాగా తెలుసులెండి మా అమ్మకు
8:16 PM U: మీ చిత్తూరు నాగయ్య గారి గురించి చదివాను.. చాలా బాగా రాసారు..
                   అయితే ఒకే..
                   అన్నట్టు పోపు పెట్టుకోవాలి మరి అవి సిద్ధం చేసుకోండి..
       me: పోపు అంటే ఏమిటి?
8:17 PM U: చిన్న బాండీ, ఒక చెంచా (చిన్న) నూనె, ఇంగువ, ఆవాలు, జీలకర్ర..
                    తిరగమాత, తాలింపు...
       me: ohh this.. i thought whatto whattu
        U: పోపు అన్ని ఒకటే..
       me: that is ready
        U: మీరు ఏం అంటారు..
              మేము తిరగమోత అంటాం..
8:20 PM U: ఇంతకీ మీరు ఏమంటారు.. పోపు, తాలింపు......
       me: మేమూ తిరగమోత అనే అంటాం లేండి.
        U: సో సో సో...
             ఓ.. అయితే సేం పించ్

        U: అయిందా రసం.. నేను కూడా వస్తున్నా భోజనానికి.. ఉంటే గింటే.. ఓ అరడజను అప్పడాలు, ఓ డజను వడియాలు వేయిన్చేయ్యండి.. గబగబా...
       me: sure sure

        U:  బాగుంది మీ వంట.. నేను ఇలా రన్నింగ్ కామెంటరీ....
       me: sarenandi.. aa rasam ela undo tini meeku chebutaanu.. vini anandinchandi
8:24 PM    ha ha ha
           all the credit goes to you only
        U: అలాగే.. చెవులు తెరుచుకుని కూర్చున్నా...
       me: :P
        U: మీరు తిని చెప్పండి..
       me: sure sure
    34 minutes
8:59 PM me: రసం సూపర్ అనుకోండి.. కొంచెం ఉప్పు తక్కువైంది తర్వాత వేసుకునాను.. మొత్తానికి చాలా బాగా వచ్చింది..
         U: అయిందా .......
        me: yes yes
9:00 PM U: ఆహా.. సూపరా..
                  గుడ్ గుడ్...
       me: "all the credit goes to you only"
        U: ఎందుకలాగా
       me: venki cinema chusaaraa?
9:01 PM daanilo brhmi dialogue adi
        U: చూసా
       me: tannulu tinnaaka chebutaadu
        U: అమ్మా గుర్తొచింది
       me: "we enjoyed a lot sir, all the credit goes to you only"
            but e running cooking bagundani
        U: హి హి హి ....
                                                  థాంకులు...