నా దిష్టి వాటికి తగిలిందా???

1/12/2009 - రాసింది karthik at Monday, January 12, 2009
నేను బెంగళూరు చేరుకొని ఒకటిన్నర సంవత్సరాలు అయ్యింది. ఈ సమయంలో నేను చాల వీధులు తిరిగాను. కాని నాకు బాగా నచ్చిన వీధులు మాత్రం మూడే!! అందులో ఒకటి అగర బస్ స్టాప్ నుండీ సర్జాపూర్ సిగ్నల్ వరకు ఉన్న రింగ్ రోడ్. నేను ప్రతి రోజూ ఆఫిస్ కి అదే రోడ్డు లో వెళతాను. ప్రతి రోజూ ఆ చెట్ల మధ్యలో బండి నడిపేటప్పుడు నాకు తెలియని ఆనందం నన్ను ఆవరించుకొని ఉంటుంది. ఏపుగా పెరిగిన ఆ చెట్లు ఎండ అనేది రోడ్డు మీద పడకుండా అడ్డు పడతాయి. చూసేందుకు ఎంతో ముచ్చటగా ఉంటుంది. ట్రాఫిక్ జాం అయినా ఆ చెట్ల వల్ల బోర్ అనిపించదు(కనీసం నాకైతే అనిపించదు). కాని ఈ రోజు పొద్దున చూస్తే ఆ చెట్లు కొట్టెయ్యడం మొదలు పెట్టారు. ఎందుకో నాకు తెలియదు, కానీ చాల బాధేసింది. ఆఫీస్ లో ప్రజలను అడిగితే అండర్ పాస్ కని ఒకరు, మెట్రో రైలుకని ఇంకొకరు చెప్పారు. అవి ఎంతవరకూ నిజమో నాకు తెలియదు, మేము ఈ రింగ్ రోడ్ ఆఫీస్ కి మారక ముందు ఒక రోజు మా మేనేజర్ పది సంవత్సరాల ముందు రింగ్ రోడ్ చాలా పచ్చగా చెట్లతో కళళలాఊతూ ఉండెది అని చెప్పాడు. అది విని నేను చాలా సంతోషించా, అప్పుదంత పచ్చగా కాక పొయిన బాగానే ఉంటుంది అని. కానీ, నేను ఎక్కువగా అలొచించానని తర్వాత తెలిసింది. ఈ పది సంవత్సరాల సమయంలో బెంగళూరు చాలా డెవలప్ అయ్యింది అని ప్రజలు చెప్పుకుంటారు. కాని బెంగళూరు జరిగిన నష్టం ఎమిటి???
రింగ్ రోడ్లో అండర్ పాస్, మేట్రో వస్తే ఎలావుంటుందో నాకు తెలియదు. కానీ ఆ చెట్లు లెకుంటె నాకు చాల బాధగా వుంటుంది. వాటికి నా దిష్టి తగిలిందేమో !!!

యెస్.బి.ఐ.-2

11/18/2008 - రాసింది karthik at Tuesday, November 18, 2008
ఈ మధ్య కాలం లో ఆఫిస్ కి పోతూనే మొబైల్ నా ర్యాక్ లో పెట్టేసి ఇంటికి వచ్చేటప్పుడు తీసుకుంటున్నా. ఎవరైనా అడిగితే పని ఒత్తిడి వల్ల అని కథలు చెబుతున్నా. కానీ నాకు మాత్రమే తెలిసిన చేదు నిజం ఎమిటంటే, నాకు బెంగళురు ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ వస్తే లిఫ్ట్ చెయ్యలంటే భయంగా వుంది. నాకు ఇంత భయం పెట్టిన ఘనత ఖచ్చితంగా యెస్.బి.ఐ. కి మాత్రమే చెందుతుంది.
పొయిన వారం లో ఒక రోజు.శని,ఆది వారాలు కాకుండా ఆఫీస్ లో పని చేసుకునే రోజు. ఆఫిస్ లో నా అంతకు నేను పాటలు వింటున్న. ఇంతలో నా ల్యాండ్ లైన్ రింగ్ అయ్యింది. ఇక మామూలుగా కథ షురు.
నేను: హలో, కార్తిక్ హియర్!
అవతల: సర్ దిస్ ఇస్ రాధా ఫ్రం యెస్.బి.ఐ. క్యాష్ బ్యాక్. వుయ్ ఆర్ గివింగ్ యు అ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్.
నేను: సారీ ఐ యాం నాట్ విల్లింగ్ ఫర్ థట్.
అవతల: డు యు హవ్ టూ మినిట్స్ ఒఫ్ టైం?
నేను: నో! ఐ యాం బిజి.
అవతల: .......
ఫోన్ కట్ అయ్యింది.
వెంటనే నా పక్కన వుండే మా కొల్లీగ్ ఫోన్ రింగ్ అయ్యింది. అతను సీట్ లో లేకపోవడం వల్ల నేనే లిఫ్ట్ చేసను. మళ్ళీ అదే కథ.
నేను: హలో,
అవతల: సర్ దిస్ ఇస్ రాధా ఫ్రం యెస్.బి.ఐ. క్యాష్ బ్యాక్. వుయ్ ఆర్ గివింగ్ యు అ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్.
నేను: సారీ ఐ యాం నాట్ విల్లింగ్ ఫర్ థట్.
అవతల: డు యు హవ్ టూ మినిట్స్ ఒఫ్ టైం?
నేను: నో! ఐ యాం బిజి.
అవతల: .......
ఫోన్ కట్ అయ్యింది.
కరెక్ట్ గా రెండు నిమిషాల తరువాత మా క్యుబికల్ లో ఇంకొక ఫోన్ రింగ్ అయ్యింది. ఇప్పుడు అది ఎవరో నాకు తెలిసిపొయింది. అంతే కాక నాకు యెస్.బి.ఐ. మీద కొన్ని పాత పగలు వున్నాయి. అందు వల్ల అది కూడా నేనే ఎత్తాను.
ఇప్పుడు ఏమైందంటే:
నేను: ఇస్ ఇట్ రాధా ఫ్రం యెస్.బి.ఐ?
ఫోన్ కట్. ఆ సంతోషంలో హింది తన్నుకు వచ్చింది.
జీత్ హమారీ హైన్! అని గట్టీగా అరిచాను.

నేను, నా బైక్, ఒక డాక్టర్

10/03/2008 - రాసింది karthik at Friday, October 03, 2008
అది సెప్టెంబర్ 30, మంగళవారం. నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ బైక్ మీద నుంచి కింద పడి ముక్కు, మూతి, మోకాలు, మోచెయ్యి పచ్చడి చెసుకున్న రొజు. 40 కి.మి. వేగంతొ వెళ్తూ కింద పడితే పచ్చడి కాక, సాంబారు రసం అవ్వవు కద!
ఇలాంటి దెబ్బలు నాకు కొత్తా కాదు, వాటికి నేను పాతా కాదు. చిన్నప్పుడు మా ఏరియా లొ " ముళ్ళు కార్తీక్ కు గుచ్చుకోవు, కార్తీక్ ముళ్ళను గుచ్చుకుంటాడు" అని ఒక సామెత వాడుక లో ఉండేది. సో అలవాటుగా దగ్గరలో ఉన్న నర్సింగ్ హోం కి వెళ్ళాను. కాని అక్కడ డాక్టర్ ని కలవలేదు!!! ఆ నర్సింగ్ హో లో ఇద్దరు డాక్టర్ లు ఉన్నారు: ఒకరు గైనాకాలజిస్ట్, ఇంకొకరు లైంగిక వ్యాధుల నిపుణులు. బెంగళూరు స్పీడ్ బ్రేకర్ దెబ్బకు విరిగిన చేతుల జాబితా లొ నా చెయ్యి చేరినా పర్వాలేదు కాని, ఆ డాక్టర్ గడప తొక్కను అని అనుకున్నా. కాంపౌండర్ పిలుస్తున్నా వెనక్కు తిరిగి చూడకుండా పారి పొయి ఇల్లు చేరుకున్నా. ఒకరిద్దరు ముఖ్యులకు మెసేజ్, మెయిల్ పంపించి ఫస్ట్ ఏయిడ్ చేసుకున్నా.అనగా టించర్ తో కడిగి పసుపు పట్టించా దెబ్బకు నొప్పి నషాళానికి ఎక్కింది. అప్పుడు నాకు పరిచయం ఉన్న ఒక డాక్టర్ గుర్తుకు వచ్చాడు. వెంటనే అతని హాస్పిటల్ కు చేరుకున్నా, నేను వస్తున్నా అని తెలుసుకున్నాడొ ఏమో ఆ జీవి ఎక్కడికో ఉడాయించాడు.
అప్పుడు తప్పదు కదా అని మరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ గుర్తుకు వచ్చిన విషయం ఏమిటంటె నా పర్స్ లో డబ్బులు లేవు. జజ్జినక జజ్జినక పండగ చేసుకున్నా! ఆ పక్కనేవున్న ఆక్సిస్ బ్యాంక్ ఏ.టి.ఎం. కి వెళ్ళా, నేను వస్తున్నా అని వీళ్ళకు కూడా తెలిసిపొయిందోచ్! డబ్బులు లేవు అని బోర్డ్ తగిలించారు. ఇంకేప్పుడూ ప్రైవేట్ బ్యాంక్ లను నమ్మకూడదు అని ఒట్టు పెట్టుకుని వెనకాల వీధి లోని ఎస్.బి.ఐ. కి వెళ్ళి డబ్బు తెచ్చు కుని కట్టు కట్టించుకున్నా. అక్కడ కట్టు కట్టే వాడు పసుపుని చూసి అదేదో అంత్రాక్స్ పొడి అన్నట్టు చూసి అది కడిగేసి అదే కలర్ లో వున్న ఒక ఆయింట్మెంట్ పూసి కట్టు కట్టాడు. తర్వాత డాక్టర్ వచ్చి నాలుక తెరువు, చెయ్యి చాపు, రెందు పల్టీలు కొట్టు అని అడిగి, అవన్నీ చేశాక ' ఎవెరిథింగ్ ఇస్ నార్మల్ ' అని చెప్పాడు. ఆ ముక్క నేను ఎం.బి.బి.ఎస్. చదవకుండానె తెలుసుకున్నానురా పాపాత్ముడా అని చెప్పి ఇంటికి వచ్చేశా.

ఎన్నెన్నొ జన్మల భంధం!!!

7/11/2008 - రాసింది karthik at Friday, July 11, 2008
'ఎన్నెన్నొ జన్మల భంధం నాదీ నీది, ఎన్నటికీ మాయని ...' అని కొన్ని దశాబ్దాల క్రితం ప్రజలు పాటలు పాడుకొనేవారు. ఈ మధ్య కాలం లో ఈ పాట వల్ల పాపులర్ ఐన వాళ్ళు ' కాంగ్రెస్-కమ్యునిస్టులు ' , ' సుమన్-ప్రభాకర్ ' దేశ ప్రజలందరూ కరుణానిధికి కళ్ళాద్దాల మీద ఎంత ప్రేమ ఉందో వీళ్ళ మధ్య కూడా అంత ప్రేమ వుంది అనికున్నారు. కొందరైతే వీళ్ళు సోల్ మేట్స్ అని కూడా అనుకున్నారు. కానీ నాకు తెలుసు వీళ్ళు రూం మేట్స్ కూడా కాదని. నిప్పు లాంటి నిజం లేటు గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చింది. మన్మొహానుడి అణువంత ప్రేమకు ' అమ్మ ' ఆశీస్సులు ఇవ్వడం తొ కమ్యునిష్టులకు ఎక్కడో కాలింది. ఏమైనా అమ్మ కద, కాదనలేదు. కానీ ఆ ప్రేమను ఇలానే చూస్తూ ఉంటే ప్రజలు కమ్యు 'నిష్ట 'ను శంకిస్తారు. అందుకని ఈ-టీవీ ప్రభాకర్ అమెరికా పొయినట్లు వీళ్ళు బెంగాల్ కు పోతాం అని అల్టిమేటం ఇచ్చారు. వీళ్ళు బెంగాల్ పొయినా, ఉత్తర్ ప్రదేశ్ నుంచి కుస్తీ పోటీలకు ఢిల్లీ వచ్చే ములాయం ఉన్నాడు, వాడు ఒక్క సారి చెప్తే 39 సార్లు చెప్పినట్టు అని అమ్మ కు బాగా తెలుసు. కానీ వాడికి ఏనుగంటే చచ్చే భయం. అందుకని అమ్మ వెంటనే ఏనుగు ను తరిమేసింది. ఇదే ఏనుగు అమ్మకు 'ప్రతిభా ' అవార్డు వచ్చేందుకు బాగా సహాయం చేసింది. అయినా అమ్మ తరిమేసింది ఎందుకంటే అవర్డు రానే వచ్చింది ఇక ఐదేళ్ళ వరకు ఢోకా లేదు. ఇదంతా చూస్తున్న రావణ సేవకులకు ఒళ్ళు మండింది. ప్రేమను తిరస్కరించినా ప్రేమికుల రొజును 'రాఖీ ' గా నామకరణం చేసినా అది మాకే చెల్లింది అన్నారు. అప్పుడే నిద్ర లేచిన 'గని పుత్రుడు ' బెంగళూరు నుంచి వెంటనే ఢిల్లీ రైలెక్కడు. కానీ ఈ తూగు మొహం ఏ.సి. ఆన్ చేస్తూనే నిద్ర పోతాడని అమ్మ భయం. అందుకని మరోసారి 'ఎన్నెన్నొ జన్మల భంధం .... ' అని మేఘ సందేశం పంపించింది. దానికి వరంగల్ నుంచి తెలం ' గానం ' లో జవాబు వచ్చింది. అమ్మకు ఈ గానం గురించి బాగా తెలుసు. అందుకే అర్థం అయినా కానట్లు నటించింది. ఎందుకంటే ఇప్పుడు ఇదే పల్లవి మరొక భార్యా భాధితుడు విడాకులు తీసుకుని కూడా పాడుతున్నాడు. ఇంతలో మొహాన్ కి బాగా రోషం వచ్చింది. మా అమ్మ తో పాటలా? దమ్ముంటే నాతో పాడండి అని తను కూడా మొదలు పెట్టాడు ' ఎన్నెన్నొ జన్మల భంధం .... '

విజ్ఞాపన

6/10/2008 - రాసింది karthik at Tuesday, June 10, 2008
బ్లాగ్ మిత్రులకు స్వాగతం. ఈ కింది విషయం గురించి వ్యాఖ్యల రూపంలో మీ అభిప్రాయాలు తెలుపగలరు.

ఒక మనిషిని నమ్మటం మరియు ఒక మనిషి నుంచి ఏదైనా ఆశించటం ఒకటేనా? ఒక వ్యక్తి మనలను మోసగించడు అని అనుకుంటాం. ఇది నమ్మకమా లేక మన ఎక్స్పెక్టేషనా?

నాకు నేర్పిన సిద్దాంతం ప్రకారం 99 మంది మనలను మోసగించినా, 100వ వ్యక్తిని నామ్మాలి. ఇలాంటిదే యండమూరి గారు 'ప్రియురాలు పిలిచే లొ చెప్పారు. ఇది ఎంత వరకూ సమంజసం?? ఎంత వరకు ప్రాక్టికల్??

మీ అభిప్రాయాలు దయ చేసి తెలుపగలరు.

-కార్తీక్